ఆర్తి ప్రభందం – 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<< అవతారిక

emperumanar

వాళి ఎతిరాశన్ వాళి ఎతిరాశన్
వాళి ఎతిరాశన్ ఎన వాళ్తువార్ వాళియెన
వాళ్తువార్ వాళియెన వాళ్తువార్ తాళిణైయిల్
తాళ్తువార్ విణ్ణోర్ తలై

ప్రతి పద్ధార్ధం

విణ్ణోర్ – నిత్యసూరులు
తలై – కొందరు వారి నాయకుడిగా తలచుట
తాళ్తువార్ – శరణని వచిన వారు
తాళిణైయిల్ – పాదపద్మముల వద్ద
వాళియెన వాళ్త్తువార్ – భక్తులకు ఎల్లప్పుడు మంగళాశాసనము చేయువారు
వాళియెన వాళ్త్తువార్ – భక్తులకు ఎల్లప్పుడు మంగళాశాసనము చేయువారు
వాళ్హ్తువార్ – ఈ విధముగా శ్రీ రామానుజులకు మంగళాశాసనము చేయు వారు
వాళి ఎతిరాసన్ – శ్రీ రామానుజులకు జయము జయము !!! శ్రీ రామానుజుల కీర్తి వర్ధిల్లుగాక!!! శ్రీ రామానుజులు చిరకాలం వర్ధిల్లుగాక!!!
వాళి ఎతిరాసన్ – శ్రీ రామానుజులకు జయము జయము !!! శ్రీ రామానుజుల కీర్తి వర్ధిల్లుగాక!!! శ్రీ రామానుజులు చిరకాలం వర్ధిల్లుగాక!!!
వాళి ఎతిరాసన్ – శ్రీ రామానుజులకు జయము జయము !!! శ్రీ రామానుజుల కీర్తి వర్ధిల్లుగాక!!! శ్రీ రామానుజులు చిరకాలం వర్ధిల్లుగాక!!!
ఎన – మూడు సార్లు

సామన్య అర్ధం

నిత్యసూరులు కొందరిని వారి నాయకులుగా భావించెదరు. అటువంటి నిత్యసురుల నాయకులు ఎల్లప్పుడు శ్రీ రామానుజులకు మంగళము పాడు భక్తులకు మంగలాశాసనము చేయువారి పాదపద్మములయందు శరణు కోరి ఉండెదరు.

వివరణ

వేదములను అనుకరించి జీవించువారిని పరమ వవైదీకులు అని అంటారు.  ఇట్టి వారికి “పల్లాణ్డు పల్లాణ్డు పల్లాయిరతాణ్డు (తిరుపల్లాణ్డు 1)” మరియు “పొలిగ పొలిగ పొలిగ (తిరువాయ్ మొళి 5.2.1) అని మంగళాశాసనము చేయుటయే సహజగుణమగును. మణవాళ మామునులు కూడ అదే విధమున తన రచనను ప్రారంభించెను.  అలా మూడు మార్లు చెప్పుట ఆనవాయితి. కొంత మంది భక్తులు (మొదటి వర్గం)  “వాళి ఎతిరాశన్ వాళి ఎతిరాశన్ వాళి ఎతిరాశన్” అని శ్రీ రామానుజులకు మంగళము పాడుచూ ఉన్నారు. మరి కొంతమంది భక్తులు (రెండవ వర్గం) శ్రీ రామానుజులకు మంగళము పాడు (మొదటి వర్గం) భక్తులను చూచి వెంటనే ” రామానుజులకు మంగళము పాడువారు చిరకాలం వర్ధిలవలెనని ” అని మంగళము చెప్ప సాగెను. ఈ సంఘటనను చూచిన ఇంకో భక్త సమూహము (మూడవ వర్గం) సంతోషించి రామానుజులకు మంగలము పాడు (మొదటి వర్గం) వారికి మంగళము పాడు (రెండవ వర్గం) భక్తులకు మంగళము (” వాళి యెన వాత్తువార్” వాళి) పాడుటకు మొదలు పెట్టెను. మరి ఒక్క భక్త సమూహము (నాలుగవ వర్గం) ” వాళి యెన వాత్తువార్ వాళి ” అని పాడుట విని ఆ భక్తులను (మూడవ వర్గం) శరణు కోరి ఆశ్రయించెను. అట్టి వారి (నాలుగవ వర్గం) పాదపద్మములకు సరి తూగునట్టి విషయము ఈ జగమున లెడు. బహుసా వారి కుడి మరియు ఎడమ పాదములను మాత్రమే పోల్చవచ్చును.నిత్యసూరులు వీరిని (నాలుగవ వర్గం) వారి నాయకులుగా తలచి కొనియాడెదరు. నిజమున, వీరు (నాలుగవ వర్గం) నిత్య సూరులకన్న గొప్ప వారు. మణవాళ మామునులు తన ఈ గ్రంధమును “వాళి” అని మంగళముతో ప్రారంభించెను.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-1/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

3 thoughts on “ఆర్తి ప్రభందం – 1”

Leave a Comment