శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
తన మనస్సులో పరమపదాన్ని అనుభవించిన ఆళ్వారు తమ దివ్య నేత్రములను తెరిచి, అతను ఇంకా సంసారం లోనే ఉన్నానని గ్రహించి వేదన చెందుతారు. వారు ఇక భరించలేనని అర్థం చేసుకొని, పిరాట్టిని ప్రార్థిస్తూ భగవానుడిని తనకు పరమపదాన్ని ప్రసాదించమని ఆర్తితో వేడుకుంటారు. కానీ ఆళ్వారు కంటే ఎక్కువ విరహ బాధను భగవానుడు అనుభవిస్తూ వెంటనే పిరాట్టితో పాటు గరుడ వాహనాన్ని అధిరోహించి పరమపదము నుండి బయలుదేరారు. ఆళ్వారు ఉన్న చోటికి వచ్చి, స్వయంగా ఆళ్వారుని ఎక్కించుకొని పరమపదానికి తీసుకువెళ్ళాడు. ఆళ్వారు ఆనందంతో “అవావఱ్ఱు వీడు పెఱ్ఱ కురుగూర్ చ్చడకోపన్” అని ప్రకటించి ఈ ప్రబంధాన్ని పూర్తి చేశారు.
మొదటి పాశురము: సౌందర్యము మొదలైన నీ గుణాలను అనుభవించిన తరువాత, నీవు లేకుండా నేను ఉండలేకపోతున్నాను; నీ గుణాలను నాకు అనుభవింపజేస్తూ భరించలేని ఈ సంసారములో నన్నుంచి, నీ నుండి దూరముగా ఇక నన్ను ఉంచకుము”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.
మునియే నాన్ముగనే! ముక్కణ్ఞప్పా! ఎన్ పొల్లా
క్కనివాయ్ తామరై క్కణ్ కరు మాణిక్కమే! ఎన్ కళ్యా!
తనియేన్ ఆరుయిరే ! ఎన్ తలై మిశైయాయ్ వందిట్టు
ఇని నాన్ పోగలొట్టేన్ ఒన్ఱుం మాయం శెయ్యేల్ ఎన్నైయే
సృష్టిపై ధ్యానించే ఓ భగవానుడా! చతుర్ముఖ బ్రహ్మ నీ శరీరంగా ఉన్నవాడా! త్రినేత్రుడు నీ శరీరంగా ఉన్నవాడా! మచ్చలేని నల్లని మణిని పోలి ఉన్న స్వరూపము ఉన్నవాడా! పండిన పండు వంటి అదరములు, ఆకర్షణీయమైన తామర పుష్పముల వంటి నేత్రములు ఉన్నవాడా! మోసం చేసి నన్ను దొంగిలించినవాడా! ఒంటరిగా ఉన్న నాకు, ప్రాణముగా ఉన్నవాడా! నీవు దిగి వచ్చి నీ దివ్య పాదాలను నా శిరస్సుపై మోపావు. ఇప్పుడు, ఇంత జరిగిన తరువాత, ముందులా నన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి నేను అనుమతించను; ఇకపై నీవు కొంచెం కూడా నన్ను యేమార్చలేవు.
రెండవ పాశురము: భగవానుడు తన కోరికను నెరవేర్చకుండా ఉండలేడని ఆళ్వారు పెరియ పిరాట్టిపై ప్రతిజ్ఞ చేస్తారు.
మాయం శెయ్యేల్ ఎన్నై ఉన్ తిరుమార్వత్తు మాలై నంగై
వాశంశెయ్ పూంగుళలాళ్ తిరువాణై నిన్నాణై కండాయ్
నేశంశెయ్దు ఉన్నోడు ఎన్నై ఉయిర్ వేఱిన్ఱి ఒన్ఱాగవే
కూశంశెయ్యాదు కొండాయ్ ఎన్నైక్కూవి క్కొళ్ళాయ్ వందందో
నన్ను ఇంకా యేమార్చ వద్దు; శ్రీమహాలక్ష్మి నీకు సహజ సంపదగా, నీ అత్యుత్తమ స్వభావానికి గుర్తింపుగా ఉన్న ఆ తల్లి, నీ వర్ణానికి భిన్నమైన వర్ణముతో నీ దివ్య వక్షలో మేలిమి బంగారపు దండలా ఉండి, ఆ తల్లి ఉన్న కారణంగా నీ గూణాలు మరింత ప్రకాశాన్ని పొందుతున్నాయి, గొప్ప దివ్య సువాసనలు విరజిమ్మే శిరోజాలు కలిగి ఉన్న ఆ తల్లి యొక్క సంకల్పమే నీ సంకల్పము కావలెను; నన్ను నిరాశపరచకుండా మీ ఇద్దరు మరియు నా మధ్య ఎటువంటి బేధము లేనట్లు స్నేహపూర్వకముగా దయతో నన్ను స్వీకరించారు; ఇక్కడకు దిగి వచ్చి, దయతో నన్ను ఆహ్వానించారు.
మూడవ పాశురము: “గర్వముతో నిండి ఉన్న బ్రహ్మ, ఈశాన తదితరులను నియంత్రించువాడవైన నీవు, వేరే ఏ ఇతర సంరక్షణ లేని నన్ను స్వీకరించాలి”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.
కూవి క్కొళ్ళాయ్ వందందో ఎన్ పొల్లా క్కరుమాణిక్కమే!
ఆవిక్కోర్ పఱ్ఱుక్కొంబు నిన్నలాల్ అఱిగిన్ఱిలేన్ నాన్
మేవి త్తొళుం పిరమన్ శివన్ ఇందిరనాదిక్కెల్లాం
నావి కమల ముదఱ్కిళంగే ఉంబరందదువే
మచ్చలేని విలువైన మణి వంటి శ్రేష్థమైన రూపాముతో, నీకు దాసోహాలు అందజేయు బ్రహ్మ, రుద్ర, ఇంద్ర మొదలగువారికి మూలమైన దివ్య కమలము యొక్క ములమైన దివ్య నాభి ఉన్న నీవు, ప్రకృతికి మూల పురుషునివైన నీవు, నిత్యసూరుల నియామకునివిగా ఉన్న నీవు, నాకు సంపూర్ణ ఆనందదాయకంగా ఉండి అనుభవింపజేస్తున్నావు! నిన్ను మించిన మరొక ఉత్తమమైన నివాసము నా ఆత్మకు మరొకటి లేదు; ఇక్కడకు వచ్చి నన్ను ఆహ్వానించి ఎంతో దయతో నన్ను స్వీకరించండి. అయ్యో! నీకు నేను చెప్పాల్సి వస్తుంది!
నాలుగవ పాశురము: అందరినీ నియంత్రించే నీవు, నా స్థితిని నేను నియంత్రించడం చూచినట్లైతే నన్ను నీవు విడిచి పెట్టినట్లు అవుతుందా?”, అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.
ఉంబరందణ్ పాళేయో! అదనుళ్ మిశైై నీయేయో!
అంబర నఱ్చోది! అదనుళ్ పిరమన్ అరన్ నీ
ఉంబరుం యాదవరుం పడైత్త మునివన్ అవన్ నీ
ఎంబరంజాదిక్కలుఱ్ఱు ఎన్నై ప్పోర విట్టిట్టాయే
నీవు ఆది మూల తత్వాన్ని నియంత్రించి, ఈ సృష్థి క్రీడను రచించు గొప్పతనము మరియు విశిష్టత ఉన్నవాడవు. చేతనులకు నివాసమైన ఆ మూల తత్వము వారికి భోగము మరియు మోక్షాన్ని కలుగజేస్తుంది. ఆ తరువాత క్రమేణా ఆకాశము, అగ్ని మొదలైనవి సృష్టించి వాటిని నీ స్వరూపాలుగా ఉంచుకున్నావు; వాటినుండి అండాకారపు విశ్వాన్ని ఉత్పత్తిచేసి, ఆ విశ్వములో బ్రహ్మ, రుద్ర మొదలైన వారిని సృష్థించి నీ స్వరూపాలుగా ఉంచుకున్నావు; దేవలోక వాసులు, మానవులు మొదలైన అన్ని రకాల జీవుల గురించి ధ్యానము చేసి వారిని సృష్టించావు; తరువాత నా దేహ నియంత్రణ బాధ్యతను స్వీకరించి నీవు నన్ను ఇక్కడ ఉంచావు. ఆళ్వారు యొక్క బాధను సూచిస్తూ “నీ” ఉన్న అన్ని చోట్లా “ఓ” ని జోడించాలి. “నా రక్షణ భారము నీపై ఉన్నప్పటికీ నన్ను నీవు విడిచిపెట్టావు” అని ఆళ్వారు దుఃఖిస్తున్నారు.
ఐదవ పాశురము: “నా స్వంత ప్రయత్నంతో నేను నిన్ను సాధించగలనని భావించి నీవు నన్ను విడిచిపెడితే ఎలా? ‘నేను’, ‘నాది’ అన్నది ఏమైనా ఉందా? నేను పతనమై పోతాను”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.
పోర విట్టిట్టు ఎన్నై నీ పుఱం పోక్కల్ ఉఱ్ఱాల్ పిన్నై యాన్
ఆరై క్కొండెత్తె అందో ఎనదెన్బదెన్? యానెన్బదెన్?
తీర ఇరుంబుండ నీరదు పోల ఎన్నారుయిరై
ఆర ప్పరుగ ఎనక్కు ఆరావముదానాయే
ఇనుము తన వేడిని తగ్గించుకోడానికి నీటిని త్రాగినట్లుగా, నా ఆత్మ యొక్క అలసటను తీర్చి తృప్తిపరచడానికి నీవు తేనెలా మారి వచ్చావు; నన్ను విస్మరించి విడిచిపెట్టి, నీ వెలుపల ఉన్న ఈ ప్రాపంచిక సుఖాలలో నన్ను నిమగ్న పరచాలని నీవు భావిస్తే, ఇక నేను ఏమి సాధిస్తాను? ఎవరితో సాధిస్తాను; అయ్యో! నాది అన్న స్వాతంత్య్రము మరియు నాది అని నేను చెప్పుకోదగినది నా వద్ద ఏమీ లేదు. “ఆరైక్కొండు ఎత్తై“ అనే విరుద్ధమైన పదాలను ప్రయోగించి బాధ పడుతున్నారు. “ఇరుంబుండ నీర్పోల్ ఎన్ ఆత్మావై ముఱ్ఱ పరుగినాన్” – నన్ను సంపూర్ణంగా త్రాగి నీ ఆనందాన్ని వెల్లడి చేశారని ఆళ్వారు చెప్పినట్లుగా సూచిస్తుంది.
ఆరవ పాశురము: “నీ నిష్ఠ పెరియ పిరాట్టిపై ఉన్నట్లు నాపై కూడా చూపి, నాతో పాటు నా దేహము/స్వరూపము పట్ల అనురాగము చూపిస్తూ నన్ను నిర్లక్ష్యం చేయకుండా దయతో త్వరగా నన్ను స్వీకరించాలి”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.
ఎనక్కు ఆరావముదాయ్ ఎనదావియై ఇన్నుయిరై
మనక్కారామై మన్ని ఉండిట్టాయ్ ఇని ఉండొళియాయ్
పున క్కాయా నిఱిత్త పుండరీగ క్కణ్ శెంగనివాయ్
ఉనక్కేఱ్కు కోల మలర్ ప్పావైక్కన్బా ! ఎన్ అన్బేయో
పద్మమును పోలిన దివ్య నేత్రములు, ఎర్రటి దివ్య అదరములు, కాయాంపూ (అల్లి) రంగులో దివ్య స్వరూపముతో ఉన్న నీవు, నీకు సరితూగే స్వరూపముతో పద్మములో నుండి జన్మించిన లక్ష్మికి ప్రియమైనవాడవు; నా ప్రేమకి స్వరూపానివి నీవు! నా దేహాన్ని/రూపాన్ని మరియు నా ఆత్మని నిత్యము అనుభవించావు. అంతటి సంపూర్ణత ఉన్న నిన్ను నా హృదయము ఇంకా ఇంకా అనుభవించాలని ఆశిస్తుంది; ఇకపై, నిన్ను నేను మరింత ఆనందించేందుకు అనుమతించాలి.
ఏడవ పాశురము: “ప్రళయ సముద్రంలో మునిగిపోతున్న శ్రీ భూమి పిరాట్టిని పైకి ఎత్తినట్లు, సాగర మథనము చేసి పెరియ పిరాట్టిని బయటకు తీసుకువచ్చి నీతో ఐక్యము చేసుకున్నట్లే, పెరియ పిరాట్టి సేవకుడనైన నన్ను ఈ సంసారపు మహాసముద్రములో నుండి వెలికి తీసి నీతో ఐక్యము చేసుకున్నావు; నా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపిన నిన్ను పొందిన తరువాత నిన్ను నేను ఎలా వదులుతాను?”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.
కోల మలర్ ప్పావైక్కు అన్బాగియ యెన్ అన్బేయో
నీల వరై ఇరండు పిఱై కవ్వి నిమిర్ందదొప్ప
కోల వరాగం ఒన్ఱాయ్ నిలం కోట్టిడై క్కొండ ఎందాయ్!
నీల క్కడల్ కడైందాయ్! ఉన్నై ప్పెఱ్ఱు ఇనై ప్పోక్కువనో
ఆనందించ యోగ్యమైనది, ముగ్ధమనోహరమైన పిరాట్టి పట్ల నీకున్న ప్రేమ వల్ల నీవు నా పట్ల కూడా గొప్ప ప్రేమతో ఉన్నావు. మహావరాహ రూపములో, నీల పర్వతము రెండు అర్ధచంద్రాకార చంద్రులను పట్టుకొని పైకి ఎత్తుతున్నట్లు, భూమిని నీ రెండు కోరలతోపైకి ఎత్తిన సౌందర్య స్వరూపుడిగా అవతరించిన ఓ భగవానుడా! నీ భక్తుల రక్షణ కోసము నీలి మహాసముద్రాన్ని చిలికి పరిశ్రమించిన ఓ భగవానుడా! నిన్ను సాధించిన తరువాత, నిన్ను పూర్తిగా నా చేతిలో పెట్టుకున్న తరువాత, నిన్ను ఎలా వదులుతాను? “నీలక్ కడల్” అంటే నీలిరంగులో ఉన్న విలువైన మణులతో నిండి ఉన్న సముద్రం అని అర్ధము.
ఎనిమిదవ పాశురము: “గ్రహణకి అందని నిన్ను పొందిన తర్వాత విడిచే ప్రసక్తేలేదు”, అని ఆళ్వారు తెలుపుతున్నారు.
పెఱ్ఱిని ప్పోక్కువనో? ఉన్నై ఎన్ తని ప్పేరుయిరై
ఉఱ్ఱ ఇరువినైయాయ్ ఉయిరాయ్ పయనాయ అవైయాయ్
ముఱ్ఱ ఇమ్మూవులగుం పెరుంతూఱూయ్ త్తూఱ్ఱిల్ పుక్కు
ముఱ్ఱ క్కరందొళిత్తాయ్ ! ఎన్ ముదల్ తని విత్తేయో!
పాప పుణ్యములనే రెండు రకాల కర్మలను నియంత్రించేవాడవు నీవు; ఆత్మని నియంత్రించేవాడవు నీవు; సుఖ దుఃఖాలకు దారితీసే కర్మల పోషకుడవు నీవు; ఈ ముల్లోకాల మూల తత్వములు మహా పొదలా ‘ప్రకారం’ రూపముగా ఉన్న వాడవు నీవు; నీవు ఆ మహా పొదలో ప్రవేశించి ఎవ్వరూ గమనించని విధముగా దాగి ఉన్నావు; నీ దివ్య సంకల్పమే నాకు ఉత్తమ ధర్మము, నిన్ను సాధించిన తరువాత, విరహ వేదనని సహించలేని స్థితికి చేరుకున్న తరువాత, నిన్ను విడిచే ప్రసక్తి ఉందా? “ఓ” అన్న శబ్దానికి విరహ బాధ అని అర్థము చెప్పుకోవచ్చు.
తొమ్మిదవ పాశురము: “సమస్థ విశ్వము నా స్వరూపంగా ఉన్న నన్ను చూసిన తరువాత, ఇక ఏమి కోరుకోవాలనుకుంటున్నావు?” అని భగవానుడు అడుగగా, “ఇంతటితో నేను తృప్తి చెందలేను; శ్రేష్టమైనది మరియు సంపూర్ణమైనది అయిన తిరునాడు (పరమపదము)లో ఉండగా నిన్ను చూడాలనుకుంటున్నాను”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.
ముదల్ తని విత్తేయో! ముళు మూవులగాదిక్కెల్లాం
ముదల్ తని ఉన్నై ఉన్నై ఎనై నాళ్ వందు కూడువన్ నాన్
ముదల్ తని అంగుం ఇంగుం ముళు ముఱ్ఱుఱు వళ్ పాళాయ్
ముదల్ తని శూళ్ందగన్ఱాళ్ందుయర్ంద ముడివిలీయో!
ముల్లోకాలు మొదలైనవాటికి సర్వకారకుడవైన ఓ భగవానుడా! భౌతిక కారణ హేతువుగా, అండాకారంలో ఉన్న ఈ విశ్వము లోపల మరియు వెలుపల ఉన్న అన్ని తత్వాలలో సంపూర్ణముగా వ్యాపించి ఉన్న ఓ భగవానుడా! సకల శ్రేయస్సు సంపదకై సారవంతమైన పంటలు పండేలా ములా ప్రకృతిని నియంత్రించువాడా! అణువణువునా దశ దిక్కులలో వ్యాపించి అన్నింటినీ అసమానమైన రీతిలో నియంత్రించువాడా! నేను ఎప్పుడు అక్కడకు చేరుకుంటానో? అన్ని కోణాలలో సాటిలేని అసామాన్యుడవైన నీతో ఎప్పుడు ఐక్యమౌతానో?
పదవ పాశురము: భగవానుడు తన కోరికను నెరవేర్చకుండా తృప్తిగా ఉండవద్దని పెరియ పిరాట్టిపై ఆన చేశారు ఆళ్వారు; ఆళ్వారు ప్రార్థనను మన్నించి భగవానుడు వచ్చి ఎంతో దయతో ఆళ్వారుతో ఐక్యమైనాడు; అది చూసి ఆళ్వారు “అపరిమితమైన ప్రకృతి, ఆత్మలు మరియు జ్ఞాన రూపములో ఉన్న నీ సంకల్పము కంటే గొప్పదైన నా కోరికను తీర్చడానికి వచ్చి నాతో ఐక్యమయ్యారు” అని ఆళ్వారు చెబుతూ, “నా కోరిక ఇప్పుడు నెరవేరింది”, అని ఆళ్వారు సంతృప్తి చెందుతున్నారు.
శూళ్ందగన్ఱళ్ందుయర్ంద ముడివిల్ పెరుం పాళేయో
శూళ్ందదనిల్ పెరియ పర నన్మలర్ చ్చోదీయో
శూళ్ందదనిల్ పెరియ శుడర్ జ్ఞాన ఇన్బమేయో
శూళ్ందదనిల్ పెరియ ఎన ఆవాఱ చ్చూళ్ందాయే
ఓ భగవానుడా! అపరిమితమైన నీ ప్రకృతి, ఈ క్రింది లోకాలలో మరియు ఆ పై లోకాలలో అన్ని దిశలలో విస్తరించి, ‘ప్రకార’ రూపములో భోగమునకు మరియు మొక్షమునకు క్రీడ స్థలముగా నీ యందు ఉన్నది! ప్రకృతి కంటే గొప్పదైనది, ఉన్నతమైనది, స్వయం ప్రకాశాత్వము వంటి గుణము, జ్ఞానముతో నిండి ఉన్న లెక్కించలేని ఆత్మలు నీ యందు ఉన్న ఓ భగవానుడా! సమస్థ తత్వములు మరియు ఆత్మలలో వ్యాపించి, జ్ఞానము మరియు ఆనందములతో గుర్తించే మంగళ గుణములు ఉన్న ఓ సర్వజ్ఞుడా! ఈ మూడు తత్వములతో చుట్టు ముట్టబడిన నా అగాఢ ప్రేమను సంతృప్తి పరచడానికి నీ అసలు స్వరూపము, గుణాలు, స్వభావము, ఆభరణాలు, ఆయుధాలు, దివ్య పత్నులు, సేవకులు మరియు నివాసములతో నీలో సంపూర్ణముగా మరియు పరమానందంగా స్థిరమైపోయే సాయుజ్య భోగాన్ని నాకు ప్రసాదించావు. ప్రతి పంక్తిలో “ఓ” అని చెప్పడంలో, “ఓహ్! ఎంత అద్భుతంగా ఉంది!” అని ఆళ్వారు తన ఆనందాన్ని వ్యక్తపరచుచున్నారు.
పదకొండవ పాశురము: భగవానుడిని తాను సాధించిన విధానాన్ని నొక్కి చూపిస్తూ, ఆళ్వారు ఈ తిరువాయ్మొళి గొప్పతనాన్ని, ఈ పదిగము యొక్క పరిజ్ఞానం ఉన్నవారి పుట్టుక యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు.
అవావఱచ్చూళ్ అరియై అయనై అరనై అలఱ్ఱి
అవావఱ్ఱు వీడు పెఱ్ఱ కురుగూర్ చ్చడగోబన్ శొన్న
అవావిల్ అందాదిగళాల్ ఇవైయాయిరముం ముడింద
అవావిల్ అందాది ఇప్పత్తఱిందార్ పిఱందార్ ఉయర్ందే
ఆళ్వార్తిరునగరికి చెందిన నమ్మాళ్వార్లు తన అగాధ ప్రేమ, భక్తులను ఆర్తితో అందించి, బ్రహ్మ రుద్రుల అంతరాత్మ అయిన ఆ హరితో శాశ్వత ఐక్యతను పొందారు; వారి కోరిక నెరవేరి ముక్తి పొందారు; వారు కృపతో ఈ వెయ్యి పాశురములను అందాది రూపంలో పాడారు; ఆ వెయ్యి పాశురములలో, తన కోరిక నెరవేరబడాలని ఈ పదిగాన్ని ధ్యానం చేసిన వారు, గొప్ప జన్మ పొందినవారౌతారు. “అవావఱచ్చూళ్ అరి” – “తన గుణాలతో తన భక్తులను వశము చేసుకొని వారిని స్వీకరించి, వాళ్ళ కోరికను నెరవేర్చువాడు” అని వివరించబడింది.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-10-10-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org