తిరువెళుకూట్ఱిరుక్కై

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

e-book of the whole series: http://1drv.ms/1J8z9Go

Audio

పన్నిద్దరాళ్వార్లలో ఒకరైన తిరుమంగైఆళ్వార్ల కు మాత్రం అనేక ప్రత్యేకతలున్నాయి. లోకములో అందరూ ఆచార్యులను ప్రార్ధించి పంచసంస్కారము పొందుతారు. కాని వీరు మాత్రము మానవమాత్రులను ఆశ్రయించక తిరునరయూర్ నంబిని  ఆశ్రయించి  పంచసంస్కారములను పొందారు. తిరుక్కణ్ణపురం పెరుమాళ్ళ దగ్గర తిరుమంత్రార్థమును పొందారు. వీరిది శార్ఘ అంశమని పెద్దలు చెపుతారు. అందుచేతనేమో వీరి పనులు, పాటలు బాణములా వాడిగా వుంటాయి.  వీరి  అసలు పేరు నీలుడు, ధర్మపత్ని కుముదవల్లి చేత సంస్కరింపబడటం  వలన వీరికి  తిరుమంగై ఆళ్వార్ల న్న పేరు స్థిరపడిపొయింది.  అర్చా రూపంలో కూడా  కుముదవల్లి సమేతంగానే దర్శనమిస్తారు.  వీరు అతి వేగంగా పరిగెత్తే ఆడల్మా అనే గుర్రాన్ని ఎక్కి దివ్యక్షేత్రాలన్నీ తిరిగి సేవించి మంగళాశాసనము చేసారు.

” మారన్ పణిత్త తమిళ్ మరైక్కు ఆరంగం కూఱ”   అని మణవాళమామునులు అన్నట్లు నమ్మాళ్వార్ల ద్రావిడవేదమునకు  ఉపనిషత్ సారమైన ఆరు ప్రబంధాలు పాడారు . అవి1.పెరియతిరుమొళి 2.తిరుక్కుఱుందాండగమ్ 3 . తిరు నెడుందాండగమ్ 4. తిరువెళుకూఱ్ఱిరుక్కై 5.శిరియ తిరుమడల్ 6.పెరియ  తిరుమడల్.

   జీవాత్మ ముక్తపురుషుడై పరమపదమునకు బయలుదేరినపుడు నిత్యసూరులు ఎదురేగి బ్రహ్మరథము లో తీసుకొని వెళతారని శాస్త్రము చెపుతున్నది.  తిరుమంగై ఆళార్లు తిరుమంత్రమే కత్తితో బెదిరించి పొందినవారు. ఆ శ్రీమన్నారాయణుడు పరమపదమునకు చేర్చుకోవటానికి ఆలస్యము చేసాడేమో నని బ్రహ్మరథమును తానే అక్షర రూపములో చేసుకున్నారు. అదే తిరువెళుక్కూఱ్ఱిరుక్కై  ప్రబంధము.  ఇందులో ఏడు భాగాలున్నాయి, కాని చూడటానికి ఒకటే పాశురములా కనపడుతుంది. ఆ ఏడు భాగాలలో వచ్చే అంకెలను వరుసగా అమరిస్తే రధం రూపు కడుతుంది. చివర కంబర్ రాసిన శ్రీ రామాయణములో ఇదే అర్ధం వచ్చే పాశురాన్ని కలిపి సేవించడం ఆచారముగా పెద్దలు ఏర్పాటు చేసారు.

తిరుమంగై ఆళ్వార్  పెరియ తిరుమొళిని మొదట  పాడారు. అందులో భగవంతుడిని దేహాత్మ సంబంధమునుతొలగించమని ప్రార్థిస్తూ ముగించారు.

తిరువెళుకూట్ఱిరుక్కై (తిరువెళుకూత్తిరుక్కై అని కూడ వ్యవహరింపబడుతుంది) తిరుమంగైఆళ్వార్ అనుగ్రహించిన ఆరు ప్రబంధములలో మొదటిది.

తిరుమంగైఆళ్వార్ అనుగ్రహించిన ప్రబంధములలో  మొదటిదైన  పెరియతిరుమొళి లో ఈ దేహసంబంధమును తొలగించమని(ఆత్మకు దేహముతో ఉన్న సంబంధం) ప్రార్థించిరి. తమ రెండవ ప్రబంధమైన తిరుక్కురుదాణ్డగం లో, ఎంపెరుమాన్ తాను ఆళ్వార్ కి తమపై ఆర్తిలో  పరాకాష్ఠ వచ్చేంతవరకు  దర్శనమివ్వలేదు, ఈ ఆలస్యపు విరహాన్ని ఆళ్వార్  భరించలేకపోయిరి.  ఎలాగైతే బాగా దప్పికగొన్న వాడు నీటిలో దిగి ఆ నీటిని త్రాగి దానిలో  మునిగి తనపై కుమ్మరించుకుంటాడో ఆళ్వార్ కూడా ఆ మాదిరి తమ గానములో  ఎంపెరుమాన్ తో సంభాషించడం, సాష్టాంగ పడటం/విచారపడుతూ తమకై ఆలోచిస్తూ తామ ఉనికికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రబంధములో. ఎప్పుడైతే బాగా దప్పికఉన్న   వాడు కొంత నీరు త్రాగిన తర్వాత ఆ తృప్తి తీరక మళ్ళీ మళ్ళీ నీటిని త్రాగాలని అనుకుంటాడో,  ఆ రీతిగా ఆళ్వార్ కూడ ఎంపెరుమాన్ అనిభవించాలని ఆర్తితో ఉన్నారు. అలా తమ మూడవ ప్రబంధమైన తిరువెజుక్కూట్ఱిరుక్కై లో తాము తిరుకుడందై(కుంభకోణం) ఆరావముదన్ కు పరతంత్రులై వారిని అనుభవించాలని వాంఛతో ఉన్నారు. అందుకే ఇది శరణాగతి ప్రబంధమైనది. (నమ్మాళ్వార్ కూడ   తిరుకుడందై ఆరావముదన్ కు తమ తిరువాయ్ మొళి 5-8 లో  శరణాగతి చేశారు)

ప్రబంధ నామ నిర్ణయము:  తిరువెజుక్కూట్ఱిరుక్కై- ఎజు- ఏడు, కుఱు- విభాగములు, ఇరుక్కై – కలిగి ఉన్న. లేదా  ఇది ఏడుగా ఉన్నది –  కవిత్వం పై  దేశ, కాల, గణనలపై  ఆధారపడి  ” చిత్రకవిత్వం ” గా ప్రస్తావింపబడుచున్నది. తిరువెజుక్కూట్ఱిరుక్కై ని రథబంధ నిర్మాణంలో లిఖించవచ్చు. రథం ప్రారంభములో కొద్ది వెడల్పుతో ఆరంభమై క్రమంగా వెడల్పు అధికమయిన్నట్లుగా,  తిరువెజుక్కూట్ఱిరుక్కై కూడ పాశురం ప్రథమపంక్తిలో 123 సంఖ్యలను , తరువాతి పంక్తిలో12321 సంఖ్యలను, ఆ పై పంక్తిలో 123454321 సంఖ్యలను , ఆ పై  పంక్తిలో 12345654321 సంఖ్యలను, ఆ పై పంక్తిలో 1234567654321  సంఖ్యలను ప్రయోగించడం జరిగినది.

thiruvezhukURRirukkai

పద్యపు ఈ నిర్మాణాన్ని రథబంధం గా వ్యవహరిస్తారు. ని నిర్మాణ ప్రబంధ రూపం నయనాందకరం చేస్తుంది ఔత్సాహికులకు – thiruvezhukURRirukkai_telugu_drawing

తిరువెజుక్కూట్ఱిరుక్కై తెలుగు చిత్ర పటం

చాలా దివ్యదేశములలో తిరువెజుక్కూట్ఱిరుక్కై ప్రబంధ పారాయణ  రథోత్సవమునాడు చేయబడుతుంది.

ఈ అనువాదం ప్రతిపదార్థ నిర్మాణమునకై ఉద్దేశించినది కాదు. వ్యాఖ్యానములలోని విశేషాంశాలను అందించడానికై ప్రయత్నం చేయబడింది. ఏదైని మార్పులు చేర్పులు అవసరమైతే మమ్మల్ని సంప్రదిందగలరు. మీ విలువైన  అభిప్రాయాలను మేము సదా ఆహ్వానిస్తాము.

వ్యాఖ్యాన చక్రవర్తి అగు పెరియవాచ్చాన్ పిళ్ళై గారి వ్యాఖ్యానముతో అందించదడింది.

వ్యాఖ్యానపు వివరణాత్మక వర్ణనలకు  పుత్తూర్ స్వామి యొక్క భాష్యం చాలా వరకు ఉపయోగపడింది.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/04/thiruvezhukurrirukkai/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

0 thoughts on “తిరువెళుకూట్ఱిరుక్కై”

Leave a Comment