శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
యాభై ఒకటవ పాశురము: ఈ భూమిపైన రామానుజుల అవతార ఉద్దేశ్యము కేవలము తనను (అముదనార్లను) వారి దాసునిగా చేసుకోవడానికేనని అముదనార్లు తెలుపుతున్నారు.
అడియై త్తొడర్‌ందెళ్లుం ఐవర్ణట్కాయ్। అన్ఱు పారత ప్పోర్
ముడియ । ప్పరి నెడుం తేర్ విడుం గోనై * ముళుదుణర్‌ంద
అడియర్‌క్కముదం । ఇరామానుశన్ ఎన్నై ఆళ వందు *
ఇప్పడియిల్ పిఱందదు । మత్తిల్లై కారణం పార్‌త్తిడిలే (51)
శ్రీ కృష్ణపరమాత్మ అడుగు జాడలను అనుసరిస్తున్న పాండవులకు, మహాభారత యుద్దములో రథ సారధిగా శ్రీకృష్ణుడి సహాయము తప్పా ఇంకెవ్వరి అండలేకుండా యుద్దము చేశారు. శ్రీకృష్ణుడే సర్వస్వమని భావించే వారి దాసులకు ఎంబెరుమానార్లు అమృతము వంటివారు. ఈ భూమిపై ఎంబెరుమానార్లు అవతరణకు కారణము కేవలం నన్ను వారి ఆశ్రయములోకి తిరుకొనుటకే. ఎంత విశ్లేషించినా ఇది తప్ప వేరొక కారణము కానరానట్లేదు.
యాభై రెండవ పాశురము: తనను నియంత్రించే సామర్థ్యము ఎంబెరుమానార్లకి ఉందా అని అడిగినపుడు, ఎంబెరుమానార్లు అత్యంత సామర్థ్యము కలవారని వివరిస్తున్నారు.
పార్‌త్తాన్ అఱు శమయంగళ్ పదైప్ప। ఇప్పార్ ముళుదుం
పోర్‌త్తాన్ పుగళ్ కొండు। పున్మైయినేన్ ఇడైత్తాన్ పుగుందు *
తీర్‌త్తాణ్ ఇరు వినై తీర్‌త్తు * అరంగన్ శెయ్య తాళ్ ఇణైయోడు
ఆర్ త్తాణ్ । ఇవై ఎం ఇరామానుశన్ శెయ్యుం అఱ్పుదమే॥ (52)
వేద విరుద్దమైన ఆరు తత్వ శాస్త్రములపై రామానుజుల దివ్య నేత్రముల దృష్థి ఎలా పడిందంటే అవి వణికిపోయాయి. వారి ప్రఖ్యాతి మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది. అల్పుడైన నా హృదయములోకి వారు కృపతో స్వయంగా ప్రవేశించి నా పాపములను తొలగించారు. అంతే కాకుండా, పెరియ పెరుమాళ్ యొక్క దివ్య తిరువడితో నా సంబంధాన్ని ఏర్పరచారు. ఇవి మనందరికీ స్వామి అయిన రామానుజులలో ఉన్న కొన్ని అద్భుతమైన విషయాలు.
యాభై మూడవ పాశురము: ఇతర తత్వ శాస్త్రాలను నశింపజేసి ఎంబెరుమానార్లు ఏమి స్థాపించారని ప్రశ్నించినపుడు, పరమ సత్యమైన చేతనాచేతనములు భగనునిపైన ఆధారపడి ఉన్నాయని ఎంబెరుమానార్లు స్థాపించారని అముదనార్లు తెలుపుతున్నారు.
అఱ్పుదన్ శెమ్మై ఇరామానుశన్। ఎన్నై ఆళ వంద
కఱ్పగం కత్తవర్ కాముఱు శీలన్ * కరుదరియ
పఱ్పల్ ఉయిర్గళుం పల్ ఉలగు యావుం పరనదు ఎన్నుం*
నఱ్పొరుళ్ తన్నై। ఇన్ నానిలత్తే వందు నాట్టిననే॥ (53)
నన్ను తన ఆశ్రయములోకి తీసుకోవడానికి రామానుజులు అవతరించారు; వారు ఒక మహోన్నత మనీషి; సాధారణ లక్షణములున్నవారిని జ్ఞానులు ఆశించేవారు; వారు అద్భుత నడవడి ఉన్నవారు; వారి దాసుల కోసం తాను అనుగుణమై ఉండే నిజాయతీ గలవారు. అసంఖ్యాక ఆత్మలు, వారు నివసించే లోకాలన్నీ భగవత్ నియంత్రణలో ఉన్నాయని స్థాపించిన వారు రామానుజులు.
యాభై నాల్గవ పాశురము: అముదనార్లు మరింత వివరిస్తూ, రామానుజులు భగవత్ ఆధిపత్యాన్ని స్థాపించిన కారణంగా బాహ్య తత్వశాస్త్రములు (వేదాలను అంగీకరించనివారు), వేదములు, తిరువాయ్మొళి (నమ్మాళ్వార్లు అందించిన ప్రబందము) యొక్క సరైన స్థానములు నిర్ధారించబడ్డాయని తెలియ చెప్పుతున్నారు.
నాట్టియ నీశ చ్చమయంగళ్ మాండన। నారణనై
క్కాట్టియ వేదం। కళిప్పుత్తదు * తెన్ కురురై వళ్ళల్
వాట్టం ఇలా వణ్ తమిళ్ మఱై వాళ్‌ందదు మణ్ఞులగిల్
ఈట్టియ శీలత్తు। ఇరామానుశన్ తన్ ఇయల్వు కండే॥ (54)
ఈ భూమిపైన నలు దిక్కులా రామానుజుల ప్రఖ్యాతి విస్తరించి వ్యాపించడం చూసి, అణగారిన వారు స్థాపించిన అల్పమైన బాహ్య తత్వ శాస్త్రములు సూర్యుడు ఉదయించిన తరువాత అంధకారం మాయమైనట్టుగా అవీ మరణించాయి. శ్రీమన్నారాయణుడే సర్వోన్నతుడు అని వెల్లడి చేసిన వేదములు గర్వ పడి, ఇకపై తమకు ఏ కొఱత లేదనుకున్నాయి. తిరుక్కురుగూర్లో అవతరించి ఏ లోపములేని ద్రావిడ వేదమైన తిరువాయ్మొళిని రచించిన నమ్మాళ్వార్లు వర్దిల్లారు.
యాభై ఐదవ పాశురము: వేదములకు రామానుజులు చేసిన ఉపకారములను గుర్తుచేసుకుంటూ, రామానుజుల మహాత్మ్యముతో సంబంధము ఉండి వారికి శరణాగతి చేసినవరే అందరినీ శాసించేందుకు తగినవారని అముదనార్లు తలచుకుంటున్నారు.
కండవర్ శిందై కవరుం। కడి పొళిల్ తెన్నరంగన్
తొండర్ కులావుం ఇరామానుశనై * తొరై ఇఱంద
పణ్ తరు వేదంగళ్ పార్మేల్ నిలవిడ ప్పొర్‌త్తరుళుం*
కొండలై మేవి త్తొళుం। కుడియాం ఎంగళ్ కోక్కుడియే॥ (55)
మనోహరమైన సువాసనలు వెదజల్లే తోటలతో చుట్టు ముట్టి ఉన్న అధ్బుతమైన ఆలయములో(శ్రీ రంగములో) పెరియ పెరుమాళ్ళు నిత్య నివాసమున్నారు. అనేక శృతులున్న వేదములను సశక్త పరచి ఈ భూమిపైన వర్ధిల్లేటట్టుగా చేసి, పెరియ పెరుమాళ్ళ యొక్క శరణాగతులచే కీర్తించబడేవారు ఎంబెరుమానార్లు ఉత్తమోత్తముడు. లౌకిక వ్యవహారలో ఆసక్తి చూపకుండా అటువంటి ఎంబెరుమానార్ల గుణాలపై ఆసక్తితో సంబంధపరచుకున్న వారు మనల్ని నియంత్రించేందుకు తగినవారు.
యాభై ఆరవ పాశురము: లౌకిక విషయాల గురించి ముందు ఇలా మాట్లాడేవారని గుర్తుచేసినపుడు, ఎంబెరుమానార్లని పొందిన పిదప, తన మనస్సు మరియు వాక్కు ఇంకే తత్వాన్ని ఎరుగదు అని అముదనార్లు తెలియజేస్తున్నారు.
కోక్కుల మన్నరై మూవెళు కాల్। ఒరు కూర్ మళువాల్
పోక్కియ తేవనై పోత్తుం పునిదన్ * పువనం ఎంగుం
ఆక్కియ కీర్‌త్తి ఇరామానుశనై అడైంద పిన్ * ఎన్
వాక్కురైయాదు। ఎన్ మనం నినైయాదిని మత్తొన్ఱైయే॥ (56)
పరశురామునిగా అవతరించిన భగవానుడు, తన గొడ్డలితో ఇరవై ఒక్క తరముల క్షత్రీయులను వధించాడు. భగవానుని ఆ గుణముతో ఓడిపోయిన ఎంబెరుమానార్లు వారిని స్తుతించారు. శుద్ద స్థితిలో ఉన్న అటువంటి ఎంబెరుమానార్లని చేరినవారు ఎంతటి అపవిత్రులైనా పవిత్రులౌతారు. ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న వారి ఖ్యాతి తప్పా నా మనస్సు ఇంకెవ్వరి గురించి కీర్తించదు, చింతించదు.
యాభై ఏడవ పాశురము: ఈ సంసారములో ఉన్నప్పుడు, తన మనస్సు ఇంకెవ్వరినీ తలంచదని, తన వాక్కు ఇంకెవ్వరినీ పొగడదని ఎలా చెప్పగలరు? అని అముదనార్లని ప్రశ్నించగా, రామానుజులను చేరిన తరువాత మంచి చెడుల తేడా తెలుసుకోకుండా దేనినైనా ఆశించే మూర్ఖత్వము తనకిక లేదని వారు తెలుపుతున్నారు.
మత్తొరు పేఱు మదియాదు । అరంగన్ మలర్ అడిక్కాళ్
ఉత్తవరే తనక్కు ఉత్తవరా క్కొళ్ళుం ఉత్తమనై *
నల్ తవర్ పోత్తుం ఇరామానుశనై * ఇన్ నానిలత్తే
పెత్తనన్ పెత్తపిన్ మత్తు అఱియేన్ ఒరు పేదమైయే॥ (57)
పెరియ పెరుమాళ్ దివ్య తిరువడి సేవ తప్పా హితకరమైనది ఇంకేదీ లేదని భావించే వాళ్ళు ఉన్నారు. భగవానునికి శరణాగతులైన అటువంటి వాళ్ళని ఎంబెరుమానార్లు తన ఆత్మ సన్నిహితులు భావిస్తారు. అటువంటి తపస్వి శరణాగతులచే కీర్తింపబడేవారు రామానుజులు. ఎంబెరుమానార్లని పొందిన పిదప, ఇతర లౌకిక విషయాలతో మునిగి తేలే అజ్ఞాన వ్యవహారాల గురించి నేనెరుగను.
యాభై ఎనిమిదవ పాశురము: వేదముల తప్పుడు తాత్పర్యములు తీసే తత్వ శాస్త్రములను ఎంబెరుమానార్లు నాశనము చేసినందుకు అముదనార్లు సంతోషపడుతున్నారు.
పేదైయర్ వేద* ప్పొరుళ్ ఇదెన్టున్ని। పిరమం నన్ఱు ఎన్ఱు
ఓది* మత్తు ఎల్లా ఉయిరుం అహ్ దెన్ఱు * ఉయిర్గళ్ మెయ్విట్టు
ఆది పరనోడు ఒన్ఱు ఆమ్ ఎన్ఱు శొల్లుం అవ్వల్లల్ ఎల్లాం
వాదిల్‌వెన్ఱాన్। ఎం ఇరామానుశన్ మెయ్ మదిక్కడలే॥ (58)
వేదములు ప్రామాణికమైనవైనప్పటికీ, కొంతమంది అజ్ఞానులు వాటి ప్రమాణ స్థాయితో అర్థము చేసుకోక, తప్పుడు వివరణములిచ్చి ఖండిస్తారు. బ్రహ్మ ఒక విశిష్టతగల భిన్నమైన తత్వమని వాళ్ళు అంగీకరించినా, బ్రహ్మ తప్పా మిగిలిన జీవాత్మలన్నీ కూడా బ్రహ్మయే అని నమ్ముతారు. జీవాత్మలు ఈ దేహాన్ని విడిచిపెట్టి, అన్నింటికీ కారణభూతుడైన బ్రహ్మలో లీనమవడాన్ని వాళ్ళు మోక్షాన్ని వివరిస్తారు. శుద్ద సత్వ జ్ఞాన సాగరుడైన మనందరికీ స్వామి అయిన రామానుజులు, అటువంటి అజ్ఞానులతో వాదించి వారి వాదనలను తోసిపుచ్చారు. ఎంత అద్భుతము!
యాభై తొమ్మిదవ పాశురము: వారి సంతోషాన్ని చూస్తూ, వాస్తవముగా భగవానుడే అత్యున్నతుడని ఆత్మలు శాస్త్రముల నుండి తెలుసుకొనుండవచ్చు అని కొందరు అంటారు. ఎంబెరుమానార్లు కలియుగ అజ్ఞానాన్ని నాశనము చేసి ఉండకపోతే, అన్ని ఆత్మలకి స్వామి ఎంబెరుమానే అని ఎవరికీ తెలిసి ఉండేది కాదు.
కడలళవాయ తికై ఎట్టినుళ్ళుం కలి ఇరుళే
మిడైదరు కాలత్తిరామానుశన్ * మిక్క నాన్మఱైయిన్
శుడర్ ఒళియాల్ అవ్విరుళై త్తురందిలనేల్ ఉయిరై
ఉడైయవన్। నారణన్ ఎన్ఱు అఱివార్ ఇల్లై ఉత్తు ఉణర్‌ందే॥ (59)
కలి చీకటి అన్ని దిశలలో (మహాసముద్రాలే హద్దులుగా) దట్టముగా వ్యాపిస్తున్న రోజులవి. ఆ సమయములో రామానుజులు అవతరించి వేదముల తేజస్సుతో కలి చీకటిని తొలగించకపోయి ఉంటే, సమస్థ ఆత్మలకు అధిపతి నారాయణుడే అని ఎవరికీ తెలిసి ఉండేది కాదు.
అరవైయవ పాశురము: ఎంబెరుమానార్ల భక్తి గురించి ప్రశ్నించినపుడు, వారు ఇందులో వివరిస్తున్నారు.
ఉణర్‌ంద మెఞ్ఙానియర్ యోగం తొఱుం। తిరువాయ్ మొళియిన్
మణం తరుం ఇన్నిశై మన్నుం ఇడం తొఱుం * మామలరాళ్।
పుణర్‌ంద పొన్ మార్చన్ పొరుందుం పదితొఱుం పుక్కునిఱ్కుం।
కుణం తిగళ్ కొండల్ । ఇరామానుశన్ ఎంగుల క్కొళ్లుందే॥ (60)
తమ ఆత్మగుణాలతో తేజోమయుడైన వారు ఎంబెరుమానార్లు, వారు నిండు మేఘము వంటివారు. మనందరికీ స్వామి. ఎక్కడైతే శుద్ద సత్వ జ్ఞానులు ఉంటారో అక్కడ, ఎక్కడైతే తిరువాయ్మొళి రాగసుధ ప్రతిధ్వనిస్తుంటుందో, ఎక్కడ పెరియ పిరాట్టిని తన వక్షస్థలములో ధరించి భగవానుడు ఉన్న దివ్య ప్రదేశాలలో ఎంబెరుమానార్లు నివాసమై ఉంటాడు. ఎంబెరుమానార్లు ఈ దివ్య దేశాలలో మగ్నమై ఉంటారు.
అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-51-60-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org