జ్ఞానసారము 15

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 14

god,hindu,mahavishnu-8af75d30e076a9163fee484b74963508_h

 అవతారిక

“ఎవ్వుయిరుక్కుం ఇందిరైకోన్ తన్నడియేకాణుం శరణ్ “ ( సకల జీవులకు ఇందిర నాయకుడు తానే అనుగ్రహించి శరణమును యిస్తాడు ) అన్న భావమునకు ఈ పాశురము వివరణగా కనపడుతుంది.” తిరుమగళ్ మణాళనుక్కు  అడియార్”( శ్రీలక్ష్మినాయకుని దాసులు )అన్న గుర్తింపును పొందిన వారు ,జ్ఞానమును పొందుటకు ముందు ఉన్న ఊరు ,కులము,ఇతర గుర్తింపులను అన్నింటిని జ్ఞానమును పొందిన తరువాత వదిలి వేస్తారు. కేవలము ఆయన శ్రీపాదములే వారి చిరునామాగా మారుతుంది .

“ కుడియుమ్ కులముమ్ ఎల్లామ్ కోకనకై కేళ్వన్

అడియార్కు అవనడియే యాగుం-పడియిన్ మేల్

నీర్ కేళువుం ఆఱుగళిన్ పేరుం నిఱముమ్  ఎల్లామ్

ఆర్ కలియై సేర్దిడ మాయన్ తఱ్ఱు “

ప్రతి పదార్థము

కుడియుమ్ = పుట్టిన ఊరు

కులముమ్ = పుట్టిన కులము

ఎల్లామ్ = ఇంకా జన్మకు సంబంధించిన గుర్తులు

కోకనకై  కేళ్వన్ = శ్రీమహాలక్ష్మి నాయకుని

అడియార్కు = దాసులకు

అవనడియే యాగుం- = ఆయన శ్రీపాదములే అవుతాయి

(దీనికి ఉదాహరణగా )

పడియిన్ మేల్  = భూమి మీద

నీర్ కేళువుం = నీటితో నిండిన

ఆఱుగళిన్ = నదుల

పేరుం = గంగ ,యమున మొదలైన పేర్లు

నిఱముమ్  = ఎరుపు,నలుపు మొదలైన రంగులు

ఎల్లామ్ = అన్నీ

ఆర్ కలియై సేర్దు = సముద్రమును కలిసిన తరువాత

మాయన్ తిడుం అఱ్ఱు = మాసి పోయినట్లుగా

వివరణ

కుడియుమ్ కులముమ్ ఎల్లామ్….” సోనాట్టు పూంచాఱఱు పార్పాన్ కౌనియణ్ విణ్ణత్తాన్ “అని ,గ్రామీణుల పాటలొ ను

“ వేంగణ్ మా  కళీరుమ్ది విణ్ణియేఱఱ

విరల్ మన్నర్ తిరళ్ అళియ వెంమావుయ్త్త్

సేమ్కణ్ణాన్ కో చోళన్ “ అని

ఇరుక్కిలంగు తిరుమొళివాయ్ ఎణ్ తోళ్ ఈసర్కు

ఎళిల్ మాడం  ఎళుపదు సెయిదు  ఉలగమ్ ఆండ తిరుక్కులత్తు వళచోళన్ “ అని

తిరుమంగై ఆళ్వార్లు పాడారు. దాని ప్రకారము కులము, గోత్రము, ఊరు,వాడ మొదలగు గుర్తులు చెప్పుట గమనించవచ్చు .

‘కోకనకై కేళ్వన్ అడియార్కు …పరమాత్మ దాసులకు కొంగు బంగారము .’ తామరై కోకనకై ’ –తామరలో పుట్టిన లక్ష్మికి కొంగు బంగారము. కేళ్వన్- నాయకుడు . లక్ష్మికినాయకుడైన  పరమాత్మ శ్రీపాదములే చిరునామా అయిన దాసులకు .

అవనడియే యాగుం-…. జ్ఞానమును పొందుటకు ముందున్న గుర్తింపు చిహ్నములన్నీ మాసిపోయి పరమాత్మ శ్రీపాదములే చిరునామాగా మిగిలిందని అర్థము. పరమాత్మ శ్రీపాద సంబంధము గలవారు కావున వారిని తిరుమాల్ అడియార్ అని అంటారు. దీనికి ఉదాహరణగా

పడియిన్ మేల్ ….. ఈ భూమి మీద

నీర్ కేళువుం ఆఱుగళిన్ పేరుం నిఱముమ్  ఎల్లామ్….. గంగ,యమున వంటి పేర్లు గల నదులు నిండుగా నీటితో పారినా

ఆర్ కలియై సేర్దు ….. సముద్రములో కలవగానే

మాయ్ దిడుం అఱ్ఱు….. తమ పేర్లను,రంగు పోగొట్టుకుంటాయి .

అర్థాత్ పరమాత్మ దాసులకు శరణాగతి చేయక ముందు ఊరు, పేరు, కులము, గోత్రము ఉన్నా ఒకసారి ఆ లక్ష్మీనయకుని శ్రిపాదములను ఆశ్రయించిన తరువాత అవన్నీ తొలగిపోయి ఆయన దాసులన్న పెరోక్కటే ఉంటుం ది.  అనగా అశాస్వతమైనవి మాసిపోతాయి, శాస్వతమైనవి నిలిచి వుంటాయి. ఊరు, పేరు, కులము, గోత్రము లన్నీ ఈ భూమి మీద,ఈ జన్మ వరకే వర్తిస్తాయి. పరమాత్మ దాసుడన్న మాట శాస్వతమైనది. ఎప్పటికీ నిలిచి వుండేది .ఇది ఆత్మలన్నింటికీ సమానముగా వర్తిస్తుంది . దీని వలన ఇతర సంబంధాలన్నింటిని విడిచి పరమాత్మతో వున్న సంబంధాన్ని మాత్రమే గుర్తుంచుకుంటాము .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-15-kudiyum-kulamum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *