తిరువెళుకూట్ఱిరుక్కై 9వ భాగము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 8వ భాగము

1-2-3-4-5-6-7-6-5-4-3 ] 2-1 – 1-2-3

నిన్ ఈరడి ఒన్ఱియ మనత్తాల్
ఒరు మతిముకత్తు మంగైయర్ ఇరువరుం మలరెన
అం కైయిన్ ముప్పొళుతుమ్  వరుడ
అఱి తుయిల్ అమరందనై

ప్రతి పదార్థము:

ఒరు మతిముకత్తు  మంగైయర్ ఇరువరుం….. – చంద్రుని పోలిన ముఖము గల శ్రీదేవి,భూదేవి అనే ఇరు దేవేరులు (మణ్మడందై, తిరుమడందై)

ఒన్ఱియ మనత్తాల్…. – ఏకాగ్రతతో

నిన్ ఈరడి – నీ పాదములు….

ముప్పొళుదుం… – నిరంతరము

వరుడ……- వత్తగా

మలర్ ఎన అం కైయిన్ – కుసుమ కోమలమైన చేతులు

అ ఱి తుయిల్ అమరందనై     –నీవు యోగనిద్రలో ఉన్నావు

thirumagaL_maNmagaL_kUsi_pidikkum_melladi_aRi_thuyil

భావము:

“పిరాట్టులిరువురు తమ సౌందర్యముతో స్వామిని కట్టివేసి, దాసులకు పురుషకారము చేయటము వలన భగవంతుడి సౌందర్యమును అనుభవించ గలుగుతున్నాను”   అని తిరుమంగై ఆళ్వార్లు చెపుతున్నారు.

భగవంతుడు  తమ వంటి దాసులకు ఎలా సహాయము చేయాలా అని ఆలోచిస్తూ యోగ నిద్రలో ఉంటారు . ఆ సమయములో, శ్రీదేవి,భూదేవుల సుకుమారమైన చేతులతో, తామరల వంటి స్వామి శ్రీపాదములను నిరంతరము సేవ చేయటము వలన వాటికి గొప్ప అందము అబ్బిందని ఆళ్వార్లు అభిప్రాయ పడుతున్నారు.

భగవంతుడు  తమ వంటి దాసులకు సహాయము చేయటానికి అమ్మవార్లు తమ అందము, యవ్వనము, సేవలతో స్వామిని  మెప్పించి ఒప్పిస్తారు  అని  ఆళ్వార్ల  విశ్వాసము.

 వ్యాఖ్యానము:

నిన్ ఈరడి . . . – నీ  పురుషకార  బలము  వలన భగవంతుడి సౌందర్యమును అనుభవించ గలుగుతున్నామని  తిరుమంగై  ఆళ్వార్లు చెపుతున్నారు.

నిన్ ఈరడి ఒన్ఱియ మనత్తాల్ – ఏకాగ్రతతో స్వామికి సేవ చేయటము  — అనన్య భోగ్యత్వమును తెలియజేస్తుంది.

 ఒరు మది ముగత్తు –స్వామి సౌందర్యమును ఏకాగ్రతతో గ్రోలటము చేత అమ్మవార్ల ముఖములు, మచ్చలేని నిండు చంద్రుని వలె మెరిసి పోతున్నవి.

మంగైయర్ ఇరువరుం –  “తుల్యశీల వయోవృత్తాం” [రామాయణము – సుందరకాణ్ద 16-5] అన్నట్లు దేవేరులిరువురూ, శీలము, అందము, వయస్సులో “యువతిశ్చ కుమారిణీ” అన్నట్లు స్వామికి తగినట్లున్నారు. “పార్ వణ్ణ మడమంగై పత్తర్ పిత్తర్ పని మలర్ మేల్ పావైక్కు”  [తిరునెదుంతాణ్డగము 18] ) –  దేవేరులు స్వామికి భక్తులు మరియు ప్రేమికులు.

మలర్ అన అం కైయిన్ – కుసుమ కోమలములైన చేతులు.

మలర్ అన అం కైయిన్ – కుసుమముల కంటే కోమలములైన, అందమైన మరియు మృదువైన చేతులు. “చంద్ర కాంతాననం రామం అతీవ ప్రియదర్శనం” [రామాయణం అయోధ్య కాణ్ద 3-29]

ముప్పొళుదుం వరుడ – త్రికాలములలో స్వామి శ్రీ పాదములకు సేవచేస్తుంటారు. “వడివు ఇణై ఇల్లా మలర్ మగళ్ మఱ్ఱై నిల మగళ్ పిడిక్కుం మెల్ అడి” [తిరువాయిమొళి 9-2-10] అని నమ్మళ్వార్లు అన్నారు కదా.

ఐఱి తుయిల్ అమరందనై – శేష శాయివై యోగ నిద్రలో ఉండి భక్త పాలన చేసే విషయమును ఆలోచన చేస్తుంటావు. ఆసమయములో నీ మీద బాణ ప్రయోగము చేసినా లెక్క చేయవు .

“నిన్ ఈరడి … మంగైయర్ ఇరువరుం … అడి వరుడ” –  ‘ అమ్మవార్ల పురుషకారము లేకుంటే నావంటి దాసులకు నిన్ను  చేరుకోవటము అసాధ్య’ మని  తిరుమంగై ఆళ్వార్లు అంటున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-9/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment