శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
పరిచయము:
మణవాళ మామునులు ఈ పాశురములో శ్రీ రామానుజుల యొక్క దిగ్విజయాలను, పరమపద మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను నాశనం చేసే బాధ్యతను వహించే శ్రీ రామానుజులను కీర్తిస్తున్నారు. శ్రీ రామానుజులు తన ప్రత్యర్థులను, వేద విరుద్దులను, వేదములలో చెప్పబడిన వాటిని వక్రీకరించిన వారిని ఎలా ఓడించారో మణవాళ మామునులు వివరిస్తున్నారు. శ్రీభాష్యము మొదలైన వంటి గ్రంధ సారముని ఉపయోగించి వారిని ఓడించారు. మణవాళ మామునులు శ్రీ రామానుజుల యొక్క విజయాలను ప్రశంసిస్తూ వారికి మంగళములు పాడుతున్నారు.
పాశురము 29
శారువాగ మదం నీఱు శెయ్దు శమణచ్చెడిక్కనల్ కొళుత్తియే
శాక్కియ క్కడలై వఱ్ఱవిత్తు మిగుశాంగియక్కిరి ముఱిత్తిడ
మాఱుశెయ్దిడుగణాద వాదియర్గళ్ వాయ్దగర్ త్తఱమిగుత్తుమేల్
వందు పాశుబదర్ శిందియోడుం వగైవాదుశెయ్ద ఎదిరాశనార్
కూఱుమాగురు మదత్తొడోంగియ కుమారిలన్మదం అవఱ్ఱిన్ మేల్
కొడియ తర్ క్కశరమ్విట్టపిన్ కుఱుగియమాయవాదియరై వెన్ఱిడ
మీఱివాదిల్వరు పాఱ్కరన్మద విలక్కడి క్కొడి ఎఱిందు పోయ్
మిక్కయాదవమదత్తై మాయ్ త్త పెరువీరర్ నాళుం మిగ వాళియే (29)
ప్రతి పద్ధార్ధములు
శారువాగ మదం నీఱు శెయ్దు – (శ్రీ రామానుజులు) “ప్రత్యక్షమేకం చార్వాకః” అని పిలువబడే “చారువాకం” అనగా కళ్ళ ముందు కనిపించేది మాత్రమే నిజమని నమ్ము సిద్దాంతాన్ని కాల్చి బూడిద చేశారు.
శమణచ్చెడిక్కనల్ కొళుత్తియే – “సమణం” అని పిలుబడే కలుపుమొక్క లాంటి జైన మతాన్ని శ్రీ రామానుజ కాల్చివేస్తారు.
శాక్కియ క్కడలై వఱ్ఱవిత్తు – (శ్రీ రామానుజులు) తమ తేజస్సుతో “సాక్కియం” (బౌద్ధ) మతమనే సాగరాన్ని జలము లేకుండా ఖాళీ చేస్తారు.
మిగుశాంగియక్కిరి ముఱిత్తిడ– (శ్రీ రామానుజులు) ప్రబలమైన “సాంఖ్యం” అనే మతాన్ని నాశనం చేశారు (విశాల పర్వతము వంటి)
తగర్ త్తు – (శ్రీ రామానుజులు) వారి వాదనలను ఉపయోగించి
వాయ్ – వాదనలను ముందు పెట్టడం
మాఱుశెయ్దిడుగణాద వాదియర్గళ్ – “ప్రతి వాదన” “కాణద వాదిగళ్” అనే ఒక సమూహము.
అఱమిగుత్తుమేల్ వందు – ఒక దాని తరువాత ఒకటి కొట్టుకుంటూ
పాశుబదర్ శిందియోడుం వగై – తన కుటుంబ సమేతంగా రుద్రుడిని ప్రాణాలను దక్కీంచుకొనుటకు ఎలా పరిగెత్తించారో అలాగ, శివ భక్తులు కూడా పరిగెత్తవలసి వచ్చింది.
వాదుశెయ్ద ఎదిరాశనార్ – వారి వాదనలను ఉపయోగించి యతిరాజులు
కొడియ తర్క చరం విట్టపిన్ అవఱ్ఱిన్ మేల్ – (శ్రీ రామానుజులు) “తర్క” అనే బాణాలతో దాడి చేశారు. (వాదనలను జయించే ఒక కళ)
కూఱుం – అర్థంలేని వాదన
మా – బలముగల (వ్యక్తుల సంఖ్య పరంగా)
గురు మదత్తోడు– “ప్రభాకర మతం” అని పిలువబడే ఒక మతం
కుమారిలన్మదం – “భట్ట మతం” అని పిలువబడే ఒక మతం.
కుఱుగియమాయవాదియరై వెన్ఱిడ – (శ్రీ రామానుజు) “మాయావాద” సిద్దాంతస్తులు నివసించే చోటికి వెళ్లి దారిలో వచ్చిన ప్రతి ఒక్కరి వదనలను జయించారు.
పాఱ్కరన్మద విలక్కడి క్కొడి ఎఱిందు పోయ్ – (శ్రీ రామానుజ) “భాస్కర” మతస్తుల వాదలను పెలికి పారేసి ముందుకి సాగిపోయారు.
మీఱివాదిల్వరుం – ఈ “భాస్కర” మతస్తులు శ్రీ రామానుజను జయించాలని గర్వంతో వచ్చారు.
మిక్కయాదవమదత్తై మాయ్ త్త – (భాస్కర సిద్దాంతాన్ని జయించి, శ్రీ రామానుజ) అధిక సంఖ్యలో అనుచరులున్న “యాదవప్రకాశ” మతాన్ని పూర్తిగా నాశనం చేశారు
నాళుం మిగ వాళియే!!! – దీర్ఘకాలం జీవించండి
పెరువీరర్ – అసమానమైన శౌర్యము కలిగిన ఎంబెరుమానార్
సరళ అనువాదము:
ఈ పాసురములో శ్రీ రామానుజులు సాధించిన దిగ్విజయాలను మణవాళ మామునులు కీర్తిస్తున్నారు. ప్రత్యేకంగా వారి కాలములో ప్రబలమైన/ ప్రసిద్ధమైన కొన్ని తత్వాల జాబితా ఇక్కడ ఇస్తున్నారు. “చారువాక”, “సమణం”, “సాఖ్యం”, “సాంఖ్యం”, “కాణావాధి”, “పాసుపత”, “ప్రభాకర”, “బట్ట”, “మాయావాద”, “యాదవ” మొదలైన తత్వ శాస్త్రములపై శ్రీ రామానుజులు సాధించిన విజయాలను మణవాళ మామునులు కీర్తిస్తున్నారు. శ్రీ రామానుజుల విజయములు ప్రతిదినం వృద్ధి పొందాలని వారికి మంగళం పాడుతూ మణవాళ మామునులు పూర్తిచేస్తున్నారు.
వివరణ:
“చారువాక మతం” అని పిలువబడేది ఒక తత్వశాస్త్రం, దీని ప్రాథమిక సిద్ధాంతం “ప్రత్యక్షమేవ చార్వాకః” (చార్వాకులు కంటికి కనిపించే వాటిని మాత్రమే అంగీకరిస్తాడు), శ్రీ రామానుజులు తన దహింపజేసే వాదనా కిరణాలతో ఆ సిద్దాంతాన్ని బూడిదలో కాలిపి వేస్తారు. శ్రీ రామానుజులు “సమణం” (జైన మతం) అని పిలువబడే సిద్దాంతాన్ని కాల్చి దగ్దం చేసి వేస్తారు. వారి దహింపజేసే వాదనా కిరణాలతో “సాఖ్య మతం” అని పిలువబడే సముద్రాన్ని నీటి బొట్టు కూడా లేకుండా బంజరు భూమిగా మార్చి వేస్తారు. పెద్ద స్థాయిలో వ్యాపించి ఉన్న “సాంఖ్య మతం” పేరుతో ఒక తత్వశాస్త్రము ఉండేది. పెద్ద స్థాయిలో వ్యాపించి ఉన్నందున దాన్ని ఒక మహా పర్వతంతో పోల్చేవారు. అయినప్పటికీ, శ్రీ రామానుజులు వజ్రాయుధము లాంటి తమ వాదనలతో ఆ పర్వతాన్ని సర్వనాశనం చేస్తారు. ప్రతివాదనలకు పేరుగాంచిన “కాణాద్వాదిగళ్” అని పిలువబడే ఒక సమూహం ఉండేది. శ్రీ రామానుజులు తమ వాదనలతో వాళ్ళ ప్రతి వాదనలను దగ్దం చేస్తారు.
“పాసుపతులు” అనే పేరుతో పిలువబడే మరొక సమూహం ఉండేది. ఈ బృందానికి చెందిన చాలా మంది శ్రీ రామానుజులపై వాదించి గెలవాలనే ఉద్దేశ్యముతో పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అయినప్పటికీ, శ్రీ రామానుజులు తమ తర్క వితర్క వాదనలతో వారిని చెల్లాచెదరు చేస్తారు. బాణాసుర యుద్ధంలో రుద్రుడిని కుటుంబ సమేతంగా శ్రీ కృష్ణుడు ఎలా చెల్లాచెదరు చేసి పరిగెత్తించారో అలాగ. “ప్రభాకర సిద్ధాంతం” మరియు “భట్ట సిద్ధాంతం” ల వైపు శ్రీ రామానుజులు శక్తివంతమైన బాణాలను గురి పెట్టి వాళ్ళను పతనం చేస్తారు. ఇలా చేసిన తరువాత, మాయావాద శాస్త్రాన్ని అనుసరించే వారి నివాస ప్రదేశాలకు అతను వెళతారు. అప్పట్లో వాళ్ళ ప్రభావం దూర దూరం వరకు వ్యాపించి ఉండేది. శ్రీ రామానుజులు తమ వాదనలను ప్రయోగించి వారిని ఓడిస్తారు, “వాదిల్ వెన్ఱాన్ నమ్మిరామానుసన్ (ఇరామానుశ నూఱ్ఱందాది 58)” అన్న వాఖ్యములో కీర్తించబడింది. “భాస్కర సిద్ధాంతం” వాళ్ళు శ్రీ రామానుజుల ముందు వాద్వివాదమునకు దిగినప్పటికీ, శ్రీ రామానుజులు వారిని ఓడించడమే కాక, వారు వేసిన బాటలో ఎవ్వరూ నడవకుండా చేస్తారు. “యాదవ సిద్ధాంతం” అనుచరులు పెద్ద సంఖ్యలో శ్రీ రామానుజులను ఓడించాలనే లక్ష్యంతో జట్టుగా కలిసి వస్తారు. శ్రీ రామానుజులు వారి సిద్ధాంతము కూడా జాడ లేకుండా చేస్తారు.
ఈ తత్వాలను ఖండించి ఓడించిన శ్రీ రామానుజుల విజయాలు దినదినము పెరగాలని మణవాళ మామునులు కోరుతున్నరు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/10/arththi-prabandham-29/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org