ఆర్తి ప్రబంధం – 7

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<<ఆర్తి ప్రబంధం – 6

emperumAnAr_thiruvadi_to_a_dumb

శ్రీ రామానుజులు మూగవారిని తన శిష్యులుగా స్వీకరించి వారిని తన పాదపద్మములను మాత్రమే ఆశ్రయించమని చెప్పెను

ప్రస్తావన

ముందు పాశురము వలే ఈ పాశురమున కూడ మణవాళ మామునులు శ్రీ రామానుజులు తనను ప్రశ్నించెనని ఊహించెను. క్రిందటి పాశురంలో, మణవాళ మామునులు శ్రీ రామానుజులను ఈ దేహము అంతముచేసి త్వరగా అతని వద్దకు చేర్చుకోవలెనని ప్రార్ధించెను. అందుకు శ్రీ రామానుజులు ” నేను ఎవరను మరియు నాకు ఏ అర్హత ఉంది , మీ తప్పులను గూర్చి ఆలోచించి మిమ్ముస్వీకరించుటకు? మీరు ఏమి చేయవలెనని విచారించలేని వారా? మీచే చెప్పబడినవాటిని మీరే చేయలేరా? మీ దేహమును అంతంచేసి మీరు చెప్పునట్లు మీకు మేలు చెసుకొనలేరా?” అని ప్రశ్నించెను. ఈ పాశురమున మణవాళ మామునులు ఆ ప్రశ్నలకు సమాధానము చెప్పెను. ఒక శిశువు తన పనులను తానే చేయునచో , మీ శిశువైన నేనూ నా పనులను చేసుకొనెదను. కాని ఒక పసికందుకు తన పనులను చేయడం సాధ్యముకాదు మరియు తనను తాను రక్షించుటకు తెలియదు. అదే విధముగా, ఈ అడియేన్ (నాకు) కు కూడ ఏమి చేయ్యాలో, ఎలా చేయవలెనో అని తెలియదు. నా తల్లి యైన మీరే నా కొఱకు అన్ని చేయవలెను.

పాశురం 7

అన్నై కుడినీర్ అరుంది ములైయుణ్ కుళవి
తన్నుడైయ నోయైత్ తవిరాళో? – ఎన్నే
ఎనక్కా ఎతిరాసా ఎల్లా నీ సెయ్దాల్
ఉనక్కు అదు తాళ్వో ఉరై

ప్రతి పద్ధార్ధం

అన్నై – తన శిశువు ఎడల అసమానమైన వాత్సల్యము గల ఒక తల్లి వలే
కుడినీర్ అరుంది – తాను మొడలు సేవించిన మందు యొక్క చెడు ప్రభవమును తగ్గించుటకు నీరు త్రాగునట్లు
తవిరాళో? – స్వస్థము చేయ లేరా
తన్నుడైయ ములైయుణ్ కుzహవి – పాలు త్రాగు తన పసికందు యొక్క
నోయై – రోగమును
ఎతిరాసా – ఓ! యతిరాజా!!
ఎనక్కా – (మీరు) అంతులేని వాత్స్యలముతో కూడిన నా తల్లి
ఎల్లా నీ సెయ్దాల్ – నాకు బడులుగా, నన్ను రక్షించుటకునెను ఎమి చేయవలెనని తలెచెడరొ
అదు – వాటిని
తాళ్వో – ఏ మొహమును పెంచక
ఉనక్కు – ఎప్పుడు పెరుగు మీ ప్రకాశమునకు?
ఉరై – దయ చేసి చెప్పుము!!!
ఎన్నే – ఎంతో ఆశ్చర్యము!!! (అన్ని తెలిసిన మీరు, ఈ విషయము తెలియపరుచుటకు నన్ను ఎంచినట్లు)

సామన్య అర్ధం

మణవాళ మామునులు ఇక్కడ తన శిశువు యొక్క రోగము తగ్గుట కొఱకు క్రమముగా మందుకు సేవించు తల్లిని ఉపమానముగా చెప్పెను. తల్లి వద్ద పాలు త్రాగే పసికందుకు తనకు తానే వ్యాదిని స్వస్తము చేయుటకు తెలియదు. తల్లియే తన బిడ్డకు బదులుగా చేయ వలసినవాటిని చేసి వ్యాదిని కుదుర్చును. మణవాళ మామునులు శ్రీ రామానుజునితో, వారే తనకు తల్లి అని, కావున తనకు బదులుగా వారె రోగము స్వస్థమగుటకు చేసినచో వారి ప్రకాశము (గొప్పతనము) ఏ మాత్రము తగ్గదని ప్రార్ధించెను

వివరణ

మణవాళ మామునులు ఒక ఉపమానముతో ప్రారంభించెను. ఒక తల్లికి పాలు త్రాగే శిశువు ఉండెను. అట్టి చంటివారికి ఏది తెలియదు, కావునా అన్నింటికీ తన తల్లి మీదే ఆధార పడును. ఒక వేళ ఆ శిశువుకు ఏదైన  కలిగినచో ఏమి చేయవలెను? ఆ తల్లి తన శిశువు యొక్క అనారోగ్యము బాగుచేయుటకు అవసరమైన అన్నింటిని వెంటనే చేసెదరు. ఔషధమగు నీటిని త్రాగెదరు.ఆ ఔషధము ఎక్కవై ఆపద కలుగకుండ, వాటిని కావలినంతమాత్రమే సేవించెదరు. ఇలా ఏదైనను శిశువు యొక్క అనారోగ్యమును గుణము చేయవలసిన అన్ని తల్లి తానే శిశువుకు బదులుగా చేసెదరు. తాను సరిగ్గ శిశువును సంరక్షించక పోవుటచేతనే శిశువుకు అనారోగ్యము కలిగెనని చింతించెదరు. మణవాళ మామునులు శ్రీ రామానుజులను అంతులేని వాత్సల్యం తో కూడిన తల్లియని అతనితో చెప్పెను. మణవాళ మామునులు శ్రీ రామానుజులను ” ఓ యతిరాజా!! నేను చేయవలసినవాటిని నాకు బదులుగా మీరు చేసినచో అది మీకు ఏ విధముగానైనా చెడు పేరు తెచ్చునా? లేదు, అది మీ ప్రకాషమునకు ఇంకనూ మెరుగు చేర్చును. ఇందున ఆశ్చర్యమగు విషయము ఏమి అనగా, ఈ సందేశమును మీరు నా ద్వారా ఈ లోకమునకు తెలియపరుచవచ్చు. అందరికీ ఈ సందేశమును ఎందునకు చెప్పరు?” అని అడిగెను.

మణవాళ మామునులు మన శాస్త్రములు పూర్తిగా ఈ సందేశముతో నిండి ఉన్నండుటను కారణముగ చెప్పెను. ప్రతిఒక్కరూ ఆచార్యులు తన శిష్యుల కొఱకు చేయు కార్యములను గుర్తుంచుకొనవలెను. తన ఆచార్యులు ప్రేమతో ఒక శిష్యుని ఎంచుకొని వారి మేలు కోసం కార్యములను చేయుటను “ఆచార్యాభిమానము”అని చెప్పెదరు. ఆచార్యులు ఆ శిష్యుని దేనిని చేయుటకు శక్తిలేని వారిగా గుర్తించెదరు. అదీగాక శ్రీమన్ నారాయణుడు తన యొక్క ఒక అస్తిని (ఆ శిష్యునిలో ఉన్న ఆత్మ) పొందినచో, ఆనందముచే వారి ముఖారవిందమున మందహాసముతో వెలుగును. కావున ఈ రెండింటిని ( శిష్యుని మరియు శ్రీమన్ నారాయణుని) తలచి ఆచార్యులు శిష్యుని బదులుగా అన్ని అనుష్టానములను చేసి శ్రీమన్ నారాయణుని ముఖమును ఆనందముతో మిక్కిలి ప్రకాశింపచేసెదరు. ఆచార్యుల ఈ కార్యము తన శిశువునకు అనారోగ్యము సరియగుటకు మందు మరియు నీరు త్రాగు తల్లితో సమానమైనది. తన శిష్యుపై అపార కరుణ చూపు ఇట్టి ఆచార్యులు “మహాభాగవతులు” అని చెప్పబడు వారికి నిదర్శనముగ ఉండెను. ప్రతిఒక్కరు వారి గొప్పతనమును తెలుసుకొని, వారి పాదపద్మములనే ఆశ్రయించి, వారు తన యెడల చేయువాటిని స్వీకరించవలెను. అది కొన్ని విషయములను మననుండి విడదీసి మరికొన్ని విషయములను చేర్చవచ్చును. శిశువు తన తల్లిని ఎట్లు పూర్తిగా అండగొని ఉండునో అదే విధముగా శిష్యులు వారి ఆచార్యుని ఆశ్రయించి ఉండ వలెను. ఈ సందేశము పలు మార్లు పేర్కొనబడెను. “వల్ల పరిశు వరువిప్పరేల్ (నాచ్చియార్ తిరుమొళి 10.10)” ఒక ఉదాహరణగా చెప్పవచ్చును.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-7/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment