తిరువెళుకూట్ఱిరుక్కై – తనియన్లు

మొదటి తనియన్ 

పిళ్ళైలోకం జీయర్   మణిప్రవాళ భాష(సంస్కృత తమిళ భాషల  మిశ్రమం)లో అనుగ్రహించిన తనియన్ వ్యాఖ్యానము ఇక్కడ వర్ణింపబడింది.

దేవాలయాన్ని ఎలాగైతే  ప్రాకారములు రక్షించునో  ఆ మాదిరిగా ఆ భగవానుని ప్రాకారములను (వైభవమును)  రక్షించు  షట్ప్రబంధములను అనుగ్రహించిన తిరుమంగైఆళ్వార్ కు పల్లాండు (మంగళాశాసనం) ను చేయు తనియన్.

ఆచార్యులు నేరుగా వీరిని స్తుతిస్తున్నారు. అన్నీ దివ్యదేశముల యందు ఆళ్వార్ ప్రస్తుతం అర్చారూపిగా వేంచేసి ఉన్నారు. ఈ తనియన్ ఆళ్వార్ కు మంగళాశాసనం చేయుచున్నది.

                                        thUyOn sudar mAna vEl

తూయోన్ శుడర్ మానవేల్

ramanuj

ఎంపెరుమానార్( శ్రీపెరుంబుదూర్)

ఎంపెరుమానార్ అనుగ్రహించిన తనియన్ 

వాళి పరకాలన్ వాళి కలికన్ఱి/
వాళి కురైయలూర్ వాళి వేన్దన్/
వాళి యరో మాయోనై  వాళ్ వలియాల్ /మన్దిరఙ్గొళ్ మఙ్గైయర్ కోన్                                                                           తూయోన్ శుడర్ మానవేల్//

ప్రతిపదార్థం 

వాళి -శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
పరకాలన్- ఇతర మతస్తులకు(తత్త్వాలకు) యముడి వంటి వారు( తిరుమంగైఆళ్వార్)
వాళి -శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
కలికన్ఱి – కలి నశింపచేయు వారు( తిరుమంగైఆళ్వార్)
వాళి – శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
వేన్దన్ – తిరుమంగై కు రాజు
కురైయలూర్ – తిరుక్కురయలూర్ నివాసి(రాజు)
వాళ్-  సుఖముగా నివసించు ఆ స్థానం (వీరి వైభవం వలన)
వాళి- శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక
శుడర్ – ప్రకాశించు/కాంతిగల
మానమ్- గొప్పవైభవం గల
వేల్ – ఈటె/బల్లెము
మఙ్గైయర్ కోన్    – మంగై(ప్రదేశం) కు రాజైన
తూయోన్ – బాహ్యాంతరములుగా పవిత్రులగు/శుద్ధులగు
వాళ్ వలియాల్ – తమ ఆయుధమగు వేళ్(కత్తి) బలముతో
మాయోనై  – ఎంపెరుమాన్  నుండి                                                                                                                   మన్దిరఙ్గొళ్ – భగవానుని నుండి తిరుమంత్రమును  పొందిన
వాళి-శుభం కలుగుగాక  / మంగళం కలుగుగాక / వర్థిల్లుగాక                                                                                  యరో – ‘అసై’ అను తమిళ వ్యాకరణ పదం(పూరకం)

వ్యాఖ్యానం

వాళి పరకాలన్ – పరకాలులు అను నామాంతరం గల ఆళ్వార్ కు మంగళం . ‘పరులు’ (ఇతర మతస్తులు)- ఎంపెరుమాన్ ను తిరస్కరించువారు. అలాంటి వార్లకు ఆళ్వార్ కాలుల (యముడు) వంటి వారు. కావున వీరు పరకాలులు అయ్యిరి.

వాళి కలికన్ఱి – ఆళ్వార్ కు కలికన్ఱి అని మంగళాశాసనం(కలి యొక్క దోషములను తొలగించువారు‌)

కురైయలూర్ వాళి వేన్దన్ వాళి తిరుక్కురయలూర్ లో అవతరించి దానికి రాజై , రక్షించే వారికి మంగళం

పిమ్మట ఎంపెరుమానార్ తాము ఆళ్వార్  కు మరియు వారు ధరించిన బల్లెము/ఈటె కు మంగళాశాసనం చేస్తున్నారు.

 మాయోనై  వాళ్ వలియాల్ /మన్దిరఙ్గొళ్ మఙ్గైయర్ కోన్  తూయోన్ శుడర్ మానవేల్//

మాయోనై – ఆళ్వార్,  తిరువరంగమున  ఆదిశేషుని పై పవళించిన ‘మాయోన్ ‘ ను తమ కత్తితో బెదిరించి అతని నుండి ‘తిరుమంత్రమును’  పొందిరి.

మాయోనై – వివరణ – “కడి అరంగత్తు అరవణైయిల్ పల్లి కొళ్ళుమ్ మాయోనై ” (పెరుమాళ్ తిరుమొళి 1-2) మరియు ” వాళి శుళి పొరితత్త నిర్ పొన్నిత్తెన్ అరంగన్ తన్నై వాళి పరితత్త వాళన్ వలి“, దీనర్థం- ఆళ్వార్  తమ కత్తి యొక్క బలముతో రంగనాథుని నుండి తిరుమంత్రాన్ని పొందిరి.

తనను ప్రేమించే వారి సమస్తములను అపహరించు మాయోన్  దగ్గర నుండి ఆళ్వార్ ‘తిరుమంత్రాన్ని’ దొంగలించారు. ( కై పొరుళ్ గళ్ మున్నమే కైక్కొణ్డార్ కావిరి నిర్ పురళా ఓడుమ్  తిరువరంగ చ్చెల్వనార్– నాచ్చియార్ తిరుమొళి-11-6)

మంత్ర ప్రతిపాద్యుడగు  ఎంపెరుమాన్ నుండి ఆళ్వార్ తిరుమంత్రమును పొందిరి. దీనినే  తిరునెడుదాణ్డగమ్ లో ఇలా అన్నారు – ‘ అన్దణార్ మత్తు అంది వైతత్త మందిరమ్

మఙ్గైయర్ కోన్   తిరుమంగై కు రాజైన ఆళ్వార్

తూయోన్ – ఆళ్వార్ బాహ్యాంతర పవిత్రతను/శుద్ధత్వం   కలిగి ఉన్నారు.

అనన్యార్హ   శేషత్వం (మరెవరికిని చెందకుండా ఉండుట) అనన్య శరణత్వం (ఎంపెరుమాన్ ను పొందుటకు   అతనిని తప్ప మరెవరిని ఆశ్రయించ కుండుట)  అనన్య భోగ్యత్వమ్ (ఎంపెరుమాన్ తప్ప మరేతరము కూడ అనుభవ (ఆశ్రయించుటకు) యోగ్యము కాకుండుట)- అంతరశుద్ధిగా ఈ విశేష గుణములను  ఆళ్వార్ కలిగి ఉన్నారు

పంచసంస్కారాదులను పొందుట మొదలైనవి బాహ్యశుద్ధిగా చెప్పబడింది.

ఆళ్వార్ తమ నామధేయములను ఒక పాశురమున తెలిపారు. ఈ నామధేయములు తన  బాహ్యాంతర శుద్ధత్వమును తెలుపుచున్నవి. అవి – అంగమలత్తడ వయల్ శూళ్ ఆళినాడన్, అరుళ్ మారి, అరట్టముఖి, అడైయార్ శీయమ్ కొఙ్గు మలర్  క్కురయలూర్ వేళ్ మంగైవేన్దన్, కూర్ వేళ్ పరకాలన్, కళియన్ (పెరియ తిరుమొళి 3-4-10)

శుడర్ మానవేల్ –  ప్రకాశవంతమైన పెద్దనైన బల్లెము కలిగిన వారు,  మంచి నిర్వాహణాధికారి,  విశేష ప్రతిభాపాటవం కలవారు  తిరుమంగై మన్నన్ .

తూయోన్  వేళ్  వాళి యరో- ఈ తనియన్  లో ఆళ్వార్ తో పాటు ప్రభావం కల వారి  కత్తి కూడ మంగళాశాసనం కావింపబడినది. ఆండాళ్ కూడ తమ తిరుప్పావై-24 పాశురమున- ” నిన్ కైయిళ్  వేళ్ పోత్తి? ” అని కృష్ణునకు మంగళం పాడేటప్పుడు అతని ఆయుధమైన బల్లెమునకు కూడా మంగళం  గావించెను కదా.  ఆళ్వార్  తమ ఆయుధమైన బల్లెము గురించి ఇలా   అంటున్నారు ‘ కొత్తవేళ్’ (పెరియ తిరుమొళి 3-2-10) అని- ఏ లోపాలు లేని ఎల్లప్పుడు విజయ సారథ్యం వహించునది ఆళ్వార్ బల్లెము. ఈ తనియన్ అనుగ్రహించిన వారికి( ఎంపెరుమానార్) ఆళ్వార్ తో పాటు వారి ఆయుధం పైన కూడ అధిక వ్యామోహం ఉన్నదని తెలుస్తున్నది,  కావుననే ఆయుధానికి కూడ మంగళం గావించారు.

రెండవ పాశురం కూడ ఎంపెరుమానార్ చే అనుగ్రహింప బడినది.

(ఈ పాశురానికి పిళ్ళైలోకం జీయర్ వారి వ్యాఖ్యానము  లేదు  కావున కేవలం ప్రతి పదార్థం మాత్రమే ఇవ్వబడింది.)

శీరార్ తిరువెజుక్కూట్ఱిరుక్కై ఎన్ఱుమ్ శెంతమిళాళ్                                                                                                   ఆరావముదన్ కుడన్దై పిరాన్ తన్ అడియిణైక్కుళళ్|                                                                                             ఏరార్ మఱైప్పొరుళ్ ఎల్లామ్ ఎడుతదు ఇవ్వులగుయ్యవే                                                                                   శోరామల్ శొన్న అరుళ్ మారి పాదమ్ తుణై నమక్కే||

ప్రతిపదార్థం 

ఆర్- పూరింప బడినది                                                                                                                                           శీర్ – గొప్ప శబ్దార్థములతో
తిరువెజుక్కూట్ఱిరుక్కై ఎన్ఱుమ్- తిరువెజుక్కూట్ఱిరుక్కై అను ప్రబంధము
శెంతమిళాళ్-  అందమైన తమిళ భాషలో ఉన్న ప్రబంధం
అడియిణైక్కుళళ్- ఎంపెరుమాన్ పాదపద్మముల పై  ఆలాపించబడిన
ఆరావముదన్ – ఆరావముదన్ అను నామము కల
కుడన్దై పిరాన్ తన్ – తిరుకుడన్దై  పెరుమాళ్
ఏరార్ మఱైప్పొరుళ్ ఎల్లామ్ ఎడుతదు – అపౌరేషయముగా పేరుగాంచిన వేదం యొక్క  సారమును స్పష్ఠముగా తెలుపునది.
ఇవ్వులగుయ్యవే- ఈ సంసారమును ఎరిగి జీవించుటకు
శోరామల్ శొన్న- వేదార్థములను వేటిని విడువక అన్నింటిని తెలిపిన
అరుళ్ మారి – కృపావర్షమును వర్షించు తిరుమంగై ఆళ్వార్
పాదమ్ – శ్రీ పాద పద్మములు
తుణై నమక్కే- మాకు రక్షకం

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/04/thiruvezhukurrirukkai-thaniyans-invocation/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment