శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
ఆళవందార్, కాట్టుమన్నార్ కోయిల్
ఈ గ్రంథమునకు ఉన్న తనియన్లను తెలుసుకుందాం.
స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం |
స్తోత్రయామాస యోగీంద్రః తం వన్దే యామునాహ్వయం||
గ్రాహ్యమునకు దుర్గమైన వేదాంత రహస్యములను సులభముగా గ్రాహ్యమగునట్లు తమ స్తోత్రరత్నమున విశదీకరించిన, యోగులలో శ్రేష్ఠులైన యామునాచార్యులకు వందనం.
యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః |
వస్తుతాముపయాతో2హం యామునేయం నమామి తం ||
ఎవరి దివ్యకృపతో నా కల్మషములన్నీ నాశనము చేందినవో మరియు ఒక వస్తువుగా గుర్తించబడ్డానో పూర్వము అసత్ (అచేతనము)గా ఉండి యామునాచార్యుల పాదముల ధ్యానముతో ప్రస్తుతం సత్(ఆత్మ/ చేతనము) గా భావిస్తున్నానో ఆ శ్రీ యామునాచార్యులనకు నమస్కరిస్తున్నాను.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/12/sthothra-rathnam-invocation/
పొందుపరిచిన స్థానము : https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org