ఆర్తి ప్రబంధం – 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 39

పాశురము 40:

అవత్తే పొళుదై అడియేన్ కళిత్తు
ఇప్పవత్తే ఇరుక్కుం అదు పణ్బో?
తివత్తే యాన్ శేరుం వగై అరుళాయ్ శీరార్ ఎతిరాశా
పోరుం ఇని ఇవ్వుడంబై ప్పోక్కు

ప్రతి పద్ధార్ధములు:

అడియేన్ – నేను, నిత్య దాసుడను (శ్రీ రామానుజులకు)
అవత్తే కళిత్తు– అలా వృధా చేశాను
పొళుదై – పాద పద్మాల యందు దాసుడిగా గడపాల్సిన ఆ విలువైన కాలము (శ్రీ రామానుజుల).
పణ్బో? – (ఓ శ్రీ రామానుజ!!) మీ హోదాకి గుణాలకి సరి తూగుతుందా?
ఇరుక్కుం అదు – నేను ఉండాలంటే
ఇప్పవత్తే – ఈ సంసారం ఒక శత్రువు (నాకు మీ నిత్య సేవ చేయనీయకుండుట వల్ల).
శీరార్ ఎతిరాశా – ఓ యతిరాజా! శుభ గుణాలతో నిండి ఉన్న
ప్పోక్కు– నాశనము
ఇని ఇవ్వుడంబై – ఈ దేహము మరియు
అరుళాయ్ – దయచేసి ఆశీర్వదించండి
యాన్– నేను
శేరుం వగై – చేరుకోవడానికి  సాధనముగా
అవత్తే – పరమపదము
పోరుం – “సంసారం” అనే ఈ చరసాల నాకు సరిపోతుంది.

సరళ అనువాదము:

మాముణులు చాలా కాల వృధా చేసారని బాధపడుతూ, ఆ సమయము తమ స్వామి అయిన శ్రీ రామానుజులను సేవించగలిగి ఉండేవారని భావిస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో శాశ్వతంగా ఉండాలని అనుకుంటున్న ఈ శరీరాన్ని తాను ఎందుకు ముక్కలుగా నరకలేదో వారు రామానుజులను ప్రశ్నిస్తున్నారు. అలా చేయగలిగితే, తాను ఎప్పటినుంచో ఆరాటపడుతున్న పరమపదానికి వెళ్లగలిగితే, అక్కడ శ్రీ రామానుజులకు నిత్య సేవ చేయగలడు అని తెలుపుతున్నారు.

వివరణ: 

మాముణుల ఇలా అభ్యర్థిస్తున్నారు – “హే శ్రీ రామానుజా! మీకు సేవ చేయడానికే నేను పుట్టాను. అయితే ఇన్ని సంవత్సరాలు, నేను మీకు నిరంతరాయంగా సేవ చేయగలిగిన సువర్ణ సమయాన్ని వృధా చేశాను. నేను ఈ సంసారంలో కూరుకుపోయి ఉన్నాను. ఈ ప్రాపంచిక లోకములో నేను ఎప్పటికీ ఇక్కడే ఉండాలనేది మీ కృపకి సరితూగదు. అందువల్ల, మిమ్ములకు నిరంతరం సేవచేసుకునే అవకాశ భాగ్యము నిత్యము రెట్టింపు అయ్యే ప్రదేశమైన పరమపద మార్గాన్ని నాకు అనుగ్రహించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. “పరమపదం ఎన్నుం తివం” అని వర్ణించబడుతున్న ఆ ప్రదేశానికి వెళ్ళాలని పరితపించి ఉన్నాను. కానీ అలా జరగాలంటే, హే ఎంబెరుమానారే! యతుల నాయకుడా! మంగళ గుణాల సంపూర్ణుడా! ఇక ఈ సంసారంలో నా బసను ముగించమని అభ్యర్థిస్తున్నాను. అజ్ఞానానికి మూలమైన ఈ దేహము, మీకు శాశ్వతమైన సేవకి అవరోధమైన ఈ దేహము, ఈ ప్రపంచంలో ఆత్మతో కలిసి జీవిస్తున్న ఈ నా దేహాన్ని నాశనం చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ సేవ చేయడమే అత్యున్నత లక్ష్యము, దయతో అనుగ్రహించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ”. ఈ పాశురాన్ని మరో రకంగా కూడా పఠిస్తారు, అనగా, “అడియేన్ ఇప్పవత్తే ఇరుకుమదు పణ్బో?” – ఈ ప్రపంచంలో ఉండడం నా గుణ చిహ్నమా అని మాముణులు శ్రీ రామానుజులను ప్రశ్నిస్తున్నారని దీనికి మనము అర్థం చెప్పుకోవచ్చు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-40/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment