శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 31
ముప్పదొకటవ పాశురము. ఈ పాశురములో మామునులు తొణ్డరడిప్పొడి ఆళ్వారు మఱియు కులశేఖర ఆళ్వార్ల అవతార స్థలముల విశేషములను కృపచేయుచున్నారు.
తొణ్డరడిపొడియార్ తోన్ఱియ ఊర్ తొల్ పుగళ్ శేర్
మణ్ఢజ్ఞుడి యెన్బర్ మణ్ణులగిల్ ఎణ్డిశైయుమ్
ఏత్తుమ్ కులశేఖర నూరెన ఉరైప్పర్!
వాయ్ త్త తిరువఞ్జిక్కళమ్!!
తొణ్డరడిప్పొడి ఆళ్వార్లవతరించిన స్థలము తిరుపుళ్ళం భూతంగుడి అను దివ్య దేశమునకు ప్రక్కన గల ప్రాచీన మఱియు ప్రఖ్యాతిగాంచిన “తిరుక్కురుంగుడి” అని పెద్దల అభిప్రాయము. ఎనిమిది దిక్కుల ప్రజలు కీర్తించునట్టి కులశేఖర ఆళ్వార్లవతరించిన స్థలము “తిరువంజిక్కళం”. ఆ స్థలము ఆళ్వార్ల కీర్తికి సమానమైనదని పెద్దల అభిప్రాయము.
పాశురము 32
ముప్పది రెండవ పాశురము. తిరుమణిశై ఆళ్వార్, నమ్మాళ్వార్ మఱియు పెరియాళ్వార్ల అవతారస్థలముల విశేషములను కృపచేయుచున్నారు.
మన్ను తిరుమళిశై మాడ త్తిరుక్కురుగూర్!
మిన్ని పుగళ్ విల్లిపుత్తూర్ మేదినియిల్ * నన్నఱియోర్
ఏయ్ న్ద పత్తిశారర్ ఎళిల్ మాఱన్ పట్టర్ పిరాన్!
వాయ్ న్దుదిత్త ఊర్ గళ్ వగై!!
ఈ ప్రపంచంలో ఆచార్యుల కరుణ కొఱకే వేచి ఉండడమనే మంచి లక్ష్యముతో ఉండినవారు శ్రీభక్తిసారులు అనబడే తిరుమణిశై ఆళ్వార్, అందముగా గల మాఱన్ అనబడే నమ్మాళ్వార్, భట్టర్ పిరాన్ అనబడే పెరియాళ్వార్లు వారి అవతార స్థలములు వరుసగా జగన్నాధ పెరుమాళ్ నిత్యము నివసించు మహీసార క్షేత్రం అనబడే తిరుమణిశై, మేడలు మిద్దేలతో చుట్టబడిన ఆళ్వార్ తిరునగరీ అనబడు తిరుక్కురుగూర్ మఱియు ప్రకాశవంతమైన కీర్తిని కలిగిన శ్రీవిల్లిపుత్తూర్ మొదలగునవి.
పాశురము 33
ముప్పదిమూడవ పాశురము. ఈ పాశురములో మామునులు ఆణ్డాళ్, మధురకవి ఆళ్వార్ మరియు యతిరాజులనబడే భగవద్రామానుజుల అవతార స్థలముల వైభవమును కృపచేయుచున్నారు.
శీరారుమ్ విల్లిపుత్తూర్ శెల్వత్తిరుక్కోళూర్!
ఏరార్ పెరుమ్బూదూర్ ఎన్నుమివై * పారిల్
మదియారుమ్ ఆణ్డాళ్ మధురకవి యాళ్వార్!
ఎతిరాశర్ తోన్ఱియ ఊర్ ఇజ్ఞు!!
కీర్తికి ఆలవాలమైన శ్రీవిల్లిపుత్తూరు, కైంకర్య లక్ష్మీ నిండుగా కలిగిన తిరుక్కోవలూరు మరియు ఆది కేశవ పెరుమాళ్ళను నిత్యవాసముగా కలిగిన శ్రీపెరుంబుదూరు వరుసగా భూమి పిరాట్టి అంశగా అవతరించిన ఆండాళ్, నమ్మాళ్వార్లనే తమ దైవముగా భావించే మధురకవి ఆళ్వార్లు మరియు పరమాత్మ కల్యాణ గుణ సంపత్తి యొక్క పరిపూర్ణ జ్ఞానము కలిగిన యతిరాజులనబడే భగవద్రామానుజుల అవతార స్థలములు.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-31-33-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org