శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం తద్దైవతామపి న కించిదహో బిభేమి |
ఇత్థం శఠోsప్యశఠవదియసయింఘే హ్రుష్టుశ్చరామి యతిరాజ! తతోsస్మి మూర్ఖః ||
ప్రతి పదార్థము :
యతిరాజ! = ఓ యతిరాజా
అహం = దాసుడు
గురుం = అజ్ఞానాంధకారమును పొగొట్టి జ్ఞాన దీపమున్ వెలిగించిన ఆచార్య దేవా
మంత్రం = తిరుమంత్రమనె అష్టాక్షరి మంత్రమును
తద్దైవతామపి = ఆ మంత్రమునకు అధి దేవత అయిన శ్రీమన్నారాయణుని
నిత్యం తు = నిరంతరము
పరిభవామి = అవమానిస్తున్నాను
కించిద = కొంచెము కూడా
న బిభేమి = ఈ పని చేయటము వలన రాగల విపత్తుల గురించి చింత లేకుండా
అహో = అయ్యో
ఇత్థం = ఈవిధముగా
శటః అపి = పరులకు తెలియకుండా అపకారము చేయు వాని వలె ,శాస్త్రములో విశ్వాసము లేని వాడి వలె
అశటవత్ = ఎప్పుడు మంచినే చేసేవాడిలాగా, పైన పేర్కొన్న మూడింటినీ విశ్వసిచాలనే శాస్త్ర ప్రమాణము మీద నమ్మకము లేని వాడిలాగా
భవదీయసంఘే = తమ దాసులైన పరమ ఆస్థికుల గోష్టిలో
హ్రుష్టఃసన = మన తప్పులు వీరికి తెలియలేదన్న ఆనందముతో
చరామి = సంచరిస్తున్నాను
తత = అందువలన
అహం మూర్ఖః అస్మి = దాసుడు పరమ మూర్ఖుడవుతున్నాడు
త్వరాయ = ఇటువంటి దాసుడి మూర్ఖతను పోగొట్టి తమరు కృపతో అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.
భావము:
నాలుగవ శ్లోకములో ‘దాసుడి వాక్కు తమరి గుణ కీర్తనతో తరించాలని ‘చెప్పి ఇక్కడ దానికి విరుధ్ద్ధముగా గురువును,మంత్రమును, మంత్ర అది దేవతను పరిభవించుట మొదలగు చెడు పనులను చేయుటలో మునిగి పోయినట్లు, అటువంటి చెడు గుణములను పోగొట్టి కృపతో అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.గురువును అవమానించుట అనగా ఉపదేశములో విడువతగినవని చెప్పిన వాటిని విడువలేక పోవుట. తన పేరు కొరకో, గౌరవము కొరకో, స్వలాభము కొరకో మంత్రొపదేశము చేయుట మొదలైనవి.
మంత్రమును అవమానించుట – మంత్రములోని వాస్తవములను దాచి అందులో లేని విపరీత విషయములను ప్రచారము చేయుట .మంత్రములో చెప్పిన దేవతలను అవమానించుట – శ్రీమన్నారాయణునిచే సృష్టి చేయబడిన కాలములో ఇవ్వబడిన శాస్త్రమును వాడి విషయములలో అన్వయించ కుండా ఇతర నీచ విషయములలో అన్వయించటము. దీనికి సంబంధించిన వివరణ శ్రీవచన భూషణములో చూడ వచ్చును.
అహో -ఆశ్చర్యము . లోకముల దాసుడి వంటి పాపి ,పాప భీతి లేని వాడు మరొకరు కనపడక పోవుట దాసుడికే ఆశ్చర్యమును కలిగిస్తున్నది అని ‘అహో ‘అంటున్నారు.
అడియెన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-9/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org