ఉత్తర దినచర్య శ్లోకం 11 – అపగత

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 10

శ్లోకము

అపగత మదమానైః, అన్తిమోపయనిష్ఠై:

అధిగత పరమార్థైః , అర్థ కామానపేక్షైః !

నిఖిల జన సుహృద్భిః నిర్జిత క్రోధలోభైః

వరవరముని భృత్యైః , అస్తు మే నిత్యయోగః  !!

ప్రతిపదార్థము:

మే = ఇప్పటి దాకా చెడ్డవారితో చేరి కానిపనులు చేసిన దాసుడు

అపగత మదమానైః = నేనే పెద్దవాడిని అన్న గర్వము లేని వారు లేక అహంకారంతో పెద్దలను అగౌరవించడం చేయని వారు

అన్తిమోపయనిష్ఠై: = మోక్షపదం పోమ్దటానికి సాధనకు హేతువైన ఆచార్యాభిమానమనే అంతిమ ఉపాయం స్వీకరించిన వారు

అధిగత పరమార్థైః = ఆచార్యకైంకర్యమనే పరిపూర్ణ పరమార్థాన్ని పొందినవారు  

అర్థ కామానపేక్షైః = ఇతరోపాయాలను ,ఇతరఫలితాలను కోరని వారు

నిఖిల జన సుహృద్భిః = ఆభిముఖ్యులు ,విముఖులు, ఉదాసీనులు అనే మూడువర్గాలవారి మంచినికోరే సుహ్రుద్భావము గలవారు

నిర్జిత క్రోధలోభైః = క్రోధలోభములను జయించిన వారు

వరవరముని భృత్యైః = వరవరమునుల అంతరంగిక శిష్యులైన కోయిల్ కందాడై అణ్ణన్ , వానమామలై జీయర్ మొదలైనవారితో

నిత్యయోగః  = నిత్య సంబంధం ( మామునుల శ్రీపాదములను ఉంచే మెత్తని దిండు ,పాదరేఖలుగా )

అస్తు = లభించుగాక అని ప్రార్థిస్తున్నాము.

భావము:

             మదము ,అహంకారము, సంపద మీద కోరిక , స్త్రీవ్యామోహం , కోపము, లోభము, మొదలైన దుర్గు ణాలు గలనీచులతో సంబంధము కలిగిఉన్న దాసుడికి ,ఇప్పటి నుండి అటువంటి చెడుగుణాల వాసనా కూడాలేని   వరవరమునుల అంతరంగిక శిష్యులైన కోయిల్ కందాడై అణ్ణన్ , వానమామలై జీయర్ మొదలైన వారితో నిత్య సంబంధము లభించుగాక అని ప్రార్థిస్తున్నాము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-11/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment