ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 19 -20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతాశీర్షిక

పాశురం 19

ఈ పందొమ్మిదవ పాశురములో మామునులు పెరియాళ్వార్లచే కృపచేయబడిన తిరుపల్లాండు యొక్క ప్రాశస్త్యమును ఉదాహరణ పూర్వకముగా తెలుపుచున్నారు.

కోదిలవామ్ ఆళ్వార్గళ్ కూరుకలై క్కెల్లామ్! ఆది తిరుప్పల్లాణ్డు ఆనదువుమ్ * వేదత్తుక్కు ఓమెన్ను మదుపోల్ ఉళ్ళదుక్కెల్లామ్ శురుక్కాయ్! తాన్మజ్ఞలమ్ (తాన్ మంగళం) ఆదలాల్!!

ఎంబెరుమానుని పొందుటకు ఎంబెరుమానే మార్గమని నమ్మి ఇతర మార్గములయందు ఆసక్తిచూపటమనే దోషమేమాత్రము లేనివారు ఆళ్వార్లు. భగవత్ విషయములను తప్ప ఇతర విషయములను ప్రస్తావించడమనే దోషము లేని ప్రబంధములను కృపచేసినారు. అటువంటి ప్రబంధములలో తిరుపల్లాండు, ఎంబెరుమాన్ యొక్క కల్యాణ గుణములను దర్శిస్తూ మంగళాసనమందే కేంద్రీకృతమగుట వలన వేదమునకు తాత్పర్య రూపకముగా భావించే ప్రణవం “ఓం” మాదిరిగా ప్రధానమైనదిగా నిలిచినది.

పాశురం 20

ఈ పాశురములో పెరియాళ్వార్లకు వారి తిరుపల్లాండు ఏ విధముగా సాటిలేనిదో తెలుపుచున్నారు.

ఉణ్డో తిరుపల్లాణ్డుక్కు ఒప్పదోర్ కలైదాన్?* ఉణ్డో పెరియాళ్వార్కు ఒప్పొరువర్ తణ్ తమిళ్ నూల్ శెయ్దరుళుం ఆళ్వార్గళ్ తమ్మిలవర్ శెయ్ కలైయిల్! పైదల్ నెజ్ఞే నీ ఉణర్ న్దు పార్!!

చిన్నపిల్లల లాంటి తత్వముకల ఓ మనసా! ఎంబెరుమాన్ యొక్క నిర్హేతుక కృపచేత
పరీశుద్ధ తమిళ భాషలో పాశురములను కృపచేసిన ఆళ్వార్లను వారి రచనలను బాగుగా పరిశీలించి చూడు. తిరుపల్లాండునకు సాటి ప్రబంధము కలదా? లేదు. ఎంబెరుమానుకు పల్లాండు/మంగళాశాసనము పాడటమే పరమావధిగా చేసికొనినది తిరుపల్లాండు. ఇతరాళ్వార్ల ప్రబంధములు ఎంబెరుమానుని అనుభవించుటకు ఉధ్ధేశించినవి. పెరియాళ్వార్లకు సాటియగు ఆళ్వార్లు కలరా? లేరు. ఎంబెరుమాన్ యొక్క అందము మొదలగు వాటికి మంగళాశాసనము చేయుటయందే నిమగ్నమైనవారు వీరు. ఇతరాళ్వార్లో ఎంబెరుమాన్ యొక్క కల్యాణ గుణములందు ఆకర్షితులై వాటిలో మునిగిపోయినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-19-20-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment