శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 44
నలబై నాల్గవ పాశురము. తిరువాయ్ మొళికి నమ్బిళ్ళె కృపచేసిన ఉపన్యాసములను సంకలనము చేసి వడక్కుతిరువీధి పిళ్ళై ఈడు ముప్పత్తారాయిరపడి వ్యాఖ్యానముగా రచించిన వైభవమును కృపచేయుచున్నారు.
తెళ్ళియదా నమ్బిళ్ళె శెప్పు నెఱిదన్నై।
వళ్ళల్ వడక్కుతిరువీధి పిళ్ళై ఇన్ద
నాడఱియ మాఱన్మఱై ప్పొరుళై నన్గురైత్తదు।
ఈడు ముప్పత్తాఱాయిరమ్॥
నజ్ఞీయర్ శిష్యులు పరిపూర్ణ జ్ఞానవంతులైన నంబిళ్ళై, నమ్మాళ్వార్ మాఱన్ మొదలుగా మన పూర్వాచార్యులు చూపిన వేద/వేదాంత మార్గములో “ఈ ఉత్క్రష్ట అర్థములను అందరు తెలుసుకొనవలెను” అనే మంచి సంకల్పము కలిగిన వడక్కుతిరువీధి పిళ్ళై ఈ లోకములోనే తెలుసుకొని ఉజ్జీవింపబడే విధముగా కృప చేసిన వ్యాఖ్యానము ఈడు ముప్పతాఱాయిరపడి వ్యాఖ్యానము. ఈడు అనగా అర్థము, వ్యాఖ్యానము, వివరణ, తాత్పర్యము, కవచము, సాటిలేనిది మొదలగు అనేకార్థములు కలవు. ఇది పరిమాణములో శ్రీభాష్యమునకు వ్యాఖ్యానమైన “శృత ప్రకాశిక” కు సమానము. ఈ శృత ప్రకాశిక ఈడు వ్యాఖ్యానము తరువాతి కాలములో వచ్చినప్పటికినీ దీనిని ఆ విధముగా భావిస్తారు.
పాశురము 45
నలబై ఐదవ పాశురము. ఈ పాశురములో వాదికేసరి అళగియ మణవాళ జీయర్ తిరువాయ్ మొళికి అనుగ్రహించిన పన్నీయాయిరప్పడి వ్యాఖ్యాన వైభవ విశేషములను కృపచేయుచున్నారు.
అన్బోడు అళగియ మణవాళ చ్చీయర్।
పిన్బోరుమ్ కత్తఱిన్దు పేశుగైక్కా తమ్ పెరియ
పోదముడన్ మాఱన్మఱై యిన్ పొరుళ్ ఉరైత్తదు।
ఏదమిల్ పన్నీరాయిరమ్॥
నమ్మాళ్వార్ల యందు మఱియు తిరువాయ్ మొళి యందు గల గొప్ప భక్తి చేతను మరియు చేతనుల మీద గల వాత్సల్యముతో పెరియవాచ్ఛాన్ పిళ్ళై కృపకు పాత్రులైన వాదికేసరి అళగియ మణవాళ జీయర్, తమ తదనంతర కాలములో వచ్చు ఆచార్యులు పాశురములలోని అర్థములను సంపూర్ణముగా తెలుసుకొని ఇతరులకు ఉపదేశము చేయుటకు అనుకూలముగా, తమ ఆచార్యుల కృపతో కలిగిన జ్ఞాన విశేషముతో నమ్మాళ్వార్ మాఱన్ కృప చేసిన వ్యాఖ్యానము పన్నీయాయిరప్పడి వ్యాఖ్యానము. ఇది పదముల వరుస క్రమములో అనగా పాశురములలోని విషయములకు వివిధ అర్థ విశేషములతో కూడినది.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-44-45-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org