శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము-27
“నెఱి అఱియాదారుం అఱిందవర్ పాఱ్ సెన్ఱు
సెఱిదల్ సెయ్యా త్తీ మనత్తర్ తాముం – ఇఱై ఉరైయై
త్తేఱాడవరుం తిరుమడందై కోన్ ఉలగత్తు
ఏఱార్ ఇడర్ అళుందువార్”
అవతారిక:
ఈ పాశురములో స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ మూడు రకముల మనుష్యుల గురించి చెపుతున్నారు. 1.ఆత్మోజ్జీవనము గురించి చింతింపని వారు 2.ఆత్మోజ్జీవనమునకు మార్గ నిర్దేశము చేయు గురువును ఆశ్రయించని వారు 3. శరణాగతి శాస్త్రములో విశ్వాసము లేని వారు వీరు ‘పరమపదము’ చేరి శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు కైంకర్యము చేయలేరు. ఈ లోకములోనే మళ్ళీ మళ్ళీ పుట్టి జనన మరణ చక్రములో పడి కష్టాల పాలవుతారు అని చెపుతున్నారు.
ప్రతి పదార్థము:
నెఱి = ఉపాయము
అఱియాదారుం = తెలుసుకోని వారు
అఱిందవర్ పాఱ్ సెన్ఱు = తెలిసిన గురువును ఆశ్రయించని వారు
సెఱిదల్ సెయ్యా = గురువుకు శుశ్రూష చేని వారు
త్తీ మనత్తర్ తాముం = దుష్ట స్వభావముగల వారు
ఇఱై ఉరైయై త్తేఱాడవరుం = శరణాగతి శాస్త్రములో విశ్వాసము లేని వారు
తిరుమడందై కోన్ ఉలగత్తు = శ్రీమన్నారాయణుని నిత్య నివాసమైన ‘పరమపదము’
ఏఱార్ = చేరలేరు
ఇడర్ = కష్టాలలో ( జనన మరణ చక్రములో పడి )
అళుందువార్ = మునిగి పోతారు
వ్యాఖ్యానము:
నెఱి అఱియాదారుం……...ఈ లోకములోనే మళ్ళీ మళ్ళీ పుట్టి జనన మరణ చక్రములో పడి కష్టాల పాలవుతారు అని చెపుతున్నారు. వీరు ఆత్మోజ్జీవనము గురించి చింతింపరు.
అఱిందవర్ పాఱ్ సెన్ఱు సెఱిదల్ సెయ్యా త్తీ మనత్తర్ తాముం ..……..ఆచార్యులను ఆశ్రయించి సంసార బంధము నుండి బయట పడు మార్గమును తెలుసుకోని వారు “మాఱి మాఱి పల పిఱప్పుం పిఱందు”( మళ్ళీ మళ్ళీ అనేక జన్మలెత్తి ) ఇక్కడే కొట్టుకుంటూ వుంటారు . వీరు జ్ఞానము, అనుష్టానము గల సదాచార్యులను ఆశ్రయించరు. ఆశ్రయించినా ఆచార్యుల ఉపదేశములపై విశ్వాసము కలుగదు . ఆచార్యులకు కైంకర్యమును చేయరు. ఆచార్యులంటే ఆయన మనలాంటి మనిషే కదా అనుకొని లోపాలను వెతుకుతారు .
ఇఱై ఉరైయై త్తేఱాడవరుం ….….మరొక రకము వారు ఆచార్యులను ఆశ్రయించినా శరణాగతి చేయుటలో విశ్వాసము కలిగి వుండరు . శ్రీకృష్ణుడు అర్జునుని వ్యాజముగా చేసుకొని భగవద్గీత”18వ అధ్యాయములో ఈ శరణాగతి శాస్త్రమును చేతనొజ్జీవనము కోసమే ఉపదేశించాడు.
తిరుమడందై కోన్ ఉలగత్తు ఏఱార్ …….ఇటువంటి వారు శ్రీమన్నారాయణునికి శ్రీమహాలక్ష్మికి నిత్యనివాసమైన పరమపదమును ఎప్పటికీ చేరలేరు.
ఇడర్ అళుందువార్..…….స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఇటువంటి వారందరూ ఈ లోకములోనే పుడుతూ, గిడుతూ నిత్యానందమునకు నోచుకోరు, కష్టాల కడలిలో మునిగి పోతారు అని చెపుతున్నారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-27-neri-ariyadharum/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org