శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
1-2-3-4-5-6-7 ] – 6 – 5-4-3 [2-1
కూఱియ అఱుశువై ప్పయనుం ఆయినై
శుడర్ విడుం ఐమ్బుడై అంకైయుళ్ అమరందనై
శుందర నాళ్ తోళ్ మున్నీర్ వణ్ణ
ప్రతిపదార్థము:
కూఱియ అఱు శువై ప్పయనుం ఆయినై — – షడ్రుచులు (తీపి, పులిపు, కారము, చేదు, వగరు, ఉప్పు నాకు నువ్వే
అంకైయుళ్— – నీ అందమైన చేతులలో
అమరందనై– – ఒదిగినవి
శుడర్ విడుం ఐమ్బుడై– – ప్రకాశవంతమైన పంచాయుధములు
శుందర నాళ్ తోళ్- సుందరమైన నాలుగు చేతులు
మున్నీర్ వణ్ణ సముద్ర వర్ణుడా…..
భావము:
తనకు భగవంతుడే షడ్రుచులని తిరుమంగైఆళ్వార్లు చెపుతున్నారు.
భగవంతుడి ప్రకాశవంతమైన పంచాయుధములను ధరించిన సుందరమైన నాలుగు చేతులను ఆళ్వార్లు ఆనందముగా అనుభవిస్తున్నారు. . ఆ ఆనందమును శాశ్వతము చేయమని ప్రార్థిస్తున్నారు.
వ్యాఖ్యానము
కూఱియ అఱు శువైప్పయనుం ఆయినై
శాస్త్రములో చెప్పబడిన షడ్రుచులు నీవే అని అంటున్నారు ఆళ్వార్లు. నమ్మాళ్వార్లు “అఱు శువై అడిశిల్ ఎంకో” (నీవే చేతనులకు షడ్రుచులు) అని తిరువాయ్ మొళి 3-4-5 లో అన్నారు. ఆళ్వార్లకు ప్రకాశవంతమైన పంచాయుధములను ధరించిన సుందరమైన నాలుగు చేతులు ఆళ్వార్లకు షడ్రుచులు. కాబట్టి నిన్ను మాకు అనుగ్రహించమని అడుగుతున్నారుఅ.
శుడర్ విడుం ఐమ్బుడై అంకైయుళ్ అమరందనై – శంఖము,చక్రము, గథ, శారంగము, నందకము(కత్తి) అనే ప్రకాశవంతమైన పంచాయుధములను సుందరమైన నాలుగు చేతులలో ధరించినా లేకున్నా పరుల దిష్టి తగులుతుంది.
సుందర నాల్ తోళ్ మున్నీర్ వణ్ణ – అందము నాలుగు భాగములైతే అవి నీ సుందరమైన బాహువులు. “సర్వ భూషణ భూషార్హా: భాహవ:” [రామాయణము – కిష్కింధకాండము 3-15], [సర్వ భూషణములను ధరించుటకు అర్హమైన బాహువులు] .ఆభరణములకే అందమునిచ్చు బాహువులు. ఆభరణములేవీ లేకున్నా ఆ బాహువులు అందమైనవి. అవి అందమును సృషించిన బాహువులు.
మున్నీరు – ఆకాశము నుండి పడిన నీరు, నదుల నుండి చేరిన నీరు, భూమిలో ఊరిన నీరు, ఈ మూడు కలసి సముద్రముగా ఏర్పడుతుంది. అలసిన మనసుకు, కనులకు ఆ సముద్రము బడలికను పోగొట్టి ఆనందాన్నిస్తుంది. అలేగే సముద్ర వర్ణుడు ఈ సంసార సాగరములో పడి అలసిన వారికి బడలికను పోగొట్టి ఆనందాన్నిస్తాడు.
అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-8/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org