సప్తగాథై – తనియన్లు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

సప్తకాథై

వాళి నలన్తికళ్ నారణతాతనరుళ్,
వాళి అవనముద వాయ్ మొళి గళ్, – వాళియే
ఏఱు తిరువుడైయాన్ ఎన్దై యులకారియన్ శొల్,
తేఱు తిరువుడైయాన్ శీర్.

ప్రకాశించే గొప్ప జ్ఞానాన్ని కలిగిన వారైన నారాయణతాతర్ (నారాయణదాసులు) అనే తిరునామము కలిగిన వారైన శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారి యొక్క కృప వర్ధిల్లాలి. వారు అనుగ్రహించిన మధురమైన శ్రీసూక్తులు గలసప్తగాథైఅనే ప్రబంధం వర్ధిల్లాలి. సదా వర్ధిల్లే భగవద్ భాగవత ఆచార్య గుణానుభవ, రూప సంపదను కలవారై, శ్రీ పిళ్ళైలోకాచార్యుల వారి శ్రీసూక్తుల యందు ఏ రకమైన సందేహము లేని స్పష్టమైన జ్ఞానాన్నికలిగినవారై మరియు చరమపర్వనిష్ఠారూపాపన్నమైన  ఆచార్యాభిమానమనే సంపదను సమృద్ధిగా కలవారైన శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారి వైభవం నిత్యనూతనముగా వర్ధిల్లాలి.

అడియేన జ్యోతిర్మయి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2022/12/saptha-kadhai-thaniyan/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment