పూర్వ దినచర్య – శ్లోకం 26 – అథ శ్రీశైలనాథా

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 25

శ్లోకం 26

అథ శ్రీశైలనాథార్య నామ్ని శ్రీమతి మండపే |

తదంఘ్రి పంకజద్వంద ఛ్ఛాయామధ్యనివాసినం ||

ప్రతి పదార్థం:

అథ = మఠమునకు వేంచేసిన తరువాత

శ్రీశైలనాథార్య నామ్ని = శ్రీశైలనాధులన బడే తమ ఆచార్యులైన తిరువాయిమొళి పిళ్ళై తిరునామము గల

శ్రీమతి = మిక్కిలి ప్రకాశము గల

మండపే = మంటపములో

తదంఘ్రి పంకజద్వంద ఛ్ఛాయామధ్య నివాసినం = చిత్ర రూపములో నున్న తమ ఆచార్యుల శ్రీపాదముల నీడలో మామునులు వేంచేసి వున్నారని ఈ శ్లోకములో చెపుతున్నారు.

భావము:

తమ మఠములో కాలక్షేప మండపమునకు తమ ఆచార్యులైన తిరువాయిమొళి పిళ్ళై నామకారణము గావించి, వారి పఠమును చిత్ర రూపములో వేంచేపు చేసుకున్నారు మామునులు. ఆ చిత్రము యొక్క శ్రీ పాదముల దగ్గర తాను వేంచేసి వున్నారని ఈ శ్లోకములో చెపుతున్నారు. శ్రీమతి మండపే మిక్కిలి ప్రకాశము గల మంటపము అన్నారు. ఆ మంటపమునకు అంతటి  ప్రకాశము ఎందుచేత అబ్బిందంటే పిళ్ళై లోకాచార్యులాది పూర్వాచార్యుల తిరుమాళిగల నుండి తీసుకు వచ్చిన మట్టితో ఆ గోడలపై పూయడం చేత ఏర్పడింది. మహానుభావులు వేంచేసి వుండిన స్థలములు , వారి శ్రీపాదములు తగిలిన స్థలములు పవిత్రములు కదా!  అందువలననే ఈ మఠమునకు శుద్ది ఏర్పడినది. ఇక్కడ ‘ తదంఘ్రి పంకజద్వందచ్చాయామధ్యనివాసినం ‘ షష్ఠీ బహువచన ప్రయోగము కనపడుతున్నది. తమ ఆచార్యుల పాద ఛ్ఛాయలో తాము అమరినట్లు తమతో శిష్యులు కూడ అమరి ఉన్నట్లు అర్థము.  పై శ్లోకములో చెప్పినట్ళు ‘దివ్యప్రబంధ సారం వ్యాచక్షాణం నమామి తం ‘ (దివ్య ప్రబంధ సారమును అనుగ్రహించు మామునులను నమస్కరిస్తున్నాను అని ) తో అన్వయము చేసుకోవాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-26/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment