జ్ఞానసారము-29

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 28

lakshmi_narayan_py94_l

 

పాశురము-29

“మందిరముం ఈంద గురువుం అం మందిరతాల్

సిందనై సెయిగిన్ఱ తిరుమాలుం

నందలిలాదు ఎన్ఱుం అరుళ్ పురివర్ యావర్ , అవర్ ఇడరై

వెన్ఱు కడిదు అడైవర్ వీడు”

అవతారిక:

తిరుమంత్రమనే అష్టాక్షరి మంత్రముపై దానినుపదేశించిన ఆచార్యులపై ,మంత్ర ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణునిపై మహా విశ్వాసము కలవారు జననమరణ చక్రబంధము నుండి విడివడి నిత్య కైంకర్య భాగ్యమును పొందుతారని ఈ పాశురములో చెపుతున్నారు.

ప్రతిపదార్థము:

మందిరముం = తిరుమంత్రము

ఈంద గురువుం = ఉపదేశించిన ఆచార్యులు

అం మందిరతాల్ = ఆ మంత్రముచే

సిందనై సెయిగిన్ఱ = ప్రతిపాద్యుడైన

తిరుమాలుం = శ్రీమన్నారాయణుడు

నందలిలాదు = అవ్యవధానముగా

ఎన్ఱుం = ఎల్లప్పుడు

యావర్ = ఎవరైతే

అరుళ్ పురివర్ = కృపకు పాత్రులవుదురో

అవర్ = వారు

ఇడరై వెన్ఱు = జననమరణ చక్రమును చేధించుకొని

కడిదు = త్వరగా

వీడు అడైవర్ = పరమపదమును చేరుకుంటారు

వ్యాఖ్యానము:

“మందిరముం..…..మననము చేయునది మంత్రము. మరల మరల చెప్పుటయే మననము . అనగా ప్రేమతో మరల మరల చెప్పుట …ఇక్కడ మననము చేసేది అష్టాక్షరి అనే ఎనిమిది అక్షరాల మంత్రము .“ఎట్టెళుతుం ఓదువార్గల్ వల్లార్ వానం అళవే” అని తిరుమళిసై ఆళ్వార్లు అన్నారు.

ఈంద గురువుం ….….అష్టాక్షరి మంత్రమునుపదేశించి దాని అర్థమును వివరించిన గురువు

అం మందిరతాల్ సిందనై సెయిగిన్ఱ తిరుమాలుం……..ఆ అష్టాక్షరి మంత్రమునకు ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణుడు .

నందలిలాదు …..…“నందుదల్”  అంటే ఆగిపోవుట , అవాంతరములు ఏర్పడుట… నందలిలాదు… అంటే ఎలాంటి అవాంతరములు ఏర్పడకుండా , ఆగిపోకుండా..

ఎన్ఱుం అరుళ్ పురివర్ యావర్ ………పై మూడింటిపై అవ్యవధానముగా విశ్వాసము కలవారు  సదా ఆయన కృపకు పాత్రులవుతారు.

అవర్ ఇడరై వెన్ఱు కడిదు అడైవర్ వీడు..…… “మంతిరత్తిలుం మంతిరత్తుక్కు ఉళ్ళేడాన వస్తువిలుం మంతిర ప్రధాననాన ఆచార్యన్ పక్కలిలుం ప్రేమం గణక్క ఉండానాల్ కార్య కరమావదు”.అని ముముక్షుపడి సూత్రములో చెప్పినట్లుగా, మంత్రముపై , దానినుపదేశించిన ఆచార్యులపై ,మంత్ర ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణునిపై మహా విశ్వాసము కలవారు జననమరణ చక్రబంధము నుండి విడివడి నిత్య కైంకర్య భాగ్యమును పొందుతారని ఈ పాశురములో చెప్పారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-29-mandhiramum-endha/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *