ఉత్తర దినచర్య శ్లోకం 14 – దినచర్యామిమాం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 13

శ్లోకము

దినచర్యామిమాం దివ్యాం రమ్యజామాతృయోగినః !

భక్త్యా నిత్యమనుధ్యాయన్ ప్రాప్నోతి పరమం పదమ్ !!

ప్రతిపదార్థము:

ఇమాం = “ ప్రేత్యుః ప్రసిద్దయామే ( పూర్వ దినచర్య-14) అని ప్రారంభంచేసి  ‘స్నానం సంస్మరామి తమ్ ‘ అనే శ్లోకం వరకు అనుసంధానం చేయబడింది,

దివ్యాం రమ్యజామాత్రుయోగిన దినచార్యాం – అళగియమణవాళ జీయర్ల  నిత్యనుష్టానాన్ని తెలిపే ఈ కృతిని

నిత్యం = ప్రతిదినము( పగలు, రాత్రి )

భక్త్యా మనుధ్యాయన్ = భక్తితో అనుసంధానము చేయువారు

పరమం పదమ్ = జనన మరణములు లేని నిత్య విభూతి అయిన శ్రీవైకుంఠమును

ప్రాప్నోతి = పొందుతారు

భావము:

             ‘దినచర్య ‘ అనే ఈగ్రంధం చివరలో ఫలశ్రుతిగా ఈగ్రంధ అధ్యయనం వలన కలిగే ఫలితాలను చెపుతు న్నారు. పూర్వ దినచర్యలో 13వ శ్లోకం వరకు ఉపోద్ఘాతంగా అమరిందని ముందరే చెప్పుకున్నాము. 14వ శ్లోకం నుండి ఉత్తర దినచర్యలోని 13వ శ్లోకం వరకు వరవరముని దినచర్య వర్ణించబడింది .’ దివ్యం ‘ అన్న పదానికి దివ్య మైన పాంచరాత్రాగమం మొదలైన శాస్త్ర సిద్ధమైన అనుష్టానములను తెలియజేసే గ్రంధములని అర్థము. అంతే కాక  ఈలోకములో అనుసంధానములోలేని, పరమపదములో మాత్రమే  నిర్వహింపబడే పాంచకాలిక అనుష్టానములను తెలియజేసే గ్రంధమని కూడా గ్రహించవచ్చు .  ఈ అనుష్టానములు చాల దుర్లభమైనందున పరమైకాంతులు మాత్ర మే అనుష్టించతగినవిగా వుండటం వలన కృతయుగంలో  పరిపూర్ణంగా అనుష్టించినవి. త్రేతా ద్వాపరాలలో కొద్దిగా తగ్గుతూ వచ్చినవి. కలియుగంలో ఉన్నవో! లేవో! కూడా తెలియదు అని భరద్వాజ పరిశిష్టంలో చెప్పబడింది. అందు వలన ఈ అనుష్టానము ఎంత ఉన్నతమైనదో అర్థమవుతున్నది . పైగా ఎన్నో కోరికలతో పరుగులు తేసే మానవులు ,వాటిని పొందడం కోసం ఎందరెందరో దేవతలను ఆశ్రయిస్తూ శ్రీమన్నారాయణుడొక్కడే పరమ దైవ మన్న మాటను కూడా మరచిపోయినవారు ఈ అనుష్టానములను చేపడతారా! అన్నది ప్రశ్నార్థకమే . జ్ఞాన సం పన్నులై కూడా కాల  ప్రభావముచేత మోహవశ్యులై ,పురాకృత పాపవాసన నుండి బయటపడలేరు . కలియు గంలో కూడా కొందరు పరమాత్మ ఒక్కడే అని విశ్వసించేవారు ఉంటారు కానీ కాల ప్రభావం వలన వారు కూడా అన్యమతస్తుల మాయలోపడి కొట్టుకుపోతారని ఇదే గ్రంధంలో తెలుపబడింది.

              ఐదు కాలలలో చేయదగిన భగావరాధనారూపమైన ఈ కర్మలను, క్రమము తప్పక అనుష్టించువారు, నూరుసంవత్సరాలు నిండగానే మోక్షపదమును పొందుతారని లక్ష్మీతంత్రంలో చెప్పబడింది.  మోక్షాన్ని పొందడానికి అన్యఉపాయాలన్నింటిని పూర్తిగావదిలివేసి ఈ పాంచకాలిక అనుష్టానములను నిష్టతోఆచరించేవారు పరమపదాన్ని పొందుతారు. వారికి కర్మజ్ఞానభక్తి అనేఉపాయాలతో పనిలేదు అని శాండిల్యస్మృతిలో చెప్పబడింది. కానీ భరద్వాజా దులు పరమాత్మను సిద్దోపాయమని నమ్మినవారు. వారు భగవద్కైంకర్యం రూపంగానే అనుష్టానములను ఆచరిం చాలనిపేర్కొన్నారు. ఇదియే ప్రపన్నులు అనుసరించదగిన మార్గమని చెప్పారు. ముందుగా అభిగమము చేసి ,  భగవదారాధనకు  కావాల్సిన వస్తువులను సిద్దము చేసుకోవాలి . తరువాత భగవదారాధనరూపమైన ఇజ్జను అను ష్టించాలి . తదుపరి స్వాధ్యాయనంచేసి, చివరగా ధ్యానమనే యోగాభ్యాసం చేయాలి . ఇక్కడ ఈ ఐదుకాలలో ఆచ రించే అను ష్టించే ఐదింటిని ఉపాయరూపంగా కాకుండా ఫలరూపంగా ఆనందగా అనుష్టించాలి. కర్మజ్ఞానభక్తిప్రపత్తి అనే నాలుగు ఉపాయాలు మోక్షోపాయంగా  అనుష్టించక ,ఫలమునుఆశించక, పరమాత్మఆనందమే పరమ ప్రయో జనంగా భావించి ,కైంకర్యరూపంగా చేయాలి అని పరాశరముని అనుగ్రహించారు.

                       శ్రీదేవరాజ గురువనబడే ఎరుమ్బియప్పా అనుగ్రహించిన శ్రీవరవరముని దినచర్య ,దానికి వా దూల వీరరాఘవగురువనే తిరుమళిశై అణ్ణావప్పంగర్ స్వామి  అనుగ్రహించిన సంసృత వ్యాఖ్యానమునకు తమిళంలో  శ్రీకృష్ణమాచార్యస్వామి రాసిన వ్యాఖ్యానం సంపూర్ణం  

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-14/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment