శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

నంపిళ్ళై — తిరువల్లిక్కేణి
నంపిళ్ళై గారి అసలు పేరు వరదరాజన్. ఆయన శ్రీరంగం సమీపంలోని నంబూరు అనే గ్రామంలో జన్మించారు. అందువల్ల, ఆయనను ‘నంబూరు వరదరాజన్’ అని పిలుస్తారు. ఆయన కార్తీక మాసంలో కృతికా నక్షత్రంలో జన్మించారు.కార్తీక మాసంలో కృతికా నక్షత్రంలో తిరుమంగై ఆళ్వార్ కూడా జన్మించారు. తిరుమంగై ఆళ్వారే స్వయంగా తిరిగి వచ్చి నంపిళ్ళైగా అవతరించారని చెప్పేంత గొప్పతనాన్ని ఆయన కలిగి ఉన్నారు. అందువల్ల, ఆయనను కలికన్ఱి దాసర్ అని పిలుస్తారు. ఆయన నంజీయరు గోష్ఠిలో కాలాక్షేపాన్ని విని ఆనందించేవారు. ఆయన నంజీయర్ యొక్క ప్రముఖ మరియు ప్రధాన శిష్యులు.తన 9,000 పడి వ్యాఖ్యానాన్ని అత్యంత సుందరమైన చేతిరాతతో రాయగల వ్యక్తిచేత ప్రతిలిపి చేయించాలని నంజీయర్ ఆశించారు. తన గోష్ఠిలో ఎవరికి మంచి చేతిరాత ఉందని అడుగగా, అందరూ నంబూర్ వరదరాజన్ (నంపిళ్ళై) అందంగా రాస్తాడని ఆయన వైపు చూపించారు. అప్పుడు నంజీయర్ ఆ 9,000 పడి తాళపత్ర ప్రతులను నంపిళ్ళైకి ఇచ్చి, వాటిని ప్రతిలిపి చేయమని ఆదేశించారు.నంబూరు వరదరాజన్ అని పిలవబడే నంబిళ్ళై, ఆ తాటిపత్ర ప్రతులను తీసుకుని తన స్వగ్రామమైన నంబూరు చేరుకోవడానికి కావేరీ నదిని దాటడానికి బయలుదేరారు. ఆ సమయంలో, కావేరీ నదికి వరద వచ్చింది; ఆయన ఆ ప్రతులను ఒక మూటగా కట్టి, తన తల మీద పెట్టుకుని నదిని దాటడం ప్రారంభించారు. కానీ ఆ వరద ప్రవాహంలో తాటిపత్ర ప్రతులు కొట్టుకుపోయాయి, దాంతో నంబిళ్ళై ఎంతో దుఃఖితులయ్యారు.అయినప్పటికీ, అతను తన స్వగ్రామానికి వెళ్లి, తమ ఆచార్యులైన నంజీయర్‌ను మనస్సులో ధ్యానిస్తూ, నంజీయర్ గారితో కలిసి చేసిన కాలక్షేపంలో తాను విన్న విషయాల ఆధారంగా రాయడం ప్రారంభించారు. నంబిళ్ళై గారు ఒక గొప్ప విద్వాంసులు; పరాశర భట్టర్ వలె, అతను కూడా తమిళ మరియు సంస్కృత సాహిత్యాలలో మరియు వ్యాకరణంలో బాగా ప్రావీణ్యం కలవారు.ఆయన శ్రీరంగం చేరుకుని, తాను వ్రాసిన దానిని నంజీయరుకు సమర్పించారు. దానిని చూసి, నంజీయర్ వారు ఆశ్చర్యచకితులయ్యారు.ఎందుకంటే అసలు వ్రాతప్రతిలో ఉన్న అన్ని వ్యాఖ్యానాలు మరింత అందమైన పదాలను ఉపయోగించి రాయబడ్డాయి అని నంజీయర్ గారు అన్నారు. “యానైక్కు కోలం శెయ్దదు పోలే” (ఇది ఏనుగును అలంకరించినట్లు). అంటే, ఏనుగు సహజంగానే అందంగా ఉన్నప్పటికీ అలంకరణతో మరింత శోభాయమానంగా కనిపిస్తుందో, అలాగే తన వ్యాఖ్యానాలు కూడా మరింత అందంగా తీర్చిదిద్దబడ్డాయని నంజీయర్ భావించారు.ఆయన దీని గురించి నంబూర్ వరదరాజన్‌ను అడిగినప్పుడు, జరిగినదంతా ఆయన వివరించారు. అది విని నంజీయర్ ఎంతో గర్వపడి, పరమానందంతో “వారమ్ నంపిళ్ళైయే!” అంటే (‘వారమ్’ — రండి/రా నా కుమారా) అని పిలిచి, ఆయనను ఆలింగనం చేసుకున్నారు.నంపెరుమాళ్ పురప్పాడుకు ఎంత పెద్ద జనం గుమిగూడితారో,అంతే జనం నంపిళ్ళై కాలక్షేపానికి గుమిగూడెవారట. అది చూసి అందరూ “నంపిళ్ళై గోష్టియో నంపెరుమాళ్ పురప్పాడో” అని ఆశ్చర్యపోయేవారు.నంపిళ్ళై గారు వేంచేసి ఉన్న కాలాన్ని “నల్లడిక్ కాలం” అంటే మంచి రోజులు అని పిలిచేవారు.నంపిళ్ళై గారు వేంచేసి ఉన్న కాలంలో ఎంపెరుమాన్ సంబంధమైన విషయాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండేది కాదు.భగవద్విషయం ఎలాంటి అవరోధాలు లేకుండా విరాజిల్లేది. ఒకసారి పెరియ పెరుమాళ్ నంపిళ్ళై గారి కాలక్షేపం వినడానికి తమ ఆదిశేష పర్యంకం మీద నుండి లెగిసారు అని కూడా చెబుతారు.తిరువిళక్కు పిచ్చన్ (సన్నిధిలో దీపాలను వెలిగించే కైంకర్యం చేసే శ్రీవైష్ణవుడు) పెరుమాళ్ళని ఆపి, “దేవరీర్ ఎళుందు వరక్కూడాదు అర్చావతారత్తిల్ నీర్ అప్పడయే తాన్ ఇరుక్క వెణ్డుమ్” అని అంటారు. అంటే స్వామి మీరు ఇలా లేచి రాకూడదు.అర్చావతారంలో మీరు ఎప్పుడూ పడుకునే ఉండాలి. అని చెప్పి స్వామి మళ్ళీ సన్నిధి లోపలకి వెళ్ళేలా చేశారు.ఈ సంఘటనను బట్టి వారి చరిత్రలో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత, ఆయన ‘లోకాచార్య’ అనే దివ్య నామాన్ని కూడా పొందారు.ఒకానొక సమయంలో, కందాడై తోళప్పర్ గారు నంపిళ్ళై గారిని అవమానించారు. కానీ ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపపడి, “ఆయన ఎంతటి జగద్గురువు!” (ఎన్న ఉలగారియనో) అని ఆశ్చర్యపోతూ, నంపిళ్ళై గారికి ‘లోకాచార్య’ అనే బిరుదును ప్రసాదించారు. అంతేకాకుండా, నడువిల్ తిరువీధి పిళ్ళై గారు కూడా ఆయనను అవమానించి, ఆ తర్వాత పశ్చాత్తాపపడి ఆయనకు శిష్యుడయ్యారని మనకు తెలుస్తోంది. ఈ విధంగా, ఎందరో ఆచార్యులు నంపిళ్ళై గారిపై అమితమైన భక్తిశ్రద్ధలను కలిగి ఉండి, ఆయన పాదాలను ఆశ్రయించారని (శరణు వేడారని) గ్రహించవచ్చు.
నంపిళ్ళై గారి వాళి తిరునామం:
తేమరువుం సెంగమలత్ తిరుత్తాళ్గళ్ వాళియే
తిరువరైయిల్ పట్టాడై సేర్మరుంగుం వాళియే
తామమణి వడమార్వుం పురినూలుం వాళియే
తామరైక్కై ఇణై అళగుమ్ తడంపుయముం వాళియే
పామరువుం తమిళ్ వేదం పయిల్ పవళమ్ వాళియే
పాడియత్తిన్ పొరుళ్ తన్నై ప్పగర్ నావుం వాళియే
నామనుదల్ మదిముగముమ్ తిరుముడియుం వాళియే
నంపిళ్ళై వడివళగుం నాడోఱుం వాళియే
నంపిళ్ళై గారి వాళి తిరునామం – సరళ వివరణ
తేమరువుం సేన్గమలత్ తిరుత్తాళ్గళ్ వాళియే
తేనెలు పలుకుతున్న ఎర్ర తామర పువ్వుల వంటి నంపిళ్లై వారి దివ్య పాదములు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
తిరువరైయిల్ పట్టాడై సేర్మరున్గుం వాళియే
నంపిళ్లై గారు నడుము చుట్టూ ధరించిన పట్టు వస్త్రపు సౌందర్యం చిరకాలం నిలిచియుండుగాక (పల్లాండు)!
తామమణి వదమార్వుం పురినూలుం వాళియే
నంపిళ్లై ధరించిన తులసి హారాలు, తామర పూసల మాలలు, వక్షస్థలంపై ధరించిన పవిత్రమైన జంధ్యం — వీటన్నిటికి పల్లాండు!
తామరైక్కై ఇణైయళుగుం తదంబుయముం వాళియే
తామర పువ్వుల వంటి ఆయన రెండు దివ్య హస్తాలు, విశాలమైన భుజములు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
పామరువుం తమిళ్వేదం పయిల్ పవళం వాళియే
తిరువాయ్మొళి అనే తమిళ వేదంలోని గంభీరమైన పాశురాలను, నంపిళ్ళై ఎల్లప్పుడూ తన పగడపు పెదవులతో వినిపించేవారు. వడక్కు తిరువీధి పిళ్ళై అందించిన ‘ఈడు 36000 పడి’ వ్యాఖ్యానంలో, నంపిళ్ళై కాలక్షేపంలోని అన్ని విశేషాలు సందేహం లేకుండా స్పష్టంగా వివరించబడ్డాయి. ఇతర వ్యాఖ్యానాలలో తెలిపిన అర్థాలన్నీ ఈ ఈడు 30000 పడి వ్యాఖ్యానంలోనే ఇమిడి ఉన్నాయి. ఈ విధంగా తిరువాయ్మొళిని వ్యాఖ్యానిస్తూ వినిపించే నంపిళ్ళై పగడపు పెదవులు చిరకాలం వర్ధిల్లుగాక! పల్లాండు!
పాడియత్తిన్ పోరుళ్తన్నైప్ పగర్నావుం వాళియే
‘పాడియం’ రామానుజుల వారు అనగా శ్రీభాష్యం. రామానుజాచార్యుల శ్రీభాష్యార్థాలను అద్భుతంగా వివరిస్తున్న నంపిళ్లై వారి మహోన్నతమైన నాలుకకు పల్లాండు.సంస్కృతం, తమిళం రెండింటిలోనూ నిపుణులైన ఆయన, తన కాలక్షేపంలో —వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృత వ్యాకరణం, శ్రీభాష్యం, గీతాభాష్యం, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు, స్మృతులు, తిరుక్కురళ్, అగనానూరు, పురనానూరు — ఇలా అనేక గ్రంథాల నుండి ఉదాహరణలు ఇచ్చేవారు.ఇటువంటి ఉత్తమ నాలుక కలిగి, కాలక్షేప చక్రవర్తి అయిన నంపిళ్లై చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
నామనుదల్ మదిముగముం తిరుముడియుం వాళియే
తిరునామంతో అలంకరించబడిన నంపిళ్లై గారి నుదురు, చంద్రకళ వంటి ఆయన తిరుముఖమండలం, దివ్య శిరస్సు — వీటన్నిటికి పల్లాండు!
నంపిళ్ళై వడివళగుం నాడోఱుం వాళియే
అను నిత్యం పెరుగుతున్న నంపిళ్లై వారి దివ్య రూప సౌందర్యానికి పల్లాండు!
ఆచారియన్ సిఛ్ఛన్ ఆరుయిరైప్ పెణుమవన్
దేసారుం సిఛ్ఛన్ అవన్ సీర్ వడివై – ఆసైయుడన్
నోక్కుమవన్ ఎన్నుం నుణ్ణఱివైక్ కేట్టు వైత్తుం
ఆర్కుం అన్నేర్ నిఱ్కై అరిదం
మణవాళ మామునిగళ్ ఉపదేశరత్నమాలైలో ఇలా చెప్పారు — ఆచార్యుడు శిష్యుని ఆత్మను రక్షిస్తాడు; శిష్యుడు ప్రేమతో ఆచార్యుని దేహాన్ని సేవిస్తాడు. శిష్యుడు ఆచార్యుని దివ్య శరీరాన్ని అత్యంత ప్రేమతో సంరక్షించాలి. ఇది శ్రీవచనభూషణంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఆచార్యుడు శిష్యుని లోకబంధనాల నుండి విడిపించి, భగవంతుని చేరే మార్గాన్ని చూపేవాడు. శిష్యుడు ఆచార్యుని ఆత్మ సంబంధ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.
మణవాళ మామునిగళ్ చెప్పినట్లుగా, నంపిళ్లై వారి తిరుమేని సేవను సంపూర్ణంగా చేసిన శిష్యుడు పింబళగరాం పెరుమాళ్ జీయర్.
మామునిగళ్ ఆయన మహిమను తమ ఉపదేశరత్తినమాలైలో మరో పాశురంలో ఇలా చెప్పారు:
పిన్బళగరాం పెరుమాళ్ సీయర్ పెరుందివత్తిల్
అన్బదువుం అఱ్ఱు మిక్క ఆసైయినాల్
నంపిళ్ళైక్కాన అడిమైగళ్ సెయ్ అన్నిలైయై నన్నెంజే
ఊనమాఱ ఎప్పొళుదుం ఓర్
పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్ వలె, మనం కూడా మన ఆచార్యులకు కైంకర్యం (సేవ) చేయాలి. పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్ చేత సంరక్షించబడిన నంపిళ్ళై గారి యొక్క దివ్య మంగళ తిరుమేని (అందమైన రూపం) చిరకాలం వర్ధిల్లాలని (పల్లాండు) ప్రార్థిస్తూ నంపిళ్ళై యొక్క వాళి తిరునామం ముగుస్తుంది.
ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం.
అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org