ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 27 – 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<<గతశీర్షిక

పాశురము 27

ఇక మీదటి మూడు పాశురములలో మామునులు ఆళ్వార్ల తిరునక్షత్రమైన దివ్య ఆరుద్రా నక్షత్రం ఏదైతే ఉందో అదే ఎంబెరుమానార్ (భగవద్రామానుజుల) తిరునక్షత్రము కూడా. వారు లోకోద్దారకులు. ఈ పాశురములో లోకులకు చైత్రమాస అరుద్రా నక్షత్రము యొక్క గొప్పతనమును తెలుపుచున్నారు.

ఇన్ఱులగీర్ శిత్తిరైయిల్ ఏయ్ న్ద తిరువాదిరై నాళ్!
ఎన్ఱై యినుం ఇన్ఱిదనుక్కేత్తమెన్ఱాన్ ఎన్ఱవర్కు
చ్చాత్తుగిన్ఱేన్ కేణ్మిన్ ఎతిరాశర్ దమ్ పిఱప్పాల్!
నాల్ దిశై యుమ్ కొణ్డాడుమ్ నాళ్!!

ఓ భూమండల వాసులారా! ఈ రోజు చైత్ర మాసములోని గొప్పరోజైన ఆరుద్రా నక్షత్రయుక్తమైన రోజు. ఈ రోజుకెందుకంత ప్రాముఖ్యమనుకొను వారికి నేను చెప్పుచున్నాను, వినండీ. యతులకు రారాజుగా భావించే ఎంబెరుమానార్ (భగవద్రామానుజులు)  అవతరించుటచే నాలుగు దిశలందుగల ప్రజలచే కీర్తింపబడే రోజే ఈ రోజు.

మణవాళ మామునులు తమ ఆర్తి ప్రబంధము నందు తామే “అనైత్తులగుం వాళ్ ప్పిరంద ఎతిరాశా మామునివా” అని ఎంబెరుమానారును కీర్తించినారు. ఎంబెరుమానార్ అవతారముతో ప్రపంచములోని వారందరు ఎంబెరుమానార్ మూలముగా ఉజ్జీవింపగలరని నిర్ణయింపబడినది. ఇటువంటి కీర్తిని వీరు కలిగియుండుటచే వీరు అవతరించిన ఈ రోజును ప్రపంచములోని అందరూ కూడా ఇంత గొప్పగా కీర్తిస్తున్నారు.

పాశురము 28

ఈ పాశురములో చైత్ర మాసములో తిరు ఆరుద్రా నక్షత్రము ఆళ్వార్లవతరించిన వారి తిరునక్షత్ర రోజులకంటే కూడా చాలా విశేషమైనదో అందరూ అర్థము చేసుకొను విధముగా కృపచేసినారు.

ఆళ్వార్ గళ్ తాజ్ఞ్గళ్ అవదరిత్త నాళ్ గళిలుమ్
వాళ్ వాన నాళ్ నమక్కు మణ్ణులగీర్ ఏళ్ పారుమ్
ఉయ్య ఎతిరాశరుదిత్తరుళుమ్ శిత్తిరైయిల్
శెయ్య తిరువాదిరై!!

ఓ జనులారా! చైత్రమాస ఆరుద్రా నక్షత్రమునకు ఆళ్వార్ల తిరునక్షత్రముల కంటే చాలా ప్రశస్తమైనది. ఎందుకనగా ఈ రోజుననే సమస్త జీవరాశులను ఉద్ధరించి ఉజ్జీవింప చేయాలనే తలచిన భగవద్రామానుజులు ఈ రోజుననే అవతరించినారు.
ఆళ్వార్లు ఎంపెరుమాన్/పరమాత్మ కృపచేత జ్ఞాన కొఱతలేని సంపత్తిని కలిగినవారు. వారు కరుణతో ప్రబంధములను ప్రజలందరూ తరించుటకై పాశురములుగా కృపచేసినారు. ఎంబెరుమానార్ ఆళ్వార్ల ఆ ప్రబంధముల ఆధారముగా యావత్ ప్రజలు ఉజ్జీవించే విధముగా విశిష్టాద్వైత సిధ్ధాంతమును స్థాపించినారు. అముదనార్, ఎంబెరుమానార్ శిష్యులలో ప్రముఖులు, తమ ఇరామానుశ నూత్తంతాది గ్రంథములో “ఉలగోర్ గళ్ ఎల్లాం అణ్ణల్ ఇరామానుశన్ వన్దుతోన్ఱియ అప్పొழுదే నణ్ణరు జ్ఞానమ్ తలైకొణ్డు నారణర్కాయినరే” అని కృప చేసినారు. దానికి వ్యాఖ్యానము కృప చేసిన మామునులు భగవద్రామానుజుల అవతరానంతరము అందరూ జ్ఞాన వృద్ధి కలవారై శ్రీమన్నారాయణుని ఆశ్రయించదలచారని అక్కడ మరియు ఇక్కడ కూడా అదే అభిప్రాయమును తెలిపినారు. ఇంకా ఆదిశేషావతారమైన ఎంబెరుమానార్ అవతరించి శ్రీభాష్యము మొదలగు అనేకానేక గ్రంథముల రచన మరియు ఉపదేశముల ద్వారా ఆ కాలములో అప్పుడు అక్కడ ఉన్నవారందరూ ధన్యులైనారు అని చెప్పినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-27-28-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment