శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
1-2-3 ] 4 – 5 – 6-7
నెఱి ముఱై నాల్ వకై వరుణముం ఆయినై
మేతకుం ఐమ్బెరుం పూతముం నీయే
అఱుపదం మురలుం కూన్దల్ కారణం
ఏళ్ విడై అడంగచ్చెఱ్ఱనై
ప్రతి పదార్థము:
నాల్ వకై వరుణముం ఆయినై – నాలుగు వర్ణముల వారిని నియమిస్తావు
నెఱి ముఱై – శాస్త్రము ప్రకారము నడచుకొనే వారు…..
మే తకుం ఐమ్బెరుం పూతముం నీయే – అంతర్యామివి నీవే
అఱుపదం మురలుం కూన్దల్ కారణం….. – నప్పిన్న ముంగురులు చూసి తుమ్మెదలు ఘీంకారము చేస్తూ తిరుగుతాయి
ఏళ్ విడై… – ఏడు ఎద్దులను
అడంగచ్చెఱ్ఱనై – కలిపి కట్టావు
భావము:
అఱి తుయిళ్ – కిందటి భాగమున భక్త రక్షణము గురించి, ఈ భాగములో యోగ నిద్రలో ఉండి భక్తరక్షణము గురించి చేసిన చింతన విషయమును చెపుతున్నారు.
నాలుగు వర్ణముల వారిని వారి వారి పనులను బట్టి విభజన చేసి విధివిధానములను నిర్ణయించాడు. . ఆయా విధి విధానములకు తగినట్లు భక్తి చేయటమే ఆయన అంగీకరిస్తాడు .ఇతర విధాములను పాటించటము ఆయన అంగీకరించడు.
నాలుగు వర్ణముల వారిని వారి వారి పనులను బట్టి విభజన చేసి విధివిధానములను నిర్ణయించాడు. ఆయా విధి విధానములకు తగినట్లు భక్తి చేయటమే ఆయన అంగీకరిస్తాడు ఇతర విధానాలాని పాటించడం ఆయన అంగీకరించడు.
దేవ, మనుష్య, తిర్యక్కులలో ఆయన అంతర్యామిగా వుండి రక్షిస్తాడు.భక్తి చేయటానికి సహాయము చేస్తాడు .
నప్పిన్న ముంగురులను చూసి తుమ్మెదలు ఘీంకారము చేస్తూ వుంటాయి. అంతటి అందమైన నప్పిన్నను పొందడం కోసము, ఏడుఎడ్లను కలిపి కట్టాడు.
అలాగే దాసుల కష్టాలను కూడా తొలగిస్తాడు.
వ్యాఖ్యానము:
ఈ భాగములో భక్తరక్షణ గురించి చెపుతున్నారు.
నెఱి ముఱై నాల్ వగై వరుణముం ఆయినై – నాలుగు వర్ణముల వారు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) శాస్త్రము విధించిన విధముగా నడచుకోవాలి. వీరందరు నీ ఆధీనములోని వారే. వారందరికి అంతరాత్మ నువ్వే, అంటే నువ్వే ఆ నాలుగు వర్ణములు.
‘అహం హి సర్వ యఙ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ’ [గీతా – 9-24]. (నేను సర్వ యఙ్ఞములకు భోక్తను, ప్రభువును) ¡
“వర్ణాశ్రమ ఆచార్వతా పురుషేణ పర: పుమాన్ | విష్ణుర్ ఆరాదయతే పంతా నాన్యస్ తత్తోషకారక: ||” [విష్ణు పురాణం 3-8-9]( వర్ణాశ్రమ ఆచారము ననుసరించి కొలిచినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు. పర ధర్మమును ఆచరించి చేసే ఫూజలను భగవంతుడు మెచ్చడు.
“చాతుర్ వర్ణ్యం మయా సృష్టం” [గీత 4-13].
పై ఉదాహరణలన్నీ శాస్త్రములో చెప్పబడినవి.
మేతగుం ఐంపెరుం పూతముం నీయే – శరీరము పాంచ భౌతికము. అందులో ఉండి, ఆత్మను నియంత్రించే వాడివి నువ్వే.
మేతగుం – యాదానుం ఓర్ ఆక్కైయిల్ పుక్కు అంగు ఆప్పుణ్డుం” [తిరువిరుత్తం 95] – ఆత్మ దేవ, మనుష్యులలో, ప్రవేశించి “దేవోహం మనుష్యోహం” అనిపించి, ఆ యా రూపములకు తగిన కర్మను చేయిస్తాయి.
“నాల్వగై వరుణముం ఆయినై; ఐం పెరుం పూతముం నీయే” , సత్తా, స్తితి, ప్రవృత్తి నువ్వే అయినప్పుడు మరింకెవరు నన్ను రక్షిస్తారు అని ఆళ్వార్లు అంటున్నారు.
కిందటి భాగములో యోగ నిద్రలో భగవంతుడు చేతన రక్షణను గురించి చింతన చేసినట్టు చెప్పారు. ఇప్పుడు నప్పిన్న పిరాట్టిని రక్షింన విషయమును చెపుతున్నారు.
అఱుపద మురలుం కూందల్ – నప్పిన్న పిరాట్టి అందమైన కురులను చూసి తుమ్మెదలు నల్లకలువలుగా భ్రమసి స్వచ్చమైన తేనె దొరుకుతుందని ఆమె చుట్టూ తిరుగుతూ రొద చేస్తాయి.
ఏళ్ విడై అడంగచ్చెఱ్ఱనై – నప్పిన్న పిరాట్టిని పొందటము కొరకు నువ్వు ఏడు ఎద్దుల మదమణచి, కలిపి కట్టి కడ తేర్చావు.
నప్పిన్న పిరాట్టిని ఎలా రక్షించి నీ దగ్గరకు చేర్చుకున్నావో దాసుడిని కూడా అలా నీ దగ్గరకు చేర్చుకోలేవా? అని ఆళ్వార్లు అడుగుతున్నారు.
అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/07/thiruvezhukurrirukkai-10/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org