రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 91- 100

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< మునుపటి శీర్శిక

తొంభై ఒకటవ పాశురము: సంసారులు ఏమీ పట్టనట్టు ఉన్నప్పటికీ, వారిని ఉద్దరించడానికి రామానుజులు చేసిన ప్రయత్నాలను అముదనార్లు స్మరిస్తూ వారిని స్తుతిస్తున్నారు.

మరుళ్‌ శురందు ఆగమ వాదియర్‌ కూఱుం। అవ ప్పొరుళాం
ఇరుళ్‌ శురందెయ్‌త్త ఉలగిరుళ్‌ నీంగ * త్తన్ ఈండియ శీర్
అరుళ్‌ శురందెల్లా ఉయిర్లట్కుం నాదన్। అరంగన్ ఎన్నుం
పొరుళ్‌ శురందాన్ । ఎం ఇరామానుశన్ మిక్క పుణ్ణియనే॥ (91)

అజ్ఞాన వశాత్తు శివ ఆగమశాస్త్రము ప్రకారము పశుపతులు వారి వాదనలు ముందుంచుతారు. వారి అల్పార్థముల కారణముగా ప్రపంచమంతా అంధకారములో మునిగిపోయెను. మనుషుల అజ్ఞానాంధకారమును తొలగించేందుకు, రామానుజులు  విశిష్టమైన దయార్ద్ర హృదయులై, సమస్థ ఆత్మలకు శ్రీరంగనాథుడే స్వామి అని స్థాపించారు. వారు గొప్ప అరాధ్యనీయులు.

తొంభై రెండవ పాశురము: నిర్హేతుకముగా ఎంబెరుమానార్లు తనని స్వీకరించారని, వారు కృపతో తన ఆంతర మరియు బాహ్య ఇంద్రియాలకు మూల విషయముగా నిలబడి ఉన్నారని గుర్తుచేసుకుంటూ సంతోషపడి దీనికి కారణమేమిటని ఎంబెరుమానార్లని అడుగుతున్నారు. 

పుణ్ణియ నోన్చు పురిందుం ఇలేన్ । అడి పోత్తి శెయ్యుం
నుణ్‌ అరుం కేళ్వి నువన్ఱుం ఇలేన్ * శెమ్మై నూల్ పులవర్కు
ఎణ్‌ అరుం గీర్‌త్తి ఇరామానుశ  ఇన్ఱు నీ పుగుందు ఎన్‌
కణ్జుళ్ళుం నెంజుళ్ళుం। నిన్ఱ ఇక్కారణం కట్టురైయే॥ (92)

ఇంతటి అనుగ్రహము పొందేందుకు నేను ఏ ఉపకారమూ చేయలేదు. అతి సూక్ష్మమైన కఠినమైన తపస్సులు (శాస్త్ర శ్రవణం) ఏవీ నీ దివ్య చరాణాలను చేరుకునేందుకు చేయలేదు. నిరపేక్షుడైన ఓ రామానుజ! శాస్త్రాలను పోలిన కవిత్వాలను పాడేవారి బుద్దికి కూడా అందనంత గొప్పతనము గలిగినవాడా! నా యొక్క బాహ్య మరియు అంతరంగ (బుద్ది) నేత్రాలకు మూల బిందువు నీవే అన్న విషయానికి నీవే కారణము చెప్పాలి.    

తొంభై మూడవ పాశురము: ఎంబెరుమానార్లు బదులివ్వనందుకు, రామానుజులను ఎవ్వరూ అడగకుండానే కుదృష్థి తత్వశాస్త్రములను ఎట్లయితే ధ్వంసము చేశారు, అలాగే అముదనార్లు వారిని అడగకుండానే, బలీయమైన వారి గత కర్మలను తెగత్రెంచారని, ఎంబెరుమానార్లు నిర్హేతుక కృపను కురిపించేవారని అముదనార్లు వివరిస్తున్నారు.     

కట్ట ప్పొరుళై మఱైప్పొరుళ్‌ ఎన్జు। కయవర్‌ శొల్లుం
పెట్టె క్కెడుక్కుం పిరాన్ అల్లనే * ఎన్ పెరు వినైయై
క్కిట్టి క్కిళంగొడు తన్ అరుళ్‌ ఎన్ను౦ ఒళ్‌ వాళ్‌ ఉరువి
వెట్టి కళైంద। ఇరామానుశన్‌ ఎన్నుం మెయ్ ‌త్తవనే॥ (93)

శరణాగతులకు స్వామి అయిన ఎంబెరుమానార్లు నా వద్దకు వచ్చి ఇదివరకు నశ్వరము గావింపబడని నా ఘోర పాపములను వెలికితీశారు. వేదాల వాస్తవార్థములకు బదులుగా అల్పమైన తప్పుడు అర్థములను ప్రచారము చేసి భ్రమింపజేయు కుదృష్థులను నాశనము చేసిన గొప్ప ఉపకారి ఎంబెరుమానార్లు కాదా! 

తొంభై నాల్గవ పాశురము: ఎంబెరుమానార్లు తన శరణాగతులకు స్పష్థమైన  మర్గదర్షకత్వముతో శ్రీవైకుంఠములో స్థానము కలిపించే పర్యంతమూ దయతో హితములు చేకూర్చినా,  అముదనార్లు మాత్రము వారి దివ్య మంగళ గుణాలు తప్పా ఇంకేమీ కోరనని తెలుపుతున్నారు. 

తవం తరుం శెల్వం తగవుం తరుం। శలియా ప్పిఱవి
పవం తరుం  తీవినై పాత్తి త్తరుం * పరందామం ఎన్నుం
తివం తరుం తీదిల్‌ ఇరామానుశన్ తన్నై చ్చార్‌ందవర్గట్కు
ఉవందరుందేన్। అవన్ శీర్‌ అన్ఱి యాన్ ఒన్ఱుం ఉళ్‌ మగిళ్ందే॥ (94)

తనను ఆశ్రయించిన వారికి అభయమివ్వలేనన్న కొఱత లేనివారు ఎంబెరుమానార్లు, తనను ఆశ్రయించిన వారికి  శరణాగతిపై దృఢమైన నమ్మకము కలిగిస్తారు. ప్రాప్య సాధనమైన భక్తి సంపదను కూడా ప్రసాదిస్తారు. ఈ సంసారములో మళ్ళీ మళ్ళీ జన్మించుటకు కారణమైన మన పాప కర్మలను పటాపంచలు తానొక్కడే చేయగల సామర్థము కలవారు. పరమపదమైన శ్రీవైకుంఠమును మనకు ప్రసాదిస్తారు. ఇవన్నీ ఇచ్చినా కూడా, నీ దివ్య మంగళ గుణములను తాప్పా నా మనస్సు దేనినీ ఆస్వాదించదు.

తొంభై ఐదవ పాశురము: ఎంబెరుమానార్లు యొక్క జ్ఞానము, శక్తి మొదలగు వాటిని గురించి ఆలోచిస్తూ, వారు ఈ ప్రపంచానికి చెందిన వారు కారని, నిత్యసూరులలో ఒకరని, ఈ సంసారముతో ఏ సంబంధము లేనివారని, ఈ భూమిపైన అవతరించారని తెలియజేస్తున్నారు.                                                                                                     

ఉళ్ నిన్ఱు ఉయిర్గళుక్కు ఉత్తనవే శెయ్దు। అవర్‌క్కుయవే
పణ్ణుం పరనుం పరివిలనాం పడి * పల్‌ ఉయిర్‌క్కుం
విణ్ణిన్ తలై నిన్ఱు వీడు అళిప్పాన్ ఎం ఇరామానుశన్
మణ్ణిన్‌ తలత్తుదిత్తు। ఉయ్మఱై నాలుం వళర్‌త్తననే॥ (95)

ఎంబెరుమానార్లు ఆత్మలలోకి ప్రవేశించి వాళ్ళని సంస్కరింపడడానికి తగిన చర్యలు తీసుకుంటారు.  ఆత్మలపట్ల ప్రేమాభిమానములు ఎంబెరుమానార్లకు ఉన్నంత ప్రేమాభిమానములు భగవానుడికి కూడా లేదని చెప్పవచ్చు. ఎందుకనగా, సమస్థాత్మలను ఉద్దరించి మోక్షమును ఒసగేందుకు మన స్వామి  ఎంబెరుమానార్లు అంతరిక్షములోని అత్యద్భుతమైన శ్రీవైకుంఠము నుండి దిగివచ్చారు కాబట్టి. ఏ దోషములు అంటకుండా ఈ భూమిపైన అవతరించిన వారు.  అందరినీ ఉద్దారపరచే నాలుగు వేదములను ఏకొరతా లేకుండా పొందుపరచినవారు ఎంబెరుమానార్లు.

తొంభై ఆరవ పాశురము: ఎంబెరుమానార్లు కృపతో ఉపనిషణ్మయములయిన భక్తి మరియు ప్రపత్తి అను రెండు మార్గములను దర్శింపచేశారు. ఈ రెండింటిలో, సులభతరమైన ప్రపత్తి మార్గమును మీరెంచుకొన్నారా? అని అడగగా  ఎంబెరుమానార్ల యొక్క అనుగ్రహముతో వారి ఆశ్రయమును తాను పొందానని అముదనార్లు తెలుపుతున్నారు.

వళరుం పిణికొండ వల్వినైయాల్। మిక్క నల్వినైయిల్‌ 
కిళరుం తుణివు కిడైత్తఱియాదు * ముడైత్తలై ఊన్‌
తళరుం అళవుం తరిత్తుం విళ్లుందుం తని తిరివేఱ్కు
ఉళర్‌ ఎం ఇఱైవర్। ఇరామానుశన్‌ తన్నై ఉత్తవరే॥ (96)

అనేక దుఃఖాలకు కారణమైన మన గత కర్మలు కారణముగా ఉన్నత మార్గములో నడిపించే శరణాగతి మార్గముపై నమ్మకము ఏర్పడం కష్థము. గుర్ఘందము, మాంసము మొదలైనవాటికి కేంద్రమైన ఈ శరీరమును విడిచే మరణ సమయములో లౌకిక విషయములతో కూడి లక్ష్యం లేని ప్రయాణము చేస్తున్న నాకు, వారి సదుపదేశాల కారణముగా సంరక్షింపబడి, మన స్వామి ఎంబెరుమానార్ల ఆశ్రితుల ఆధారము లభ్యమైంది.   

తొంభై ఏడవ పాశురము: ఎంబెరుమానార్లు కాక వారి దాసులను కూడా కోరుకునేందుకు కారణమేమిటి? అదికూడా ఎంబెరుమానార్ల కృపతోనే దక్కినదని అముదనార్లు చెబుతున్నారు.

తన్నై ఉత్తాట్చెయ్యుం తన్మైయినోర్। మన్ను తామరై త్తాళ్‌
తన్నై ఉత్తాట్చెయ్య  ఎన్నై ఉత్తాన్  ఇన్ఱు*  తన్ తగవాల్‌
తన్నై ఉత్తార్ అన్ఱి తన్మై ఉత్తార్‌ ఇల్లై ఎన్ఱు అరిందు
తన్నై ఉత్తారై। ఇరామానుశన్ గుణం శాత్తిడుమే॥ (97)

తన వద్దకు వచ్చి తనను ఆశ్రయించి స్తుతించిన వారున్నారు. కాని, తన దాసులను ఆశ్రయించి వారిని కీర్తించువారు లేరని ఎంబెరుమానార్లు తమ మనస్సులో భవిస్తున్నారు. కావున, అన్ని లౌకిక విషయములను విస్మరించి తన చింతన మాత్రమే చేయునట్టు చేశారు; వారు తమ దాసుల  అతి సుందర దివ్య చరణ కమలములను తప్పా ఇంకేమీ ఎరుగకుండా చేశారు.  కృపతో వారు ఈ వేళ నన్ను వారి శరణులోకి స్వీకరించారు.   

తొంభై ఎనిమిదవ పాశురము: తన కర్మానుసారముగా భగవాన్ తనను స్వర్గానికో లేదా నరకానికో పంపుతారని తన దివ్య మనస్సులో అనుకొని ఎంబెరుమానార్లని ఈ విషయము గురించి అడుగుతున్నారు. ఎంబెరుమానార్లకి శరణాగతులైన వారికి అలా ఏమి వారు కానివ్వరని, కలవర పడవద్దని రామానుజులు అభయమిస్తున్నారు.

ఇడుమే ఇనియ శువర్‌క్కత్తిల్‌ । ఇన్నుం నరగిల్‌ ఇట్టు
చ్చుడుమే అవత్తై తొడర్‌ తరు తొల్లె * శుళల్ పిఱప్పిల్‌
నడుమే ఇని నం ఇరామానుశన్ నమ్మై నం వశత్తే
విడుమే శరణం ఎన్ఱాల్। మనమే నైయల్‌ మేవుదఱ్కే॥ (98)

మనల్ని ఉద్దరించడానికి వచ్చిన భగవానుడికి “నీవే మాకు శరణు” అని మనము చెప్పినపుడు, ప్రాపంచిక విషయాసక్తి ఉన్నవారు ఆనందించేలా మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తారా? వారి దివ్య తిరువడిని పొందిన తరువాత కూడా మనల్ని నరక యాతనలను అనుభవించమని నరకానికి పంపుతారా? లేదా స్వర్గ నరకాలకు దారితీసే జనన మరణ చక్రములో చిక్కి ఉండమని మన మానాన మనల్ని వదిలేస్తారా? లేదా, మీ ఇష్థ ప్రకారము మీరు జీవించండని మనమానాన మనల్ని వదిలేస్తారా? ఓ మనసా! మనకొచ్చే అంతిమ ఫలమును గురించి ఆలోచిస్తూ దుఃఖించకు.    

తొంభై తొమ్మిదవ పాశురము: బాహ్యులు మరియు కుదృష్థులు అధికముగా ఉండే చోట నివసిస్తున్నందున మనము భ్రాంతిచెందే అవకాశము ఎక్కువ ఉండదా? రామానుజుల ఆగమనముతో వీళ్ళు వాళ్ళ బ్రతుకుదెరువులు కోల్పోయారని అముదనార్లు వివరిస్తున్నారు.

తఱ్క చ్చమణరుం శాక్కియ పేయ్గళుం।  తాళ్ ‌శడైయోన్‌
శొళ్‌ కత్త శోమ్బరుం శూనియ వాదరుం * నాన్మఱైయుం
నిఱ్క కుఱుంబు శెయ్‌ నీశరుం మాండనర్ నీళ్‌ నిలత్తే
పొఱ్కఱ్పగం। ఎం ఇరామానుశ ముని పోంద పిన్నే॥ (99)

సమణులు తెలివిగా వాదనలతో తమ తత్వ శాస్త్రమును నడిపిస్తారు, బౌద్దులు  వికటకవిత్వముతో తెలివిగా తమ తత్వ శాస్త్రమును నడిపిస్తారు, జటా జూటముతో బూడిద పూసుకొని తపస్సు చేసే శివుడు పలికిన శైవాగమ శాస్త్రమును తామస ప్రవృత్తి గల శైవులు నేర్చుకొని నడిపిస్తారు, భగవత్ సంకల్పముతో మోహశాస్త్రములు (భ్రమింపజేసే అల్ప గ్రంథములు), మాధ్యమికులు (బౌద్దుల ఉపవిభాగము) శూన్యము సిద్ధాంతమును అవలంభించువారు, వీరందరికీ పోలిక లేని కుదృష్థులు (వేదమును అంగీకరించెదరు కానీ వారికి అనుకూలమైన తప్పుడర్థాలను ప్రచారము చేయువారు), వీరందరినీ కల్పవృక్షము  వంటి ఔదార్యము గల ఎంబెరుమానార్లు ఈ భూమిపైన అవతరించి వీరందరినీ నాశనము గావించారు.

నూరవ పాశురము: ఎంబెరుమానార్లు యొక్క దివ్య కమల చరణముల తీయని అనుభూతిలో తన మనస్సు మునిగి ఉండటం చూసి, మరింకేదో చూపించి తనను భ్రమపెట్టవద్దని ఎంబెరుమానార్లకు అముదనార్లు విన్నవించుకుంటున్నారు.  

పోందదు ఎన్ నెంజెన్నుం పొన్ వండు। ఉనదడి ప్పోదిల్‌ ఒణ్‌ శీర్‌
ఆం తెళి తేన్ ఉండు అమర్‌ందిడ వేండి * నిన్పాల్‌ అదువే
ఈందిడ వేండుం ఇరామానుశ  ఇదు అన్ఱి ఒన్ఱుం
మాందగిల్లాదు। ఇని మత్తొన్ఱు కాట్టి మయక్కిడలే॥ (100)

అందమైన తుమ్మెదలాంటి నా మనస్సు, తేనె త్రాగుటకు పుష్పముల వంటి నీ చల్లని సున్నితమైన దివ్య పాదముల చెంతకు వచ్చి అక్కడే ఉండిపోవాలనుకుంటుంది. నీవు కృపతో అది అనుగ్రహించాలి. నా మనస్సుకి ఇంకేదీ సరిపడదు. నాకింకేదో చూపించి మీరు నన్ను యేమార్చకూడదు.  

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము :  https://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-91-100-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment