<< తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 61 – 70
పాశురం: 71
అవతారిక: భగవంతుడి గుణముల స్వరూపం యొక్క విషయంలో సందేహం కలిగితే ఆ అతిశంఖని తొలగించిన ప్రకారాన్ని తెలియజేసే దశకం ‘దేవి మార్‘ అనే 71 వ తిరువాయ్ మోళి. ఆ పాశురాలలో నమ్మాళ్వార్ తెలియజేసిన విషయాలు సంగ్రహంగా ప్రస్తుత ’తేవన్ ఉఱై పతియిల్’ అనే పాశురంలో మామునులు మనకు అనుగ్రహించారు.
తేవన్ ఉఱై పతియిల్ శేరప్పెఱామైయాల్
మేవుమ్ అడియార్ వశనామ్ మెయన్నిలైయుమ్ – యావైయుమ్ తాన్
నానిలైయుమ్ శన్గిత్తవై తెళిన్ద మాఱన్పాల్
మానిలత్తీర్ నన్గళ్ మనమ్
ప్రతిపదార్థము:
మానిలత్తీర్ = ఈ భూమి మీద నివసించే జనులారా
తేవన్ ఉఱై పతియిల్ = భగవంతుడు వేంచేసి ఉన్న తిరువారన్ విలై అనే దివ్యదేశంలో
శేరప్పెఱామైయాల్ = చేరి, పాడి కైంకర్యం చేసే భాగ్యం లభించక
మేవుమ్ అడియార్ వశనామ్ మెయన్నిలైయుమ్ = భగవంతుడిని ఆశ్రయించిన కైంకర్యపరులకు పరతంత్రుడైన దశలో కూడా
యావైయుమ్ తాన్నానిలైయుమ్ = చేతనాచేతనాలన్నీ ’తాను’ అనే పదంలో చేరి ఉండి కూడా
శన్గిత్తు = శంకించి
అవై తెళిన్ద = ఆ శంక తీరిన తరువాత
మాఱన్పాల్ = ఆళ్వార్ల విషయంలో నన్గళ్
మనమ్ = మన మనస్సు అన్వయించి ఉండును
భావము: ఓ ప్రజలారా! నమ్మాళ్వార్లు, భగవంతుడు దేవేరులతో కూడా వేంచేసి ఉన్న తిరువారన్ విళై దివ్యదేశం చేరారు. కానీ అక్కడ స్వామి కైంకర్యం చేసే అవకాశం పొందలేక భగవంతుడి ఆశ్రిత పారతంత్ర్యం, సర్వ శరీరం అనే ఆశ్రిత రక్షణోపాయం, యోగగుణాలు ఉన్నాయా! అని శంకించారు. తరువాత స్వామి అనుగ్రహం చేత ఆ గుణాలు ఆయనలో ఉన్నాయని నిశ్చయించు కొని, కుదుట పడిన నమ్మాళ్వార్ల విషయంలో మా మనసు లగ్నం అయింది’ అని మామునులు తెలియజేస్తున్నారు.
అవతారిక: నమ్మాళ్వార్లు ఆత్మాత్మీయులలో ఆశ లేదని ‘నజ్ఞ్గళ్ వరివళయాయ్‘ అనే తిరువాయ్ మొళిలో అనుగ్రహించిన శ్రీసూక్తులను మామునులు సంగ్రహించి ’నన్గరుత్తై’ అనే ఈ పాశురంలో కృప చేస్తున్నారు.
నన్గరుత్తై నన్ఱాగ నాడి నిఱ్కుమ్ మాలఱియ
ఇన్గివఱ్ఱిల్ ఆశై ఎమక్కుళదెన్ శన్గైయినాల్
తన్నుయిరిన్ మఱ్ఱినశై తానొళిన్ద మాఱన్
అన్నిలైయై ఆయ్న్దురైత్తాన్ అజ్ఞు
ప్రతిపదార్థము:
నన్గరుత్తై = తమ హృదయమును
నన్ఱాగ నాడి నిఱ్కుమ్ = బాగా పరిశీలించి ఉన్న
మాలఱియ = భగవంతుడు తెలుసుకొనునట్లు
ఇన్గివఱ్ఱిల్ ఆశై = ఈ విభూతి యందు కోరిక
ఎమక్కుళదెన్ శన్గైయినాల్ = మాకు ఉన్నదన్న అతి శంఖతో
తన్నుయిరిన్ మఱ్ఱిల్ = ఆత్మీయుల యందు
నశై తానొళిన్ద = ఆశ లేని
మాఱన్ = నమ్మాళ్వార్
అన్నిలైయై ఆయ్న్దు = ఆ స్వభావాన్ని పరిశీలించి
అజ్ఞు ఉరైత్తాన్ = పరిశీలించి ఆ విధంగానే కృప చేశారు
భావము: నమ్మాళ్వార్ మనసు సర్వసంగ పరిత్యాగం చేసినా, మనకు తెలియకుండా ఈ విభూతిలో ఉన్న విషయాల మీద ఏ కాస్తైనా ఆశ మిగిలిపోవచ్చు. అలా ఉంటే సర్వజనుల అభిప్రాయాలను తెలుసుకోగలిగిన సర్వేశ్వరుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఫలితం ఇవ్వడేమో అని నమ్మాళ్వారు సందేహించారు. అందుకని తమకు ఆత్మాత్మీయములో ఏమాత్రం ఆశ లేదని అది సవాసనగా నశించిందని విన్నవించారు.
అవతారిక: ‘ఈ లీలా విభూతిలో ప్రేమతో మంగళాశాసనం చేసేవారు లేరే’ అని నమ్మాళ్వార్ కలత చెందారు. అప్పుడు పెరియాళ్వార్ వంటి ’ప్రేమించే వారు ఉన్నారు‘ అని స్పష్టపరిచిన శ్రీ సూక్తిని ‘అజ్ఞుమిజ్ఞుమ్‘ అనే 73వ తిరువాయ్ మొళికి సంగ్రహంగా ‘అజ్ఞమరర్ పేణవవర్ ‘ అనే ఈ పాశురం అమరింది.
అజ్ఞమరర్ పేణవవర్ నడువే వాళ్ తిరుమాఱ్కు
ఇజ్ఞోర్ పరివరిలై యెన్ఱజ్ఞు ఎజ్ఞుమ్
పరివరుళర్ ఎన్నప్పయమ్ తీర్న్ద మాఱన్
వరి కళఱ్ఱాళ్ శేర్న్దవర్ వాళ్వార్
ప్రతిపదార్థము:
అజ్ఞు = ఆ నిత్యవిభూతిలో
అమరర్ పేణ = నిత్య సూర్యులు మంగళా శాసనం చేయగా
అవవర్ నడువే వాళ్ = వారి మధ్య వేంచేసి ఉన్న
తిరుమాఱ్కు = శ్రియః పతికి
ఇజ్ఞు = ఈ లీలా విభూతిలో
ఓర్ పరివరిలై యెన్ఱజ్ఞు = ప్రేమతో మంగళాశాసనం చేసేవారు ఎవరూ లేరే అని భయపడి
ఎజ్ఞుమ్ = అంతటా
పరివరుళర్ ఎన్న = ప్రేమించే వారు ఉన్నారని చెప్పగా
ప్పయమ్ తీర్న్ద = అందువలన భయము తీరిన
మాఱన్ = నమ్మాళ్వార్
వరి కళళ్ తాళ్ = విజయ రేఖలతో వీరత్వాన్ని తెలియజేసే కాలి అందెలతో ఉన్న శ్రీపాదాలను
శేర్న్దవర్ = పొందినవారు
వాళ్వార్ = ఉజ్జీవించగలరు
భావము: ‘పరమపదంలో
అవతారిక: నమ్మాళ్వార్లకు మళ్ళీ భయం కలుగకుండా సర్వేశ్వరుడు తన శౌర్యవీర్య పరాక్రమాదులను, శాపానుగ్రహసామరదుల సహవాసాన్నీ, చూపించారు. అది చూసిన ప్రకారాన్ని తెలిపే నమ్మాళ్వార్ల శ్రీసూక్తిని తెలిపే ‘వార్ కడా‘ అనే 74 వ తిరువాయ్ మొళి సారాన్ని ‘వారామచ్చమిని‘ అనే ఈ పాశురంలో అనుగ్రహించారు.
వారామచ్చమిని మాల్ తన్ వలియినైయుమ్
శీరార్ పరివరుడన్ శేర్త్తియైయుమ్ పారుమెన
త్తాన్ ఉగన్ద మాఱన్ఱాళ్ శార్ నెన్జే శారాయేల్
మానిడవరైచ్ చార్న్దు మాయ్
ప్రతిపదార్థము:
ఇని అచ్చమ్ వారామల్ = ఇక భయపడవలసిన అవసరము లేకనే
మాల్ = భగవంతుడు సర్వేశ్వరుడు
తన్ వలియినైయుమ్ = తన పరాక్రమాదులను
శీరార్ పరివరుడన్ శేర్త్తియైయుమ్ = పరత్వంతో పాటు తనపై ప్రీతి గల వారితో తాను ఎట్లా చేరి ఉంటాడో ఆ ప్రకారాన్ని
పారుమెన = చూడండి అని చూపించగా
త్తాన్ ఉగన్ద = తాము ప్రీతితో కృప చేసిన
మాఱన్ తాళ్ = ఆళ్వార్ల శ్రీపాదములను
నెన్జే శార్ = ఓ మనసా ఆశ్రయించుము
శారాయేల్ = అట్లా ఆశ్రయించక పోయినచో
మానిడవరైచ్ చార్న్దు మాయ్ = మనుషులను ఆశ్రయించి నశించిపోవటమే జరుగుతుంది
భావము: ఓ మనసా! ఇక భయపడవలసిన అవసరము లేదు. సర్వేశ్వరుడు తన శక్తిని, తనపై ప్రేమతో మంగళాశాసనం చేసే వారిని చూపించాడు. పరాక్రమాదులను, పరత్వంతో పాటు తనపై ప్రీతి గల వారితో తాను ఎట్లా చేరి ఉంటాడో ఆ ప్రకారాన్ని చూపించాడు. అది చూసి ప్రీతి చెందిన ఆళ్వార్ల శ్రీపాదములను ఆశ్రయించడమే మనకు ఉత్తారకము. అలా చేయకపోతే సంసారుల సహవాసంతో నశించిపోవటమే జరుగుతుంది అని తెలుసుకోవాలి అని చెబుతున్నారు.
అవతారిక: ‘మాయన్ వడివళగై’ అనే ఈ పాశురములో భగవంతుడి దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని అనుభవించలేక దుఃఖిస్తున్న శఠకోపుల ఆర్తి అతిశయాన్ని తెలియజేస్తున్నారు. నమ్మాళ్వార్ ‘మాయకుతాన్’ అనే 75 వ దశకంలో తెలియజేసిన అర్థాలను ఈ పాశురములో మామునులు సంక్షిప్తంగా అనుగ్రహించారు.
మాయన్ వడివళగై క్కాణాత వల్ విడా
యాయ్ అతఱ విజ్ఞి యళుదలఱ్ఱుమ్ తూయపుగళ్
ఉఱ్ఱ శఠకోపనై నామొన్ఱి నిఱ్కుమ్బోదు పకల్
అఱ్ఱ పొళుతాన తెల్లియామ్
ప్రతిపదార్థము:
మాయన్ = సర్వేశ్వరుడి
వడివళగై = దివ్య విగ్రహ సౌందర్యాన్ని
క్కాణాత = సేవించలేక పోయినందువలన కలిగిన
వల్ విడాయాయ్ అతు = పెద్ద దుఃఖం
అఱ విజ్ఞి = మిక్కిలి అధికమై
అళుదలఱ్ఱుమ్ = విలపించి అక్రమముగా మొరపెట్టుతున్న
తూయపుగళ్ ఉఱ్ఱ = పరిశుద్ధమైన
శఠకోపనై = శఠకోపులను
నామొన్ఱి నిఱ్కుమ్బోదు = మనము చేరి ఉండి అనుభవించు సమయము
పకల్ = పగలే అవుతుంది
అఱ్ఱ పొళుతానతు = ఆ అనుభవము విచ్చేదమై లేని కాలంలో
ఎల్లియామ్ = అది కాళరాత్రి అవుతుంది
భావము: శఠకోపులు భగవంతుడి దివ్య మంగళ విగ్రహసౌందర్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశపడ్డారు. అది లభించక ఆర్తితో దుఃఖిస్తూ విలపించారు. అలాంటి గొప్ప కీర్తిమంతులైన నమ్మాళ్వార్లను ఆశ్రయించి వారి గుణాలను అనుభవించినప్పుడే, మన కోరిక తీరే రోజు అవుతుంది. అదే మన పాలిటి పగలు అవుతుంది. అది తీరని నాడు అది గాఢాంధకారంతో నిండిన కాళరాత్రికి సమానం అవుతుంది.
అవతారిక: నమ్మాళ్
ఎల్లిపకల్ నడన్ద విన్ద విడాయ్ తీరుకైక్కు
మెల్లవన్దు తాన్ కలక్క వేణుమెన – నల్లవర్ కళ్
మన్ను కడిత్తానత్తే మాల్ ఇరుక్క మాఱన్ కణ్డు
ఇన్నిలైయైచ్చొన్నాన్ ఇరున్దు
ప్రతిపదార్థము:
ఎల్లిపకల్ నడన్ద = రాత్రింబవళ్లు ఎక్కువవుతున్న
ఇన్ద విడాయ్ తీరుకైక్కు = ఈ విశ్లేష దుఃఖం తీరడానికి
మెల్లవన్దు తాన్ కలక్క వేణుమెన = మెల్లమెల్లగా వచ్చి తాను సంశ్లేషించాలని భావించి
నల్లవర్ కళ్ మన్ను = మంచి యశస్సు గల వేదవేత్తలు నిత్య నివాసం చేస్తున్న
కడిత్తానత్తే = తిరుక్కడితానం అనే దివ్య క్షేత్రంలో
మాల్ ఇరుక్క = భగవంతుడు వేంచేసి ఉండగా
మాఱన్ కణ్డు = నమ్మాళ్వారు సేవించి
ఇరున్దు = స్థిరంగా అక్కడే ఉండి
ఇన్నిలైయైచ్చొన్నాన్ = ఈ స్థితిని కృప చేశారు
భావము:
పాశురం: 77
అవతారిక: నమ్మాళ్వా
ఇరున్దవన్ఱాన్ వన్దు ఇన్గివర్ ఎణ్ణమ్ ఎల్లామ్
తిరున్ద ఇవర్ తన్దిఱత్తే శెయ్దు పొరున్ద
క్కలన్ది నియనాయ్ నిర్క్కక్కణ్డ శఠకోసంసారులుపర్
కలన్ద నెఱి కట్టురైత్తార్ కణ్డు
ప్రతిపదార్థము:
ఇరున్దవన్ఱాన్ = తిరుక్కడి తానంలో వేంచేసి ఉన్న ఓ సర్వేశ్వరా!
ఇన్గు వన్దు = ఇక్కడికి వేంచేసి
ఇవర్ ఎణ్ణమ్ ఎల్లామ్ తిరున్ద = వీరి మనోరథమంతా పూర్ణత్వాన్ని పొందునట్లు
ఇవర్ తన్దిఱత్తే శెయ్దు = వీరిని కృప చేసి
పొరున్దక్కలన్దు = ఒకే నీరు అన్నట్లుగా కలిసి
ఇనియనాయ్ నిర్క్కక్కణ్డ = ప్రియమైనవాడుగా వేంచేసి ఉండటాన్ని సేవించిన
శఠకోపర్ = శఠకోపులు
కలన్ద నెఱి = ఆయన తమతో సంశ్లేషించిన ప్రకారాన్ని
కణ్డు = మానసిక సాక్షాత్కారంగా దర్శించి
కట్టురైత్తార్ = కృప చేశారు
భావము: తిరుక్కడి తానంలో వేంచేసి ఉన్న సర్వేశ్వరుడు, ఇప్పుడు ఆళ్వార్ల సమక్షంలోకి వేంచేసి, వీరి మనోరథమంతా పూర్తిగా తీర్చినట్లు, దాని వలన వీరు తృప్తి పొందినట్లు మానసిక సాక్షాత్కారాన్ని పొందారు. ఆళ్వారులను సర్వేశ్వరుడు ఎంతగా కృప చేసారంటే ఇద్దరూ ఒకే నీరు అన్నట్లుగా కలిసిపోయారు. తనకు ఎంతో ప్రియమైనవాడుగా తనతో భగవంతుడు వేంచేసి ఉండటాన్ని మానసిక సాక్షాత్కారంగా సేవించిన శఠకోపులు ఆయన తమతో సంశ్లేషించిన ప్రకారాన్ని దర్శించి, ‘ఇరుత్తుమ్‘ అనే దశకంలో అద్బుతంగా కృప చేశారు. ఆ దశక సారాన్ని మామునులు ఇక్కడ మనకు అనుగ్రహించారు.
పాశురం: 78
అవతారిక: జీవుడి స్వరూప వైలక్షణ్యాన్ని సర్వేశ్వరుడు దర్శింపచేయగా దానిని ‘కణ్గళ్ శివన్దు‘ అనే తిరువాయ్ మొళి దశకంలో నమ్మాళ్వార్లు వివరించారు. ఆ దశక సారాన్ని ప్రస్తుత పాశురమైన ‘కణ్ణిఱైయ వన్దు‘ లో మామునులు అనుగ్రహించారు.
కణ్ణిఱైయ వన్దు కలన్ద మాలిక్కలవి
తిణ్ణిలైయా వేణుమ్ ఎనచ్చిన్దిత్త్తు తణ్ణితెను
మారుయిరినేఱ్ఱమదు కాట్ట వాయ్న్దురైత్తాన్
కారిమాఱన్ తన్ కరుత్తు
ప్రతిపదార్థము:
కణ్ణిఱైయ వన్దు కలన్ద మాl = కన్నులు తృప్తి చెందేట్లుగా వచ్చి సంశ్లేశించిన భగవానుడు
ఇక్కలవి = ఈ సంశ్లేషం
తిణ్ణిలైయా వేణుమ్ ఎనచ్చిన్దిత్త్తు = దృఢంగా ఉండాలని భావించి
తణ్ణితెనుమ్ = అల్పమనబడే
ఆరుయిరిన్ = విలక్షణమైన ఆత్మ యొక్క
ఏఱ్ఱమదు కాట్ట = శ్రేష్టతని దర్శింపజేసి కృప చేయగా
కారిమాఱన్ = నమ్మాళ్వార్లు
ఆయ్న్దు = పరిశీలించి
తన్ కరుత్తురైత్తాన్ = తన మనోభావాలను కృప చేస్తున్నారు
భావము: ‘ కణ్గళ్‘ అనే తిరువాయ్ మొళిలో సర్వేశ్వరుడు ఆళ్వార్లకు కన్నులారా సేవ సాధించి, మహా వ్యామోహంతో వారిని సంశ్లేషించారు. తర్వాత ఈ సంశ్లేషం ఇలాగే నిత్యం కావాలని, దీనికి ఆటంకం ఏముంటుంది? అని పరిశీలించారు. ‘ఆళ్వార్లు నాతో సంశ్లేషించడానికి తమ స్వరూపం తగినది కాదని అనుకుంటున్నారు. అదే ఈ సంశ్లేషానికి ఆటంకం కనుక, వారి భావాన్ని పోగొట్టి తీరాలి’ అని అనుకున్నారు. భగవంతుడు వారికి జీవాత్మ యొక్క స్వరూపం తాలూకు గొప్పతనాన్ని ప్రకాశింప చేశాడు. దానిని దర్శించిన నమ్మాళ్వార్లు ఆత్మ స్వరూపాన్ని పరిశీలించి మనకు తెలుపుతున్నారు.
పాశురం: 79
అవతారిక: నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి ‘కరుమాణిక్కమాలై’ అనే 79 వ దశకంలో ఆత్మ యొక్క అన్యశేషత్వ వృత్తిని కృపచేశారు. విలక్షణమైన ఆత్మ స్వరూపం తనకే చెందక అతడికే అనన్యార్హ శేషమై ఉండే ప్రకారాన్ని అన్యాపదేశంగా కృపచేశారు. దాని సారాన్ని ‘కరుమాల్ తిఱత్తిల్’ అనే ఈ పాశురంలో మామునులు మనకు అనుగ్రహించారు.
కరుమాల్ తిఱత్తిల్ ఒరు కన్నికైయామ్ మాఱన్
నొరుమాకలవి యురైప్పాల్ తిరమాక
వన్నియరుక్కాకాదు అవన్ తనక్కే ఆగుమ్ ఉయిర్
ఇన్నిలైయై ఓరు నెడితా
ప్రతిపదార్థము:
కరుమాల్ తిఱత్తిల్ = శ్రీకృష్ణ భగవానుడి విషయంలో
ఒరు కన్నికైయామ్ మాఱన్ = ఒక కన్యకావస్థను పొందిన ఆళ్వార్
ఒరుమాకలవి యురైప్పాల్ = అద్వితీయములు, విలక్షణములు అయిన సంశ్లేష లక్షణములను సఖివాక్యములుగా కృప చేయాలని ఆరంభించారు గనుక
తిరమాక = స్థిరంగా
ఉయిర్ అన్నియరుక్కు ఆకాదు = ప్రాప్తశేషికే శేషమని ఆత్మస్వరూపనిష్ట అన్యులకు శేషము కాకుండా
అవన్ తనక్కే ఆగుమ్ ఇన్నిలైయై = అతడికే శేషమనే ఈ దశను
నెడితా = బాగుగా
ఓరుమ్ = పరిశీలించుడు
భావము: అందమైన దివ్య మంగళ విగ్రహుడై, ఆశ్రిత వ్యామోహం గల, సర్వేశ్వరుడుతో ఒక పిరాట్టి దశను ఆళ్వార్లు పొందారు. ఆళ్వార్లకు కలిగిన అద్వితీయమైన అతిశ్లాగనీయమైన కలయిక అనే అనన్యార్హశేషత్వాన్ని అన్యాపదేశంగా ఆయన తమ ‘కరుమాణిక్కమలై‘ అనే 79వ దశకంలో కృప చేశారు. ఓ మనసా! నువ్వు వారు సాధించిన ప్రకారం, చేతనుల భగవత్చ్చేషత్వాన్ని, అన్యశేష రాహిత్యాన్ని, బాగా పరిశీలించి చూడుమా! అని చెపుతున్నారు.
పాశురం: 80
అవతారిక: అనన్య శేషత్వానికి ఎల్ల భాగవతశేష పర్యంతం, అని ఆళ్వార్లు కృప చేసిన ’నెడు మార్కడిమై’ అనే 80 వ తిరువాయ్ మొళి సారాన్ని ఈ పాశురంలో మామూలుగా మనకు అనుగ్రహించారు.
నెడుమాల్ అళగుతనిల్ నీళ్ గుణత్తిలిడు
పడుమా నిలైయుడైయ పత్తర్క్కడిమైతనిల్
ఎల్లై నిలన్దానాక ఎణ్ణినాన్ మాఱన్ అతు
కొల్లై నిలమాన నిలై కొణ్డు
ప్రతిపదార్థము:
నెడుమాల్ అళగుతనిల్ = భగవంతుడి విగ్రహ సౌందర్యానికీ
నీళ్ గుణత్తిల్ = గొప్ప సౌహార్థ గుణానికీ
ఈడు పడుమ్ = వశపడుతున్న
మానిలైయుడైయ = ఉత్కృష్ట స్వభావం గల
పత్తర్క్కడిమైతనిల్ = భాగవతుల విషయంలో దాసులవటమే కాక
ఎల్లై నిలమ్ తానాక ఎణ్ణినాన్ = పరాకాష్ట తామే అని భావించిన వారు
మాఱన్ = నమ్మాళ్వార్, ఎందువలనంటే
అతు కొల్లై నిలమాన నిలై కొణ్డు = ఆ భాగవత శేషత్వం యొక్క చిట్టచివరిదైన ఉత్తమ పురుషార్ధమనేనిష్ఠ వలన
భావము : ‘నెడు మార్కడిమై’ అనే తిరువాయ్ మొళిలో నమ్మాళ్వార్లు, ‘భాగవత శేషత్వమే ఉత్తమోత్తమ పురుషార్ధం’ అని నిర్ధారించారు. ఆ నిష్టనే అనుష్టిస్తూ సర్వేశ్వరుడి దివ్య మంగళ విగ్రహ సౌందర్యానికీ, సౌహార్దాది ఆత్మగుణాలకి ఈడుపడిన భాగవత దాసదాస పరంపరలో తమను చరమావధిదాసులుగా భావించారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-71-80-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org