ఆర్తి ప్రబంధం – 8

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<<ఆర్తి ప్రబంధం – 7

ramanujar-alwai (2)

పాశురం 8

తన్ కుళవి వాన్ కిణఱ్ఱైచ్ చార్న్దిరుక్కక్ కన్డిరున్దాళ్
ఎన్బదన్ఱో అన్నై పళియేర్కిన్ఱాళ్ – నన్గు ఉణరిల్
ఎన్నాలే ఎన్ నాసమ్ మేలుమ్ యతిరాసా
ఉన్నాలే ఆమ్ ఉఱవై ఓర్

ప్రతి పద్ధార్ధం

తన్ కుళవి – తన శిశువు (ఎవరైతే) ఒకవేళ
చార్న్దిరుక్క – దగ్గర
వాన్ కిణఱ్ఱ – ఒక పెద్ద (లోతైన) బావి (ఒకవేళ ఆ శిశువు ఆ బావిలో పడి చనిపోయినచో)
ఎన్బదన్ఱో – అప్పుడు ఈ జగమతయు చెప్పును
కన్డిరున్దాళ్ – ఆ శిశువు యొక్క తల్లి చూచెను (బావి వద్దకు వెళ్ళూట చూచెను కాని అశ్రధ్దగ ఉండెను)
అన్నై – (తుదుకు) ఆ తల్లి
యేర్కిన్ఱాళ్ – బాధ్యతను తీసుకొనెను
పళి – తప్పును
నన్గు ఉణరిల్ – ఒకవేళ పదిలముగా ఆలోచించినచో
ఎన్నాలే – “పాపములు” అను అగాధమైన పల్లములో ఉన్న నేన్ను
ఎన్ నాసమేలుం – నన్ను నాశనము చెసినైనను
ఎతిరాసా – ఓ! యతిరాజ!!!
ఓర్ – దయచేసి నాకు వివరింపుము !!
ఉఱవై – బాంధవ్యం
ఆమ్ – అది స్థాపించబడినది
ఉన్నాలే – మీ (మరియు నా) వలనే ( ఒక తల్లికి తనయునకు ఉండు బాంధవ్యమే శ్రీ రామానుజులు మరియు మణవాళ మామునులు పంచు కొనుటచే ఈ జగము తనయుడిని కాపాడుకుండుండుటకు తల్లినే తప్పు పట్టును కాని తనయుడిని కాదు)

సామాన్య అర్ధం

ఈ పాశురములో మణవాళ మామునులు శ్రీ రామానుజులు అడిగిన ప్రశ్నకు సమాధానము ఇచ్చెను. శ్రీ రామానుజులు ” నేను ఒక తల్లి తన శిశువును కాపాడునట్టు మిమ్ము కాపాడవలెనని చెప్పుచున్నారు. కాని మీ గురించి ఆలోచించుము. మీ యొక్క దుష్కర్మములు పెరుగుచుండెను మరియు సత్ కర్మములు ఏమియూ లేవు. అట్టి వారిని నేనెలా కాపాడెదను” అని మామునులను ప్రశ్నించెను. దానికి మణవాళ మామునులు శ్రీ రామానుజులతో సమాధానముగా, ఒక వేళ వారు కాపాడనిచో అది వారికి ఒక మాయని మచ్చగా మారును అని చెప్పెను. ఈ విషయమును ఒక చక్కని ఉపమానముతో ఇక్కడ వివరించెను. తనను తాను కాపడలేని శిశువుకు ఒకవేళ ఏదైనను హాని కలిగినచో, ఈ లోకము తల్లినే దూషించును. ఒకవేళ 5 సంవత్సరము కూడ నిండని పసికందు చనిపోయునచో, అది ఆ శిశువు యొక్క తల్లిదే ఆపరాధమని, వారి అజాగ్రత వలనే మరణము సంభవించునని శాస్త్రములో చెప్పబడినది.

వివరణ

ఒకవేళ ఇదేళ లోపల పసికందు చనిపోయినచో, శాస్త్రము ఆ పసివాణ్ణి తల్లి యొక్క అలక్ష్యమే కారణమని దూషించును. ఇట్టి కళంకము నుండి దూరముగా ఉండుటకు, ఆ తల్లి ఎల్లప్పుడు మెలుకవతో కాపాడవలెను. ఆ తల్లి ఎప్పుడు కంటిన నూనెను పొసుకొని గమనించుకొనవలెను. ఉదాహరనకు ఆ తల్లి యొక్క చంటి శిశువు బాగ లోతైన బావి వద్ద వెళ్ళేను.అది ఆ తల్లి చూడలేడు. ఒకవేళ ఏదైన చెడు (ఆ శిశువు బావిలో పడి చనిపోయినచో) జరిగినచో, ఆ తల్లియే దానిని భరించవలెను. ఈ లోకము ఆ తల్లి చూచి కూడ ఏ మాత్రము గమనించలేదని నిందించును. మణవాళ మామునులు “ఓ!! యతిరాజా !! అటులనే, అగాఢమైన లోతైన ఈ పాపములు అను గుంతలో ఉన్న నేను, నన్ను నాశనము చేసుకొన్నచో, మీరు దయచేసి నాకు మరియు మీకు ఉన్న సంబందమును గుర్తు చేసుకొనుము. మీరు నాకు తల్లి, నేను మీ తనయుడను. ఈ బాంధవ్యమే మీకు సమస్యను తీసుకొనవచ్చును. ఎందుకనగా తల్లియే శిశువు యొక్క మరణమునకు బాద్యత వహించవలెను. అందువలనే మన మధ్య ఉన్న బంధమును ఆలోచించి, మరల నా కోరికను పరిశీలించుము. మన మధ్య ఉన్న సంబంధముచే మీరు నన్ను ఎప్పుడు రక్షించ వలెను.” అని చెప్పెను.  ఈ సందర్భమున మనం పిళ్ళై లోకాచార్యులు, వారి శ్రీ వచన భూషణము, సూత్రం #371 “ప్రజయైక్ కిణఱ్ఱిన్ కరయిల్ నిన్ఱుం వాన్గాదొళిన్దాల్ తాయే తళ్ళినాళ్ ఎన్నక్ కడవదిరే” నందు ఇదే విషయము గూర్చి తెలియ జేయుటను ఙ్ఞప్తి చేసుకొనవచ్చు.

అధనపు విషయము

ఈ పాశురములో మణవాళ మామునుల చమత్కారమును గమనించవచ్చును. ఆ తల్లి తన శిశువు యొక్క మరణమునకు కారణమైనట్లు, యతిరాజులు తన పాపములకు కారణమని ఇక్కడ నేరుగా చెప్పలేదు. ఆ అర్థమున ఇక్కడ మట్లాడలేడు. తన కర్మములు మాత్రమే తాను ఈ అగాధమైన పాపుములలో చిక్కుకొనుటకు కారణమని, యతిరాజులు ఏ విధమునా తన పాపములకు బాధ్యులుకారని స్పష్టపరిచెను. కాని యతిరజులతో తనకున్న తల్లి-తనయుడు అను బాంధవ్యము గూర్చి వారిని ఆలోచించమని కోఱెను. ఈ బాంధవ్యముచేతనే యతిరాజులను మణవాళ మామునులు తనను రక్షించవలెనని ప్రార్ధంచెను. ఒకవేళ రక్షించనిచో ఈ లోకము తాను పాపములతో క్షయించునప్పుడు కాపడలేదని యతిరాజులను నిందించునని వివరించెను.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-8/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment