పూర్వ దినచర్య – శ్లోకం 3 – సుధానిధి

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 3

సుధానిధి మివ స్వైర స్వీక్రుతో దగ్ర విగ్రహం !

ప్రసన్నార్క ప్రతికాశ  ప్రకాశ పరివేష్టితం ! !

ప్రతి పదార్థము:

స్వైర స్వీక్రుత ఉదగ్ర విగ్రహం _  తనకిష్టమైన స్వరూపమును తానే స్వీకరించిన అందమైన విగ్రహ రూపుడైన

సుధానిధి మివ (సతితం) _పాల కడలి వంటి తెల్లని వర్ణము గల వాడు

ప్రతికాశ  ప్రకాశ పరివేష్టితం _ (రెప్ప వేయ కుండా చూడవలసిన) ప్రకాశాముగాను చల్లగాను, ఉండే సూర్యుని (అటువంటి వాడొకడుంటే )వంటి కాంతి స్వరూపుడు

భావము:

శిష్యుడు ఆచార్యుని దేహమును పాదాది కేశ పర్యంతము ధ్యానించాలి అని, శిష్యుడు ఆచార్యుని దేహమునకు సేవ చేసుకోవాలి అన్న సూత్రమునకు నిరూపణగా ఇక్కడ ఆచార్యుల దేహమును వర్ణిస్తున్నారు. మామునులు తెల్లని అనంతుని అవాతరమగుట వలన  తనకిష్టమైన స్వరూపమును తానే స్వీకరించిన అందమైన విగ్రహ రూపుడుగా వర్ణింప బడ్డారు .పాల కడలి  ప్రకాశము పరిమితమైనందున   సూర్యుని  కాంతిని మామునులకు  ఉపమానముగా గ్రహించారు. సూర్యుని  కాంతి ఉగ్రముగా వుంటుంది కావున ఆదోషమును తొలగించడానికి ‘ప్రసన్న ‘  అనే విశేషణమును స్వీకరించారు. అనగా తేటగా, చల్లగా ఉండే సూర్యుడొకడుంటే ఆయన లాగా మామునులున్నారని అతిశయోక్తి అలంకారమును ప్రయోగించారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-3/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment