శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 27
తత్వం దివ్యప్రబంధానాం సారం సంసారవైరిణామ్ ।
సరసం సరహస్యానాం వ్యాచక్షాణం నమామి తం ।।
ప్రతి పదార్థం:
సంసారవైరినాం = శరీర బంధ రూపమైన సంసారం నిరసించు
సరహస్యానాం = తిరు మంత్రము, ద్వయము , చరమ శ్లోకలు అర్థ సహితముగా
దివ్యప్రబంధానాం = దివ్యప్రబంధము
సారం = సారం
తత్వం = జీవాత్మ స్వరూపమైన ఆచార్య శేషిత్వము ,ఉపాయము ,ప్రాప్యము మొదలైనవి
సరసం = స్వారస్యముగా
వ్యాచక్షణం = చక్కగా అర్థమవునట్లు వివరించు
తం = ఆ మామునులను
నమామి = నమస్కరిస్తున్నాను
భావము:
శరీర సంబంధ రూపమైన సంసార క్లేశాలను దివ్యప్రబంధము పోగొడుతుందని ఈ క్రింది ఫల శ్రుతుల వలన తెలుస్తున్నది.
1.’ మాఱన్ విణ్ణప్పం శెయ్ద శొల్లార్ తొడైయల్ ఇన్ నూఱుమ్ వల్లార్ అళుందార్ పిఱప్పాం పొల్లా అరు వినై మాయవన్ శేఱ్ఱళ్ళల్ పొయ్న్ నిలత్తే ‘(తిరువిరుత్తం 100) (మాఱన్ విన్నప్పము చేసిన ఈ నూరు పాశురములు పాడినవారికి పునర్జన్మ లేదు. ఈ లీలా విభూతిలోను కష్ఠాలుండవు )
2.’ శెయిరిల్ శొల్లిశైమాలై ఆయిరత్తుళిప్పత్తాల్ వయిరం శేర్ పిఱప్పఱుత్తు వైకుందం నణ్ణువరే (తిరువయిమొళి 4-8-11)(ఈ పది పాశురాలను నేర్చిన వారు జన్మ పరంపరను తెంచుకొని వైకుంఠము చేరుదురు).
వెనకటి పాశురాలలో చెప్పిన రహస్యములకు పరమాత్మ శేషి,ఉపాయము,ప్రాప్యము అవుతున్నారని తెలుస్తున్నది.ఇంకా నిఘూఢముగా పరిశీలిస్తే భాగవతులే శేషి,ఉపాయము,ప్రాప్యము అవుతారని బోధ పడుతుంది. ఇంకను నిఘూఢముగా పరిశీలిస్తే రహస్యార్థములకు ముఖ్య ఉద్దేశ్యము మూడవ విషయమైన ఆచార్య ప్రపత్తి అవుతుందని ఆచార్య నిష్ఠలో ఆరితేరిన మధురకవుల లాంటి వారి ఉద్దేశ్యము. మామునులు యతీంద్ర ప్రణవులు ,కావున తమ ఆచార్యులనే శేషిగా, ఉపాయముగా, ప్రాప్యముగా, దివ్యప్రబంధ సారముగా ఉపదేశించారని గ్రహించాలి. ఎందుకంటే ఆచార్య పరంపరలో రామానుజులే ఉన్నతమైనవారని వెనక చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. శేషి అంటే నాయకుడు, ప్రాప్యుడు అంటే పొందవలసిన వాడు, ఉపాయము అంటే మార్గము. మనము కైoకర్యము చేయ తగ్గ నాయకులు ఆచార్యులైనందున ,వారిని పొందుటకు వేఱొక ఉపాయమును వెతకకుండా వారినే ఉపాయముగా స్వీకరించాలన్నది రహస్య గ్రంథముల సారము.దీనినే మామునులు శిష్యులకుపదేశిస్తున్నరని ఎఱుంబియప్పా ఈ శ్లోకములో చెపుతున్నారు. ఇంతటి గొప్ప అర్థములను ఉపదేశించు ఆచార్యులకు చేయతగ్గ ఉపకారమేముంటుంది. అందుకే ‘ తలై అల్లాల్ కైమారిలేన్ ‘అని ఆండాళ్ చెప్పినట్లుగా శీరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్న అర్థములో ‘ తం నమామి ‘ అన్నారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-27/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org