శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
అవతారిక
అతి సులభుడైన తన ఆచార్యుని చూసి ,తన వంటి మానవుడే కదా! అని భావించి, అనేక యోగములు , క్రియల ద్వారా మాత్రమే లభించే దుర్లభుడైన భగవంతుని కోసము పరుగులు తీయటము జ్ఞానశూన్యత అవుతుంది .
పాశురము
“పఱ్ఱు గురువై పరన్ అన్ఱు ఎన్ఱు ఇగళందు
మఱ్ఱోర్ పరనై వళిప్పడుదల్ – ఎఱ్ఱే తన్
కైపొరుళ్ విట్టారేనుం కాసినియిల్ తాం పుదైత్త
అప్పొరుళ్ తేడి తిరివాన్ అఱ్ఱు”
ప్రతిపదార్థము
పఱ్ఱు గురువై = ఆశ్రయణ సౌకర్యము గల ఆచార్యులను
పరన్ అన్ఱు ఎన్ఱు = ఈయన భగవంతుడు కాదు అని
ఇగళందు = భావించి
మఱ్ఱోర్ పరనై = వేరు దైవమును
వళిప్పడుదల్ = ఆశ్రయించుట
తన్ కైపొరుళ్ = తన చేతిలో వున్న ధనమును
విట్టు = అల్పమైనదిగా ,విలువ లేనిదిగా భావించి ,వదిలి వేసి
ఆరేనుం = పరులెవరైనా
తాం కాసినియిల్ = తమ ప్రాంగణములో
పుదైత్త = పాతిపెట్టారేమోనని
అప్పొరుళ్ = ఆ ధనమును (పాతరను )
తేడి తిరివాన్ = వెతుకుతూ తిరుగువాడి చేష్టల వంటిది
ఎఱ్ఱే = ఎంత పిచ్చితనమో కదా!
వ్యాఖ్యానము
పఱ్ఱు గురువై …..…తాను ఆశ్రయించిన ఆచార్యుడు తనకు అవసరమైనప్పుడు ఆదుకునే అవకాశము గలవారు, తన ఉన్నతిని కోరేవారు తనకు ఎల్లప్పుడు అందుబాటులో వారు.. .
పరన్ అన్ఱు ఎన్ఱు ఇగళందు.…….అటువంటి ఆచార్యుని భగవద్స్వరూపముగా భావించవలసి వుండగా ,అలా భావించక ఆయన మన వంటి మనవమాత్రుడే కదా! అని చిన్న చూపు కలిగి వుండుట…
మఱ్ఱోర్ పరనై వళిప్పడుదల్ .……..దుర్లభుడైన , పంచేద్రియముల అనుభవానికి అందని యోగముల వంటి కష్ట సాధ్యమైన క్రియల ద్వారా మాత్రమే లభించే మరొక దైవాన్ని తనకు రక్షకుడుగాను , తోడుగాను భావించి పూజించుట ….
ఎఱ్ఱే……..ఏవిటి? ….వీడు ఆశ్రయించ వలసిన, సులభుడైన ఆచార్యుని వదిలి , దుర్లభుడన వేరొక దైవాన్ని పట్టుకున్నడే అన్న బాధతో …..ఏవిటి? … అంటున్నారు .
తన్ కైపొరుళ్ విట్టు..…….తన చేతిలోని వస్తువును వదిలి వేసి , కొంగుబంగారాన్ని పారవేసి ,
ఆరేనుం కాసినియిల్ తాం పుదైత్త….….ఎవరైనా భూమిలో మన కోసము ధనమును పాతర వేసి వుంచారా! అని వెతుకుట వంటిది.
అప్పొరుళ్ తేడి తిరివాన్ అఱ్ఱు..……ఎవరో పాతర వేసిన ధనమును తాననుభవించాలని భూమిని త్రవ్వి వెతుకుట ఎంత పిచ్చితనము? అటువంటిదే కదా ఇతడు చేస్తున్న పని అని ఇక్కడ వృత్తి ఉదాహరణ చెప్పారు. అయ్యో ఎంత పిచ్చివాడు కదా! అని బాధ పడుతూ ఈ పాశురమును చెప్పారు .
శ్రీవచన భూషణములో “కై పట్ట పొరుళై కై విట్టు పుదైత్త పొరుళై కణిసిక్క కడవనల్లన్ ” అని ఈ పాశురములోని భావమును చెప్పారు .
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-tamil-34/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org