పూర్వ దినచర్య – శ్లోకం 8 – కాశ్మీర

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

8- వ శ్లోకము

కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా!

కౌసేయేన సమింధానం స్కంధ మూలావలంబిన !!

ప్రతిపదార్థము:

కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా—కుంకుమపూవుల రంగులో ప్రకాశిస్తున్న

స్కంధ మూలావలంబిన —- భుజముల మీద ధరించివున్న

కౌసేయేన —– పట్టు వస్త్రమును ధరించిన

సమింధానం——- గొప్పగా ప్రకాశిస్తున్న

భావము:

ఈ శ్లోకములో ఊర్ధ్వపుండ్రములను ధరించిన భుజములను దానిపై ఉన్న పట్టువస్త్రమును  వర్ణిస్తున్నారు. పట్టువస్త్రమును  ఉత్తరీయముగా ధరిచిన అందమును ఇక్కడ చెప్పుతున్నారు.  బ్రహ్మచారి,గృహస్తు, వానప్రస్తుడు. సన్యాసి అనే నాలుగు ఆశ్రమములలో బ్రాహ్మణులు  పట్టు వస్త్రమును ధరించుట విధాయకము. పరాశరులు, బ్రాహ్మణులు    యఙోపవీతమును,  ఊర్ధ్వపుండ్రమును, శిఖను,తామరతూడుల మాలను, పట్టు వస్త్రమును ధరించాలని చెప్పారు. ఈ ప్రకరణములో సన్యాసి ఉత్తరీయము ధరించరాధని చెప్పింది , అవైష్ణవులకు విధించబదినది. వైష్ణవ  సన్యాసులు  పట్టు వస్త్రమును ఉత్తరీయముగా ధరించటము  విధాయకము.  ఈ శ్లోకములో మామునులు వీధిలో నడచి వస్తున్న సందర్భములో చెప్పబడింది కాబట్టి భుజముల మీద  ఉత్తరీయమును ధరించటము దోషము కాదు. ప్రదక్షిణము చేయునపుడు, దాసొహములు సమర్పించునపుడు, దేవ పూజ చేయునప్పుడు,   హోమము చేయునపుడు, పరమాత్మను, ఆచార్యులను సేవించునపుడు భుజముల మీద  ఉత్తరీయమును ధరించటము దోషము అని శాండిల్యుడు నిర్ణయించి వున్నారు . పైగా వీరు ధరించి వున్న ఉత్తరీయము కాషాయ రంగులో వున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2016/03/purva-dhinacharya-8/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment