శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
మున్నై వినై యగల మూంగిల్ కుడి అముదన్
పొన్నం కళఱ్కమల ప్పోదిరణ్డుం – ఎన్నుడైయ
శెన్నిక్కు అణియాగ చ్చేర్‌త్తినేన్ తెన్బులత్తార్ క్కు
ఎన్నుక్కడ ఉడైయేన్ యాన్
ఎన్నో జన్మలుగా మూటగట్టుకున్న పాపాలను పటాపంచలు అవ్వాలని మూంగిల్ కుడిలో జన్మించిన బంగారము లాంటి అముదనార్ యొక్క దివ్య పాదాలను నేను నా తలపై ఒక ఆభరణము వలే ఉంచు కున్నాను. ఇక దీని తరువాత యమునితో గానీ యమదూతలతో గానీ నాకేరకమైన సంబంధము లేదు.
నయందరు పేరిన్బమ్ ఎల్లాం పళ్ళుదు ఎన్ఱు నణ్ణినర్బాల్
శయందరు కీర్‌త్తి ఇరామానుశ ముని తాళ్ ఇణై మేల్
ఉయరన్ద గుణత్తు త్తిరువరంగత్తు అముదోంగుం అన్బాల్
ఇయమ్బుుం కలిత్తుఱై అందాది ఓద ఇశై నెంజమే |
ఎంబెరుమానార్ తనను ఆశ్రయించిన వారికి ఈ సంసారాన్ని జయించే అనుగ్రహమును ప్రసాధిస్తారు, ఆ తరువాత ఈ భౌతిక వ్యవహారాలకు సంబంధించిన సుఖాలన్నీ ఎంత బుద్ది హీనమైనవో వారు గుర్తిస్తారు. ఓ మనసా! గొప్ప గుణాలున్న తిరువరంగత్తు అముదనార్, రామానుజముని తిరువడి పట్ల తన భక్తి ప్రపత్తులు ఉప్పొంగి రచించిన ఈ ప్రబంధాన్ని పఠించేందుకు అంగీకరించు. ఈ ప్రబంధము కలిత్తుఱై అందాది ఆకృతిలో (ముందు పాశురము యొక్క ఆఖరి పదము తరువాతి పాశురము యొక్క మొదటి పదము అవుతుంది) కూర్చబడింది.
శొల్లిన్ తొగై కొణ్డు ఉనదడిప్పోదుక్కు త్తొండు శెయ్యుం
నల్లన్బర్ ఏత్తుం ఉన్ నామం ఎల్లాం ఎందన్ నావినుళ్ళే
అల్లుం పగలుం అమరుం బడి నల్గు అఱు శమయం
వెల్లుం పరమ ఇరామానుశ ఇదు ఎన్ విణ్ణప్పమే
నీ భక్తులు, నీ తిరువడి వద్ద వాచిక కైంకర్యము రూపముగా కొన్ని ప్రత్యేక పాశురములను పఠించి ప్రయోజనము పొందుతారు. నీపై ప్పొంగి పొరలిన భక్తితో వారు స్మరించిన నామాలన్నీ రాత్రి పగలు తేడా లేకుండా నా నాలుకపై నిత్యము ఉండేలా అనుగ్రహము ప్రసాదించు. ఆరు విభిన్న తత్వశాస్త్రములను అనుసరించు వారిని, వేదములపై విశ్వాసము లేని వారిని, వేదములను తప్పుగా అర్థము చేసుకొను వారిని జయించిన ఓ గొప్ప రామానుజ ఇదే నీకు నా ప్రార్థన.
తదుపరి శీర్షికలో, ఈ ప్రబంధం యొక్క తరువాత భాగాన్ని అనుభవిద్దాము.
అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/04/iramanusa-nurrandhadhi-thaniyans-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org