శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఉపదేశరత్తినమాలై
ఉపదేశరత్తినమాలై అనేది ఒక మహత్తరమైన గ్రంథం. దాని పేరుతోనే అర్థమవుతుంది – ఇది ఉపదేశాలతో (ఆధ్యాత్మిక బోధనలతో) నిర్మితమైన ఒక మాలిక/హారం. ఆ ఉపదేశాలు పచ్చలు, మాణిక్యాలు వంటి రత్నాలతో పోల్చబడ్డాయి. అందువల్ల దీనికి ఉపదేశరత్తినమాలై అనే పేరు ఏర్పడింది.
ఉపదేశరత్తినమాలై అనేది శ్రీవచనభూషణం అనే రహస్య గ్రంథసారము. ఈ గ్రంథాన్ని స్వామి శ్రీ పిళ్ళైలోకాచార్యులు రచించారు. ఆయన తిరువాయ్మొళి సారాంశాన్ని శ్రీవచనభూషణం రూపంలో ఇచ్చారు. చివరగా, జీవుని ఉజ్జీవనానికి (పరమగతిని పొందుటకు) ఆచార్య కృప/అభిమానం ఒక్కటే ఆధారం అని స్పష్టంచేశారు.
అందులోని గంభీరార్థాన్ని సులభంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా సంక్షిప్తంగా ఉపదేశరత్తినమాలై రూపంలో మనవాళ మామునులు ప్రసాదించారు.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ “సర్వధర్మాన్ పరిత్యజ్య” అని ఉపదేశించారు. దాని అర్థం – “ఇతర అన్ని సాధనాలను విడిచి నన్ను ఒక్కనినే శరణు పొందుము”. భగవాన్ ఈ మాటను రెండో అధ్యాయంలోనే చెప్పవచ్చు, కాని ఆయన చివర్లోనే చెప్పారు. మొదట ఆయన ఆత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం మొదలైనవి వివరించారు. ఆ తరువాత మాత్రమే చివరగా శరణాగతి తత్త్వాన్ని బోధించారు. మన ఆళ్వార్లు, ఆచార్యులు కూడా ఇదే విధానాన్ని అనుసరించి ముందుగా పరిచయ జ్ఞానాన్ని ఇచ్చి, తరువాత పరమార్థాన్ని వెల్లడించారు.
అదేవిధంగా మామునులు ఉపదేశరత్తినమాలై లో ముందుగా ఆళ్వార్ల అవతార స్థలాల గురించి, వారి జన్మ మాసం, తిరునక్షత్రం, అవతార ప్రభావం గురించి వివరిస్తారు. తరువాత ఆచార్య శ్రీమన్నాథముని మహిమ గురించి చెప్పారు. ఎందుకంటే ఆయనను ప్రథమాచార్యులలో ఒకరిగా గౌరవిస్తాము. మన సంప్రదాయం “రామానుజ దర్శనం” అని నంపెరుమాళ్ చేత స్వయంగా గౌరవించిన ఘనత కలిగినది. ఈ సంప్రదాయానికి శ్రీరామానుజ ఆచార్యులే శిఖరం, ఆయన వల్లే శ్రీవైష్ణవ సంప్రదాయం పరాకాష్టకు చేరిందని మామునులు వర్ణించారు. అలాగే తిరువాయ్మొళిపై వచ్చిన వివిధ వ్యాఖ్యానాల క్రమాన్ని వివరించారు.
36000 పడి అర్థంతో కూడిన ఈడు వ్యాఖ్యానం నంపిళ్ళై ద్వారా ఇవ్వబడింది. దాన్ని వడక్కుత్తిరువీధిపిళ్ళై లిఖించారు. తరువాత ఆయన శిష్యు డైన ఈయున్ని మాధవపెరుమాళ్కు అది అందించబడింది. అక్కడి నుండి అది ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ కు అది అందించబడింది.
అక్కడి నుండి అది ఈయుణ్ణి పద్మనాభపెరుమాళ్, నాలూర్ పిళ్ళై, నాలూరాచ్చాన్ పిళ్ళై, తిరువాయ్మొళిపిళ్ళై వరకు వచ్చింది.
వడకుత్తిరువీధిపిళ్ళై నుండి ఆ జ్ఞానం ఆయన కుమారుడు పిళ్ళైలోకాచార్యులకు అందింది. శ్రీవచనభూషణం ఆయన ప్రసాదించిన అద్భుత గ్రంథమని మామునులు ఇందులో పత్ర్యేకంగా కేంద్రబిందువుగా తెలిపారు.
ఇవన్నీ ఉపదేశరత్తినమాలైలోని అవతారిక భాగం.
మామునులు శ్రీవచనభూషణం మహిమను మళ్ళీ మళ్ళీ బలపరుస్తారు. దాని లోతైన తత్త్వార్థాలు అనేక పాశురముల ద్వారా ఈ గ్రంథంలో సుందరంగా వివరించబడ్డాయి.
పాశురం- 61
ఙ్ఞానం అనుట్టానం ఇవై నన్ఱాగనే యుడైయ
నాన| గురువై అడైన్దక్కాల్| మానిలత్తీర్!
తేనార్ కమలత్తిరుమామగళ్ కొళునన్|
తానే వైకున్దం తరుమ్
అర్ధం:
ఒక వ్యక్తి నిజమైన జ్ఞానం మరియు ఆచరణతో నిండిన ఆచార్యుల కి శరణాగతి చేసినప్పుడు, తాయారుతో కూడి ఉన్న శ్రీమన్నారాయణుడు అటువంటి భక్తునికి స్వయంగా పరమపదంలో ప్రవేశాన్ని అనుగ్రహిస్తాడు.
పాశురం-64
తన్నారియనుక్కుత్తాన్ అడిమై శెయ్ వదు| అవన్
ఇన్నాడుదన్నిల్ ఇరుక్కుం నాళ్| అన్నేర్
అఱిన్దుం అదిలాశై యిన్ఱి ఆశారియనై
పిరిన్దిరుప్పారార్?| మనమే! పేశు
అర్ధం:
ఒక భక్తుడు తన ఆచార్యుడు భూమిపై ఉన్నంతకాలం ఆయనకు సేవ చేయడం అత్యంత గొప్ప అనుగ్రహమని పూర్తిగా తెలుసుకున్నప్పుడు, అలాంటి సేవను విస్మరించి ఆయన నుండి దూరంగా ఎలా ఉండగలడు? ఓ నా మనసా, నువ్వు చెప్పగలవా?
మామునిగళ్ తమ ఆచార్యుల కి పరమపదానికి చేరేవరకు సమస్త సేవలు చేశారు. ఆచార్యుల ఆజ్ఞ ప్రకారం ఆయన తరువాత శ్రీరంగానికి వెళ్లారు.
పాశురం – 66
పిన్బళగరాం పెరుమాళ్ శీయర్| పెరున్దివత్తిల్
అన్బదువు మత్తు మిక్క ఆశైయినాల్| నమ్బిళ్ళైక్కు
ఆన అడిమైగళ్ శెయ్ అన్ని లైయై నన్నెఞ్జే!|
ఊనమఱ ఎప్పొళృదుం ఓర్
అర్ధం:
ఈ పాశురంలో మామునిగళ్ ఆచార్య-శిష్యుల మధ్య ఉండవలసిన సంబంధాన్ని చూపించారు. నమ్పిళ్లై శిష్యులైన అళగియ పెరుమాళ్ జీయర్ తమ ఆచార్యుల పట్ల ప్రదర్శించిన భక్తిని ఉదాహరణగా తీసుకుని, ఒక శిష్యుడు తన ఆచార్యుల దివ్య మూర్తి పట్ల కలిగి ఉండవలసిన పరమ భక్తి ఎంత ముఖ్యమో ప్రతిపాదించారు.
పాశురం- 72
పూరువాశారియర్ గళ్ పోదం అనుట్టానఙ్గళ్|
కూరువార్ వార్తైగళై క్కొణ్డునీర్ తేఱి|
ఇరుళ్ తరుమా ఞాలత్తే| ఇన్బముత్తు వాళృమ్|
తెరుళ్ తరుమా దేశిగనై చ్చేర్ న్దు
అర్ధం:
శిష్యుడు తనను పూర్తిగా ఆచార్యులకి సమర్పించి, పూర్వాచార్యులు నిర్దేశించిన అనుష్ఠానాలను అనుసరించి జీవిస్తే, అది సంపూర్ణమైన జీవనమవుతుంది.
చివరి పాశురంలో, ఫలశ్రుతిగా, మామునిగళ్ ఇలా అంటారు – ఈ పాశురాలను హృదయంలో ఆలోచిస్తూ పఠించి అర్థం చేసుకునే వారు సాక్షాత్తు యతిరాజులైన శ్రీరామానుజుల దివ్య కృపకు పాత్రులవుతారు.
పాశురం- 74
మన్నుయిర్ గాళ్! ఇఙ్గే మణవాళమామునివన్
పొన్నడియాం శెఙ్గమలపోదుగళై| ఉన్ని
చ్చిరత్తాలే తీణ్డిల్ అమానవనుం నమ్మై|
కరత్తాలే తీణ్డల్ కడన్
అర్ధం:
ఓ భౌతిక లోకంలో నివసించే జనులారా! మామునిగళ్ ఎర్రని కమలమువంటి దివ్యపాదాలు తలపై తాకినవారికి వైకుంఠ ప్రవేశం ఖాయం. ఎందుకంటే అటువంటి భక్తుని అమానవుడు (నిత్యసూరి) స్వయంగా తాకి లోపలికి అనుమతించవలసి ఉంటుంది.
ఈ పాశురంలో ఎరుంబియప్పా గారు మామునిగళ్ మహిమను గానం చేస్తున్నారు. జీవాత్మల ఉద్ధారణలో మామునిగళ్ కమలపాదాల గొప్పతనాన్ని ప్రతిఫలిస్తుంది. మామునిగళ్ తన దయతో శ్రీవచనభూషణంలోని సూత్రరూప వివరాలను సులభంగా అర్థమయ్యే విధంగా ఉపదేశరత్తినమాలైలో పాశురాల రూపంలో అందించారు
తిరువాయ్ మొళి నూత్తన్దాది
తిరువాయిమొళి నూత్తన్దాది మానవాళ మామునిగళ్ కృప చేసిన ప్రబంధం. .
ఇరామానుజ నూత్తన్దాది రామానుజుల కాలంలో అముదనార్ ద్వారా అందించబడింది.
అళ్వార్ కోసం నూత్తన్దాది లేనందున, మామునిగళ్ తిరువాయిమొళి నూత్తన్దాదిని రాయాలని సంకల్పించారు.
ఆ గ్రంధం ప్రధానంగా ఆళ్వార్లను స్తుతిస్తూ, అదే సమయంలో వారి ప్రభంధ వైభవాన్ని కూడా తెలియజేస్తుంది.
ఈ అద్భుతమైన రచనలో, మామునిగళ్ తిరువాయిమొళి ఒక్క పదిగానికి (10 పాశురాలతో కూడిన) సారాంశాన్ని తిరువాయిమొళి నూత్తన్దాది ఒక్క పాశురంలో అందించారు.
తిరువాయిమొళి అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవడం మనకు చాలా సమయం పడుతుంది.
మామునిగళ్ మనకు ఈ గ్రంథాన్ని కృపతో అనుగ్రహించారు, ఇది ఆళ్వార్ల స్థితి, మనస్సు, మరియు భావం చూపిస్తుంది.
ఇది తిరువాయిమొళి ప్రారంభం, దాని ప్రవాహం మరియు అళ్వార్ ప్రభందం పూర్తిచేసిన విధానం కూడా వివరిస్తుంది.
మామునిగళ్ ఈ గ్రంథాన్ని రచిస్తున్నప్పుడు కొన్ని నియమాలు పెట్టుకున్నారు :
- ఇది అందాది పద్దతిలో సాగాలి (తిరువాయిమొళి అందాదిలో ఉన్నట్టే) మరియు చిన్నదిగా , సులభంగా అర్థమయ్యేలా ఉండాలి.
- ప్రతి పాశురంలో నమ్మాళ్వార్ల తిరునామం మరియు మహిమ/ వైభవం ప్రస్తావించబడాలి.
- నంపిళ్లై 36,000 పడి వ్యాఖ్యలను సంక్షిప్తంగా స్పృశించాలి.
- తిరువాయిమొళి నూత్తన్దాది పద్దతిని అనుసరిస్తుంది; అంటే ఒక పాశురం చివరి పదం తదుపరి పాశురం ప్రారంభ పదం అవుతుంది – దీనిని అందాది అంటారు.
నమ్మాళ్వార్ల తిరువాయిమొళి ” ఉయర్వఱ”తో ప్రారంభమవుతుంది, మామునిగళ్ తిరువాయిమొళి నూత్తన్దాది కూడా “ఉయర్వే”తో ప్రారంభమవుతుంది.
ఈ నియమాలను పాటిస్తూ, మామునిగళ్ తిరువాయిమొళి నూత్తన్దాది అనే అద్భుతమైన రచనను అనుగ్రహించారు.
తిరువాయిమొళి మొదటి పదిగం – “ఉయర్వఱ ఉయర్ నలమ్| ఉడైయవన్ ఎవన్ అవన్|” -దీని ద్వారా నమ్మాళ్వార్లు 10 పాశురాలలో సంపూర్ణ పరత్వాన్ని చూపిస్తూ వేదాంతాన్ని వివరిస్తారు.
ఆయన శక్తి, శరీర-శరీరి భావం వంటి అంశాలను కూడా వివరించారు.
మామునిగళ్ ఈ విషయాలన్నిటినీ కేవలం రెండు పంక్తులలో చూపించారు.
పాశురం-1
ఉయర్వే పరన్బడియై ఉళ్ళదెల్లాం తాన్ కణ్డు
ఉయర్వేదం నేర్ కొణ్డురైత్తు – మయర్వేదుమ్
వారామల్ మానిడరై వాజ్ విక్కుం మాఱన్ శొల్
వేరాగవే విళైయుం వీడు
అర్హం:
ఈ పాశురంలో, మొదటి రెండు పదాలలో మామునిగళ్ ఎంపెరుమాన్ మహిమ మరియు స్థితిని అద్భుతంగా చిత్రించారు. ఇది అన్ని, ఎంపెరుమాన్ తనకే కృతజ్ఞతతో అనుగ్రహించిన అమలమైన జ్ఞానంతో అళ్వార్లు స్వయంగా ప్రత్యక్షంగా చూశారు. నమ్మాళ్వార్ల (మారన్) యొక్క ఈ పదాలు, జీవులు మోక్షాన్ని పొందడానికి మూలకారణంగా ఉంటాయి.
మామునిగళ్ నంపిళ్లై వాఖ్యానం యొక్క లోతైన జ్ఞానాన్ని గ్రహించారు. ఈ వ్యాఖ్యానం మూడు పరిచయ భాగాలను కలిగి ఉంది: మొదటి, రెండవ మరియు మూడవ శ్రియఃపతికి , అలాగే ప్రతి పదిగానికి ప్రవేశం కూడా ఉంది. ఇది మనవాళ మామునిగళ్ ప్రతిష్ఠను మరియు తిరువాయిమొళి నూత్తన్దాది యొక్క వైభవాన్ని సూచిస్తుంది.
అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్
ఆధారం: https://www.youtube.com/live/W4vjhU2FUlo
ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/2023/12/simple-guide-to-dhivyaprabandham-part-10/
కోశం : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org