శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 67
మీరు ఆచార్యులే సర్వస్వమని తలచి ఉండమనగా మరికొంతమంది ఎంబెరుమానే సర్వస్వమని తలచి ఉండమని చెప్పుచున్నారే? దీనిలో ఏది సత్యం అని తన మనస్సు అడిగినట్లుగా భావించి దానికి వివరణము అనుగ్రహించుచున్నారు.
ఆచారియర్ అనైవరుమ్ మున్నాశరిత్త! ఆచారన్దన్నై అఱియాదార్* పేశుగిన్ఱ వార్తైగళై క్కేట్టు మరుళాదే* పూరువర్గళ్ శీర్త నిలై దన్నై నెజ్ఞే శేర్!!
ఓ మనసా! మన పూర్వాచార్యులు అనగా మధురకవులు, శ్రీమన్నాధమునులు మొదలుగా ఆచార్యులందరూ ఆచార్య భక్తియందే మునిగిపోయినారు. అటువంటి వారి ఆచారమును, నడవడికలను తెలుసుకొననివారు చేయు ఉపదేశములను వినవద్దు. మన పూర్వాచార్యులు పొందిన ఉత్కృష్ట/ఉన్నతమైన స్థితిని నీవూ పొందుమా!
ఎంబెరుమానును ఆశ్రయించి ఉండుట అనునది మొదటి స్థితి. ఆచార్యుని ఆశ్రయించు ఉండుట అనునది ఎల్లలేని స్థితి. మన పూర్వాచార్యులు ఆ ఎల్లలేని స్థితియందు ఉండుటకు ఇష్టపడి అనుష్ఠించినారు.
పాశురము 68
ఎవరిని అనుసరించ వచ్చును ఎవరిని అనుసరించకూడదు అను విషయమును అనుగ్రహించుచున్నారు.
నాత్తికరుమ్ నఱ్కలైయిన్ నన్నెఱిశేర్ ఆత్తికరుమ్! ఆత్తికనాత్తి కరుమ్ ఆమివరై* ఓర్తు నెజ్ఞే! మున్నవరుమ్ పిన్నవరుమ్ ముర్కరెన విట్టు* నడు చొన్న వరై నాళుమ్ తొడర్!!
ఓ మనసా!
శాస్త్రములను ఒప్పుకొనని నాస్తికులను, మహోన్నతమైన వేదశాస్త్రములలో చూపిన కట్టుబాట్లయందుగల మంచి విషయములను ఒప్పకొని దాని ననుసరించి నడుచుకొను ఆస్తికులు, శాస్త్రములను పైపైన తెలుసుకొని దానియందు విశ్వాసము లేకుండా ఆ విషయముల ప్రకారము నడుచుకొనక ఉండు ఆస్తికనాస్తికులు అని (3) మూడు రకములుగా ఉంటారు. జనులు బాగుగా పరిశీలించి చూసి మొదటగా చెప్పిన నాస్తికులను చివరగా చెప్పిన నాస్తిక ఆస్తికులను మూర్ఖులని వారిని విడిచి మధ్యలో చెప్పబడిన ఆస్తికులనే సర్వదా అనుసరిస్తూ ఉండమని ఉపదేశిస్తున్నారు.
పాశురము 69
అనుకూరులను చేరి ఉండుట వలన కలుగు ప్రయోజనమును ఉదాహరణ పూర్వకముగా అనుగ్రహించుచున్నారు.
నల్ల మణముళ్ళ దొన్ ఱై నణ్ణి యిరుప్పదఱ్కు! నల్ల మణముణ్డామ్ నయమదుపోల్! నల్ల గుణముడై యోర్ తజ్ఞ్గళుడన్ కూడియురిప్పార్కు! గుణం అదువేయామ్ శేర్ త్తి కొణ్డు!!
సువాసన కలిగిన ఒక వస్తువు ప్రక్కన వేరొక వస్తువును ఉంచినచో ఆ సువాసన ఈ వస్తువుకూ కలుగునట్లు సత్వ గుణము కలిగిన వారితో కలిసి ఉండినచో ఆ మంచి గుణములు వీరికీ అబ్బును. మంచి గుణములనగా శేషత్వము, భగవత్ భాగవత ఆచార్య భక్తి. ప్రాపంచిక విషయములలో వైరాగ్యము మొదలగునవి. ఒక ప్రదేశములో నీరు నింపినచో అది నిండిన తర్వాత పొంగి చుట్టూ ఉన్న ప్రదేశములను నింపు విధముగా ఉత్తమమైన గుణములున్న వారితో చేరియుండుటచే ఆ మంచి గుణములు మనలోనూ వచ్చిచేరును. మన సంప్రదాయములోని ఒక ముఖ్య సూత్రము ” ఒక భాగవతుని (భగవత్ భక్తుని) తిరువడిచేరి దాని నీడలోనే జీవించుట” అనునది.
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-67-69-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org