పూర్వ దినచర్య – శ్లోకం 10 – స్వయమానముఖాంభోజం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 10

స్వయమానముఖాంభోజం ద్వమానదృగంచలం!

మయి ప్రసాద ప్రవణం మధురోదారభాషణం!!

ప్రతి పదార్థము:

స్వయమానముఖాంభోజం = ఎల్లప్పుడు వికసించిన తామర వంటి చిరునవ్వుతో విలసిల్లే వారు

ద్వమానదృగంచలం = కరుణ పొంగు కన్నులు గల వారు

మయి = ఇంత కాలము వారికి ముఖము చాటేసిన దాసుడిపై

ప్రసాద ప్రవణం = కృపచూప చూపుటలో సిద్దహస్తులు

మధురోదారభాషణం = మధురమైన ఉదార భాషణము చేయ గల వారు

భావము:

అధరములో నిలిచిన మందహాసముతోను, కృపను వర్షించు కడగంటి చూపుతోను, వాటికి తగ్గ అమృత వాక్కులతోను ఒప్పుతున్న మామునుల స్వరూపము…వారు తమపై కురిపించు అనుగ్రహమును ఈ శ్లోకములో వర్ణించారు. మామునులు సదా ద్వయార్థమును ఉపదేశించుట వలన తమకు మోక్షలాభము తప్పక సిద్దిస్తుందని,తమ కోరిక నెరవేరుతున్నదని,  మందహాసమును వెలయించు చున్నారని భావము.

అంతే కాక ఈ మందహాసమును, పైన పేర్కొన్న మధురమైన ఉదార భాషణమునకు కూడా పూర్వాంగముగా చెప్పవచ్చును. సంతోషమును మందహాసముతో ప్రకటించాక కదా మధుర భాషణము చేస్తారు. దయతో ఇతరుల ధుఃఖమునకు కరుగుట, ‘మనము ద్వాయార్థము తెలుసుకోవటము వలన పొందే సంతోషము ఇంకా వీరికి లభించలేదే ,అయ్యో వీరింకా ఈ సంసారములో పడి కొట్టుకుంటున్నారు కదా!’ లోకుల ధుఃఖమును చూసి మామునులు విచారిస్తున్నారు. ఇదీకాక,దయతో ,సంతోషముతో కదా అచార్యులు శిష్యులతో మధుర సంభాషణము చేసేది.. ఈ దయ, సంతోషము ముఖ్యమైన గుణములు కదా! ‘సత్యం శుద్ది, దయ, మనసు సంచలించకుండుట, ఓర్పు,సంతోషము అనే సుగుణాలే అందరూ చేపట్టవలసిన లక్షణములు అని భరద్వాజ పరిశిష్ట వచనము ఇక్కడ గుర్తు చేసుకోవాలి..’మయి ప్రసాద ప్రవణం ‘ అన్న ప్రయోగానికి …దాసుడిపై కృప చూపుటలో శ్రద్ద గల వారని చెపుతున్నారు.అర్థాత్ దాసుడు గతములో వారి పట్ల విముఖుడైనప్పటికీ ,ఆ మనః క్లేశమును తొలగించి ,తేట పరచి,కృపను చూపుతున్నారని అర్థము. మాట మధురముగా, అర్థగాంభీర్యముతోను ఉండవలెను అని మేదాది, అర్థగాంభీర్యముతో ఉండవలెనని శాండిల్యుడు పేర్కొన్న విషయము ఇక్కడ గ్రహించ తగినది. ఇక్కడ అర్థగాంభీర్యము అంటే ద్వయార్థ సంబంధమని అర్థము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-10/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment