తిరువెళుకూట్ఱిరుక్కై 3వ భాగము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరువెళుకూట్ఱిరుక్కై

<< 2వ భాగము

(1-2-)3-4-3-2-1-(1-2-3)

మూవడి నానిలం వేణ్డి
ముప్పురి నూలొడు మానురి ఇలంగు మార్వినిల్
ఇరు పిఱప్పు ఒరు మాణ్ ఆగి
ఒరు ముఱై ఈరడి మూవులగు అళందనై

ప్రతిపదార్థము:

 ఒరు ముఱై – ఒకానొకప్పుడు

 ముప్పురి నూలొడు – యఙ్ఞోపవీతముతో

 మానురి – జింక చర్మము

ఇలంగు మార్వినిల్ – హృదయము మీద అలంకరించిన

 ఇరు పిఱప్పు ఒరు మాణ్ ఆగి – అసమానమైన బ్రహ్మచారి

వేణ్డి – ప్రార్థించి

మూవడి – మూడడుగులు

నానిలం – నాలుగు రకములైన భూమిని

 అళందనై – కొలిచావు

మూవులగు – మూడు లోకములు

ఈరడి – రెండడుగులు

vamana-mAnuri

భావము:

    ఈ పాశురములో తిరుమంగైఆళ్వార్లు పరమాత్మ కేవలము ధనుర్బాణాలతోనే కాదు, అందముతో కూడా శతృవులను గెలవగలరని చెపుతున్నారు.     నాలుగు విధములైన భూమిని (మైదానము, పర్వతము, అడవి, సముద్రము)ఒక్క అడుగులో కొలిచి ఊర్ధ్వ లోకములను రెండవ అడుగులో కొలిచి , మహాబలి శిరస్సు మీద మూడవ అడుగుంచావు. దీని కోసము నువ్వు వామన మూర్తిగా,  యఙ్ఞోపవీతమును ధరించి, జింక చర్మమును  హృదయము మీద అలంకరించుకొని వచ్చి మూడడుగులు  ప్రార్థించావు.  నిన్నే కోరుకునే నన్ను కాపాడ లేవా!

 వ్యాఖ్యానము:

మూవడి … –ఇంద్రుడికి కోరుకున్నలాభములన్నీ ఇచ్చిన నీకు నాలాంటివాడిని రక్షించటము కష్టమా!

నానిలం మూవడి వేణ్డి –   ముల్లై (అడవులు), కురింజి (పర్వతాలు), మరుదం (జనావాసాలు), నైదల్ (సముద్రము) అనే నాలుగు రకాలతో కూడిన నేలను ఒక్క అడుగులో కొలిచావు.  పైలోకాలను మరొక అడుగులో కొలిచి మూడవ  అడుగులో మహా బలిని ఓడించాలని,  మహా బలిని మూడడుగులు దానమడిగావని ఆళ్వార్లు పాడుతున్నారు.

ఇదే విషయాన్ని  నమ్మాళ్వార్లు  తిరువిరుత్తం 26 – “నానిలం వాయిక్ కొణ్డు…..”అన్నారు.

ముప్పురి నూలొడు మాన్ ఉరి ఇలంగు మార్వినిల్ –  బ్రహ్మచారి వ్రతములో ఉన్న నీ హృదయ సీమ మీద జింక చర్మము, దాని మీద  ఝంద్యము,  మేఘములచే ఆవరింపబడిన ఆకశములో మెరుపు తీవెలా ఉన్నది.

ఇరు పిఱప్పు – అప్పుడే పొందిన ద్విజత్వము(కొత్తగా వడుగు చేసుకున్న వటువు)

ఒరు మాణ్ ఆగి – బ్రహ్మచారిగా అసమాన దీప్తితో వామన రూపములో , అడగటమే తెలియని  నీవు, ఇంద్రుని కోసము నేలను దానమడిగావు.

బలి దానమిచ్చినా ఇవ్వకున్నా ఒకటే అన్నట్లు ప్రసన్నముగా ఉండిన  ఆ వామన రూపములో ఎంత అందముగా ఉన్నావు.

ఒరు ముఱై ఈరడి మూవులగు అళందనై – ఒకే సారి రెండడుగులతో మూడు లోకములను కొలిచావు.

“ఇంధ్రుని కోసము మూడు లోకములను అడిగి ఇచ్చిన వాడివి,   నాకు నీ సేవకుడుగా వుండే భాగ్యాన్ని ఇవ్వలేవా? “అని ఆళ్వార్లు అడుగుతున్నారు.

“మూడు  లోకములను కొలిచేటప్పుడు నీమీద ఇష్టము లేని వారికి కూడ నీ  శ్రీపాద స్పర్శ ఇచ్చావు. నిన్నే కోరుతున్న నాకు నీ శ్రీపాద స్పర్శ ఇవ్వలేవా?”

“ఇంధ్రుడు  స్వార్థము కోసము అల్పమైన నేలను కోరుకున్నాడు. మహాబలి దర్పము కోసము దానమిచ్చాడు.  నేను మాత్రము నిన్నే  కోరుతున్నాను. నిన్ను కాక అల్పమైన విషయములను కోరుకునే వారి కోరికలను తీర్చగలవు కాని, నిన్నే కోరుకునే వారి కోరికలను తీర్చలేవా?

ఆళ్వార్లు, ఆచార్యులందరు భగవంతుని శ్రీపాదములనే కోరుకున్నారు.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/06/thiruvezhukurrirukkai-3/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment