ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 70 – 72

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 70

విడవ వలసిన ప్రతికూరులతో కలిసి ఉండుట వలన కలుగు దుష్పరిణామములను ఉదాహరణ పూర్వకముగా కృపచేయుచున్నారు.

తీయగన్ద ముళ్ళ దొన్ఱై చ్చేరిన్దిరుప్ప దొన్ఱుక్కు! త్తీయగన్దమేఱుమ్ తిఱమదపోల్ * తీయ గుణముడై యోర్ తజ్ఞ్గళుడన్ కూడి యిరుప్పార్కు! గుణమదవేయామ్ శెఱివు కొణ్డు!!

దుర్గన్ధము కలిగియున్న వస్తువుతో మరియొక వస్తువు చేరినచో ఆ వస్తువునకు కూడా ఆ దుర్గన్ధము ఎట్లా వచ్చునో అదే విధముగా దుర్గుణములు ఉన్నవాడితో సాంగత్యము చేసిన వారికీ ఆ దుర్గుణములు వచ్చి చేరును.

భగవత్ భాగవత ఆచార్య భక్తిలేని వారితో మనము చేరినచో మనలోని భగవత్ భాగవత ఆచార్య భక్తి సన్నగిల్లును. భగవత్ భాగవత ఆచార్య విషయములో అపచారపడు వారితో చేరినచో మనమూ ఆ విషయములో అపచారపడడం ఆరంభిస్తాము. అది సహజము! దీనిని అర్థము చేసుకొని అటువంటి వారితో చేరక ఉండుటయే ఆత్మకు ఉచితము. ఇదే మన పూర్వాచార్యులు చూపిన మార్గము.

పాశురము 71

క్రిందట చెప్పిన పాశురములను చక్కగా పరశీలించినచో అనుకూలురు మఱియు ప్రతీకూలురు చేయు ఉపదేశములు ఎలా ఉంటాయో అనుగ్రహించుచున్నారు.

మున్నోర్ మొళి న్ద ముఱై తప్పామల్ కేట్టు! పిన్నోర్ న్దుమ్ తామ్ అదనై ప్పేశాదే! తన్నెఞ్జిల్ తోత్తినదే శొల్లి ఇదు శుద్దవుపదేశ వరవాత్త దెన్బర్ * మూర్ఖారావార్!!

పెద్దలైన శ్రీ మన్నాధమునులు మొదలు పూర్వాచార్యుల ఉపదేశ క్రమము ఆశ్రయించి, విని ఆ అర్థములను చక్కగా పరిశీలించి చూసి తామూ క్రమములో ఉపదేశము చేయకుండా, వారి మనస్సునకు తోచిన అర్థమును మరొకరికి ఉపదేశించి, దాని కంటే తాను చెప్పన అర్థమే సత్సంప్రదాయ పరంపరలోని అర్థములని, అబద్దము చెప్పు వారు మూర్ఖులు.

మూర్ఖులనగా తెలివిలేని వారని అర్థము. మన ఆచార్యులు పరంపరగా సత్సంప్రదాయ అర్థములను చెప్పినవే ఏక కంఠముతో చెప్పి కృప చేసినారు. ఆ ఉన్నతమైన శ్రీసూక్తులను తెలుసుకొనక వారి యొక్క బుద్దికి పుట్టిన అర్థమును కల్పించువారు ఆచార్య భక్తి, శాస్త్ర జ్ఞానము, సత్సంప్రదాయ జ్ఞానము లేని తెలివిలేని వారు/మూర్ఖులు.

పాశురము 72

ఉత్తమమైన ఆచార్యులను ఆశ్రయించి ఆత్మ స్వరూపమునకు తగినట్టి కైజ్ఞ్కర్య ప్రాప్తి ఈ లోకములోన పొందండని అందరికీ ఉపదేశీస్తున్నారు.

పూర్వాశారియర్ గళ్! పోదమ్ అనుట్టానజ్ఞ్గళ్! కూరువార్ వార్తైగళై క్కొణ్డు నీర్ తేఱి! ఇరుళ్ తరుమా ఞాలత్తై! ఇన్బముత్తు వాళుమ్! తెరుళ్ తరుమా! దేశిగనై చ్చేర్ న్దు!

సత్ససంప్రదాయమునందే స్థిరమైన నిష్ఠతో ఉన్న ఒక ఆచార్యుని శరణాగతి చేసి/ఆశ్రయించి, శ్రీమన్నాథమునులు మొదలుగా మన పూర్వాచార్యుల జ్ఞానము మరియు అనుష్ఠానమును చక్కగా ఉపదేశమును పొందిన వారి ద్వారా వాటిని నేర్చకొని/తెలుసుకొని వాటియందు పూర్తి నిష్ఠ కలిగి, అజ్ఞానమును జనింపచేసి దానిని వృద్ధి చేయు ఈ సంసారముననే భగవత్ భాగవత ఆచార్య కైజ్ఞ్కర్యములు చేయ నిశ్చయముతో జీవించండి.

ఈ సంసారము మనకు అజ్ఞానమును పుట్టించి దానిని బాగా వృద్ధి చేయు స్థలము. ఉత్తమమైన ఆచార్యుని ఆశ్రయించి ఆ ఆచార్యుని యంనే ఉపదేశములను పొంది ఆచార్యునకు అనుకూలురుగా ఉండి, ఇక్కడ ఉండు కాలముననే తిరుమాల్ అడియార్/భగవత్ దాసులను పూజించి ఉజ్జీవిద్దాము.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-70-72-simple/

పొందుపరిచిన స్థానము : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment