శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 50
ఈ యాబైయవ పాశురములో ఈ విధముగా తిరువాయ్ మొళి ఈడు వ్యాఖ్యాన వైభవమును కృప చేసిన పిదప తిరువాయ్ మొళికి తాత్పర్యమైన శ్రీవచన భూషణ దివ్య వైభవమును కృప చేయదలచి మొదలుగా నంబిళ్ళైకి లోకాచార్యులనే విశేష తిరునామము కలిగిన చరిత్రను వివరించుచున్నారు. శ్రీవచన భూషణమును కృప చేసిన పిళ్ళై లోకాచార్యులు నంబిళ్ళై యొక్క తిరునామమైన లోకాచార్యులనే తిరునామమును పొందిన చరిత్రను వివరించుచున్నారు. “నమ్” అని సంభోధింప బడిన కొద్ది మంది విశేష్ట వ్యక్తులను పొగుడుమా అని తన మనస్సునకు తెలుపుచున్నారు.
నమ్బెరుమాళ్ నమ్మాళ్వార్ నఞ్జీయర్ నమ్బిళ్ళె
యెన్బర్ అవరవర్ దమ్ ఏత్తత్తాల్ అన్బుడయోర్
శాత్తు తిరునామజ్ఞ్గళ్ తానేన్ఱు నన్నేఞ్జే।
ఏత్తదనైచ్చొల్లి నీ యిన్ఱు॥
ఓ మనసా! నంబెరుమాళ్, నమ్మాళ్వార్, నఞ్జీయర్, నంబిళ్ళై అనే కొద్దిమంది విశేషమైన తిరునామముతో సంభోధింపబడినారు. దీనికి కారణము వీరికి ఉన్న విశేష కీర్తి వలన వీరిని ఆ విధముగా అభిమానముతో సంబోధిస్తారు. ఆ దివ్య నామము చెప్పి నీవు వీరిని కీర్తింపుమా!
అళగియ మణవాళన్ (శ్రీరంగనాథుడు) శ్రీరంగము నుంచి కొంత కాలము వెలుపల ఉన్న తర్వాత తిరువరంగమునకు తిరిగి వచ్చిన పిదప స్వామికి తిరుమంజనము జరుపగా ఒక వయోవృద్దుడైన వైష్ణవ చాకలి నంబెరుమాళ్ యొక్క తడి వస్త్ర తీర్థమును స్వీకరించి “వీరే మన పెరుమాళ్” అని ప్రేమతో సంబోధించుట చేత ఆపేరే శ్రీరంగనాథునికి స్థిరపడి పోయినది. నంబెరుమాళ్ ఆళ్వార్ ను “నమ్ ఆళ్వార్ శఠకోపన్” అని సంభోధించుట చేత ఆళ్వారునకు నమ్మాళ్వార్ అనే పేరు నిలిచి పోయినది.
తిరునారాయణ పురములో సన్యాస ఆశ్రమమును స్వీకరించి శ్రీరంగమునకు వచ్చిన వేదాంతిని పరాశర భట్టర్ “రండి నఞ్జీయర్” అని అభిమానముతో సంబోధింపగా వారు నఞ్జీయర్ గానే లోక ప్రసిద్ధులైరి. నఞ్జీయర్ కృప చేసిన ఒన్బది నాయిరప్పడిని నంబూర్ వరదర్ స్వదస్తూరితో ఒక అందమైన గ్రంథముగా వ్రాయుట చూసి “నంపిళ్ళై” అని నఞ్జీయర్ పిలువగా వారికి నంపిళ్ళై అను తిరునామము నిలిచిపోయినది.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-50-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org