శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
డెబ్భై ఒకటవ పాశురము: అముదనార్ల విన్నపమును స్వీకరించిన ఎంబెరుమానార్లు, అనుగ్రహ పూరిత ప్రత్యేక దృష్టితో చూసి, తద్వారా అముదనార్లు తనతో దృఢమై ఉండేలా అతని జ్ఞాన వికాసము చేశారు. అముదనార్లు తాను పొందిన అదృష్టానికి సంతృప్తులౌతున్నారు.
శార్‌ందదెన్ శిందై ఉన్ తాళ్ ఇణైక్కీళ్ అన్బు తాన్ మిగవుం
కూర్‌ందదు అత్తామరై త్తాళ్గళుక్కు ఉందన్ గుణంగలుక్కే
తీరిందదు ఎన్ శెయ్గై మున్ శెయ్వినై నీ శెయ్వినై అదనాల్
పేరందదు వణ్మై ఇరామానుశ ఎం పెరుం తగైయే (71)
దివ్య ఔదార్య లక్షణములున్న ఓ రామానుజ! నన్ను నీ శరణు లోకి తీసుకొన్న తర్వాత నా చంచలమైన మనస్సు నీ దివ్య చరణముల యందు కుదుటపడింది. నీ దివ్య పాదముల పట్ల నా భక్తి అంచెలంచెలుగా వృద్ది చెందింది. నా నడవడి కూడా పూర్తిగా నీ దివ్య గుణాలకు అంకితమైనది. నాపై నీ దివ్య కృపా వర్షముతో నా పూర్వ పాప కర్మలన్నీ నాశనమైనవి.
డెబ్భై రెండవ పాశురము: రామానుజులు తనుకు అనుగ్రహించిన మరొక ఉపకారము గురించి తలచుకుంటూ అముదనార్లు ఆనందపడుతున్నాడు.
కైత్తనన్ తీయ శమయ క్కలగరై కాశినిక్కే
ఉయ్‌త్తనన్ తూయ మఱైనెఱి తన్నై* ఎన్ఱున్ని ఉళ్ళం
నెయ్‌త్త అన్బోడు ఇరుందేత్తుం నిఱై పుగళోరుడనే*
వైత్తనన్ ఎన్నై ఇరామానుశన్ మిక్క వణ్మై శెయ్దే (72)
రామానుజులు వారి ఔదార్యాన్ని ప్రదర్షిస్తూ, సమస్యలను సృష్థిస్తున్న వేద విరుద్ద తత్వశాస్త్రములను ధ్వంసం చేశారు. ఈ భూమిపై పవిత్రమైన వేద మార్గాన్ని స్థాపించారు. పరిపూర్ణ గుణాలు ఉన్న రామానుజ దాసుల సమూహములో తనను చేర్చినందుకు మనస్ఫూర్తిగా రామానుజుల మహా కృపను మనసారా గుర్తుచేసుకుంటున్నారు. ఎంతటి అద్భుతమిది!
డెబ్భై మూడవ పాశురము: రామానుజులు తనకనుగ్రహించిన భక్తి ప్రపత్తులతో తాను ఉండగలడా అని అడిగినపుడు, నిరంతర రామానుజ చింతన లేకుండా తానుండలేడని అముదనార్లు బదులిస్తున్నారు.
వణ్మైయినాలుం తన్ మా తగవాలుం * మది పురైయుం
తత్మైయినాలుం ఇత్తారణియోర్లట్కు * తాన్ శరణాయ్
ఉణ్మై నల్ ఞ్ఙానం ఉరైత్త ఇరామానుశనై ఉన్ను౦
తిణ్మై అల్లాల్ ఎనక్కిల్లె మత్తోర్ నిలై తేరందిడిలే (73)
మనుషులు అల్పులని అర్థాలు గొప్పవన్న భేదము చూపించకుండా అందరికీ జ్ఞాన బోధన చేసే ఔదార్యము రామానుజులకు కలదు. ఇతరుల దుఃఖము చూడలేని దయ ఉన్నావారు. ఇతరుల బాధలను తొలగించి సంతోషము కలించే చంద్రుని వంటి చల్లదనము ఉన్నవారు. ఈ భూమిపైన భగవత్ జ్ఞానము గురించి అణు మాత్రం కూడా ఎరుగని వారికి కూడా గొప్ప ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చి వారిని రక్షించువారు. వారు నా రక్షకుడు అన్న శక్తి తప్పా నన్ను నేను ఆదుకునే సాధనము నాదగ్గర మరొకటి లేదు.
డెబ్భై నాల్గవ పాశురము: ఇతర తత్వ శాస్త్రములను జయించు విషయములో భగవాన్ కన్నా సునాయాసముగా రామానుజులు విజయము సాధించారన్న అంశాన్ని గుర్తుచేసుకుంటూ అముదనార్లు సంతోషపడుతున్నారు.
తేరార్ మఱైయిన్ తిఱం ఎన్ఱు * మాయవన్ తీయవరై*
క్కూరాళి కొండు కుఱైప్పదు* కొండల్ అనైయ వణ్మై
ఏరార్ కుణత్తెం ఇరామానుశన్ * అవ్వెళిల్ మఱైయిల్
శేరాదవరై చ్చిదైెప్పదు* అప్పోదొరు శిందై శెయ్దె (74)
వేదములు అనాది నుండి ఉన్నాయి, వాటిని ఒకరు రచించినవి కావు. అసీమితమైన జ్ఞాన శక్తులు ఉన్న భగవాననుడు, తన ఆఙ్ఙను మీరి వేద విరుద్దముగా ప్రవర్తించిన వారిని తన చక్రాయుధముతో పతనము గావించును. ఎన్నో కళ్యాణ గుణాలున్న మనందరి స్వామీ, అందరిపై సమముగా తన కృపా వర్షము కురిపించే మేఘము వంటి ఎంబెరుమానార్లు, ప్రతి నిమిషము తప్పుడు పథకములతో వచ్చు వేద విరోధులను జయించారు.
డెబ్భై ఐదవ పాశురము: భగవత్వైభవము చవిచూసే వరకే తనతో గుణ సంబంధము ఉంచుకుంటాదేమోనని ఎంబెరుమానార్లు అనుకున్నట్లైతే, భగవాన్ ప్రత్యక్షమై తన సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ తననెప్పుడూ విడువనని మాటిచ్చినా, ఎంబెరుమానార్ల కల్యాణ గుణములలోనే తాను నిమగ్నమై ఉంటానని అముదనార్లు తెలుపుతున్నారు.
శెయ్‌త్తలై చ్చంగం శెళు ముత్తం ఈనుం* తిరువరంగర్
కైత్తలత్తాళియుం* శంగముం ఏంది* నంగణ్ ముగప్పే
మొయ్‌త్తలైత్తున్నై విడేన్ ఎన్ఱిరుక్కిలుం నిన్ పుగళే
మొయ్‌త్తలైక్కుం వందు* ఇరామానుశ ఎన్నై ముత్తుం నిన్ఱే (75)
శ్రీరంగములో అందమైన ముత్యాలనిచ్చే శంఖుల చేనులు ఉంటాయి. ఆ శ్రీరంగములో నిత్య నివాసముంటున్న పెరియ పెరుమాళ్ళు తన దివ్య సౌందర్యాన్ని ప్రదర్షిస్తూ తన దివ్య హస్తములలో శంఖు చక్రములను ధరించి నా ముందుకు వచ్చినా, నీకు సమర్పించబడ్డ నా మనస్సు కలవరపడి, “నేను నిన్ను ఎప్పటికి వదలను” అని చెబుతుంది. నీ మంగళ గుణాలు వాటి గొప్పతనాన్ని చూపిస్తూ నన్ను చుట్టు ముట్టి నన్ను వాటి వైపు లాగేస్తాయి.
డెబ్భై ఆరవ పాశురము: అముదానార్లు చెప్పింది విని సంతోషపడి, తానేమి కావాలో కోరుకోమని ఎంబెరుమానార్లు అడుగగా, తన ప్రగాఢమైన కోరిక ఏమిటో అముదనార్లు వారికి తెలుపుకుంటారు.
నిన్ఱ వణ్ కీర్‌త్తియుం నీళ్ పునలుం। నిఱై వేంగడ ప్పొర్
కున్ఱముం వైగుంద నాడుం కులవియ పాఱ్కడలు౦ *
ఉందనక్కెత్తనై ఇన్బం తరుం ఉన్ ఇణైమలర్ త్తాళ్
ఎన్ తనక్కుం అదు। ఇరామానుశ ఇవై ఈందరుళే॥ (76)
తిరువేంగడం అని దివ్య తిరునామమున్న తిరుమల, అందమైన జలపాతములతో అందరూ కోరుకునే అతి సుందమైన ప్రదేశమది; శ్రీవైకుంఠము అతి సుందమైన దివ్య ప్రదేశము; ఎందరో మహా జ్ఞానులచే కీర్తింపబడిన తిరుపార్కడల్ (క్షీరాబ్ది)లో యోగనిద్రలో ఉండి భగవానుడు తన భక్తుల రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ మూడు దివ్య దేశములు నీకెంత సంతోషాన్నిస్తాయో, అంత సంతోషము నాకు నీ దివ్య చరణ కమలముల వద్ద లభిస్తుంది. కావున నీవు దయతో అవి నాకిమ్ము.
డెబ్భై ఏడవ పాశురము: అముదనార్లు కోరినట్టే రామానుజులు తమ దివ్య చరణములను ఒసగిన తరువాత వారు సంతృప్తి చెంది దయతో తనకింకేమి ఇస్తున్నారని ప్రశ్నించారు.
ఈందనన్ ఈయాద ఇన్నరుళ్ । ఎణ్ణిల్ మఱై క్కుఱుంబై
ప్పాయ్‌ందనన్ అమ్మఱై ప్పల్ పొరుళాల్ * ఇప్పడి అనైత్తుం
ఏయ్‌ందనన్ కీర్‌త్తియినాల్ ఎన్ వినైగళై వేర్ పఱియ
క్కాయ్‌ందనన్ । వణ్మై ఇరామానుశర్కు ఎన్ కరుత్తినియే॥ (77)
ఎంబెరుమానార్ ఇంతవరుకు ఎవ్వరికీ ఇవ్వని విశిష్టమైన అనుగ్రహాన్ని నాకు ప్రసాదించారు. వేదములలో పేర్కొన్న అర్థములకు తప్పుడు వ్యాఖ్యానములిచ్చే కుదృష్టులను పారద్రోలినవారు. వారి ఖ్యాతితో ప్రపంచమంతా తెలిసినవారు. వారి పరిమళము వలన నా గత పాపకర్మలన్నీ తొలగించారు. ఔదార్యులైన రామానుజులు వారి దివ్య మనస్సులో యింకా నాకు ఏమి చేయాలని ఆలోచిస్తున్నారు?
ఎంబెరుమానార్లు ఇంతవరుకు ఎవ్వరికీ ఇవ్వని విశిష్టమైన అనుగ్రహాన్ని నాకు ప్రసాదించారు. వేదములలో పేర్కొన్న అర్థములకు తప్పుడు వ్యాఖ్యానములిచ్చే కుదృష్థులను పారద్రోలినవారు. వారి ఖ్యాతితో ప్రపంచమంతా తెలిసినవారు. వారి పరిమళము వలన నా గత పాపకర్మలన్నీ తొలగించారు. ఔదార్యులైన రామానుజులు వారి దివ్య మనస్సులో యింకా నాకు ఏమి చేయాలని ఆలోచిస్తున్నారు?
డెబ్భై ఎనిమిదవ పాశురము: తనని సంస్కరించేందుకు రామానుజులు పడిన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ, రామానుజులు తనని సరిదిద్దిన తరువాత తన మనస్సు విషయవాంఛల గురించి ఆలోచించదని అముదనార్లు తెలుపుతున్నారు.
కరుత్తిల్ పుగుందు ఉళ్ళిల్ కళ్ళం కళత్తి। కరుదరియ
వరుత్తత్తినాల్ మిగ వంజిత్తు * నీ ఇంద మణ్ణగత్తే
తిరుత్తి త్తిరుమగళ్ కేళ్వనుక్కాక్కియ పిన్ ఎన్నెంజిల్
పొరుత్త ప్పడాదు। ఎం ఇరామానుశ మత్తోర్ పాయ్ ప్పొరుళే॥(78)
బాహ్యముగా నన్ను సంస్కరించడము కష్థమని నిర్ణయించుకొని, నా మనస్సులోకి మిమ్ములను ప్రవేశింపనీయకుండా ఆపగలనని తెలిసినవారై, నన్ను యేమార్చి ఊహించలేని ఇబ్బందులకు పూనుకొని నా మనస్సులోకి ప్రవేశించారు. నా మనస్సులో నేను పోషిస్తున్న ‘ఆత్మాపహారము’ (ఆత్మ స్వతంత్రమైనది) అన్న దోషమును సరిదిద్దారు. బంజరు భూమిని సాగుభూమిగా మార్చినట్టు, నన్ను సరిదిద్ది శ్రీ మహా లక్ష్మీపతికి దాసునిగా మార్చారు. ఇవన్నీ చేసిన పిదప, నా మనస్సుకు హానికరమైన తప్పుడు నడవడి అక్కడ సరితూగదు.
డెబ్భై తొమ్మిదవ పాశురము: ఉద్దరింపబడాలనే కోరిక ఉన్నా, దుర్లభమైన జ్ఞానాన్ని కోల్పోయి దీన స్థితిలో ఉన్న సంసారులను చూసి అముదనార్లు జాలిపడుతున్నారు.
పొయ్యై చ్చురక్కుం పొరుళై త్తురందు। ఇంద ప్పూదలత్తే
మెయ్యై ప్పురక్కుం ఇరామానుశన్ నిఱ్క* వేఱు నమ్మై
ఉయ్య క్కొళ్ళ వల్ల తెయ్వం ఇంగు యాదెన్ఱు ఉలర్‌ందు అవమే
ఐయప్పడా నిఱ్పర్। వైయత్తుళ్ళోర్ నల్లఱి విళందే॥ (79)
రామానుజులు ఈ భూమిపైన సత్యపూరితమైన తత్వశాస్త్రములను రక్షించి, ఆత్మజ్ఞానము గురించి తప్పుడు అర్థములను ప్రచారముచేసే భాహ్య కుదృష్థులను పారద్రోలి, యదార్థ వేదాంత శాస్త్రములను అన్వేషించే వారి కోసము వీక్షిస్తున్నారు. అటువంటి రామానుజులను స్వీకరించక, అనేక చింతలతో మునిగి శరీరాలు కుంగి కృషించుకు పోయినా ఈ భూజనులు తమను గతి చేర్చడానికి అన్య దేవతలను అన్వేషిస్తున్నారు. అయ్యో! ఎంత బాధపడుతున్నారు!
ఎనభైయవ పాశురము: వాళ్ళ సంగతి మరచి తాను నమ్మినది ఏమి అని రామానుజులు ప్రశ్నించగా, రామానుజులకు సంబంధించిన వారి పట్ల ప్రీతి చూపించే వారికి సేవ కొనసాగిస్తానని అముదనార్లు బదులిస్తారు.
నల్లార్ పరవుం ఇరామానుశన్ । తిరునామం నంబ
వల్లార్ తిఱత్తై మఱవాదవర్గళ్ యవర్ * అవర్‌క్కే
ఎల్లా ఇడత్తిలుం ఎన్ఱుం ఎప్పోదిలుం ఎత్తొళుంబుమ్
శొల్లాల్ మనత్తాల్। కరుమత్తినాల్ శెయ్వన్ శోర్విన్ఱియే॥(80)
రామానుజులు ఎంతటి గొప్పవారంటే, గొప్ప పుసుషులు వారెక్కడున్నా సంతోషముగా వారి కీర్తిస్తారు. అన్నిచోట్లా, ప్రతి నిమిషము, ఏ స్తితిలోనైనా రామానుజుల దివ్య నామములే శరణమని నిత్యము నిశ్చమించుకొని తలచే వారికి మనసా వాచా కర్మణా వారిని వీడకుండా నిరంతరము కైంకర్యము కొనసాగిస్తాను.
అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-71-80-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org