Category Archives: thiruvezhukURRirukkai

తిరువెళుకూట్ఱిరుక్కై 13వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 12వ భాగము

కంబర్,   తిరుమంగై ఆళ్వార్ల  గురించి పాడిన పాశురము ఈ ప్రబంధానికి ఆఖరి భాగముగా అమరింది.

ఇడం కొణ్డ నెంజత్తు ఇణంగిక్కిడప్పన
ఎన్ఱుం తడం  తామరై సూళుం మలర్ద తణ్ పూన్
విడం కొణ్డ వెణ్ పల్ కరుం తుత్తి చెంకణ్ తళల్ ఉమిళ్ వాయి
పడం కొణ్డ పాంబణైప్పళ్ళి కొణ్డాన్ తిరుప్పాదంగళే

ప్రతి పదార్థము:

కుడంతై       తిరుక్కుడందై లో 

సూళుం  ఆవరించిన

పొన్ని- కావేరి

తామరై కొణ్డ తడం –తామర పూలతో నిండిన   కొలనులు

తణ్ పూ చల్లని, అందమైన,సుకుమారమైన, పూలు

మలర్ద –  వికసించిన

ప్పళ్ళి కొణ్డాన్ –  పవళించిన ఆరావముదన్  

పడం కొణ్డ పాంబణై- పడగ తో కూడిన ఆది శేష శయ్యపై

విడం కొణ్డ-     పడగ       విప్పిన    

వెణ్ పల్తెల్లని దంతములు

కరుం తుత్తి  –  పడగపై నల్లని చుక్కలు

సెం కణ్ఎర్రని కన్నులు

తళల్ ఉమిళ్ వాయి – నిప్పులు చెరిగే  నోరు

తిరుప్పాదంగళే- శ్రీపాదములే 

 ఎన్ఱుం తడం ఇణంగిక్కిడప్పన- శ్రీమన్నారాయణుని శ్రీపాదములు రెండు

 నెంజత్తు –  మనసులో

ఇడం కొణ్డ – స్థానము పొందిన

 భావము:

తిరుకుడందై ఆరావముద పెరుమాళ్ళను   తిరువెళుకూఱ్ఱిరుక్కైలో  తిరుమంగైఆళ్వార్ల పాడిన విధముగానే కంబర్ కూడా పాడారు.  తిరుమంగై ఆళ్వార్ల  గొప్పదనాన్ని కీర్తిస్తూ కంబర్ పాడిన పాశురాన్ని ఈ ప్రబంధము చివర చేర్చారు.

వ్యాఖ్యానము:

పొన్నితామరై కొణ్డ థడం సూళుం :చల్లని కావేరి, చల్లని, అందమైన,సుకుమారమైన, వికసించిన తామర పూలతో నిండిన కొలనులు ఆవరించి వున్న తిరుకుడందై ఉన్న ఆరావముద పెరుమాళ్ళు

విడం కొణ్డ  పాంబణై శేషశయనము   పడగ విప్పిన   —  

విడం కొణ్డ వెణ్పల్ –  అసురులను, రాక్షసులను కొరకగల విషపూరితమైన తెల్లని పళ్ళు

కరుం తుత్తినల్లని చుక్కలు

సెం కణ్పరమాత్మను రక్షించటములో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటము వలన ఎర్రబడ్డ కళ్ళు

తళల్ ఉమిళ్ వాయి –  ఆంగు ఆరవారం అదు కేట్టు అళల్ ఉమిళుం పూంకార్ అరవణై” [నాన్ముగన్ తిరువందాది]10  )  ఆది శేషుడు అక్కడ ఏదైనా అలికిడి వినపడగానే ,పరమాత్మకే కీడు తలపెట్ట ఎవరొచ్చారో అని నోటితో నిప్పులు చెరుగుతాడు.

పడం కొణ్డ పాంబణైప్పళ్ళి కొణ్డాన్ – ఆదు అరవు అమళియిల్ అఱి తుయిల్ అమరంద పరమ”, అని  తిరుమంగై ఆళ్వార్లు ఇదే ప్రబందములో పాడినట్టు కంబర్ కూడా పాడారు. తెల్లని  పళ్ళు, ఎర్రని కల్ళు, తెల్లని పడగపై నల్లని చుక్కలు, నీలి శరీరము,  నోటి నుండి ఎర్రని మంటలు గల శేషపాన్పుపు చూసి కంబర్ మైమరచి పోయారు.

 తిరుప్పాదంగళే అందమైన్,దివ్యమైన శ్రీపాదములు రెండూ

ఇడం కొణ్డ నెంజత్తు ఇణంగిక్కిడప్పన   – పెరియ తిరుమొళి లో (11-1-10)  :ఆళ్వార్లు తిరుమంగై     వెళ్ళత్తాన్ వేంకడత్తానేలుం కలికన్ఱి ఉళ్ళత్తినుళ్ళే ఉళన్ కణ్డాయి”, పాడినట్లు,నారాయణుడి శ్రీపాదములు రెండూ ఆయన హృదయములో సదా నిలిచి వుంటాయి.

  “విష్వస్య ఆయతనం మహత్అని నారాయణ సూక్తములో ఉన్నట్లు   సర్వేశ్వరుడికి భక్తుల హృదయమే  పెద్ద కోవెల

ఈ అర్థములో     నమ్మాళ్వార్లు  నెంజమే నీళ్ నగరాగ ఇరుంద ఎన్ తంజనే!” [తిరువాయిమొళి 3-8-2] ,) ‘ శ్రీవైష్ణవుల  హృదయమే పెద్ద కోవెలగా భావించిన స్వామీ’  అన్నారు.

thirukkudanthai_aravamudhazhvar_divine_feet

శ్రీవచన భూషణములో, పిళ్ళైలోకాచార్యులు, “అంకుత్   వాసం సాధనం, ఇంకుత్తై వాసం సాధ్యం(అక్కడ ,కోవెలలో వాసము సాధనము ఇక్కడ, శ్రీవైష్ణవుల  హృదయములో  వాసము సాధ్యము)అన్నారు.

ఇదు సిద్దిత్తాల్ అవఱ్ఱిల్ ఆదరం మట్టమాయి ఇరుక్కుం” –   శ్రీవైష్ణవుల  హృదయములో  వాసము దొరికితే కోవెలలో వాసమును లక్ష్య పెట్టడు.

ఇళం కోయిల్ కై విడేల్ ఎన్ఱు ఇవన్ ప్రార్తిక్క వేణ్డుంపడియాయ్ ఇరుక్కుం” –కోవెలలో భక్తులు, తమని నిర్లక్ష్యము చేయవద్దని స్వామిని  ప్రార్థించాల్సి వుంటుంది.   

ప్రాప్య ప్రీతి విషయత్వత్తాలుం, కృతఙ్ఞతైయాలుం, పిన్బు అవై   అభిమతంగళాయ్ ఇరుక్కుం”  శ్రీవైష్ణవుల మీద వున్న ప్రేమ చేత, వారు తన దగ్గరికి రావటానికి కారణమైన కోవెలలో కూడా వాసము చేస్తారు.

idam_koNda_nenjangaL_thiruvAli_thirunagai_uthsavam_2013 (Small)

                                        తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం 2013, తిరువాళి తిరునగరి

ఆచార్యన్ తిరువడిగళే శరణం

   శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్   తిరువడిగళే శరణం                         

 ఆళ్వార్    ఎంపెరుమానార్   జీయర్ తిరువడిగళే శరణం

పుత్తూర్ సుదర్శనం’ కృష్ణమాచార్య స్వామి వ్యాఖ్యానం దీనికి ఎంతో ఉపకరించినది. 

అడియేన్ చక్రవర్తుల చుడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-13/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై 12 వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 11వ భాగము

కున్ఱా మదుమలర్చ్ చోలై వణ్కొదిప్ పదప్పై
వరుపునల్ పొన్ని మామణి అలైక్కుం
సెన్నెల్ ఒణ్ కళనిత్ తిగళ్వనం ఉదుత్త
కఱ్పోర్ పురిసై కనక మాళిగై
నిమిర్కొడి విసుంబిల్ ఇళంపిఱై తువక్కుం
సెల్వం మల్గు తెన్ తిరుక్ కుడందై
అంతణర్ మంతిర మొళియుడన్ వణంగ
ఆదరవు అమళియిల్ అఱితుయిల్ అమరంద పరమ
నిన్ అడి ఇణై పణివన్
వరుం ఇడర్ అగల మాఱ్ఱో వినైయే.

ప్రతి పదార్థము:

కున్ఱా మదు – అక్షయముగా తేనె ఉండే

మలర్చోలై – పూల తోటలు

వణ్కొదిప్పదప్పై -తోటంతా అల్లుకున్న తీగలు

పొన్ని –  కావేరి నది

వరుపునల్ – నితంతరము ప్రవహించే నీరు

మామణి – గొప్ప మణులు

అలైక్కుం అలలు

సెన్నెల్ ఒణ్ కళని – బంగారు వర్ణములో మేరయు వరి చేలు

తిగళ్వనం ఉడుత్త – నాలుగు దిక్కుల వస్త్రములలా అమరిన అడవులు,  తోటలు

కఱ్పోర్ పురిసై విద్యావంతులతో నిండిన నగరములు

 కనక మాళిగై నిమిర్కొడి –  బంగారు మేడలమేద ఎగురుతున్న జెండాలు

 విసుంబిల్ తువక్కుం – ఆకాశమునంతు తుండగా

ఇళంపిఱై – విదియ చంద్రుడు

సెల్వం మల్గుసంపదలు పొంగు

తెన్ తిరుక్ కుడందై – దక్షిణాన ఉన్న తిరుక్కుడందై

ఆదరవు అమళియిల్ – పడగ విప్పిన ఆధి శేష తల్పము మీద

అఱితుయిల్ అమరంద – యోగ నిద్రలో ఉండి

అంతణర్ ... బ్రాహ్మణులు 

మంతిర మొళియుడన్ వణంగ –  వేద సూక్తములు పఠించు ధ్వనులు

పరమఓ  పరమేశ్వరా!

నిన్ అడి ఇణై పణివన్ – నీ పాద పద్మములు రెంటీని  సేవించిన  వాడికి

వరుం ఇడర్ అగల – కష్ట నివారణ  జరిగి తీరుతుంది

మాఱ్ఱో వినైయే – మా ఇడములను   పోగొట్టగల వాడివి    నీవే

thirukkudandhai_aravamudhAzhvAr

తిరుక్కుడందై ఆరావముదాళ్వాన్

ఈ చివరి భాగములో , తిరుమంగైఆళ్వార్లు  తిరుక్కుడందై పెరుమాళ్ళను శరణాగతి చేసారు . అక్కడి సంపదను, ఆ ప్రాంత ప్రత్యేకతను, కావేరి ప్రవాహమును, అందులో దొరికే విలువైన రాళ్ళను వర్ణిస్తున్నారు. అక్కడ నివసించే శ్రీ వైష్ణవుల పాండిత్యము ఎనిమిది దిక్కుల వ్యాపించినదని చెపుతున్నారు.

 నమ్మాళ్వార్ల లాగే తిరుమంగై ఆళ్వార్లు కూడా ఇక్కడి పెరుమాళ్ళను శరణాగతి చేసారు

వ్యాఖ్యానము:

 “కిడందవాఱు ఎళుందిరుందు పేసు” [తిరుచ్చంద విరుత్తం 61],”లేచి నిలబడి  మాట్లాడుమని తిరుమళిశై ఆళ్వార్లు ,  భగవంతుడు  భక్తులు ఎలా ఆఙ్ఞాపించినా వింటాడు,   బతిమాలినా వింటాడు” అని తిరుమంగై ఆళ్వార్లు  అంటున్నారు..  కోరుకుంటున్నారు  సౌలభ్యమును వీరు  

 కున్ఱా మధు మలర్చోలైసామాన్యముగా తోటలకు  మట్టి,  నీరు, ఎరువు వేసి పెంచుతారు. అలాంటి  పూవులలో తేనె కొంత కాలానికి తరిగి పోతుంది.  ఇది ఆరావముద పెరుమాళ్ళ కృపా దృష్టితో పెరుగుతున్న తోట.  దీనిలో  తేనె ఎప్పటికి తరగదు.    

వణ్కొదిప్పదప్పైబంగారు వర్ణములో మెరిసే గడ్డితో, చిక్కగా అల్లుకున్న తమల పాకుల తీవెలతో నిండిన నేలలు ఎంత సారవంతమో, సంపన్నమో కదా!   

వరుపునల్ పొన్ని మామణి అలైక్కుంకావేరి నది ఇరు దరులు ఒరుసుకొని పారుతూ విలువైన వజ్రాలను వొడ్డుకు చేరవేస్తుంది :  (చన్జచ్చచామర చంద్ర చంధన మహా మాణిక్య ముక్తోత్కరాన్   కావేరీ లహరీకరైర్ విధధతీ” [రంగరాజ స్థవం 1-21] ( కావేరి  చామరం,(వీచేగాలి), పచ్చ కర్పూరము ,చందనము, వజ్రాలు, ముత్యాలు మొదలైన వాటిని మోసుకు వస్తుంది.

(ఆళరియాల్ అలైప్పుణ్డ  యానై  మరుప్పుం  అగిలుం  అణిముత్తుం వెణ్ సామరైయోడు పొన్ని మలైప్పణ్డం మణ్డత్  తిరైయుండు” [పెరియ తిరుమొళి 3-8-3];

చందినోడు మణియుం కొళిక్కుం పునల్ కావిరి” [పెరియ తిరుమొళి 5-4-1], “వేయిన్ ముత్తుం మణియుం కొణరందు ఆర్ పునల్ కావిరి” [పెరియ తిరుమొళి 5-4-9],

తిసై విల్ వీసుం సెళు మామణిగళ్ సేరుం ‘    తిరుక్కుడందై” [తిరువాయిమొళి 5-8-9]

 పై ఉపపత్తులను చూస్తే ఆళ్వార్లు  కావేరీనదిని  ఎలా అనుభవించారో తెలుస్తున్నది.

సెన్నెల్ ఒణ్ కళణి –  కావేరీ పరివాహ ప్రాంతములో వరి చేలు కళ కళ లాడుతుంది.

తిగళ్ వనం ఉడుత్తనిరంతర నీటి ప్రవాహము వలన దట్టమైన అడవులు ఏర్పడ్డాయి.

కఱ్పోర్ పురిసై –  “తిసై విల్ వీసుం సెళుమామణిగళ్”  [తిరువాయిమొళి5-8-9],)లో అన్నట్లు అక్కడి శ్రీవైష్ణవుల పాండిత్యము ఎనిమిది దిక్కులా వ్యాపించిందితిరుమంగై ఆళ్వార్ల ఖ్యాతి కూడా అలాగే వ్యాపించింది.

 పురిసై”- పురి=నగరము/స్థానము,

ఇసై  –గోడధృఢమైన గోడ.

కఱ్పు ఓర్ పురిసై”- దివ్యమైన గోడలు.

కనక మాళిగైబంగారు మేడలు.

నిమిర్ కొడి విసుంబిల్ ఇళం పిఱై తువక్కుంఇళ్ళ మీది జెండాలు ఆకాశములో విదియ చంద్రుడిని తాకటము వలన పడగ విప్పిన పామేమోనని భ్రమ కలుగుతుంది.

శెల్వం మల్గు తెన్ తిరుక్కుడందైసంపదలు పొంగి పొరలు దక్షిణ దిక్కున వున్న తిరుక్కుడందై.‘, -. తీయని సంపదలుకోరుకోదగిన, న్యాయమైన,ఆనదానిచ్చే సంపదలు.

అందణర్ మందిర మొళియుదన్ వణంగవేదాధ్యనము చేసిన  బ్రాహ్మణులు, వేధాంత సూక్తులను ఉచ్చస్వరములో పఠిస్తుంటే వినకూడని వారి చెవిన పడుతుందని మంత్రం యత్నేన గోపయేత్అంటున్నారు.

ఆడు అరవు అమళియిల్ అఱి తుయిల్ అమరంద పరమఆదిశేషునిపై శయనించిన భగవంతుడు నిరంతరం లోక రక్షణార్థమే ఆలోచిస్తుంటాడు.  సరేశ్వరుడు ఆయన  కదా 

ఆడు అరవు…. పాములు పడగ విప్పి ఆడతాయి.అలాగే ఇక్కడ అనంతాళ్వాన్ తన ఉచ్వాస,నిశ్వాసములతో ఊయలలా ఊగుతుంటాడు.    , అలాగే  భగవంతుడికి అనుగుణముగా తన శరీరమును కుంచించి  విస్తరించి నిరంతర కైంకర్యము చేస్తాడు. అనంతాళ్వాన్ ఆయన   ! కదా  

నిన్ అడియిణై పణివన్ –  పిరాట్టియుం అవనుం విడిల్ తిరువడిగళ్ విడాదు, తిణ్ కళలాయి ఇరుక్కుం – (ముముక్షుప్పడి} అన్నట్లు దాసుడు నీ శ్రీపాదములనే శరణు కోరుతున్నాడు  శ్రీపాదాలు  ఆ  దాసుడిని స్వీకరించినాతిరస్కరించినా వేరే దారి ఏదీ లేదు.

 వరుం ఇడర్ అగలనీ స్వరూప రూప గుణములను అనుభవించటములో విరోధులెదురైనా ఆ శ్రీపాదాలే దాసుడిని రక్షింస్తాయి.

మాఱ్ఱో వినైయేఈ సంసారము నుండి  దాసుడిని రక్షించాలి.

అడియిణై పణివన్ మాఱ్ఱో వినైనమ్మాళ్వార్లు  తరియేన్ ఇని ఉన్ చరణం తందు ఎన్ శన్మం కళైయాయే” [తిరువాయిమొళి 5-8-7](ఇంకా తట్టుకోలేను నీ శ్రీ పాదములనిచ్చి నా జన్మను చాలించు అని) 

ఈ సంసారము నుండి దాసుడిని రక్షించి  అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తిని  ఇవ్వమని కోరుతున్నారు తిరుమంగై ఆళ్వార్  భగవంతుని శ్రీ పాదములయందు శరణు వేడుచున్నారు. 

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-12/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై 11వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 10వ భాగము

1-2-3-4-5-6-7-] 6-5 – 4-3-2-1

అఱు వగైచ్చమయముం అఱివరు నిలైయినై
ఐంపాల్ ఓదియై ఆగత్తు ఇరుత్తినై
అఱముదల్ నాంగవైయాయ్ మూర్త్తి మూన్ఱాయి
ఒన్ఱాయి విరిందు నిన్ఱనై

ప్రతి పదార్థము:

అఱు వగైచ్చమయముం – ఆరు రకముల తత్వవేత్తలు

అఱివరు – అర్థము చేసుకోలేరు

నిలైయినై – నీ తత్వము అటువంటీది

ఐంపాల్ ఓదియైపిరాట్టి కురులు ఐదు రకముల కురులకు సంకేతము

ఆగత్తు ఇరుత్తినై – ఆమెను నీ హృదయసీమలో నిలిపినవి

 అఱముదల్ నాంగవైయాయ్ – నాలుగు పురుషార్థ్హములు (ధర్మ,అర్థ,కామ.మోక్షము )ఇవ్వగలవాడవు

 మూర్త్తి మూన్ఱాయి – త్రిమూర్తులకు అంతర్యామివి

 ఇరువగైప్పయనాయి – కర్మానుసారముగా సుఖదుఖముల  నిచ్చు వాడు

ఒన్ఱాయి విరిందు నిన్ఱనై – ప్రళయ కాలములో ఏకమూర్తిగా ఉండి సృష్టి కాలములో అంతటా విస్తరించి

భావము:

భగవంతుడి ఐశ్వర్యము (పరత్వము) గురించి ఈ భాగములో చెపుతున్నారు.

భగవంతుడిని విస్మరించి, ఆరు రకముల తత్వములను అనుసరించేవారికి ఆయనను చేరుకోవటము అసాధ్యము. శ్రీదేవి నీ హృదయసీమలో కూర్చుని పురుషకారము చేయుటకు సిద్దముగా ఉంది. త్రిమూర్తులకు అంతర్యామివి నీవే. కర్మానుసారముగా సుఖఃదుఖఃముల నిచ్చు వాడవు నీవే.  ప్రళయ కాలములో నువ్వు ఒక్కడివీ ఈ సృష్టి కాలములో అనేకములుగా మారి నామ రూపముల నిస్తావు.

కావున నిన్ను పొందలేక పోవటము ఉండదు.

వ్యాఖ్యానము:

అఱువగైచ్చమయముం అఱివరు నిలైయినై చార్వాక,  బౌద్ద,  శమణులు,  నైయాయిక వైశేషిక (తార్క్కికులు),  సాంఖ్య,  పాశుపతులు మొదలైన వారు నిన్ను అంగేకరించరు. అలాంటివారికి నువ్వు అర్థము కావు అని ఆళ్వార్లు అంటున్నారు.

ఐంపాల్ ఓదియై ఆగత్తు ఇరుత్తినై (ఐదు శుభలక్షణములు గల శ్రీదేవి కురులు) ఉంగరాలు తిరిగి, సువాసనతో, మెరుస్తూ, వత్తుగా, మెత్తగా ,నల్లగా ఉండే శ్రీదేవి కురులు.

ఆగత్తు ఇరుత్తినైహనుమ (తిరువడి) పిరాట్టి చే సరిదిద్దబడ్డాడు. పాపానాం వా శుభానాం వా వదార్హాణాం ప్లవంగమ   కార్యం కరుణమార్యేణ   న కశ్చిత్ నాపరాద్యతి “ [రామాయణం యుధ్ధ కాణ్దము 116-44]       

‘ఓ వానరా! లోకములో తప్పు చేయని వారే ఉండరు’ అని పిరాట్టి చెప్పింది. ఆమె సదా నీ హృదయ సీమను అలంకరించి వుంటుంది.  ఆమె పురుషకారము వలననే దాసుల వంటివారు నీ సన్నిధికి చేరుకొగలుగుతారు. మంగైయర్ ఇరువరుం వరుడ”. కిందటి భాగములో  ఉభయ దేవేరులను గురించి చెప్పారు. ఇక్కడ హృదయ పీఠమునలంకరించిన  శ్రీదేవి,  స్వామి ఐశ్వర్యము (పరత్వము),  సౌలభ్యము, అందము మొదలగు గుణములకు కారణమంటున్నారు.

pApAnAm_va

అఱం ముదల్ నాంగవైయాయ్ఐశ్వర్యాది నాలుగు పురుషార్థములు-అవి  ధర్మము/దయ, ఐశ్వర్యము/వస్తువులు,    సంతోషము/ఆనందము, శ్రీ వైకుంఠము.

దేవేంద్ర స త్రిభువనం అర్థమేకపింగ:

సర్వార్ది త్రిభువనగాం చ కార్థవీర్య: |

వైదేహ: పరమపదం ప్రసాధ్య విష్ణుం

సంప్రాప్థ: సకల పల ప్రదోహి విష్ణు: ||” [విష్ణు ధర్మం 43-47]

(విష్ణువును పూజించటము వలన దేవేంద్రుడు మూడు లోకములను,   కుభేరుడు సంపదను,   కార్త వీర్యుడు మూల్లోకములలో  కీర్తిని,  జనక మహారాజు పరమపదమును పొందగలిగారు. చేతనులకు నాలుగు  పురుషార్థములను ఇవ్వగలిగిన వాడు  విష్ణువు ఒక్కడే.  అసలు పురుషార్థములు ఆయనే అని ఆళ్వార్లు అంటున్నారు.

మూర్తి మూన్ఱాయి  బ్రహ్మా, రుద్రఇంద్రులలో అంతర్యామిగా ఉండి సృష్టి,  రక్షణ, లయ కార్యము చేసేది విష్ణు మూర్తి.

సృష్టి  స్థితి  అంతకరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం |

స సంజ్యాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్ధన: ||”   [విష్ణు పురాణం 1-2-66]

 సృష్టి, రక్షణ,లయ కార్యములను  జనార్ధనుడే చేస్తున్నాడు అని  పరాసర ఋషి  విష్ణు పురాణములో అంటున్నారు.

 ఇరువగైప్ పయనాయి –  సుఖఃదుఃఖములనే రెండు కర్మలను నియంత్రిచువాడు అతడే.

ఒన్ఱాయి విరిందు నిన్ఱనై –  ప్రళయ కాలములో సమస్త పదార్థములు నామరూపాలు లేకుండా శ్రీమన్నారాయణుని బొజ్జలో అతుక్కొని వుంటాయి.   దినినే సదేవఅని [చాందొగ్యోపనిషద్ 6-2-1],లో అన్నారు. మళ్ళీ సృష్టి కాలములో ఆయనే  బహు స్యాం” [చాందొగ్యోపనిషద్ 6-2-3]  అని సంకల్పించిన వెంటనే అనేకములుగా విడి పోతాయి.

ప్రళయ కాలములోను, సృ ష్టి కాలములోను,  చేతనాచేతనములన్నీ ఆయనలో భాగమే.  పరమాత్మ ఒక్కడే సత్యము.  ఆయన తనలో ఉన్న చేతనాచేతనముల వలన కళంకములేవీ అంటని వాడు.

 ‘అఱమ్  ముదల్  నుండి  ఇక్కడి దాకా పరమాత్మ ఐశ్వర్యము  (పరత్వము) గురించి చెప్పారు.  ఆళ్వార్లు పరమాత్మ ఐశ్వర్యమును (పరత్వము) కారణముగా చూపి అది నీ వద్ద  ఉనందున నిన్ను నేను వదులుకోలేను అంటున్నారు.

    ఇక్కడి దాకా రథము ఆకారములో సంఖ్యలు వచ్చాయి. తరువాతది,  ఆఖరిది అయిన భాగములో ఆళ్వార్లు  తిరుక్కుడందై పెరుమాళ్ళను శరణాగతి చేస్తున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-11/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై 10 వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 9వ భాగము

1-2-3 ] 4 – 5 – 6-7

నెఱి ముఱై నాల్ వకై వరుణముం ఆయినై
మేతకుం ఐమ్బెరుం పూతముం నీయే
అఱుపదం మురలుం కూన్దల్ కారణం
ఏళ్ విడై  అడంగచ్చెఱ్ఱనై 

ప్రతి పదార్థము:

నాల్ వకై వరుణముం ఆయినై –  నాలుగు వర్ణముల వారిని నియమిస్తావు

నెఱి ముఱై –  శాస్త్రము ప్రకారము నడచుకొనే వారు…..

మే తకుం ఐమ్బెరుం పూతముం నీయే అంతర్యామివి నీవే 

అఱుపదం మురలుం కూన్దల్ కారణం….. –  నప్పిన్న ముంగురులు చూసి తుమ్మెదలు ఘీంకారము చేస్తూ తిరుగుతాయి 

ఏళ్ విడై… ఏడు ఎద్దులను

అడంగచ్చెఱ్ఱనై కలిపి కట్టావు

భావము:

అఱి తుయిళ్ –  కిందటి భాగమున భక్త రక్షణము గురించి,  ఈ భాగములో యోగ నిద్రలో ఉండి భక్తరక్షణము  గురించి చేసిన చింతన  విషయమును  చెపుతున్నారు.

నాలుగు వర్ణముల వారిని వారి వారి పనులను బట్టి విభజన చేసి విధివిధానములను నిర్ణయించాడు. . ఆయా విధి విధానములకు తగినట్లు భక్తి చేయటమే ఆయన అంగీకరిస్తాడు .ఇతర విధాములను పాటించటము  ఆయన అంగీకరించడు.

నాలుగు వర్ణముల వారిని వారి వారి పనులను బట్టి విభజన చేసి విధివిధానములను నిర్ణయించాడు. ఆయా విధి విధానములకు తగినట్లు భక్తి చేయటమే ఆయన అంగీకరిస్తాడు ఇతర విధానాలాని పాటించడం ఆయన అంగీకరించడు. 

 దేవ, మనుష్య, తిర్యక్కులలో ఆయన అంతర్యామిగా వుండి రక్షిస్తాడు.భక్తి చేయటానికి సహాయము చేస్తాడు .

నప్పిన్న ముంగురులను చూసి తుమ్మెదలు ఘీంకారము చేస్తూ  వుంటాయి.  అంతటి   అందమైన నప్పిన్నను పొందడం  కోసము, ఏడుఎడ్లను  కలిపి కట్టాడు.

అలాగే దాసుల కష్టాలను కూడా తొలగిస్తాడు.

7bulls

వ్యాఖ్యానము:

ఈ భాగములో భక్తరక్షణ  గురించి చెపుతున్నారు.

నెఱి ముఱై నాల్ వగై వరుణముం ఆయినైనాలుగు వర్ణముల వారు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) శాస్త్రము విధించిన విధముగా నడచుకోవాలి. వీరందరు నీ ఆధీనములోని వారే. వారందరికి అంతరాత్మ నువ్వే, అంటే నువ్వే ఆ నాలుగు వర్ణములు. 

అహం  హి   సర్వ  యఙ్ఞానాం  భోక్తా చ ప్రభురేవ చ [గీతా – 9-24]. (నేను సర్వ యఙ్ఞములకు భోక్తను, ప్రభువును) ¡‌‌

వర్ణాశ్రమ ఆచార్వతా పురుషేణ పర: పుమాన్ | విష్ణుర్ ఆరాయతే పంతా నాన్యస్ తత్తోషకారక: ||” [విష్ణు పురాణం 3-8-9]( వర్ణాశ్రమ ఆచారము ననుసరించి కొలిచినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు.  పర ధర్మమును ఆచరించి చేసే ఫూజలను భగవంతుడు మెచ్చడు.

 “చాతుర్  వర్ణ్యం  మయా సృష్టం” [గీత 4-13].   

పై ఉదాహరణలన్నీ శాస్త్రములో చెప్పబడినవి.

 మేతగుం ఐంపెరుం పూతముం నీయేశరీరము పాంచ భౌతికము.  అందులో   ఉండి, ఆత్మను నియంత్రించే వాడివి  నువ్వే.

 మేతగుం – యాదానుం ఓర్ ఆక్కైయిల్ పుక్కు అంగు ఆప్పుణ్డుం” [తిరువిరుత్తం 95] – ఆత్మ దేవ, మనుష్యులలో, ప్రవేశించి దేవోహం మనుష్యోహంఅనిపించి,  ఆ యా రూపములకు తగిన కర్మను చేయిస్తాయి.

 “నాల్వగై వరుణముం ఆయినై; ఐం పెరుం పూతముం నీయే” ,  సత్తా,  స్తితి,  ప్రవృత్తి  నువ్వే అయినప్పుడు మరింకెవరు నన్ను రక్షిస్తారు అని ఆళ్వార్లు అంటున్నారు.

కిందటి భాగములో యోగ నిద్రలో  భగవంతుడు చేతన రక్షణను గురించి చింతన చేసినట్టు చెప్పారు. ఇప్పుడు నప్పిన్న పిరాట్టిని రక్షింన విషయమును చెపుతున్నారు.

అఱుపద మురలుం కూందల్నప్పిన్న పిరాట్టి అందమైన కురులను చూసి తుమ్మెదలు నల్లకలువలుగా భ్రమసి స్వచ్చమైన తేనె దొరుకుతుందని ఆమె చుట్టూ తిరుగుతూ రొద చేస్తాయి.

ఏళ్ విడై అడంగచ్చెఱ్ఱనై –  నప్పిన్న పిరాట్టిని పొందటము కొరకు నువ్వు ఏడు ఎద్దుల మదమణచి, కలిపి కట్టి కడ తేర్చావు.

నప్పిన్న పిరాట్టిని ఎలా రక్షించి నీ దగ్గరకు చేర్చుకున్నావో దాసుడిని కూడా అలా  నీ దగ్గరకు చేర్చుకోలేవా? అని ఆళ్వార్లు  అడుగుతున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-10/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై 9వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 8వ భాగము

1-2-3-4-5-6-7-6-5-4-3 ] 2-1 – 1-2-3

నిన్ ఈరడి ఒన్ఱియ మనత్తాల్
ఒరు మతిముకత్తు మంగైయర్ ఇరువరుం మలరెన
అం కైయిన్ ముప్పొళుతుమ్  వరుడ
అఱి తుయిల్ అమరందనై

ప్రతి పదార్థము:

ఒరు మతిముకత్తు  మంగైయర్ ఇరువరుం….. – చంద్రుని పోలిన ముఖము గల శ్రీదేవి,భూదేవి అనే ఇరు దేవేరులు (మణ్మడందై, తిరుమడందై)

ఒన్ఱియ మనత్తాల్…. – ఏకాగ్రతతో

నిన్ ఈరడి – నీ పాదములు….

ముప్పొళుదుం… – నిరంతరము

వరుడ……- వత్తగా

మలర్ ఎన అం కైయిన్ – కుసుమ కోమలమైన చేతులు

అ ఱి తుయిల్ అమరందనై     –నీవు యోగనిద్రలో ఉన్నావు

thirumagaL_maNmagaL_kUsi_pidikkum_melladi_aRi_thuyil

భావము:

“పిరాట్టులిరువురు తమ సౌందర్యముతో స్వామిని కట్టివేసి, దాసులకు పురుషకారము చేయటము వలన భగవంతుడి సౌందర్యమును అనుభవించ గలుగుతున్నాను”   అని తిరుమంగై ఆళ్వార్లు చెపుతున్నారు.

భగవంతుడు  తమ వంటి దాసులకు ఎలా సహాయము చేయాలా అని ఆలోచిస్తూ యోగ నిద్రలో ఉంటారు . ఆ సమయములో, శ్రీదేవి,భూదేవుల సుకుమారమైన చేతులతో, తామరల వంటి స్వామి శ్రీపాదములను నిరంతరము సేవ చేయటము వలన వాటికి గొప్ప అందము అబ్బిందని ఆళ్వార్లు అభిప్రాయ పడుతున్నారు.

భగవంతుడు  తమ వంటి దాసులకు సహాయము చేయటానికి అమ్మవార్లు తమ అందము, యవ్వనము, సేవలతో స్వామిని  మెప్పించి ఒప్పిస్తారు  అని  ఆళ్వార్ల  విశ్వాసము.

 వ్యాఖ్యానము:

నిన్ ఈరడి . . . – నీ  పురుషకార  బలము  వలన భగవంతుడి సౌందర్యమును అనుభవించ గలుగుతున్నామని  తిరుమంగై  ఆళ్వార్లు చెపుతున్నారు.

నిన్ ఈరడి ఒన్ఱియ మనత్తాల్ – ఏకాగ్రతతో స్వామికి సేవ చేయటము  — అనన్య భోగ్యత్వమును తెలియజేస్తుంది.

 ఒరు మది ముగత్తు –స్వామి సౌందర్యమును ఏకాగ్రతతో గ్రోలటము చేత అమ్మవార్ల ముఖములు, మచ్చలేని నిండు చంద్రుని వలె మెరిసి పోతున్నవి.

మంగైయర్ ఇరువరుం –  “తుల్యశీల వయోవృత్తాం” [రామాయణము – సుందరకాణ్ద 16-5] అన్నట్లు దేవేరులిరువురూ, శీలము, అందము, వయస్సులో “యువతిశ్చ కుమారిణీ” అన్నట్లు స్వామికి తగినట్లున్నారు. “పార్ వణ్ణ మడమంగై పత్తర్ పిత్తర్ పని మలర్ మేల్ పావైక్కు”  [తిరునెదుంతాణ్డగము 18] ) –  దేవేరులు స్వామికి భక్తులు మరియు ప్రేమికులు.

మలర్ అన అం కైయిన్ – కుసుమ కోమలములైన చేతులు.

మలర్ అన అం కైయిన్ – కుసుమముల కంటే కోమలములైన, అందమైన మరియు మృదువైన చేతులు. “చంద్ర కాంతాననం రామం అతీవ ప్రియదర్శనం” [రామాయణం అయోధ్య కాణ్ద 3-29]

ముప్పొళుదుం వరుడ – త్రికాలములలో స్వామి శ్రీ పాదములకు సేవచేస్తుంటారు. “వడివు ఇణై ఇల్లా మలర్ మగళ్ మఱ్ఱై నిల మగళ్ పిడిక్కుం మెల్ అడి” [తిరువాయిమొళి 9-2-10] అని నమ్మళ్వార్లు అన్నారు కదా.

ఐఱి తుయిల్ అమరందనై – శేష శాయివై యోగ నిద్రలో ఉండి భక్త పాలన చేసే విషయమును ఆలోచన చేస్తుంటావు. ఆసమయములో నీ మీద బాణ ప్రయోగము చేసినా లెక్క చేయవు .

“నిన్ ఈరడి … మంగైయర్ ఇరువరుం … అడి వరుడ” –  ‘ అమ్మవార్ల పురుషకారము లేకుంటే నావంటి దాసులకు నిన్ను  చేరుకోవటము అసాధ్య’ మని  తిరుమంగై ఆళ్వార్లు అంటున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-9/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై 8వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 7వ భాగము

 1-2-3-4-5-6-7 ] – 6 – 5-4-3 [2-1

కూఱియ అఱుశువై ప్పయనుం ఆయినై
శుడర్ విడుం ఐమ్బుడై అంకైయుళ్ అమరందనై
శుందర నాళ్ తోళ్ మున్నీర్ వణ్ణ

 ప్రతిపదార్థము:

కూఱియ అఱు శువై ప్పయనుం ఆయినై — – షడ్రుచులు (తీపి, పులిపు, కారము, చేదు, వగరు, ఉప్పు నాకు నువ్వే

అంకైయుళ్—  – నీ అందమైన చేతులలో

అమరందనై– – ఒదిగినవి

శుడర్ విడుం ఐమ్బుడై– – ప్రకాశవంతమైన పంచాయుధములు

శుందర నాళ్ తోళ్- సుందరమైన నాలుగు చేతులు

మున్నీర్ వణ్ణ సముద్ర వర్ణుడా…..

భావము:

తనకు భగవంతుడే షడ్రుచులని  తిరుమంగైఆళ్వార్లు చెపుతున్నారు.

భగవంతుడి ప్రకాశవంతమైన పంచాయుధములను ధరించిన సుందరమైన నాలుగు చేతులను ఆళ్వార్లు ఆనందముగా అనుభవిస్తున్నారు. . ఆ ఆనందమును శాశ్వతము చేయమని ప్రార్థిస్తున్నారు.

panchayudham

వ్యాఖ్యానము

కూఱియ అఱు శువైప్పయనుం ఆయినై

శాస్త్రములో చెప్పబడిన షడ్రుచులు  నీవే అని అంటున్నారు ఆళ్వార్లు. నమ్మాళ్వార్లు  “అఱు శువై అడిశిల్ ఎంకో” (నీవే చేతనులకు షడ్రుచులు) అని తిరువాయ్ మొళి 3-4-5 లో అన్నారు. ఆళ్వార్లకు ప్రకాశవంతమైన పంచాయుధములను ధరించిన సుందరమైన నాలుగు చేతులు ఆళ్వార్లకు షడ్రుచులు.  కాబట్టి నిన్ను మాకు  అనుగ్రహించమని అడుగుతున్నారుఅ.

శుడర్ విడుం ఐమ్బుడై అంకైయుళ్ అమరందనై – శంఖము,చక్రము, గథ, శారంగము, నందకము(కత్తి)  అనే ప్రకాశవంతమైన పంచాయుధములను సుందరమైన నాలుగు చేతులలో ధరించినా లేకున్నా పరుల దిష్టి తగులుతుంది.

సుందర నాల్ తోళ్ మున్నీర్ వణ్ణ –  అందము నాలుగు భాగములైతే అవి నీ సుందరమైన బాహువులు.  “సర్వ భూషణ భూషార్హా: భాహవ:” [రామాయణము – కిష్కింధకాండము 3-15], [సర్వ భూషణములను ధరించుటకు అర్హమైన బాహువులు] .ఆభరణములకే  అందమునిచ్చు బాహువులు. ఆభరణములేవీ లేకున్నా  ఆ బాహువులు అందమైనవి. అవి అందమును సృషించిన బాహువులు.

మున్నీరు –  ఆకాశము నుండి పడిన నీరు, నదుల నుండి చేరిన  నీరు, భూమిలో ఊరిన నీరు, ఈ మూడు కలసి సముద్రముగా ఏర్పడుతుంది. అలసిన మనసుకు, కనులకు ఆ సముద్రము బడలికను పోగొట్టి ఆనందాన్నిస్తుంది. అలేగే సముద్ర వర్ణుడు ఈ సంసార సాగరములో పడి అలసిన వారికి బడలికను పోగొట్టి ఆనందాన్నిస్తాడు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-8/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై 7వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 6వ భాగము

1-2] 3-4-5-6 – 7

ముక్కణ్ నాల్ తోళ్ ఐవాయ్  అరవోడు
ఆఱుపొది శడైయోన్
అఱివరుంతన్మై ప్పెరుమైయుళ్ నిన్ఱనై —
ఏళులగు ఎయిత్తినిల్ కొణ్డనై

ప్రతి పదార్థము:

ముక్కణ్ – (రుద్రుడు) మూడు కన్నులు గలవాడు

నాల్ తోళ్ నాలుగు భుజములు గలవాడు

ఐవాయ్  అరవోడు ఐదు నోళ్ళు గల పాము

ఆఱు పొది శడైయోన్ శిఖపై గంగను ధరించిన వాడు

అఱివు అరు బుధ్ధికి అందని వాడు

తన్మై అది నీ తత్వము

పెరుమైయుళ్ నిన్ఱనై నీ గొప్పతనము అలాంటిది

ఎయిత్తినిల్ కొణ్డనై – ( శ్రీ వరహము)  ముట్టెతో ఎత్తిన వాడు

ఏళులగు సప్త లోకాలు

భావము:

ఈ భాగములో రెండు విషయాల్ను చెపుతున్నారు. ఒకటి- రుద్రుడు అపార ఙ్ఞానము, శక్తి గలవాడు. మూడు కన్నులునాలుగు భుజములుఐదు నోళ్ళు గల పాముశిఖపై గంగ- ఇత్యాది అదనపు బలము  గలవాడు. అయినా రుద్రాదుల నుండి సామాన్యమైన దాసుడి దాకా ఎవరికి నిన్ను తెలుసుకోవటము సాధ్యము కాదు. నీ అనుగ్రము చేతనే నిన్ను తెలుసుకొని నీదగ్గరకు చేరగలుగుతాము.

ఇక రెండవ  విషయము- నారాయణుడు ప్రళయకాలములో వరాహమూర్తిగా భూదేవిని ముట్టెతో ఎత్తి ఉద్ధరించిన విధమును తెలుపుతున్నారు. రుద్రాదులు కూడా ప్రళయము చే బాధింప బడిన వారే.

                                    Gods_prayed_Vishnu  

 వ్యా ఖ్యానం:

తిరుమంగైఆళ్వార్లు  ఈ భాగములోను, కిందటి భాగములోను… ఉపాసకులు భగవంతుడిని దర్శించగలరు. అయినా భగవంతుడిని వారి ఊహ మేరకే దర్శించగలరు, పరిపూర్ణ గుణానుభవము మాత్రము దొరకదని చెపుతున్నారు.

ఆళ్వార్లు  ఈ  విషయమును విశద పరచుటకు అపారఙ్ఞానము, శక్తి గలవాడు, మూడు కన్నులునాలుగు భుజములుఐదు నోళ్ళు గల పాముశిఖపై గంగ-ఇత్యాది అదనపు బలము  గల  రుద్రుడికైనా భగవంతుడి తత్వము తేలుసుకోవటము అసాధ్యమని  అంటున్నారు.

. ముక్కణ్ …. రుద్రుడికి అదనముగా మరొక కన్ను ఉంది.అది ఙ్ఞానమునకు సంకేతము  ఈశ్వరాత్ ఙ్ఞానమన్విచేత్    (శివుడు ఙ్ఞానమునకు  సంకేతము)   అంతటి ఙ్ఞానము ఉన్న వాడికిని  సులభము కాదు.

ముక్కణ్ …. శివుడు ముక్కంటికన్ను అదనపు ఙ్జానమునకు సంకేతం .

నాల్ తోళ్ –  సర్వేస్వరుడికి,  శివుడికి కూడా నాలుగు భజములున్నాయిఅదనపు శక్తికి సంకేతము . ఒన్ఱిరణ్డు కణ్ణినానుం ఉన్నై ఏత్త వల్లనే [తిరుచ్చంద విరుత్తం 7],(ఒకటి మరియు  రెండు  మొత్తము మూడు కళ్ళున్నా  నీకు సమము కాదే దనపు  ఙ్ఞానమున్నా సర్వేశ్వరుడి గుణములను తెలుసుకోవటము సులభము కాదు.

ఐవాయి అరవోడు ఆరు పొది శడైయోన్ మెడలో ఐదు నోళ్ళుగల పాము, శిఖపై  గంగ గల వాడు  ఇది శివుడి అధిక శక్తిని తెలియజేస్తుంది.   అరవోడు ఆరు పొది పాము, గంగ రెండూ శిఖపైనే ఉన్నాయి. “అరవోడుపాము శరీరములోనే న్నది.

అఱివరుం తన్మైప్పెరుమైయుళ్ నిన్ఱనై అంతటి వారికి కూడ అందవు, అది నీ తత్వము  రుద్రాది దేవతలకే సాధ్యము కాదు. అది నీ కృప లేకపోతే సాధ్యము కాదు.

నీ అహంకారమును వీడీ, ప్రళయ కాలములో మహా వరాహరూపమునెత్తి బురదలోకి వెళ్ళి భూదేవిని రక్షించావు. అన్ని భువనములు భూగోళముపై నీ తెల్లని దంతము మీద తామర మీద తుమ్మెద వలె అతుక్కుని ఉన్నప్పుడుభూగోళము వెండి కొండపై నీలి వజ్రములా మెరుస్తుండగా భూదేవిని ఉద్దరించావు.

varaha_avathar

ఆళ్వార్లు ప్రళయ కాలములో భూదేవిని రక్షించినవాడివి ఈ సంసార ప్రళయము నుండి నన్ను కాపాడలేవా అని భగవంతుడిని అడుగుతున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-7/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై 6వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 5వ భాగము

1-2-3-4-5-6] 5-4-3-2-11-2

ఐమ్బులన్ అగత్తినుళ్ శెఱుత్తు
నాన్గుఉడన్  అడక్కి ముక్కుణత్తు ఇరణ్డవై అగత్తి
ఒన్ఱినిల్ ఒన్ఱి నిన్ఱు
ఆంగు ఇరు పిఱప్పు అఱుప్పోర్ అఱియుం తన్మైయై

ప్రతి పదార్థము:

ఐమ్బులన్ అగత్తినుళ్ శెఱుత్తు ఇంద్రియ నిగ్రహము వహించి

నాన్గు ఉడన్ అడక్కి ఆహార, నిద్ర, భీతి మరియు  ఆనందములను నిగ్రహించి

ముక్కుణత్తు సత్వరజోతమో గుణములు

అగఱ్ఱి తొలగించి

ఇరణ్దు అవై రజోతమో గుణములు

ఒన్ఱి నిన్ఱు ఒక్క దానిలో నిలిచి

ఒన్ఱినిల్ –  సత్వ గుణము

ఆంగు –  భక్తి యోగము

ఇరు పిఱప్పు అఱుప్పోర్ –  ఉపాసకులు ద్విజత్వమును విడిచి 

అఱియుం తన్మైయైనిన్ను తెలుసుకునే తత్వము

భావము:

కిందటి భాగములో తిరుమంగైఆళ్వార్,   భగవంతుడిని చేరటానికి స్వప్రయత్నము చేసేవారి (కర్మ యోగము, ఙ్ఞాన  యోగములు) గురించి చెప్పారు. ఈ భాగములో అతి కష్టము, అసాధ్యము అయిన భక్తి యోగమును గురించి చెపుతున్నారు.  కొందరు దీనిని  ముఖ్య సాధనముగా భావిస్తారు.

భక్తి యోగమును చేసేవారు ఙ్ఞానేంద్రియములను కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మమును,.. శబ్ధ,  స్పర్శ, రూప,  రస, గంథముల నుండి నిగ్రహించాలి.  ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి.  సత్వగుణమును కలిగి ఉండి ఇతర రెండు గుణములను (రాజస తామస) అదుపులో ఉంచుకోవాలి.  అలా జీవించినప్పుడు వారికి మంచిచెడు  అనే రెండురకముల జన్మలు ఉండవు.

చివరకు భగవంతుడిని చేరుకుంటారు. కాని  ఇది ప్రకృతికి  విరుధ్ధము.  ఆత్మలన్నీ భగవంతుడి పైనే ఆధారపడాలి  కాని స్వప్రయత్నం చేయరాదు. అలా కూడా కొందరు నిన్ను చేరవచ్చు,  కాని దాసుడు మాత్రము నిన్ను చేరుకోవటానికి  నీపైనే ఆధారపడ్డాడు  అని ఆళ్వార్లు చెపుతున్నారు.

BhakthiYogam

వ్యాఖ్యానము:(భక్తి యోగం)

ఈ భాగములో తిరుమంగైఆళ్వార్లు  భక్తి యోగమును గురించి మాట్లాడుతున్నారు. కర్మ యోగములో ఇది ఒక అంగము, కర్మ యోగము కాన్న కష్ట సాధ్యము.   సంసారము మీద విరక్తి చెంది మోక్షమును కోరు ఉపాసకులు మాత్రమే చేయగలిగినది.

ఐమ్బులన్ అగత్తినుళ్ శెఱుత్తు –  శబ్ద,  స్పర్శ,  రూప, రస,  గంథములనే పంచతన్మాత్రలను..,  బాహ్య ఙ్ఞానేంద్రియములైన  చెవి,  చర్మముకన్ను,  నాలుక,  ముక్కులతో  నిగ్రహించగలగడం.

నాంగు ఉడన్ అడక్కి అంతర  ఙ్ఞానేంద్రియములైన మనసుతో మననము’(మమనము చేసేది), ‘బుధ్ఢి’ (ఙ్ఞాము),  ‘చిత్తము’ (చింతనము)  అహంకారము ‘(తనను గురించి ఆలోచించుట)  అనే నాలుగింటినీ  ఏక కాలములో నిగ్రహించగలగడం.  అది అంత సులభము కాదు.

నాన్గుడన్  అడక్కి ఆహార, నిద్ర, భయ మైధునములనే  అర్థము కూడా తీసుకోవచ్చు.  అలా అయినా ఆ  నాలుగింటినీ  నిగ్రహించగలగాలి.

 నాన్గు ఉడన్ అడక్కి 1.సంపదను నిత్యానిత్యముల మధ్య విభజించుట  2.అంతరబహిర శక్తులను నిగ్రహించుట             3.ఈ లోకము ఫైలోకములలో లభ్దిని కోరుకోవటము, 4. మోక్షము పొందాలను కోరిక —-ఇవన్నీ  మోక్ష సాధనములు.

ముక్కుణత్తు ఇరణ్డవై అగఱ్ఱి సత్వరాజోతమో  గుణములలో మనలను కిందికి లాగే రాజస, తామస గుణములను నిగ్రహించుట.

ఒన్ఱినిల్ ఒన్ఱి నిన్ఱు సత్వ గుణమును పెంపొందించుకొనుట.

ఆంగు భక్తి యోగముతో కర్మ యోగమును చేరుట.

ఇరు పిఱప్పు అఱుప్పోర్ –  ఉపాసకులు  పుణ్యపాపముల వలన కలిగే  మంచిచెడు  జన్మల నుండి తప్పించుకో గలుగుతారు.

అఱియుం  తన్మైయై ఉపాసకుల  గుణములు వారి ఉపాసన వలన తెలుస్తుంది.

ఆంగు ఇరు పిఱప్పుఅ ఱుప్పోర్ భక్తి యోగముతో జనన మరణ చక్రము నుండి విడివడతారు.

ఆంగు అఱియుం  – ఉపాసకులు భక్తి యోగము చేయటము వలన నిన్ను తెలుసుకో గలుగుతారు.

 కిందటి భాగములో ముత్తీనుండి మొదలు పెట్టి ఈ భాగమును పరిశీలిస్తే……… కర్మ యోగము, ఙ్ఞాన

 ఙ్ఞానం యోగము,  భక్తి యోగము చేసి ఈ సంసారము నుండి విముక్తిని పొంది భగవంతుడి గుణానుభవము పొందటము మహా కష్ట సాధ్యము.

గజేంద్రుడు, మొసలి నుండి విముక్తిని పొంది భగవంతుడి శ్రీ పాదముల మీద తామరపూవు ఉంచడానికి పడిన  కష్టమే దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. భగవంతుడి కృప ఉంటే తప్ప ఆయనను పొంద లేము.

 ఇక్కడ ఆళ్వార్లు ఇదే విషయాన్ని స్పష్టీకరిస్తున్నారు. కొందరు ఇతర మార్గముల ద్వారా మోక్షము పొందడానికి భగవంతుడిని  చేరడానికి  ప్రయత్నము చేస్తారు. కాని ఆళ్వార్లు భగవంతుడి కృపను మాత్రమే ఉపాయము అని విశ్వసించారు.

 “ముత్తీ”  “అఱియుం తన్మైయైఅన్న పదాలకు ఇదే అర్థము .

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-6/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై 5వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 4వ భాగము

1-2]3-4-5-6[-5-4-3-2-1

ముత్తు ణై నాన్మరై వేళ్వి
అఱు తొళిల్  అన్దణర్ వణంగుం తన్మయై

ప్రతిపదార్ధము : 

అన్దణర్ వణంగుం తన్మైయై బ్రాహ్మణులచే పూజింపబడువాడు 

ముత్తీ త్రై అగ్నులు  (మూడు విధము లైన అగ్నులు)మరియు

నాల్ మఱై నాలుగు రకములైన  వేదములు మరియు

ఐవగై వేళ్వి ఐదు విధములైన  యఙ్ఞములు మరియు

అఱు తొళిల్ ఆరు విధములైన కర్మలు.

భావము:

నిన్ను పొందటము కోసము ధర్మములను, కర్మయోగములను పాటించు బ్రాహ్మణులచే పూజింపబడువాడవు. దాని కొరకు వారు హోమములను చేసి మూడు విధములైన అగ్నులను కాపాడుతూ, నాలుగు వేదములను అధ్యయనము చేసి, ఐదు విధములైన యఙ్ఞములను చేస్తూ, ఆరు విధములైన కర్మలను పాటిస్తారు. అలాంటి  బ్రాహ్మణులకు పరమాత్మ అడిగినవన్నీ సమకూరుస్తాడు.

yagyam

 వ్యాఖ్యానము:

వాళియిన్ అట్టనైపిరాట్టి కోసము  బాణ ప్రయోగముతో  శతృ సంహారము  చాశాడు) ; ‘మడువుళ్ తీర్త్తనైఇంధ్రుడి అన్య ప్రయోజనములను నేవేర్చటము కోసము సహాయము చేసాడు అంటున్నారు తిరుమంగై ఆళ్వార్లు

ప్రబంధములోని తరువాతి పాదములలో  భగవంతుడిని తమ ప్రయోజనార్థము వినియోగించుకొని, అదే సమయములో ఇతర ప్రయత్నముల వలన కూడ తమ ప్రయోజనములను నెరవేర్చుకునే వారికి కూడ సహాయము చేసే   పరమాత్మ  గొప్పగుణములను, ఆళ్వార్లు వర్ణిస్తున్నారు.

 ముత్తీ … –  “యోగో యోగవిధాం నేతా” [విష్ణు సహస్రనామం 18,19]  అన్నట్లుగా, పరమాత్మ అన్నింటికీ కారణభూతుడు. అయినా అన్య ప్రయత్నముల ద్వారా ఆయనను పొదగోరు వారికి కూడా  ఆయన సులభుడు.  బ్రాహ్మణులు నిర్వహించే  కర్మ యోగమును ఆళ్వార్లు  ఇక్కడ అన్య ప్రయత్నము అన్నారు.

ముత్తీ గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణాగ్నులను త్రైయగ్నులంటారు. ఏక కాలములో జన్మించిన ముగ్గురు బిడ్డలకు పాలు పట్టడము తల్లికి ఎంత కష్టమో  బ్రాహ్మణులకు ఏక కాలములో త్రైయగ్నుల నిర్వాహణ అంత కష్టము.

నాన్మఱై –  కర్మ యోగులు , సక్రమముగా ఋక్, యజుర్, సామ, అథర్వణ మనే నాలుగు వేదములను అధ్యయనము మరియు  అధ్యాపనము చేస్తూ ఉంటారు.

ఐవగై వేళ్వి దేవయఙ్ఞము , పితృయఙ్ఞము, భూతయఙ్ఞము , మానుషయఙ్ఞము, బ్రహ్మయఙ్ఞము అనేవి ఐదు విధములైన యఙ్ఞములను బ్రాహ్మణులు నిత్యము అనుష్ఠిస్తూ ఉంటారు.  

అఱు తొళిల్ బ్రాహ్మణులు ఆరు విధముల కర్మములను చేస్తూ వుంటారు.యజనం (వారి కొరకు యఙ్ఞము చేయటము), యాజనం (ఇతరుల కొరకు యఙ్ఞము చేయటము ), అధ్యయనం (వేదములను వల్లె వేయుట),అధ్యాపనం (ఇతరులకు వేదములను నేర్పించుట), దానము , ప్రతిగ్రహణం  (దానము స్వీకరించటము). బ్రాహ్మణేతరులకు ఇందులో కొన్నింటిని మాత్రమే చేయటానికి అధికారము ఉంది.

దీని వలన కర్మయోగమును ఆచరించటములోని కష్టములను తెలియజేస్తున్నారు. యఙ్ఞము కలిగి కర్మ యోగము చేయు  బ్రాహ్మణుల ఔన్నత్యమును ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. 

అందణర్ వణంగుం తన్మైయై –  కర్మ యోగము చేసి,బ్రాహ్మణులు నిన్ను చేరగోరేటతటి  మహిమాన్వితుడివి నువ్వు అని ఆళ్వార్లు అంటున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-5/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

తిరువెళుకూట్ఱిరుక్కై 4వ భాగము

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 3వ భాగము

1-2-3]4-5-4-3-2-1[1-2

నాల్ దిశై నడుంగ అంజిఱై ప్పఱవై ఏఱి
నాల్వాయ్  ముమ్మతత్తు ఇరుశెవి
యొరుతని వేళత్తు అరందైయై
ఒరునాళ్ ఇరునీర్ మడువుళ్ తీర్తనై

ప్రతిపదార్థము 

ఒరునాళ్ – ఒకానొకప్పుడు

 నాల్ దిశై నడుంగ – నాలుగు దిక్కులు వణికిపోగ

అంజిఱై  ప్పఱవై ఏఱి – అందమైన పక్షిని ఎక్కి(గరుడవాహనము నెక్కి)

ఇరునీర్ మడువుళ్ – లోతుగా నీరుగల మడుగులో

అరందైయై – బాధ పడుతున్న

నాల్వాయ్ – వేలాడుతున్న నోరుగల

ముమ్మదం – మూడు ద్వారములగుండా మదము స్రవిస్తుండగా

ఇరుశెవి – రెండు చెవులు

ఒరుతని వేళత్తు – అసమానమైన ఏనుగు(గజేంద్రుడు) దుఃఖమును 

తీర్తనై – తొలగించావు

gajendramoksham

భావము:

తిరుమంగై ఆళ్వార్లు ,  ‘ఙ్ఞానము శక్తి గల ఇంద్రుడికి సహాయము చేసావు,  ఏనుగును కాపాడావు.  నువ్వు సునాయాసముగా సమస్త పదార్థములను, సర్వ లోకములను సృష్టించావు.  అలాంటి వాడివి నీ భక్తుల రక్షణార్థము సర్వము మరచి,  బ్రహ్మతో సహా అందరూ ఆశ్చర్య పోయే విధముగా పరుగులు తీశావు’ అని ఏనుగును(గజేంద్రుడు) రక్షించిన విధమును  కొనియాడుతున్నారు. 

 ఆణ్దాళ్  తమ  నాచ్చియార్ తిరుమొళిలో తనను కాపాడ రమ్మని పాడినట్లుగా,  ఆళ్వార్లు తనను  సంసారము నుండి,  ప్రధాన  శతృవులైన పంచేంద్రియముల నుండి  కాపాడ రమ్మని ప్రార్థిస్తున్నారు.

వ్యాఖ్యానము:

 ఙ్ఞానము శక్తి గల ఇంద్రుడికి మాత్రమే  సహాయము చేస్తాడా భగవంతుడు?  తన భక్తులు పిలిస్తే ఉన్నవాడు ఉన్నట్టు పరుగులు తీస్తాడా? (అరై కులైయ, తలై కులైయ )జుట్టు చెదిరి పోయివస్త్రము తొలగిపోయి-  పోతన భాగవతములో-  సిరికింజెప్పడు…. లో వర్ణిచినట్లు.

నాల్ తిశై నడుంగ పరమాత్మ సంకల్ప మాత్రమున సకలమును సృష్టించాడు.  ఆ సృష్టిని తిరిగి సంకల్ప మాత్రముననే లయము చేసాడని బ్రహ్మాది దేవతలకు తెలుసు. కాని తన భక్తులను రక్షించే సమయములో మాత్రము అసాధారణ త్వరను, కోపమును ప్రదర్శించటము చూసి బ్రహ్మాది దేవతలు తల్లడిల్లి పోయారు. అసాధారణ సంఘటన ఏదో జరగబోతున్నదని భయపడ్డారు.

అం శిఱైప్పఱవై ఏరి  బంగారు వర్ణము గల మేరు పర్వతము మీద నల్ల మబ్బులు కదలినట్లు, విష్ణు మూర్తి గరుడుడి మీద ఎక్కి ఎందుకిలా పరిగిడుతున్నారని తిరుమంగై ఆళ్వార్లు అడుగుతునారు.

నాల్ వాయి ముమ్మదతు ఇరు శెవి ఒరు తని వేళత్తు అరందైయై –  (నాల్ వాయి) తొండమును పైకి లేపడము వలన నోరు వేలాడుతున్నది. మూడు వైపుల మద జలము స్రవిస్తున్నది.  చేటంత చెవులు రెండు విచ్చుకున్నవి, రక్షించే వారెవరూ లేక ధైర్యము కోల్పోవటము గొప్ప విషాదము- అరందైయై. (పోతన భాగవతములో లావొక్కింతయు లేదు…..) 

ఒరు నాళ్ ఇరు నీర్ మడువుళ్ తీర్త్తనై –  లోతైన మడుగులో స్థాన బలము గల మొసలి చేత చిక్కిన  స్థాన బలము లేని గజేంద్రుడి ని చూసి ప్రమాదమును  గమనించి రక్షించడానికి నువ్వు వచ్చావు.  

ఒరు నాళ్   గజేంద్రుడుని రక్షించడాటినికి మహావిష్ణువు వచ్చిన సన్నివేశాన్ని తలచుకొని పొంగిపోతున్నారు తిరుమంగై ఆళ్వార్లు. ‘గజేంద్రుడి దుఖఃమును తీర్చిన నువ్వు నన్ను కూడా ఈ సంసారమనే దుఖఃము నుండి కాపాడవా!  అని అడుగుతున్నారు.  గజేంద్రుడు ఒడ్డు వైపుకిమొసలి నీటిలోనికి 1000 దేవ సంవత్సరాలు (విష్ణు ధర్మము 69) హోరాహోరిగా పోరు సలిపాయి.  అక్కడ ఉన్నది ఒక మొసలియే,  కాని ఇక్కడ నన్ను పంచేంద్రియములనే ఐదు మొసళ్ళు సంసారములోకి లాగుతున్నాయి. అక్కడ ఏనుగు బలమైనది. ఇక్కడ నేను బలహీనమైనవాడను. కాబట్టి నన్ను కాపాడటానికి పరుగున రావా!’ అని  ప్రార్థిస్తున్నారు.   

వేఅత్తు అరంధైయై ఇరు నీర్ మడువుళ్ తీర్త్తనై విష్ణు ధర్మములో చెప్పినట్లు,  గ్రాహం చక్రేణ మాధవ:, పరుగున వచ్చి ఏనుగు పాదమునకు ఒక్క ముల్లు కూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా సుదర్శన చక్రమును ప్రయోగించి మొసలిని చంపి ఏనుగును రక్షించాడు విష్ణుమూర్తి. ఈ సందర్భములో భట్టర్ , “ రాజుగారితో రోజూ కుస్తీ పోటీ చేసినందుకు సేవకుడికి కూడా ఆయనతో పాటు మంచి ఆహారము దొరికినట్లు, ఏనుగుతో  మొసలి పోరాడినందుకు మొసలికి కూడ మోక్షము లభించింది ” అన్నారు.

శోబై ….   బావిలో పడిన పిల్లను కాపాడి పైకి తీసిన తరవాత ఆ బిడ్డ అందాన్నిచూసి మురిసి పోతారు.

(వాళిప్పు)ఆహా! ఎమేఏ దీని చెవులు, ఎంత అందం ఈమెది,  అందమైన కాళ్ళు చూడు, తల అన్నింటిని తన్నే అందం -అని రకరకాలుగా చెప్పుకుంటారు.   

నాల్వాయి ముమదత్తు ఇరు సెవి ఒరు తని వేళత్తు–  ఆళ్వార్లు ఎందుకు  ఒక్కొక్క భాగాన్ని, మొత్తము అందాన్ని ఇంతగా వర్ణిస్తున్నారు? (సముదాయ) అందరు కలసి కాపాడినందున బిడ్డ అందాన్ని మరీ మరీ వర్ణించినట్టుగా ఆళ్వార్లు  ప్రబంధములోని ఈ భాగములో మహా విష్ణువు  కాపాడిన ఏనుగును ఇంతగా వర్ణిస్తున్నారు. 

వేళత్తు అరందైయై  చిన్న శరీరమైతే  ప్రమాదము కొద్దిగా వుండేది. కాని ఇక్కడ శరీరము పెద్ద ది ప్రమాదము కూడా పెద్దగానే ఉంది. పరమాపదం ఆపన్న: మనసా{శ్} చింతయత్ హరిం” [విష్ణు ధర్మం] ఋషులు ఏనుగుకు కలిగిన ఆపదను గొప్ప ఆపదగా చెపుతున్నారు-‘. “పరమాపదం …. అందు వలననే గజేంద్రుడు నోరు తెరచి పిలవటానికి శక్తి లేక పరమాత్మను మనసులోనే తలచుకున్నాడని  చెపుతున్నారు-మనసా చింత్యాత్ ‘

ఒరు నాళ్ తీర్తనై –   పెరియాళ్వార్ల కుమార్తె,    నారాయణుడికి ప్రియమైనది అయిన గోదాదేవి, నారాయణుడి కృప కోసము   కాలైక్కదువిడుగిన్ఱ కయలొడు వాళై విరువి [నాచ్చియార్ తిరుమొళి 3-5] అని పాడింది. –( నీటిలో ఒక్క పురుగు వున్న సహించలేవు. అలాంటిది రెండు చేపలుంటే సహించగలవా?) అదేవిధముగా తిరుమంగై ఆళ్వార్లు పరమాత్మను అడుగుతున్నారు, “బలవంతమైన  గజేంద్రుడిని మొసలి కొంత కాలము పట్టుకుంటేనే సహించలేవే!  పంచేంద్రియములు నన్ను ఇంత కాలము బాధిస్తుంతే తట్టుకోగలవా?”

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-4/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org