శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఇరవై ఒకటవ పాశురము: ఆళవందారుల దివ్య తిరువడి ఉపాయముగా పొందిన ఎంబెరుమానార్లు, కృపతో నన్ను రక్షించెను. అందుచేత అంత కంటే తక్కువ వారిని నేను కీర్తించను.
నిదియై ప్పొళియుం ముగిల్ ఎన్ఱు । నీశర్ తం వాశల్ పత్తి
తుది కత్తులగిల్। తువళ్గిన్ఱిలేన్* ఇని తూయ్ నెఱి శేర్
ఎదిగట్కిఱైవన్ యమునై తుఱైవన్ ఇణై అడియాం।
గది పెత్తుడైయ । ఇరామానుశన్ ఎన్నై క్కాత్తననే॥ (21)
దివ్య పాదయుగళి గల ఆళవందార్లు, స్వచ్ఛమైన కార్యములు చేసే యతులకు రాజు వంటివారు. ఆళవందార్ యొక్క దివ్య తిరువడియే తన ఉపాయముగా ఉన్న ఎంబెరుమానార్లు కృపతో నన్ను రక్షించారు. కావున, అల్పుల ఇంటి గుమ్మాల వద్ద వారి గొప్పతనాన్ని పొగుడుతూ ” నీవు సంపదను కురిపించే మేఘము వంటి వాడవు” అని ప్రసంసిస్తూ వారిని నా రక్షణార్థం ఆశ్రయించను.
ఇరవై రెండవ పాశురము: బాణాసురుని పక్షాన చేరి తననే విరోధించిన దేవతల వైపరిత్యాన్ని భగవానుడు సహించాడు. ఆపై ఎంబెరుమాన్ యొక్క గొప్ప తనాన్ని గ్రహించి వారిని కీర్తించారు. ఎంబెరుమాన్ ని ప్రశంసించే ఎంబెరుమానార్లు, నన్ను ఆపదలో నుండి రక్షించిన గొప్ప నిధి వంటివారు.
కార్‌త్తిగైయానుం । కరి ముగత్తానుం । కనలుం ముక్కణ్
మూర్‌త్తియుం మోడియుం వెప్పుం ముదుగిట్టు మూవులగుం
పూత్తవనే ఎన్ఱు పోత్తిడ । వాణన్ పిళై పొఱుత్త ।
తీరత్తనై ఏత్తుం । ఇరామానుశన్ ఎందన్ శేమ వైప్పే ॥ (22)
శ్రీ కృష్ణపరమాత్మకు విరోధముగా యుద్దము చేస్తూ బాణాసురునికి సహాయంగా నిలబడ్డ కార్తికేయుడు, గణపతి, అగ్ని దేవుడు, త్రినేత్రుడైన శివుడు, దుర్గ, జ్వరుడు యుద్ధ భూమినుండి పారిపోయిరి. శ్రీ కృష్ణపరమాత్మ మహోన్నతుడని గ్రహించిన దేవతలు “ముల్లోకాలను నీ దివ్య కమలనాభిలో నుండి సృష్థించావు” అని కీర్తిస్తూ బాణాసుడి తరఫున దేవతలు భగవానుడిని వేడుకున్నారు. వారి కోరిక మేరకు బాణాసురుడిని భగవాన్ క్షమించి వదిలేస్తాడు. అటువంటి మహోన్నతుడైన భగవాన్ యొక్క దివ్య మంగళ గుణాలను కీర్తించే ఎంబెరుమానార్, నా ఆపత్కాలములో నన్ను గట్టెక్కించే ఒక నిధి లాంటివాడు.
ఇరవై మూడవ పాశురము: “ఏ లోపములు లేని వారిచే కీర్తించబడే ఎంబెరుమానార్లని అన్ని లోపాలతో కూడిన నేను కీర్తిస్తే వారి మంగళ గూణాలు ఏమౌతాయి?” అని అముదనార్లు ప్రశ్నిస్తున్నారు.
వైప్పాయ వాన్ పొరుళ్ ఎన్ఱు । నల్ అన్నర్ మనత్తగత్తే
ఎప్పోదుం వైక్కుం । ఇరామానుశనై ఇరు నిలత్తిల్
ఒప్పార్ ఇలాద । ఉఱు వినైయేన్ వంజ నెంజిల్ వైత్తు ।
ముప్పోదుం వాళ్‌త్తువన్ । ఎన్నాం ఇదు అవన్ మొయ్ పుగళ్ క్కే॥ (23)
మన సంపదను రాత్రింబగళ్ళు తేడా లేకుండా ఎలా జాగ్రత్త పరుచుకొంటామో అలాగే ఏ దోషము కల్మశము లేని వారు ఎంబెరుమానార్లని ప్రేమతో తమ గుండెలలో నిలుపుకొంటారు. పరమ పాపులకు సమానుడనైన నా లాంటివాళ్ళు అటువంటి ఎంబెరుమానార్లని తమ మనస్సులో పెట్టుకొని రోజుకి మూడు సార్లు వారిని స్తుతిస్తుంటే వారి గొప్పతనం ఏమి కావాలి?
ఇరవై నాల్గవ పాశురము: తక్కువ స్థాయి నుండి ఈ స్థాయి వరకు ఎలా వచ్చారని అడిగినపుడు, అముదనార్లు తన మునుపటి స్థితి నుండి ఇక్కడి వరుకు ఎలా వచ్చారో వివరిస్తున్నారు.
మొయ్‌త్త వెమ్ తీవినైయాల్ । పల్లుడల్ తొఱుం మూత్తు । అదనాల్
ఎయ్‌త్తొళిందేన్ । మున నాళ్లళ్ ఎల్లాం * ఇన్ఱు కణ్డు ఉయర్‌ందేన్
పాయ్ త్తవం పోత్తుం పులై చ్చమయంగళ్ నిలత్తవియ
క్కైత్త మెయ్ ఞ్ఙానత్తు । ఇరామానుశన్ ఎన్నుం కార్ తన్నైయే ॥ (24)
తేనెపుట్ట చుట్టూ తేనెటీగలు గుముగూడినట్లు, అనాదిగా క్రూరమైన నా గత కర్మలు నా ఆత్మ చుట్టూ గుముగూడి ఉండగా, దాని ఫలితముగా మళ్ళీ మళ్ళీ పుట్టి ముసలితనాన్ని అనుభవిస్తున్నాను. వేదములు మనకు ఈ లౌకిక సుఖాలకి ఎలా దూరముండాలో, ఎవరికీ హాని కలిగించకూడదని చూపిస్తాయి, చివరికి గురువులను ఎలా సేవించాలో మార్గదర్శకత్వము చేస్తాయి. అల్పమైన తత్వ శాస్త్రములు వేదానుసారముగా కాకుండా వారి సొంత భుద్దిని ఉపయోగిస్తూ తప్పుగా ప్రవర్తిస్తాయి. అటువంటి తత్వ శాస్త్రములను ఎంబెరుమానార్లు ఖండించారు. అత్యంత ఉదారస్వభావులైన అటువంటి ఎంబెరుమానార్లు, వారి నిజరూపాన్ని తనుకు చూపించినందుకు తాను ఇప్పటి ఈ ఉన్నత స్థితికి చేరుకున్నాను అని అముదనార్లు తెలుపుతున్నారు.
ఇరవై ఐదవ పాశురము: తనకు చేసిన ఉపకారములను గుర్తుచేసుకుంటూ, అముదనార్లు రామానుజుల దివ్య ముఖాన్ని చూస్తూ వారిని ఇలా అడుగుతున్నారు, “ఈ ప్రపంచములో నీ కృపను ఎవరు తెలుకోగలరు?”
కారేయ్ కరుణై ఇరామానుశ । ఇక్కడలిడత్తిల్
ఆరే అఱిబవర్। నిన్ అరుళిన్ తన్మై * అల్లలుక్కు
నేరే ఉఱైవిడం నాన్ వందు నీ ఎన్నై ఉయ్‌త్త పిన్ ఉన్
శీరే ఉయిర్‌క్కుయిరాయ్ । అడియేర్కు ఇఱు తిత్తిక్కుమే ॥ (25)
ఎలాగైతే నేల సముద్రము తేడా లేకుండా మేఘము అన్ని చోట్లా వర్షిస్తుందో, అలాగే ఏ భేదము లేకుండా అందరిపైన తన కృపా వర్షాన్ని కురిపించే ఓ రామానుజా! నేను అన్ని దుఃఖాలకు ఆధారము లాంటివాడినైనా ఇటువంటి సమయాన నీవైనీవు వచ్చి నాకు ఆశ్రయమునిచ్చావు, నీ పరిశుద్దమైన కళ్యాణ గుణాలు ఈ ఆత్మను నిలబెట్టేందుకు మధువు లాంటిది. నీ కృపను గుర్తించేవారు ఈ ప్రపంచములో ఎవరు ఉన్నారు?
ఇరవై ఆరవ పాశురము: ఎంబెరుమానార్ల దివ్య తిరువడి సేవలో తమను సంపూర్ణముగా అర్పించుకున్న ప్రఖ్యాతి శ్రీవైష్ణవులకుంది. అటువంటి శ్రీవైష్ణవుల పూర్వపు స్థితిలోని ప్రతి గుణము నన్ను ముగ్ధుడను చేస్తున్నది అని అముదనార్లు తెలుపుతున్నారు.
తిక్కుత్త కీర్‌త్తి ఇరామానుశనై । ఎన్ శెయ్ వినైయాం ।
మెయ్ క్కుత్తం నీక్కి । విళంగియ మేగత్మై * మేవుం నల్లోర్
ఎక్కుత్త వాళర్ ఎదు పిఱప్పు ఏదు ఇయల్వు ఆగ నిన్నోర్ ।
అక్కుత్తం అప్పిఱప్పు । అవ్వియళల్వే నమ్మై ఆట్కొళ్యుమే॥ (26)
నేను చేసిన తప్పుడు పనుల కారణముగా నాలో స్థిరమై ఉన్న లోపాలను ఎంబెరుమానార్లు తొలగించారు. ఆ నా పాపాలు తొలగినందున కలిగిన సంతోషము కారణముగా వారి ఔదార్య గుణములు నలుమూలలు వ్యాపించి అద్భుతంగా నిలబడిరి. రామానుజుల దివ్య పాదాలతో నీడలా వెంట ఉన్న గొప్ప వాళ్ళు కూడా పూర్వము కొన్ని అప్పిదాలు చేసి ఉండవచ్చు, తక్కువ జాతిలో పుట్టి ఉండవచ్చు, కొన్ని దుష్కర్మలు చేసి ఉండవచ్చు. అటువంటి లోపాలు, జన్మలు, కర్మలు మాత్రమే ‘ఎవరైనా ఎంబెరుమానార్లని చేరుకోగలరు’ అని భావించే మాలాంటివారిని కూడా పాదాక్రాంతులను చేయగలవు. అటువంటి ఆలోచన వచ్చినపుడు, శ్రీవైష్ణవులు మనలాంటి సామాన్యులు కారని మనకంటే ఎంతో ఉన్నతమైన వారని భావిస్తాము.
ఇరవై ఏడవ పాశురము: ఎంబెరుమానార్లు తమ దాసుల పట్ల ఆప్యాయతతో ఉన్న రీతిన, తన మనస్సుతో కూడా సంబంధితులైనారు. ఎంబెరుమానార్లకి ఏ దోషము అంటుకుంటుందోనని అముదనార్లు కలవరపడుతున్నారు.
కొళ్ళ క్కుఱైవత్తిలంగి । కొళ్ళుందు విట్టు ఓంగియ ఉన్
వళ్ళల్ తనత్తినాల్ । వల్వినైయేన్ మనం నీ పుగుందాయ్
వెళ్ళై చ్చుడర్ విడుం ఉన్ పెరు మేన్మైక్కు ఇళుక్కు ఇదు ఎన్టు ।
తళ్ళుత్తు ఇరంగుం । ఇరామానుశ ఎన్ తని నెంజమే ॥ (27)
ఓ ఉడైయవర్ (ఉభయ విభూతులూ తన నియంత్రణలో ఉన్నవాడు)! కోరుకున్న వారందరికీ వారి వారి కోరికలు తీర్చినందుకు నీ గొప్పతనము అపరిమితముగా అద్భుతంగా విస్తృతమైనది. అటువంటి నేను ఒక పాపినైనా నీ గొప్పతనాన్ని కూడా లెక్క చేయకుండా నా మనస్సులోకి ప్రవేశించావు. ఒంటరిదైన నా మనస్సు పవిత్రమైన నీ గొప్పతనానికి కొఱత ఏర్పరుస్తుందేమోనని భావించి కృంగిపోవుచున్నది అని అముదనార్ వివరిస్తున్నారు.
ఇరవై ఎనిమిదవ పాశురము: ఎంబెరుమానార్లు వ్యవహారాల పట్ల తన వాక్చాతుర్య కోరికను చూసి అముదనార్లు ఆనంద పడుతున్నారు.
నెంజిల్ కఱై కొండ । కంజనై క్కాయ్‌ంద నిమలన్ । నంగళ్
పంజి త్తిరువడి । ప్పిన్నై తన్ కాదలన్ * పాదం నణ్ణా
వంజర్ క్కరియ ఇరామానుశన్ పుగళ్ అన్ది ఎన్ వాయ్।
కొంజి ప్పరవగిల్లాదు । ఎన్న వాళ్వు ఇన్ఱు కూడియదే ॥ (28)
అటు చూస్తే మనస్సులో కోపాన్ని పెంచుకున్న కంసుడిపై శ్రీ కృష్ణుడు ఆగ్రహించాడు, కానీ ఇటు చూస్తే దాసుల తప్పిదముల పట్ల అమితమైన వాత్సల్యము చూపించి, మెత్తని దూదిలాంటి పాదాలున్న నప్పిన్నై పిరాట్టి (నీళా దేవి) వారికి అతి ప్రియమైనవాడు. తమ ఆత్మలను దొంగిలించి (ఆత్మ తమ సొంతమని భావించేవారు) శ్రీ కృష్ణపరమాత్మ తిరువడిని ఆశ్రయించని వారు ఎంబెరుమానార్ల ని పొందలేరు. నా వాక్కు ఎంబెరుమానార్ల యొక్క కళ్యాణ గుణాలను తప్ప ఇంకెవ్వరినీ కీర్తించదు. ఎంత అద్భుతమైనదో కద ఇప్పుడున్న ఈ జీవితము.
ఇరవై తొమ్మిదవ పాశురము: ఎంబెరుమానార్లు యొక్క మంగళ గుణాలను గ్రహించి తండొపతండాలుగా చేరిన గుంపుని చూసే అదృష్థము ఈ కన్నులకి ఎప్పుడు కలుగుతుందని అముదనార్లు ఆశ్చర్యపోతున్నారు.
కూట్టుం విది ఎన్ఱు కూడుంగొలో । తెన్ కురురై ప్పిరాన్
పాట్టెన్నుం వేద ప్పశుందమిళ్ తన్నై * త్తన్ పత్తి ఎన్నుం
వీట్టిన్ కణ్ వైత్త ఇరామానుశన్ పుగళ్ మెయ్ ఉణర్‌ందోర్ ।
ఈట్టింగళ్ తన్నై । ఎన్ నాట్టంగళ్ కండిన్నం ఎయ్దిడవే॥ ( (29)
ఆళ్వార్ తిరునగరికి నాయకుడైన నమ్మాళ్వార్ రచించిన వేద రూపములో ఉన్న తిరువాయ్మొలి, చాలా ప్రశస్తి కలిగినది. ఎంబెరుమానార్లు ఆ తిరువాయ్మొలిని తన హృదయంలో ఉంచుకున్నారు. ఎంబెరుమానార్లు యొక్క కళ్యాణ గుణాలను గ్రహించి తడొపతండాలుగా చేరిన గుంపుని చూసే అదృష్థము ఈ కన్నులకి ఎప్పుడు కలుగుతుందని? ఈ మేలును గ్రహించేందుకు మనపై వారి కృపా వర్షము ఎప్పుడు కురుస్తుందో?
ముప్పైయ్యవ పాశురము: ఎంబెరుమానార్లని మొక్షము ప్రసాదించమని అడిగారా లేదా అని ప్రశ్నించినపుడు, ఎంబెరుమానార్లు తనను వారి ఆశ్రయములోని తీసుకున్న తరువాత తాను మోక్షాన్ని పొందినా పరవాలేదు, నరకాన్ని పొందినా పరవాలేదు అని అముదనార్లు తెలియజేస్తున్నారు.
ఇన్చం తరు పెరు వీడు వందు ఎయ్దిలెన్ । ఎణ్ణిఱంద
తున్చం తరు । నిరయం పల శూళ్లిలెన్ * తొల్ ఉలగిల్
మన్ పల్ ఉయిర్లట్కిఱైవన్ । మాయనెన మొళ్లింద
అన్నన్ అనగన్ । ఇరామానుశన్ ఎన్నై ఆండననే ॥ (30)
అద్భుతమైన స్వరూప, రూప గుణాలున్న సర్వేశ్వరుడు, అనాదిగా ఈ సంసారములో చిక్కుకొనున్న అసంఖ్యాక ఆత్మలకు అధిపతి. ఈ సత్యాన్ని ఎంబెరుమానార్లు సంసారుల పట్ల తమ నిష్కామ కృపతో అందించిన “శ్రీభాష్యం” గ్రంథము ద్వారా మనందరికీ తెలియజేశారు. అటువంటి ఎంబెరుమానార్ ఎంతో దయతో వారి శిష్యునిగా స్వీకరించిన తరువాత ఎంబెరుమాన్ నిత్య కైంకర్యము కొనసాగించేందుకు మోక్షాన్ని పొందినా పరవాలేదు లేదా లెక్కలేనన్ని వేదనలు చుట్టు ముట్టి ఉన్న నరకమును పొందినా పరవాలేదు. నాకు రెండూ సమానమే.
అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-21-30-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org