తిరువెళుకూట్ఱిరుక్కై 6వ భాగము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 5వ భాగము

1-2-3-4-5-6] 5-4-3-2-11-2

ఐమ్బులన్ అగత్తినుళ్ శెఱుత్తు
నాన్గుఉడన్  అడక్కి ముక్కుణత్తు ఇరణ్డవై అగత్తి
ఒన్ఱినిల్ ఒన్ఱి నిన్ఱు
ఆంగు ఇరు పిఱప్పు అఱుప్పోర్ అఱియుం తన్మైయై

ప్రతి పదార్థము:

ఐమ్బులన్ అగత్తినుళ్ శెఱుత్తు ఇంద్రియ నిగ్రహము వహించి

నాన్గు ఉడన్ అడక్కి ఆహార, నిద్ర, భీతి మరియు  ఆనందములను నిగ్రహించి

ముక్కుణత్తు సత్వరజోతమో గుణములు

అగఱ్ఱి తొలగించి

ఇరణ్దు అవై రజోతమో గుణములు

ఒన్ఱి నిన్ఱు ఒక్క దానిలో నిలిచి

ఒన్ఱినిల్ –  సత్వ గుణము

ఆంగు –  భక్తి యోగము

ఇరు పిఱప్పు అఱుప్పోర్ –  ఉపాసకులు ద్విజత్వమును విడిచి 

అఱియుం తన్మైయైనిన్ను తెలుసుకునే తత్వము

భావము:

కిందటి భాగములో తిరుమంగైఆళ్వార్,   భగవంతుడిని చేరటానికి స్వప్రయత్నము చేసేవారి (కర్మ యోగము, ఙ్ఞాన  యోగములు) గురించి చెప్పారు. ఈ భాగములో అతి కష్టము, అసాధ్యము అయిన భక్తి యోగమును గురించి చెపుతున్నారు.  కొందరు దీనిని  ముఖ్య సాధనముగా భావిస్తారు.

భక్తి యోగమును చేసేవారు ఙ్ఞానేంద్రియములను కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మమును,.. శబ్ధ,  స్పర్శ, రూప,  రస, గంథముల నుండి నిగ్రహించాలి.  ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి.  సత్వగుణమును కలిగి ఉండి ఇతర రెండు గుణములను (రాజస తామస) అదుపులో ఉంచుకోవాలి.  అలా జీవించినప్పుడు వారికి మంచిచెడు  అనే రెండురకముల జన్మలు ఉండవు.

చివరకు భగవంతుడిని చేరుకుంటారు. కాని  ఇది ప్రకృతికి  విరుధ్ధము.  ఆత్మలన్నీ భగవంతుడి పైనే ఆధారపడాలి  కాని స్వప్రయత్నం చేయరాదు. అలా కూడా కొందరు నిన్ను చేరవచ్చు,  కాని దాసుడు మాత్రము నిన్ను చేరుకోవటానికి  నీపైనే ఆధారపడ్డాడు  అని ఆళ్వార్లు చెపుతున్నారు.

BhakthiYogam

వ్యాఖ్యానము:(భక్తి యోగం)

ఈ భాగములో తిరుమంగైఆళ్వార్లు  భక్తి యోగమును గురించి మాట్లాడుతున్నారు. కర్మ యోగములో ఇది ఒక అంగము, కర్మ యోగము కాన్న కష్ట సాధ్యము.   సంసారము మీద విరక్తి చెంది మోక్షమును కోరు ఉపాసకులు మాత్రమే చేయగలిగినది.

ఐమ్బులన్ అగత్తినుళ్ శెఱుత్తు –  శబ్ద,  స్పర్శ,  రూప, రస,  గంథములనే పంచతన్మాత్రలను..,  బాహ్య ఙ్ఞానేంద్రియములైన  చెవి,  చర్మముకన్ను,  నాలుక,  ముక్కులతో  నిగ్రహించగలగడం.

నాంగు ఉడన్ అడక్కి అంతర  ఙ్ఞానేంద్రియములైన మనసుతో మననము’(మమనము చేసేది), ‘బుధ్ఢి’ (ఙ్ఞాము),  ‘చిత్తము’ (చింతనము)  అహంకారము ‘(తనను గురించి ఆలోచించుట)  అనే నాలుగింటినీ  ఏక కాలములో నిగ్రహించగలగడం.  అది అంత సులభము కాదు.

నాన్గుడన్  అడక్కి ఆహార, నిద్ర, భయ మైధునములనే  అర్థము కూడా తీసుకోవచ్చు.  అలా అయినా ఆ  నాలుగింటినీ  నిగ్రహించగలగాలి.

 నాన్గు ఉడన్ అడక్కి 1.సంపదను నిత్యానిత్యముల మధ్య విభజించుట  2.అంతరబహిర శక్తులను నిగ్రహించుట             3.ఈ లోకము ఫైలోకములలో లభ్దిని కోరుకోవటము, 4. మోక్షము పొందాలను కోరిక —-ఇవన్నీ  మోక్ష సాధనములు.

ముక్కుణత్తు ఇరణ్డవై అగఱ్ఱి సత్వరాజోతమో  గుణములలో మనలను కిందికి లాగే రాజస, తామస గుణములను నిగ్రహించుట.

ఒన్ఱినిల్ ఒన్ఱి నిన్ఱు సత్వ గుణమును పెంపొందించుకొనుట.

ఆంగు భక్తి యోగముతో కర్మ యోగమును చేరుట.

ఇరు పిఱప్పు అఱుప్పోర్ –  ఉపాసకులు  పుణ్యపాపముల వలన కలిగే  మంచిచెడు  జన్మల నుండి తప్పించుకో గలుగుతారు.

అఱియుం  తన్మైయై ఉపాసకుల  గుణములు వారి ఉపాసన వలన తెలుస్తుంది.

ఆంగు ఇరు పిఱప్పుఅ ఱుప్పోర్ భక్తి యోగముతో జనన మరణ చక్రము నుండి విడివడతారు.

ఆంగు అఱియుం  – ఉపాసకులు భక్తి యోగము చేయటము వలన నిన్ను తెలుసుకో గలుగుతారు.

 కిందటి భాగములో ముత్తీనుండి మొదలు పెట్టి ఈ భాగమును పరిశీలిస్తే……… కర్మ యోగము, ఙ్ఞాన

 ఙ్ఞానం యోగము,  భక్తి యోగము చేసి ఈ సంసారము నుండి విముక్తిని పొంది భగవంతుడి గుణానుభవము పొందటము మహా కష్ట సాధ్యము.

గజేంద్రుడు, మొసలి నుండి విముక్తిని పొంది భగవంతుడి శ్రీ పాదముల మీద తామరపూవు ఉంచడానికి పడిన  కష్టమే దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. భగవంతుడి కృప ఉంటే తప్ప ఆయనను పొంద లేము.

 ఇక్కడ ఆళ్వార్లు ఇదే విషయాన్ని స్పష్టీకరిస్తున్నారు. కొందరు ఇతర మార్గముల ద్వారా మోక్షము పొందడానికి భగవంతుడిని  చేరడానికి  ప్రయత్నము చేస్తారు. కాని ఆళ్వార్లు భగవంతుడి కృపను మాత్రమే ఉపాయము అని విశ్వసించారు.

 “ముత్తీ”  “అఱియుం తన్మైయైఅన్న పదాలకు ఇదే అర్థము .

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-6/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment