శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
ప్రస్తావన
పూర్వపు పాశురములో మణవాళమామునులు, శ్రీ రామానుజులవారిని చేరు సుదినము ఎప్పుడు వచ్చునని తెలుపమని ప్రార్ధించెను. ఈ ప్రార్ధనచే శ్రీ రామానుజుల మదిన ఒక ఆలోచన ఉదయించి ఉండవచ్చని మణవాళమామునులు తలచెను. శ్రీ రామానుజుల మదిన ఉదయించిన ఆలోచన ఏమనగా ” ఓ! మణవాళమాముని!, మీరు ఈ భౌతికశరీరమును విడిచినప్పుడు “మరణమానాల్ (తిరువాయ్ మొళి 9.10.5)” అను వాక్యానుసారము మీరు శ్రీమన్నారాయణుని నివాసమగు పరమపదమును చేరెదరు.” ఇందులకు మణవాళ మామునులు ఇంకను చేర్చుకొనుటకు ఆలస్యమగు కారణమేమని ప్రశ్నించెను శ్రీమన్నారాయణుని. ఈ భౌతిక శరీరమును విడిచి మరణించు సమయము వరకు ఎందులకు ఉపేక్షించవలెను. ఇప్పుడే శీఘ్రముగ చేర్చుకోరాదా?” అని ప్రశ్నించెను. ఇదియే ఈ పాశురము యొక్క సారాంశము.
పాశురం 17
పొల్లాన్గు అనైత్తుం పొదిందు కొణ్డు నన్మైయిల్ ఒన్ఱు
ఇల్లా ఎనక్కుం ఎతిరాశా – నల్లార్గళ్
నణ్ణుం తిరునాట్టై నాన్ తరువేన్ ఎన్ఱ నీ
తణ్ణెన్ఱు ఇరుక్కిరదు ఎన్దాన్?
ప్రతి పద్ధార్ధం
అనైత్తుం – (నేను) అన్ని
పొల్లాన్గు – ఈ భువిన ఉన్న చేయరాని విషయములను
పొదిన్దు కొణ్డు – నాలో గాఢముగా చెక్కియున్న
ఒన్ఱు ఇల్లా – ఆవంత కూడా
నన్మైయిల్ – నాలో మంచి విషయము
ఎతిరాసా – ఓ! ఎమ్పెరుమానారే!
ఎనక్కుమ్ – నావంటి వారికి కూడా
నాన్ తరువేన్ ఎన్ఱ నీ – మీరు మమ్ము అనుగ్రహించెదరని చెప్పియున్నారు
తిరునాట్టై – పరమపదము ఏదైతే
నణ్ణుమ్ – చేరుటకు ఉత్తమమైన స్థానము
నల్లార్గళ్ – మంచి గుణములతోయున్న వారు
తణ్ణెన్ఱు ఇరుక్కిరదు ఎన్దాన్? – నన్ను అనుగ్రహించుటకు ఆలస్యమెందులకు? ( అంతరార్థము, చేరుటకు ఏ చోటు లేని మరియు తన వద్ద ఏమియు లేని మణవాళ మామునులు, శ్రీ రామానుజుల అనుగ్రహముచే శ్రీఘ్రముగా పరమపదము చేరవలెనని ఆకాంక్షిస్తుండెను)
సామాన్య అర్ధం
మణవాళమామునులు ” మేము అన్ని చెడు విషయములతో కూడి ఉన్న దాసుడిని. మాలో ఆవగింజంత కూడ మంచి గుణములు లేవు. కాని శ్రీ రామానుజులు మా వంటి నీచులకు కూడ పరమపదమును అనుగ్రహించెదనని చెప్పెను. ఓ! రామానుజా, మీరు పరమపదమును అనుగ్రహించెదనని చెప్పి, ఇంకను ఆలస్యముచేయుటకు కారణమేమి?” అని చెప్పెను.
వివరణ
మణవాళ మామునులు, పాశురపు మొదటి భాగములో తన గూర్చి చెప్పెను. “నీసనేన్ నిఱై ఒన్ఱుమిలేన్ (తిరువాయ్ మొళి 3.3.4)” మరియు “అకృతసుకృత, ‘ అను వాక్యములలో చెప్పబడిన యట్లు వారి యందు ఏ మంచి గుణము లేక నీచులై ఉన్నరని మణవాళ మామునులు చెప్పెను. జీవాత్మను ఉన్నత స్థాయికి చేర్చి ముక్తి పొందుటకు కావలసిన గుణములకు విరుద్ధముగ ఉండు అన్ని గుణములతో నిండి ఉన్నను. మరియు తనలో కొంచము కూడా మంచి గుణములు లేని జీవాత్మను సంస్కరించి ఉన్నత స్థాయికి చేర్చు విషయములు లేవు, మరల మరల పూర్వీకులచే నిషేధించబడిన అన్ని విషయములను ఎల్లప్పుడు చేయుచుండెను. “ప్రాప్యమ్ అర్చిపదాసత్బిస్ తత్ విష్ణోర్ పరమంపదం” అను వాక్యానుసారం పరమపదము అనునది అన్ని మంచి పనులు మరియు గుణములతో కూడిన శ్రేష్ఠమైన వారిచే ఆకాంక్షించు ప్రదేశమని వర్ణించబడెను. మణవాళ మామునులు ” ఓ! ఎమ్పెరుమానారే, మీరు మావంటి నీచమైన వారికి కూడా పరమపదమును అనుగ్రహించెదరని చెప్పెను. మన మధ్య ఉన్న బాంధవ్యము గూర్చి తెలిసి కూడా అలా చెప్పెను. కాని ఆ పరమపదమును అనుగ్రహించుటలో ఎందులకు ఆలస్యము? మీరు మీ మదిన మేము ఇంకెవరో రక్షించెదరు అని వారి వద్దకు వెళ్ళి చేరెదనని తలచెనా? శ్రీమన్నారాయణునిచే నిత్య విభూతి యగు పరమపదమును చేరుటకు నియమించబడిన ఇతర మార్గములో మా ప్రయత్నముచే చేరెదనని తలెచెనో? ఓ! ఎమ్పెరుమానారే, మాకు మిమ్ము తప్ప ఇంకెవరిని తెలియదు మరియు మిమ్ము తప్ప వేరే ఉపాయము తెలియదు. మాలో ఏ విషయము లేదు మరియు మీ చరణకమలములను మించి వేరు స్థానము తెలియదు. కావున త్వరితముగా ముక్తిని ప్రసాదించమని ప్రార్ధిస్తున్నాను” చెప్పెను.
అడియేన్ వైష్ణవి రామానుజ దాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/07/arththi-prabandham-17/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org