రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ మణవాళ మాముణులు తమ ఉపదేశరత్తినమాల 38వ పాశురములో ఎంబెరుమానార్ యొక్క అసమానమైన వైభవమును అద్భుతంగా వెల్లడిచేశారు. 

ఎమ్బెరుమానార్ దరిశనమెన్ఱే ఇదుక్కు। 
నమ్పెరుమాళ్ పేరిట్టు నాట్టి వైత్తార్ అమ్బువియోర్ 
ఇంద దరిశనత్తై ఎమ్బెరుమానార్ వళర్త।
అన్దచ్చెయల్ అఱిగైక్కా॥

నంపెరుమాళ్ (శ్రీరంగ ఉత్సవ మూర్తి)  మన శ్రీ వైష్ణవ సాంప్రదాయమును ఎంబెరుమానార్ దరిశనము అని నామకరణము చేశారు, అభివృద్ది పరచారు. ఇది ఎందుకనగా, స్పష్టమైన వివరణలలో ఎంబెరుమానార్ ఈ భక్తి మార్గాన్ని అభివృద్ది పరచి శ్రీభాష్యం మొదలైన గ్రంథములను రచించారు. ఆచార్యుల ద్వారా మన సాంప్రదాయము యొక్క అర్థాలు అందరికీ అందేలా చేశారు, ఎన్నో దివ్య ఆలయముల పద్దతులలో (ఆలయ పరిపాలన, శాస్త్రానుసారముగా పెరుమాళ్ ఉత్సవములు మొదలైనవి) సంస్కరణలు చేశారు. ఎంబెరుమానార్ చేపట్టిన  సంస్కరణలు అందరికీ తెలియ చేసేందుకు నంపెరుమాళ్ చేత శ్రీ వైష్ణవ సాంప్రదాయము ఎంబెరుమానార్ దరిశనము అని స్థాపించబడింది. ఎంబెరుమానార్ పంచాచార్యులలో ఒకరైన తిరుక్కోష్ఠియూర్ నంబి వారికిచ్చిన ‘ఎంబెరుమానార్’ అన్న బిరుదును సార్థకము చేయుటకు అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఎంబెరుమానార్ యొక్క ప్రతిష్ట వ్యాపించాలని నంపెరుమాళ్ చేసిన పని అని కూడా భావించ వచ్చు.     

ఎంబెరుమానార్ కాలములో పిళ్ళై తిరువరంగత్తు అముదనార్ శ్రీరంగములో ఆచార్యులుగా ఉండేవారు. అప్పట్లో వారికి ఎంబెరుమానార్ పట్ల అంత గౌరవము ఉండేది కాదు. ఎంబెరుమానార్ ఆదేశము మేరకు వారిని తన ప్రముఖ శిష్యులైన కూరత్తాళ్వార్ యొక్క సంస్కరణలో ఉంచబడ్డారు. కూరత్తాళ్వార్ అనుగ్రహముతో వారు ఎంబెరుమానార్  యొక్క గొప్పతనాన్ని గ్రహించి, ఎంబెరుమానార్ గుణాలను వివరముగా వర్ణిస్తూ  ‘ఇరామానుశ నూత్తందాది’ అనే అద్భుతమైన ప్రబంధాన్ని వ్రాశారు. 

ఈ ప్రబందానికి సరళ వ్యాఖ్యానము మణవాళ మామునులు కృప చేశారు. ఈ వ్యాఖ్యానములో వారు ఈ ప్రబంధము యొక్క గొప్పతనాన్ని అందముగా వివరించారు. మనము క్లుప్తంగా ఈ గుణాలను ఇక్కడ చూద్దాము.

మధురకవి ఆళ్వార్ తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ పట్ల భక్తి ప్రపత్తులను వ్యక్త పరుస్తూ కణ్ణినుణ్ శిరుత్తాంబు రచించినట్లుగా, అముదనార్లు ఎంబెరుమానార్  పట్ల తమ భక్తి ప్రపత్తులను వ్యక్త పరుస్తూ ఈ ప్రబంధాన్ని కృప చేశారు. అయితే, మధురకవి ఆళ్వార్ అనుగ్రహించిన సంక్షిప్త ప్రబంధములా కాకుండా, అముదనార్ సుదీర్ఘమైన ప్రబంధాన్ని మనకు కృపచేశారు. ఎలాగైతే యజ్ఞోపవీత సంస్కారం తరువాత గాయిత్రి మంత్రము నిత్యము పఠించాలో, అలాగే ఆచార్య సంబంధము ఏర్పడిన తరువాత మరియు ఎంబెరుమానార్  తిరువడి పట్ల ఆసక్తి ఉన్న వారు నిత్యము అనుదినము ఈ ప్రబంధాన్ని పఠించాలి. ఈ ప్రబంధము యొక్క ప్రతి పాశురములో ఎంబెరుమానార్  నామము ఆవాహన చేయబడింది. కావున మన పెద్దలు ఈ ప్రబంధమును ‘ప్రపన్న గాయిత్రి’ అని పిలిచేవారు. 

ఈ పాశురముల సరళ వ్యాఖ్యానము మామునుల వ్యాఖ్యానముల సహాయముతో వ్రాయబడింది.

తదుపరి శీర్శికలో, ఈ ప్రబందము యొక్క తనియన్లను అనుభవిద్దాము.

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/04/ramanusa-nurrandhadhi-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment