శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీ రామానుజులు మూగవాడిని తన శిష్యునిగా స్వీకరించి వానిని తన పాదపద్మములను మాత్రమే ఆశ్రయించమని చెప్పెను
ప్రస్తావన
మునుపటి పాశురమున మణవాళమామునులు, తన హృదయమున శ్రీ రామానుజులయందు ఆవగింజంత ప్రేమ/భక్తి కూడా లేదని చెప్పి ముగించెను. ఈ పాశురమున శ్రీ రామానుజులు తనను ప్రశ్నిస్తున్నట్లు ఊహించెను. శ్రీ రామానుజులు ” ఓ! మణవాళ మామునీ! మీరు నా యందు ఏ విధమైన ప్రేమ/భక్తి లేదని చెప్పారు. కనీసము మీకు ఈ ఇతర సంసారిక విషయములందు ద్వేషమైన ఉన్నదా? ఆధ్యాత్మిక చింతనకు ఆటంకముగా ఉండు ఈ లౌకిక విషయములనుండి దూరముగా ఉండెదరా” అని అడిగెనని తలచెను. మణవాళ మామునులు ” లేదు. నేను లౌకిక విషయములను విడువలేదు. మరియు మీ యెడల కొంచము కూడ పవిత్రమైన ప్రేమ, భక్తి లేదు. ఓ! శ్రీ రామానుజా! మీ పాదపద్మములు ఒకరి యొక్క దోషములను తొలగించును. మీ చరణకమలములను చేరుట ఎప్పుడని మాకు తెలియదు. మీకు మాత్రమే అది తెలియును మరియు మిమ్ము చేరు ఆ సుదినము ఎప్పుడని మాకు తెలియ పరచగలరు” అని సమాధానమిచ్చెను.
పాశురం 16
ఆగాదదు ఈదెన్ఱు అఱిన్దుమ్ పిఱర్క్కు ఉరైత్తుమ్
ఆగాదదే సెయ్వన్ ఆదలాల్ మోకాన్తన్ ఎన్ఱూ
నినైత్తు ఎన్నై ఇగళేల్ ఎతిరాసా
ఎన్ఱు ఉన్నడి సేర్వన్ యాన్
ప్రతి పద్ధార్ధం
అఱిన్దుమ్ – నేను (మణవాళ మామునిగళ్) బాగా తెలిసియూ
ఈదెన్ఱు – విషయముల జాబితా
ఆగాదదు – ఆచార్యులు చెయ్యదగవని చెప్పిన
పిఱర్క్కు ఉరైత్తుమ్ – వాటితో నిలుపకుండ, ఇతరులకూ వాటి గూర్చి ఉపదేశించును
ఆగాదదే సెయ్వన్ – (ఆచార్యులచే చెయ్యదగవని చెప్పిన వాటిని ఇతరులకు ఉపదేశించి) నేను వాటిని చేయుట కొనసాగిస్తున్నాను.
ఆదలాల్ – అందున
ఇగళేల్ – దయచేసి నిందించవద్దు/నిషేధించవద్దు
ఎన్నై – నన్ను
ఎన్ఱూ – చే
నినైత్తు – ఆలోచించి, నన్ను తీసివేయుట
మోకాన్తన్ – అత్యాశకు లోబడిన వారని తలచి
ఎతిరాసా – ఓ! ఎమ్పెరుమానారే!!!
ఎన్ఱు – ఎప్పుడు
యాన్ – నేను
సేర్వన్ – చేరు
ఉన్ – మీ
అడి – చరణ కమలము
సామాన్య అర్ధం
మునుపటి పాశురంలో, మణవాళ మామునులు శ్రీ రామానుజుల యెడల తమకు ఏ విధమైన ప్రేమాభిమానములు లేదని వ్యధ చెందెను. ఈ పాశురమున వారు ఈ లౌకిక విషయమునందు ఇంకనూ ద్వేషము కలగలేదని చింతించెను. వారు ఇహమునను లేక, పరమును తెలుసుకొనలేక కలత చెంది, శ్రీ రామానుజులను తన లెక్కలేని దోషములను నుండి ముక్తి ప్రసాదించి అనుగ్రహించమని కోరెను. శ్రీ రామానుజుల చరణకమలములే తనవంటి వారిని రక్షించును మరియు శ్రీ రామానుజులు మాత్రమే వారిని చేరుట ఎప్పుడని తెలుపగలరని చెప్పి ముగించెను.
వివరణ
మణవాళ మామునులు , ” ఓ! రామానుజా , మన పూర్వీకులచే నియమించబడిన జీవన విధానములను గూర్చి మాకు తెలియును. వాటి గూర్చి ఎంతగా మాకు తెలియుననగా, ఇతరులను శాస్త్రములలో చెప్పని విషయములను చేయరాదని ఉపదేశించెను. ఆచార్యులచే నిషేధించబడిన విషయములను త్యజించవలెనని అందరికీ మేము చెప్పెను. కాని మా విషయమున మేము అన్యముగా వ్యవహరించియున్నాము. ఆచార్యులచే నిషేధించబడిన విషయములను, ఇతరులను చేయరాదని ఉపదేశించిన అన్ని విషయములను మేము చాలా కాలముగ చేయుచున్నాము. కావున మేము చెప్పునది, చేయునది ఒకటి కాదు. ఓ! ఎమ్పెరుమానారే, నన్ను ఈ వ్యామోహమను గూఢమైన వలలో చిక్కిన వారమని త్రోసివేయ రాదు. నమ్మళ్వార్లు “ఎన్ నాళ్ యాన్ ఉన్నై ఇని వందు కూడువన్” (తిరువాయ్ మొళి 3.2.1) అని చెప్పినట్లు, మేము మిమ్ము ఎప్పుడు చేరెదమని తెలియదు. మిమ్ము చేరు సందర్భము మాకు ఇంకెప్పుడు రాదా? ఈ ఆకర్షించు భయంకరమైన వ్యామోహమునకు లోబడిన మేము పూర్తిగ అఙ్ఞానములో ఉన్నాము. మిమ్ము ఎప్పుడు చేరదమని మాకు తెలియదు. అన్నియు తెలిసియున్న మీకు మాత్రమే, అది ఎప్పుడని తెలుసుకొను శక్తియున్నది. కావున ఆ సుదినము ఎప్పుడని మాకు చెప్పెదరా?” అని పలికెను.
అడియేన్ వైష్ణవి రామానుజ దాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/07/arththi-prabandham-16/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org