యతిరాజ వింశతి – 14

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 13

వాచామగోచరమహాగుణదేశికాగ్రయకూరాధినాథ్కథితాకిలనౌచ్యపాత్రం |
ఎషోహమేవ న పునర్జగతిద్రుశస్తద రామానుజార్య కరుణై తు మద్రతిస్తె ||

 

ప్రతి పదార్థము:

హే రామానుజార్య = ఓ రామానుజార్య

వాచామగోచరమహాగుణ = వాక్కుకు అందని గుణ పరిపూర్ణత, ఒక్కొక్క గుణమును ఎంత అనుభవించినా తనివితీరనంతగా కలిగి వున్నవారై

దేశికాగ్రకూరాధినాథ = ఆచార్య శ్రేష్టులైన కూరత్తళ్వాన్లు

కథిత = తమ పంచస్తవములో చెప్పినట్లుగా

అకిలనైచ్యపాత్రం = సకల నీచగునములు కలిగివున్నవాడిని

ఎషోహమేవ = దసుడు ఒక్కడే

ఇద్రుశ పునః = ఇలాంటి వాడు మరొకడు

జగతి = లోకములో

న = ఉండనే ఉండడు

తత్ = ఆ కారణము చేత

దేతు = కారుణ్య మూర్తి అయిన తమరి

కరుణా ఏవ = కరుణయే

మద్గతిః = దాసుడిని ఉజ్జీవింప జేయు ఉపాయము

భవతు = అగుగాక

 

భావము:

కిందటి శ్లోకము వరకు తమ దోషాలను విన్నవించుకున్నా తృప్తిని పొందక పూర్వాచార్యులు చెప్పుకున్న దోషాలన్నీ తమకు కూడా వున్నాయని విజ్ఞాపనము చేస్తున్నారు. ‘ వాచామగోచరమహాగుణ ‘అన్న విశేషణము కూరత్తళ్వాన్ల విషయములో ప్రయోగించుటకు కారణము-వారు దోషములేవీ లేని వారని చెప్పుట. అయినప్పటీకీ వారు తమ విషయములో అరోపిచుకున్న  దోషములన్నీ దాసుడి వద్ద ఉన్నాయని చెపుతూ -‘ అకిలనైచ్యపాత్రం అహమేవ   అన్నారు.’దేశికాగ్ర ‘- వేదాంత శాస్త్రమును ప్రవచించుటకు పట్టాభిషేకము చేయబడిన వారిలో ప్రధములు అన్న అర్థములో ప్రయోగించారు. ‘ ఆద్యం  యతీంద్ర శిష్యాణాం అగ్రయం వేదాంత వేదినాం ‘ ( యతీంద్రుల శిష్యులలో ప్రధములు వేదాంత శాస్త్రము తెలిసిన వారిలో అగ్రగణ్యులు అయిన కూరత్తళ్వాన్లకు ప్రణమిల్లితున్నాను ) అన్న శ్లొకమును ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కూరత్తళ్వాన్లు తమ శ్రీ వైకుంఠ స్తవములో ‘ స్వామీ!ఎంపెరుమానే!ఐయ్యో ఐయ్యో నేను చాలా చెడిపోయాను.నేను దుష్టుడను. ఇంకా చెడిపొతాను. నీచ విషయములలో మోహము కలిగి వున్న నేను భగత్స్వరూపమైన తమరి  విషయములలో ప్రేమ ఉన్నట్లు పైకి నోటిమాటగా చెప్పుకున్నాను. నా వంటి నీచుడు దోషములే లేని గుణ పరిపూర్ణులైన తమరిని స్మరించటకు కూడా అర్హుడు కాదు వాడను.’ అని చెప్పిన విషయాన్ని ఇక్కడ అన్వయించుకోవలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము:  https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-14/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment