ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 46 – 47

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 46

ఈ నలబైయారవ పాశురములో వేదములకు ఉన్నవిధముగా తిరువాయ్ మొళికి కూడా అంగములు మఱియు ఉపాంగములుగా మిగిలిన ప్రబంధములుగా గుర్తించి వాటికి వ్యాఖ్యానములు కృపచేసిన మహనీయులను కీర్తిచవలననెడి గొప్ప ఉద్ధేశ్యముతో మొదటగా పెరియవాచ్ఛాన్ పిళ్ళై చేసిన మహోపకార వైభవమును మామునులు తెలుపుచున్నారు.

పెరియవాచ్ఛాన్బిళ్ళైే పిన్బుళ్ళవైక్కుమ్।
తెరియ వియాక్కియైగళ్ శెయ్ వాల్ అరియ
అరుళిచ్చెయల్పొరుళై ఆరియర్ గట్కు ఇప్పోదు।
అరళిచ్చెయల్ ఆయ్ త్తరిన్దు॥

నంబిళ్ళై ప్రియ శిష్యులు వ్యాఖ్యాన చక్రవర్తి బిరుదాంకితులుగా కీర్తింపబడే పెరియవాచ్ఛాన్ పిళ్ళై మిగిలిన మూడువేల పాశురములన్నింటికీ అర్థములను సమగ్రముగా తెలుసుకొను విధముగా వ్యాఖ్యానములను అనుగ్రహించినందుకు, సంపూర్ణ అర్థములను తెలుసుకొను వ్యాఖ్యానముల (అరుళిచ్చెయల్) వలన వీరి తదనంతర ఆచార్యులు ఇవే కదా ఆళ్వార్ల అరుళిచ్చెయల్ అని బాగుగా తెలుసుకొనగలిగిరి. వీరు ఆళ్వార్ల అరుళిచ్చెయల్ అర్థవిశేషములను పరిపూర్ణముగా తమ ఆచార్యుల వద్ద వాటిని ఆసాంతం అనుభవించు క్రమము మిగిలిన వారికి ఉపదేశపూర్వ రూపముగా చూపిన వైశిష్ట్యమును మామునులు కీర్తస్తున్నారు.

పాశురము 47

నలబై ఏడవ పాశురము. ఈ నలబై ఏడవ పాశురములో నఞ్జీయర్ మొదలైన కొంత మంది ఆచార్యులు అనుగ్రహంచిన వ్యాఖ్యాన విశేషములను కృప చేయుచున్నారు.

నఞ్జీయర్ శెయ్ ద వియాక్కియైగళ్ నాలిరణ్డుక్కు।
ఎఞ్జామై యావైక్కుం ఇల్లైయే తమ్ శీరాల్
వైయగురువిన్ తమ్బి మన్ను మణవాళముని।
శెయ్యుమవై తాముమ్ శిల॥

భట్టర్ శిష్యులు వేదాంతిగా పిలువబడే నఞ్జీయర్ కొన్ని ప్రబంధములకు వ్యాఖ్యానములు కృపచేసినప్పటికీ పెరియ వాచ్ఛాన్ పిళ్ళై మాదిరిగా అన్ని ప్రబంధములకు కృప చేయలేదు. (ఆ విధముగా కృప చేసియుండినచో ఎంత బాగుండి ఉండేదో కదా!) పిళ్ళైలోకాచార్యుల తిరుతమ్బి ఉత్తములైన మణవాళ పెరుమాళ్ నాయనార్ కృప చేసిన వాటి యందు అనేక శాస్త్రములలో ఉన్నటు వంటి విశేష జ్ఞానము చేత కొన్ని ప్రబంధములకు అద్భుతమైన వ్యాఖ్యానములు అనుగ్రహించినారు. లబ్ద ప్రతిష్ఠులైన వాది కేసరి అళగియ మణవాళ జీయర్ కూడా కొన్ని వ్యాఖ్యానములు కృపచేసినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-46-47-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment