శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
అవతారిక
శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులకు కష్టాలను ఇచ్చినా అది వారి మీద తనకు గల అభిమానము చేతనే అని ఉదాహరణ సహితముగా ఇక్కడ తెలియజేస్తున్నారు.
పాశురము
“ఆర ప్పెరుంతుయరే సెయ్ దినుం అన్ బర్గళ్ పాల్
వేరిచ్చరోరుగై కోన్ మెయ్ న్నలమాం – తేరిల్
పొఱుత్తఱ్కు అరిదు ఎనినుం మైందన్ ఉదఱ్ పుణ్ణై
అఱుత్తఱ్కు ఇసై తాదై అఱ్ఱు. “
ప్రతి పదార్థములు
వేరిచ్చరోరుగై కోన్ = సువాస్నలు వెదజల్లు తామరయే నివాసముగా గల శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు
అన్ బర్గళ్ పాల్ = భక్తులకు
ఆర ప్పెరుంతుయర్ = పెను కష్టాలను
సెయ్తిదినుం = కలిగించుట
తేరిల్ = పరిశీలించి చూస్తే
మెయ్ న్నలమాం – = అది నిజమైన ప్రేమ చేతనే అని బోధ పడుతుంది
పొఱుత్తఱ్కు అరిదు ఎనినుం = భరింపరానిదైనా
మైందన్ = తన ప్రియమైన బిడ్డకు
ఉదఱ్ పుణ్ణై = శరీరములో పుండు పుడితే
అఱుత్తఱ్కు = ఆ భాగమును కోసి చికిత్స చేయవలసి వస్తే
ఇసై తాదై అఱ్ఱు = అనుమతించే తండ్రి వంటి వాడు
భావము
శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులకు కష్టాలను ఇచ్చినా అది వారి మీద తనకు గల అభిమానము చేతనే అని ఉదాహరణ సహితముగా ఈక్కడ తెలియజెస్తున్నారు. తన ప్రియమైన బిడ్డకు శరీరములో పుండు పుడితే ఆ భాగమును కోసి చికిత్స చేయవలసి వస్తే అనుమతించే తండ్రి వంటి వాడు శ్రీమన్నారాయణుడు అని అంటున్నారు.
వ్యాఖ్యానము
ఆర ప్పెరుంతుయరే…..’ .తుయర్ ‘ కష్టము. ‘ ప్పెరుంతుయర్ ‘ గొప్ప ,అంతులేని కష్టము. అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ‘ఏ ‘ వకారమును ఉపయోగించారు. అనగా పెను కష్టము అంతులేని కష్టము అని అర్థము. కేవలము కష్టమే తప్ప సుఖము మచ్చుకైనా ఉండనిదని అర్థము.
సెయ్తిదినుం…….భగవంతుడే అలాంటి కష్టములనిస్తే…..అంటే ఆ జీవి పురాకృత కర్మ ఫలము ఇచ్చాడన్న మాట . సంచితము , ఆగామి , ప్రారబ్దము అని కర్మలు మూడు విధములు. ఈ మూడింటినీ తొలగించ గల వాడు భగవంతుడు మాత్రమే . అయినప్పుడు ఆయన తలచుకుంటే జీవుడి కష్టాలను పోగొట్టలేడా! అంటే తన భకుల మేలు కోరి , వారైకి ఆభాస బంధములన్ని తొలగి పోవుటకే కష్టాలను ఇస్తాడని అంటారు . “కిత్తదాయిన్ వెత్తెన మఱ”.
“ఇయల్బాగవుం నోంబిఱ్కు ఒన్ఱు ఇన్మై ఉదమై
మయలాగం మఱ్ఱుం పెయర్తు ” తిరుకుఱళ్
అనగా శ్రీమన్నారాయణుని శ్రీపాదములను చేరాలనుకునే వారు లౌకిక విషయాసక్తులను తొలగ దోయాలి . ఆయన భక్తులు అలాగే చేస్తారు , కాని ఏదైనా ఒక బంధము వదలక పట్టుకొని వుంటే దాని నుండి విముక్తులను కావించటము కోసము వారికి కష్టాలనుఇస్తాడు. ఒక్కటే కదా అని ఉపేక్షచేస్తే అది పెను వృక్షముగా మారి వారికి ఆత్మహాని కలిగిస్తుంది అని పరిమేల్ అళగర్ అంటున్నారు .
వేరిచ్చరోరుగై కోన్……“చరోరుగం” అనగా తామర . ‘ వేరిచ్చరోరుగం ‘ సువాసన గల తామర . ‘ వేరిచ్చరోరుగై ‘ సువాసన గల తామరలో కూర్చున్నపడతి…. శ్రీమహాలక్ష్మి .’ వేరిచ్చరోరుగై కోన్ ‘ సువాసన గల తామరలో కూర్చున్నపడతికి ధవుడు . కోన్ అంటే రాజు. ఇక్కడ యజమాని … సువాసన గల తామరలో కూర్చున్నపడతి అయిన శ్రీమహాలక్ష్మికి యజమాని … శ్రీమన్నారాయణుడు . ఎందుకు ఇక్కడ అమ్మను ఇంతగా ప్రస్తావించారంటే స్వామి సర్వ స్వతంత్రుడు,ఆయన భక్తుల కష్టాన్ని చూడడు. కాని అమ్మ కూడా అక్కడే వుంది కదా! అయినా కష్టా కడలిలో ఈదవలసిందేనా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది .
మెయ్ న్నలమాం ……నిజమైన ప్రేమ కలవాడు
తేరిల్….తరచి చూడగా….వేరిచ్చరోరుగై కోన్ అంబర్గళ్ పాల్ ఆరప్ పెరుంతుయరే సెయ్తిడినుం తేరిల్ మెయ్న్నలమాం”….అనగా సువాసన గల తామరలో కూర్చున్నపడతి అయిన శ్రీమహాలక్ష్మికి యజమాని … శ్రీమన్నారాయణుడు , తన భకుల మేలు కోరి , వారి ఆభాస బంధములన్ని తొలగి పోవుటకే కష్టాలను ఇస్తాడు . అది ఎలాగంటే….
పొఱుత్తఱ్కు అరిదు ఎనినుం మైందన్ ఉదఱ్ పుణ్ణై అఱుత్తఱ్కు ఇసై తాదై అఱ్ఱు…… తన ప్రియమైన బిడ్డకు శరీరములో పుండు పుడితే , ఆ భాగమును కొసి చికిస్త చేయవలసి వచ్చింది. అభిమతించే తండ్రి చికిస్త చేయవద్దని అంటాడా? లేక చేయిస్తాడా? బిడ్ద తాత్కాలికముగా బాధ పడినా శాస్వతముగా రోగము నుండి విముక్తి పొందుతాడు అని కదా సంతోషిస్తాడు! అలాంటి తండ్రి వంటి వాడే శ్రీమన్నారాయణుడు అని అంటున్నారు. తన భక్తుల కర్మను కాల్చి వేయడానికే వారికి పెను కష్టాల పాలు చేస్తాడు. అమ్మ కూడా ఈ పనిలో స్వామికి సహకరించి తన బిడ్డలకు శాశ్వత సుఖాలనిస్తుంది.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-21-arap-perunthuyare/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org