రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 61 – 70

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< మునుపటి శీర్శిక

అరవై ఒకటవ పాశురము: ఎంబెరుమానార్ల గుణాల యొక్క గొప్పతనాన్ని గురించి ప్రశ్నించినపుడు, అముదనార్లు దయతో వివరిస్తున్నారు.                       

కొళుందు విట్టోడి ప్పడరుమ్ వెంగోళ్‌ వినైయాల్। నిరయత్తు‌
అళుందియిట్టేనై  వందాట్‌ కొండ పిన్నుం * అరు మునివర్
తొళుం తవత్తోన్‌ ఎం ఇరామానుశన్।  తొల్‌ పుగళ్‌ శుడర్‌ మిక్కు
ఎళుందదు। అత్తాల్‌ నల్‌ అదిశయం కండ తిరునిలమే॥ (61)

నిరంతరము భగవత్ చింతనలో ఉండే ఋషులను చేరుకోవడం చాలా దుర్లభము, అటువంటి ఋషులను భగవంతుడు కూడా కష్థంగా పొందుతాడు. మన స్వామి రామానుజుల దివ్య చరణాల వద్ద అటువంటి ఋషులు నమస్కారములు సమర్పించుకుంటారు. మరి రామానుజులు తిరిగి ఎంబెరుమానుని శరణాగతి అనే తపస్సు ను సల్పినారు. కౄరమైన పాపాలు చేసి అనంత సాగరమైన ఈ సంసారములో మునిగి కొట్టుమిట్టాడుతున్న నన్ను స్వీకరించిన తరువాత కూడా, రామానుజుల దివ్య మంగళ గుణాల శోభ విస్తరించి నలు మూలలా వ్యాపించి మరింత మంది ఉద్ధరింపబడాలని చూస్తున్నాయి. ఇది చూసిన ఈ విశాల భూమి అబ్బురపోయింది.

అరవై రెండవ పాశురము:  పాప సంబంధము తొలగిన పిదప వారు పొందిన సంతృప్తిని దయతో వివరిస్తున్నారు.

ఇరుందేన్ ఇరు వివై ప్పాశం కళ్ళత్తి । ఇన్జు యాన్ ఇఱైయుం‌
వరుందేన్ ఇని ఎం ఇరామానుశన్ * మన్ను మామలర్‌ త్తాళ్
పొరుందా నిలై ఉడై ప్పున్మైయినోర్‌ క్కొన్ఱుం నన్మై శెయ్యా *
ప్పెరున్ తేవరై ప్పరవుం। పెరియోర్‌ తం కళల్‌ పడిత్తే॥ (62)

పుణ్య పురుషులైన కొంతమంది (కూరత్తాళ్వాన్ లాంటివారు) అతి పవిత్రమైన ఎంబెరుమానార్ల దివ్య చరణ కమలాలను చేరని అల్ప వ్యక్తులకు ఎటువంటి ఉపకారము చేయకోరరు. ఈ పుణ్య పురుషులు పెరియ పెరుమాళ్ళను స్తుతిస్తారు. ఈ వేళ అటువంటి పుణ్య పురుషులను చేరుకుని పుణ్య పాప బంధముల నుండి బయటపడ్డాను. ఆ తరువాత సంతృప్తి చెందిన నేను ఇక ఎన్నడునూ దుఃఖాన్ని అనుభవించను.

అరవై మూడవ పాశురము: పుణ్య పాప బంధముల నుండి బయటపడిన నాకు ఇక వారి దివ్య తిరువడి కైంకర్యము కొనసాగించడానికి అవసమైన ఇచ్ఛను  ప్రసాదించమని రామానుజులకు అముదానార్ల విన్నపించుకుంటున్నారు.

పిడియె త్తొడరుం కళిఱెన్న। యాన్ ఉన్ పిఱంగియ శీర్‌
అడియై త్తొడరుం పడి నల్గ వేండుం * అఱు శమయ
చ్చెడియై త్తొడరుం మరుళ్‌ శెఱిందోర్‌ శిదైందోడ వందు
ఇప్పడియై త్తొడరుం । ఇరామానుశ మిక్క పండిదనే॥ (63)

ఆ ఆరు క్షుద్ర తత్వ శాస్త్రములను అనుసరించువారిని జయించి, పారద్రోలిన పిదప ఈ ప్రపంచంలోని ప్రజలను తన ఆశ్రయములోకి తీసుకోవడానికి అవకాశం కోసం చూస్తున్న మిక్కిలి జ్ఞానవంతులయిన ఓ రామానుజా!  ఆడ ఏనుగును ప్రేమతో మగ ఏనుగు వెంబడించినట్లుగా, సౌందర్యం, సౌకుమార్యము, సౌగంధ్యము మున్నగు లక్షణాలున్న మీ దివ్య తిరువడిని నేను అనుసరించే అనుగ్రహాన్ని ప్రసాదించుమయా.

అరవై నాల్గవ పాశురము:  వాదప్రతి వాదనలు చేయాలనుకునే బాహ్య కుదృష్థ తత్వశాస్త్రముల అనుచరులకి, రామానుజులు ఈ భూమిపైకి దిగి వచ్చిన ఒక గజము లాంటి వారని, వాళ్ళ జీవితాలు తొందరలో ముగుస్తాయని  అముదనార్లు తెలుపుతున్నారు.

పణ్‌ తరు మాఱణ్ పశుందమిళ్।‌ ఆనందం పాయ్‌ మదమాయ్‌
విండిడ * ఎంగళ్‌ ఇరామానుశ ముని వేళం * మెయ్‌మ్మై
కొండ నల్‌ వేద క్కొళ్లుందండం ఏంది క్కువలయత్తే
మండి వందేన్ఱదు। వాదియర్గాళ్‌ ఉంగళ్‌ వాళ్వత్తదే ॥ (64)

నమ్మాళ్వార్ల అనుగ్రహించిన తిరువాయ్మొళిని రాగ తాళములతో అభ్యసించుట గజము వంటి మన రామానుజ మునులకు ఆహ్లాదబరితమైన తేనె వంటిది. దేనినైనా యదార్థముగా వెల్లడి చేయు అద్భుత వేదములనే దండమును కూడా ధరించి ఉంటారు మన రామానుజులు. వాదించాలనుకుంటున్నవారలారా! అన్నింటినీ తోసిపుచ్చుకుంటూ ఎవ్వరూ ఆపలేని ఆ మదగజము, పెద్ద దండముతో ఈ భూమిపైకి వేంచేసింది. మీవి, మీ శిష్యుల, వాళ్ళ శిష్యుల జీవితాలన్నీ ముగుస్తాయి.

అరవై ఐదవ పాశురము: బాహ్య కుదృష్థ శాస్త్రములను జయించగల జ్ఞానాన్ని ప్రసాదించి రామానుజులు చేసిన ఉపకారమును గుర్తుచేసుకొని అముదనార్ల ఆనందపడుతున్నారు.

వాళ్వత్తదు తొల్లై  వాదియఱ్కు । ఎన్ఱుం మఱైయవర్‌ తం‌
తాళ్వు అత్తదు తవం తారణి పెత్తదు * తత్తువ నూర్
కూళ్ అత్తదు కుత్తమెల్లాం పదిత్త కుణత్తినర్‌క్కు అన్‌
నాళ్ అత్తదు। నం ఇరామానుశన్ తంద ఞ్ఙానత్తిలే॥ (65)

రామానుజులు కృపతో మనకు ప్రసాదించిన జ్ఞానము కారణముగా, చాలా కాలముగా ఉన్న బాహ్య కుదృష్థుల జీవితాలు ముగిసినవి; వైధికుల బాధలు శాశ్వతముగా తొలగినవి; భూము తిరిగి శోభాయమానమైనది; శాస్త్రములపై సందేహాలు తొలగినవి; దుర్గుణాలున్న వారి లోపాలు తొలగాయి. ఎంతటి గొప్పతనము వారిది!

అరవై ఆరవ పాశురము:  మొక్షము ప్రసాదించే ఎంబెరుమానార్ల యొక్క సామర్థ్యాన్ని చూసి వారు అనందిస్తున్నారు.

ఞ్ఙానం కనింద నలం గొండు। నాళ్‌ తొరుమ్ నైబవర్‌క్కు‌
వానం కొడుప్పదు మాదవన్ * వల్వినైయేన్ మనత్తిల్
ఈనం కడింద ఇరామానుశన్ తన్నై ఎయ్దినర్‌ క్కు అత్తానం
కొడుప్పదు। తన్ తగవెన్నుం శరణ్‌ కొడుత్తే॥ (66)

జ్ఞానము పరిపక్వమై భక్తిగా మారినవారికి, నిత్యమూ భగవత్ అనుభవాన్ని ఆశించేవారికి, నిత్యం కైంకర్యము చేయాలనుకునే వారికి శ్రియః పతి శ్రీమన్నారాయణుడు మోక్షాన్ని అనుగ్రహిస్తారు. ఎంబెరుమానార్లు తనను ఆశ్రయించిన పరమ పాతకుల మనస్సులలో నుంచి కూడా పాపాలను తొలగించి కృపతో వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తారు. ఇది ఎంత గొప్పది!

అరవై యేడవ పాశురము:  భగవంతుడిచ్చిన ఇంద్రియాలను లౌకిన ప్రయోజనాలను ఆశించి భగవతారాధనలో ఉపయోగించ వద్దని రామానుజులు తనకు నిర్దేశించి ఎలా రక్షించారో, అలా రామానుజులు చేసి ఉండకపోతే ఎంకెవ్వరూ తనను రక్షించి ఉండేవారు కాదని అముదనార్లు తృప్తితో గుర్తుచేసుకుంటున్నారు.

శరణం అడైంద తరుమనుక్కా। పండు నూతువరై
మరణం అడైవిత్త మాయవన్। తన్నై వణంగ వైత్త
కరణం ఇవై ఉమక్కు అన్ఱు ఎన్ఱు ఇరామానుశన్। ఉయిగట్కు
అరణ్‌ ఆంగమైత్తిలనేల్। అరణార్‌ మత్తు ఇవ్వారుయిర్‌క్కే॥67)

భగవాన్ చేత అనుగ్రహింపబడిన ఇంద్రియముల సహాయముతో ధర్మపుత్రుడు వారిని చేరుకున్నాడు. అద్భుతమైన శక్తులున్న భగవానుడు ధర్మపుత్రుడికి మోక్షాన్నిచ్చాడు. అదే భగవానుడు దుర్యోధనుడిని యుద్దభూమిలో వధింపజేశాడు. ఈ ఇంద్రియములు భగవాన్ కొరకు ఉపయోగించాలి కాని లౌకిన సుఖాలను అనుభవించుట కోసము కాదు. ఎంబెరుమానార్ల ఈ అర్థములను మనకి ప్రత్యక్షముగా మరియు పరోక్షముగా కూడా వెల్లడి చేసి ఆత్మలు లౌకిన సుఖాలపై ఆసక్తి చూపకుండా రక్షించారు. అలా జరగక ఉండి ఉంటే, ఆత్మలను ఎవరు రక్షించి ఉండేవారు?

అరవై ఎనిమిదవ పాశురము: ఈ సంసారములో ఉంటూ కూడా, నా ఆత్మ మరియు మనస్సు ఎంబెరుమానార్ల దాసుల గుణాలతో ముడిపడి ఉన్నాయి. ఈ పిదప, నాకు సమానులైన వారెవరూ లేరు.

ఆర్‌ ఎనక్కిన్ఱు నిగర్‌ శొల్లిల్‌। మాయన్ అన్ఱు ఐవర్‌ తెయ్వ
త్తేరినిల్‌ శెప్పియ కీదైయిన్ * శమ్మై ప్పొరుళ్‌ తెరియ
ప్పారినిల్‌ శొన్న ఇరామానుశనై పణియుం నల్లోర్
శీరినిల్‌ శెన్ఱు పణిందదు। ఎన్ ఆవియుం శిందైయుమే॥ (68)

అద్భుతమైన శక్తులన్న భగవాన్ ఒక రథసారథిగా మారి తాను భక్తాధీనుడని నిరూపించాడు. అర్జునుడు యుద్దము చేయనని తన గాండీవాన్ని క్రింద పెట్టిన ఆ రోజు, శ్రీ కృష్ణపరమాత్మ రథముపై నిలబడి (భగవానుని తిరువడి సంబంధం కలిగి దివ్యత్వమును పొందినదీ రథము) దయతో భగవద్గీతను ఉపదేశించాడు. ఈ భూమిపైన అందరూ తెలుసుకునేలా ఆ భగవద్గీతకు యదార్థమైన భావార్థములను ఇచ్చారు ఎంబెరుమానార్లు. నా ఆత్మ మరియు మనస్సు వారిని ఆశ్రయించిన వారి కల్యాణ గుణాలలో లీనమైపోయాయి. నిజానికి, ఇప్పుడు నాకు సరితూగేవారెవరు?

అరవై తొమ్మిదవ పాశురము:  భగవాన్ చూపించిన దయకంటే ఎక్కువ ఎంబెరుమానార్లు తనపై కురిపించిన కృపలను అముదనార్లు గుర్తుచేసుకొని  ఆనందిస్తున్నారు.

శిందైయినోడు కరణంగళ్।‌ యావుం శిదైందు మున్నాళ్
అంద ముత్తు ఆళందదు * కండు అవై ఎన్ తనక్కు అన్ఱు అరుళాల్
తంద అరంగనుం తన్ శరణ్‌ తందిలన్ * తాన్ అదు తందు।
ఎందై ఇరామానుశన్। వందెడుత్తనన్ ఇన్ఱు ఎన్నైయే॥(69)

సృష్టికి ముందు ప్రళయ సమయములో, బుద్ది మరియు ఇంద్రియాలు తమ స్వరూపాన్ని కోల్పోయి చిత్ అచిత్తుల భేదము లేకుండా ఉనికి లేని క్రియారహితమైన స్థితిలో ఉండేవి. అప్పుడు భగవానుడు జాలిపడి కృపతో నాకు ఇంద్రియాలను ప్రసాదించారు కానీ తన దివ్య తిరువడినివ్వలేదు. తండ్రి పాత్రను పోషిస్తూ ఎంబెరుమానార్లు తన దివ్య చరణములను నాకిచ్చి ఈ సంసారము నుండి నన్నుద్దరించారు.

డెబ్బైయవ పాశురము: ఇంత ఉపకారము చేసిన ఎంబెరుమానార్లని చూస్తూ, ఇంత చేసిన తరువాత తనకింకేమి ఉపకారము చేయబోతున్నారని అముదనార్లు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నైయుం పార్‌త్తు ఎన్ ఇయల్వైయుం పార్‌త్తు। ఎణ్ణిల్‌ పల్ గుణత్త
ఉన్నైయుం పార్‌క్కిల్ అరుళ్‌ శెయ్వదే నలం * అన్ఱి ఎన్పాల్‌
పిన్నైయుం పార్‌క్కిల్‌ నలం ఉళదే ఉన్ పెరుంగరుణై
తన్నై ఎన్ పార్‌ప్పర్‌। ఇరామానుశ ఉన్నై చ్చార్‌ందవరే॥ (70)

అనాది కాలముగా ఈ సంసారములో ఉండి, మీచే స్వీకరింపబడిన తరువాత కూడా ఇంకా లౌకిక వ్యవహరాలలో మునిగి ఉన్నాను. నన్ను చూస్తూ (ఏ మంచి గుణము లేనివడిని), నా స్వరూపాన్ని చూస్తూ (నేనై నేను ఏ మంచితనాన్ని ఆర్జించలేని వాడిని), ఆపై నిన్ను చూసి  అనేకానేక కల్యాణ గుణాలున్న నీవు నా తప్పిదములతో పాటు నన్ను స్వీకరిస్తున్నావు.  నీ కృపా వర్షాన్ని నాపై కురిపిస్తే మంచిది. దీనిని విశ్లేషించి చూస్తే, నాలో ఏ ఒక్క మంచి అయినా ఉందా? ఏదైనా మంచి ఉంటేనే అనుగ్రహిస్తానని నీవు నిర్ణయించుకుంటే, నీ దివ్య తిరువడిని చేరుకున్నవారు నీ అపార కృప గురించి ఏమను కుంటారు? అభిప్రాయమేమిటంటే, వారేదో లోపము ఉందన్న కోణముతో చూస్తారు.

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-61-70-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment